Chinna Maata
పువ్వులతో కోట్ల వ్యాపారం
యశోద,రియా కారుటూరి వూహూ ఫ్రెష్ పేరుతో పువ్వులను అమ్మే ఆన్ లైన్ రిటైల్ బ్రాండ్ మొదలుపెట్టారు. వూహూ అంటే కన్నడలో పువ్వు. బెంగళూరులో పుట్టిన ఈ అక్కా చెల్లెలు విద్యార్థులు. వూహూ ఫ్రెష్ లో చందాదారులుగా చేరితే పండుగలకు ఇతర శుభకార్యాలకు పువ్వులు ఇంటికే అందిస్తారు. పూజ కోసం జీరో టచ్ ప్యాకింగ్ కూడా ఉంటుంది. స్విగ్గి, జొమాటో, అమెజాన్ ద్వారా పూల హారాలు పత్రి కలిపిన దళాలు ప్రత్యేకమైన బాక్స్ లో పెట్టి అమ్ముతారు. ప్రస్తుతం […]
తెలివి పెంచే ఆటలు
డాక్టర్ అమూల్య మైసూర్ చైల్డ్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ పిల్లల వైద్య నిపుణురాలు అవిన్య గేమ్స్ పేరుతో బోర్డ్ గేమ్స్ తయారుచేస్తోంది. రైడ్ విత్ రామా, ప్లే విత్ కృష్ణా వంటి బోర్డ్ గేమ్స్ తయారు చేశారు. ఈ బోర్డ్ గేమ్స్ ఆడటం వల్ల పిల్లల్లో కమ్యూనికేషన్, బృందం తో కలిసి పని చేయటం నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతాయి అని చెబుతున్నారు. అమూల్య మైసూర్ బెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ అవార్డ్ తీసుకున్నారు. ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ […]
ఫ్యాషన్ ప్రపంచం లోకి ఈషా
సీమట్టి అనే టెక్స్టైల్ సంస్థ యూత్ కోసం సిద్ధం చేసిన దుస్తుల ప్రచారం కోసం ఇషా రవి అనే ఎఐ అంబాసిడర్ ను సృష్టించారు.అంటే ఈషా నిజం అమ్మాయి కాదు.డిజిటల్ అమ్మాయి.ఈ ఇషా ఫ్రీలాన్సింగ్ ఫ్యాషన్ డిజైనర్ సోలో ట్రావెలర్ కూడా. దేశం మొత్తం తిరుగుతూ వండర్ విత్ ఈషా పేరుతో వివరాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.ఈ టెక్స్టైల్ సంస్థ తయారు చేసిన దుస్తుల్ని ఈషా వేసుకొని కనిపిస్తుంది అప్పుడు నచ్చితే వాటిని కొనుక్కోవచ్చు. అన్ని […]
ఆలు చాలా మంచిది
బరువు తగ్గాలి అనుకునేవారు డయాబెటిస్ రోగులు బంగాళదుంపలు తినేందుకు సంకోచిస్తారు కానీ ఇవి నిజానికి చాలా మేలు చేస్తాయి అంటున్నారు పరిశోధకులు.ఉడికించి తొక్క తీసిన దుంపలకు వెన్న ఇతర ఫ్లేవర్లు ఫ్లేవర్స్ కలిపి ఇచ్చిన బంగాళదుంపలు తిన్నవారిలో ఎలాంటి సమస్య రాలేదని చెబుతున్నారు. డయాబెటిక్ సమస్య ఉన్న వారిని కూడా ఈ దుంపలు తినమనే సలహా ఇస్తున్నారు శాస్త్రజ్ఞులు. అరటిపండు కంటే ఎక్కువ ఫాస్పరస్ పై తొక్కలో ప్రత్యేకమైన పీచు ఉండటం వల్ల వీటిని ఎంత పరిమాణంలో […]
వయసు అడ్డుకొనే ఫాస్టింగ్
ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ వృద్ధాప్య ఛాయాల్ని అడ్డుకుంటుంది అంటున్నారు ఫ్రాన్స్ లోని ప్యారిస్ సిటీ యూనివర్సిటీ పరిశోధకులు రోజులో పగటిపూట మాత్రమే తిని ఆ తర్వాత ఏమి తినకుండా ఉండటమే ఈ పద్ధతి.ఇది బరువు తగ్గిస్తుంది. దీనివల్ల శరీర కణాలు తమని తాము ప్రక్షాళన చేసుకోగలిగే సామర్థ్యం పెరుగుతుంది. డయాబెటిస్, గుండె జబ్బులు కాన్సర్ వంటివి కూడా ఈ ఆహార పద్ధతి అడ్డుకోగలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.ఈ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ అన్ని రకాలా మంచిదని చెబుతున్నారు.
తొలి డిజిటల్ మోడల్ కైరా
2022 జనవరి 28వ తేదీనా సోషల్ మీడియాలో అడుగుపెట్టిన కైరా అలియాస్ కైరోనీ కి రెండు లక్షల కంటే ఎక్కువ మందే ఫాలోవర్స్. రియల్ మీ, టైటాన్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కు మార్కెట్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న కైరా మనదేశంలోని తొలి డిజిటల్ అమ్మాయి రూపురేఖలు వస్త్రధారణలో మోడరన్ గా ఉండే కైరా ఇటు ట్రావెలర్ గా ఆటో మోడల్ గా దూసుకుపోతుంది. కుత్రిమ మెధ తో తయారైన కైరా ను 2021లో ఎఫ్ యు […]
పాత దుస్తులు అమ్మేయాలా ?
క్లోసెట్ పునర్వి యాప్ తో సెకండ్ హ్యాండ్ దుస్తులను అమ్ముతున్నారు సహజ మాధురి. 34 వేల మంది సభ్యులు ఉన్న ఈ వెబ్సైట్ లో పదివేలకు పైగా దుస్తుల అమ్మకాలు సాగాయి షి ఇండియా మ్యాగజైన్ నుంచి సస్టైనబుల్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ తీసుకుంది మాధురి. ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని మన దగ్గర ఉన్న పాత దుస్తులు అప్లోడ్ చేసి వివరాలు పెడితే అక్కడ బృందం వాటి ధర నిర్ణయించి […]
కొండంత అండ
వంటింటి ఉపకరణాలైన మిక్సీలు, గ్రైండర్లు వంటివి తయారు చేసే హావెల్స్ ఇండియా కు డ్రైవింగ్ ఫోర్స్ వినోద్ రాయ్ గుప్తా. 35 వేల కోట్ల ఆస్తి తో దేశంలో నాలుగో సంపన్న మహిళగా స్థానం దక్కించుకున్నారు. ఆమెది ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ కేబుళ్లు స్విచ్ ల తయారీతో మొదలుపెట్టిన ఈ హావెల్స్ సంస్థను వృద్ధి చేసి, గృహోపకరణాలు తయారీ మొదలుపెట్టి 14 ఫ్యాక్టరీలు స్థాపించి 50 దేశాల్లో సంస్థ విస్తరణ చేశారు వినోద్ రాయ్ గుప్తా.ఆమె భర్త […]
గ్రామీణ మహిళలకు చేయూత
గోద్రెజ్ వ్యాపార సామ్రాజ్యం లో మూడో తరం లో పుట్టారు స్మిత గోద్రెజ్. ముంబై లో పుట్టిన స్మిత, ‘లా’ లో డిగ్రీ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ చేశారు. గోద్రెజ్ ను విద్యా, ఆరోగ్య రంగాల్లో దూసుకుపోయేలా చేసి టాప్ విమెన్ బిజినెస్ లీడర్స్ లో ఒకరుగా నిలిచారు. దేశం లోని మహిళా బిలినీయర్స్ లో స్మిత ఒకరు. 3. 3 బిలియన్ల ఆస్తులు ఆమె ఫోర్బ్స్ జాబితాలో ఐదో స్థానంలో […]
జింగిల్స్ నుంచి జాతీయ అవార్డ్ కు
బాలీవుడ్ గాయని శిల్పా రావ్ పుట్టిన ఊరు విజయనగరం చిన్నతనం నుంచే అన్ని రకాల వాయిద్యాలు వాయించే గలిగేది హిందుస్తానీ మ్యూజిక్ లో శిక్షణ తీసుకుంది. జింగిల్ సింగర్ గా పనిచేసింది. 2007లో బాలీవుడ్ లో గాయనిగా ఆమె కెరీర్ మొదలైంది.ఉత్తమ మహిళా నేపథ్య గాయని గా అవార్డ్ నామినేట్ అయింది.ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు తీసుకుంది. ఇప్పుడు దేవర పాట తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది శిల్పా రావ్.
అక్కడ ఇప్పటికీ స్వయంవరం
గుజరాత్ లో ఈనాటికీ స్వయంవరం సంప్రదాయం ఉంది.సురేంద్ర నగర్ జిల్లా లో టార్నెటర్ గ్రామంలోని ప్రసిద్ధ త్రినేత్రేశ్వర్ మహాదేవ్ జరుగుతుంది యువతలు ఎరుపు రంగు దుస్తులతో యువకులు రంగురంగుల దుస్తులతోనూ భాగస్వామిని వెతుక్కుంటారు. నృత్యం, గానం క్రీడలు ప్రదర్శించి, ఆ నైపుణ్యాలతో అమ్మాయిలను మెప్పించి వారిని వివాహం చేసుకుంటారు. ఇక్కడ అమ్మాయిలే నచ్చిన వ్యక్తిని ఎంచుకోవడం విశేషం.
వరల్డ్ ఛాంపియన్
ప్రసవ సమయంలో వైద్యుల పొరపాటుతో కుడి భుజానికి గాయమై పని చేయకుండా పోయింది మనీషా రామదాస్ కు.అయిన ఆమెకు నిరాశ లేదు పదేళ్ల వయసు లోనే బాడ్మింటన్ ఆడటం మొదలు పెట్టిన మనీషా 2021 నేషనల్ పారా ఛాంపియన్షిప్ సింగిల్స్, విమెన్స్ డబుల్ లో బంగారం సాధించింది. 2022 లో వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలిచి బెస్ట్ పారా ఫిమేల్ అవార్డ్ తీసుకుంది. పారిస్ పారా ఒలంపిక్స్ లో కాంస్యం సాధించింది. ఆమె వయసు 19. దేశంలో […]
సంకల్పమే అసలు శక్తి
అవయవ లోపం సంకల్పానికి అడ్డు రాదని నిరూపించింది తులసిమతి మురుగేశన్. తమిళనాడు లోని నమక్కల్ లో వెటర్నరీ సైన్స్ చదువుతున్న తులసిమతి ఎడమ చేతికి వైకల్యం ఉంది. హైదరాబాద్ గోపీచంద్ అకాడమీ లో బాడ్మింటన్ లో శిక్షణ తీసుకుంది. 2022 లో చైనాలో జరిగిన పారా ఏషియన్ క్రీడల్లో మూడు కేటగిరీల్లో మూడు పతకాలు సాధించింది. 2023 కెనడా పారా బాడ్మింటన్ ఇంటర్నేషనల్ లో, తాజాగా 2024 పారిస్ పారా ఒలంపిక్స్ లో పతకాలు అందుకున్నది. ఎంతో […]
సాహిత్యమే జీవితం
ఉత్తరాఖండ్‌లోని హేమవతి నందన్ బహుగుణ గర్వాల్ సెంట్రల్ యూనివర్శిటీలో ఫిలాసఫీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పని చేస్తున్న డాక్టర్ కవితా భట్ చక్కని గ్రంధకర్త ఇప్పటివరకు 27 పుస్తకాలు రాశారు. గీతా దర్శన్, భారతీయ సాహిత్యమే జీవన్ మూల్య వంటి రచనలకు పురస్కారాలు సత్కారాలు అందుకొన్నారు. 2019 లో మధ్యప్రదేశ్ సాహిత్య అకాడమీ అఖిల భారతీయ ఆచార్య రామచంద్ర శుక్లా పురస్కారం అందుకొన్నారు కవితా భట్.అధ్యాపకురాలిగా బోధన,సాహిత్య రచన తో పాటు పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు […]
కథలు చెప్పే బొమ్మలు
ఢిల్లీ లో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ శరణార్థుల శిబిరం లో తలదాచుకున్న మహిళలకు జీవనోపాధి కోసం సిలైవాలి పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ నెలకొల్పారు ఐరిష్ స్ట్రిల్ తన భర్త బిశ్వదీప్ తో కలిసి ఢిల్లీలో పోగుపడే చెత్త వ్యర్థాల నుంచి ఫ్యాబ్రిక్ వేస్ట్ ను రీసైకిల్ చేసి వాటితో కళాకృతులు చేసేందుకు గాను అఫ్గాన్ మహిళలకు శిక్షణ ఇచ్చాము.వారు తయారు చేసిన క్లాత్ బొమ్మలు, పర్స్ లు వాల్ హ్యాంగింగ్స్ కు 150 దేశాల్లో డిమాండ్ ఉంది.ఈ […]
సమాజం మార్పు కోసం’హోమ్‌లెస్’
హోమ్‌లెస్ పుస్తకంతో ఈ సంవత్సరం సాహిత్య అకాడమీ యువ పురస్కారం (ఇంగ్లీష్) అవార్డ్ తీసుకుంది రచయిత్రి కె.వైశాలి. 22 సంవత్సరాల వయసులో ముంబై నుంచి వచ్చి హైదరాబాద్ లో ఎలాంటి వసతులు లేని హాస్టల్ లో ఉంటూ తను ఇబ్బంది పడిన డిస్క్ లెక్సియా డిస్క్ గ్రాఫియా ల సమస్యలు అలాంటి మానసిక వైకల్యం ఉన్న పిల్లల పట్ల సమాజం నిర్లిప్తంగా ఉండటం విద్య వ్యవస్థల్లో ఉన్న లోపాల గురించి వైశాలి తన పుస్తకంలో చర్చించింది. యూనివర్సిటీ […]
రేసింగ్ ఛాంపియన్ డయానా
నేషనల్ రేసింగ్ ఛాంపియన్షిప్ గెలిచిన తొలి మహిళ గా నిలిచింది డయానా పండోల్. ఈమెది పూణే. రేసింగ్ అంటే ప్రాణం పెట్టే తల్లిదండ్రులతో కలిసి రేసింగ్ నేర్చుకుంది. జాతీయస్థాయిలో కాదు యూఎస్ ఎ, సింగపూర్, బెల్జియం, యూరప్ తో సహా ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని కప్పులు గెలుచుకుంది. ఇద్దరి పిల్లల తల్లి డయానా. ఛాంపియన్షిప్ లో పురుషుల తో పోటీపడి మరీ సత్తా చాటింది డయానా. ఈమె సింగర్ కూడా. అంధుల కోసం పరీక్షలు రాసి […]
ఈ నంబర్స్ సేవ్ చేసుకోండి
ఉద్యోగం కోసము లేదా, అవసరమైన పని కోసం బయటకు వెళ్లక తప్పదు. ఒంటరిగా కనిపిస్తే చీకటి వేళ ఎవరైనా దాడి చేస్తే రక్షణ కోసం 100 లేదా 1098 కి ఫోన్ చేయచ్చు. పబ్లిక్ ప్రదేశాల్లో వెంటబడి వేధిస్తే 8712656856 నెంబర్ కు కాల్ చేయచ్చు.మాట్లాడే వీళ్లు దొరకకపోతే వాట్సాప్ మెసేజ్ చేసినా సరే షీ టీమ్ నుంచి సాయం అందుతుంది.ఈ నంబర్ ను ఫోన్ లో వెంటనే ఫీడ్ చేసుకోండి. ఒంటరిగా బయటికి వెళ్లవలసి వస్తే […]
ప్రపంచ రికార్డ్ కెక్కిన కన్యా
ట్రాక్ రేసింగ్ అథ్లెట్ గా ప్రపంచ రికార్డ్ కెక్కిన కన్యా సెస్సర్ కాళ్లు వేళ్ళు కూడా లేని వైకల్యంతో పుట్టిన పిల్ల కన్నవాళ్ళు ముళ్లపొదల్లో విసిరేస్తే అమెరికా దంపతులు పెంచుకున్నారు. పోర్ట్ ల్యాండ్ లో పెరిగిన కన్యా కు ఎన్నో సర్జరీలు చేయించారు. పదో తరగతికి వచ్చేసరికి ఈ కాళ్లు లేని అమ్మాయి వీల్ చైర్ రేసింగ్, రగ్బీ ఈత, సర్ఫింగ్ స్నోబోర్డింగ్ క్రీడల్లో రాణించింది. పారా లింపింగ్ ట్రాక్ రేసింగ్ అథ్లెట్ గా జాతీయ స్థాయి […]
అందాల రోజ్ గోల్డ్
బంగారం రంగు మార్చుకొని రోజ్ గోల్డ్ గా ఈ మధ్యకాలంలో పాపులర్ అయింది. బంగారం, రాగి, వెండి లోహాల కలయిక ఈ రోజ్ గోల్డ్ పసిడి తో పోలిస్తే ఈ ఆభరణాల ధర తక్కువే సింపుల్ గా,ఎలిగెంట్ డిజైన్ లతో చిన్న పెండెంట్స్ ఉన్న రోజు గోల్డ్ హారాలు యువతులు ఇష్టపడుతున్నారు. పెద్ద పెండెంట్లు జూకాలు, చోకర్లు ఈ రోజ్ గోల్డ్ ఆభరణాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. శుభ్రమైన మెత్తని గుడ్డతో తుడిస్తే చాలు ఈ రోజు […]
