Monday, 27 Jul, 2026

చల్లదనాన్నిచ్చే కీర

ఈ వేసవి ఎండలకు కీర దోస తింటే శరీరానికి చల్లదనం ఇంకా ఇతర ప్రయోజనాలు ఎన్నొ దక్కుతాయి. ఇది చర్మాన్ని పరిరక్షించగలుగుతుంది. కీరా లో 90శాతం నీరు ఉండటం వల్ల వేసవి వేడికి శరీరం కొల్పోయినా నీటిని ఎలక్ర్టోలైట్స్ ను భర్తీ చేయగలుగుతుంది. చర్మం ఆరోగ్యంగా తాజాగా ఉంటుంది. ఎండకు చర్మం కందిపోయి మంట పెడుతూ ఉంటే కీరా ముక్కతో రుద్దితే పోతుంది. ట్యాన్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. గోళ్ళు చిట్లీ పొకుండా ఉంటాయి. కళ్ళు అసలటతో […]

ఇది సౌందర్య ఫలం కూడా

చక్కగా మామిడి పళ్ళు వచ్చేశాయి. వీటిని ఇష్టపడని వారు దాదాపు ఉండరు. రోగ నిరోధక శక్తి వ్యవస్థ పటిష్టంగా ఉంచేందుకు శరీరం ఇనుము శోషించుకొనేందుకు చర్మ సౌందర్యానికి అవసరమైన విటమిన్ సి మామిడి పండులో అధికంగా ఉంటుంది. రొగాలను ఎదుర్కోనే శక్తి ఇచ్చే విటమిన్ ఎ ఫోలేట్ విటమిన్ బి6 కూడా మామిడి పండు లో ఎక్కువే. మామిడి పండులోని ఫైబర్ జీర్ణవ్యవస్థను కాపాడుతుంది. కాకాపోతే జ్యూస్ లు,జామ్ లాగా తీసుకొంటే ఈ రసంలోకి చేరే అదనపు […]

పాస్టిక్ ఐస్ క్యూబ్స్

ఐస్ క్యూబ్స్ కోసం ట్రేలో నీళ్ళు పోసి ఫ్రిజ్ లో పెట్టేస్తాం. చల్లగా ఏదైనా తాగాలనుకొంటే ఈ క్యూబ్స్ ని పానీయాల్లో వేస్తాం. కానీ ఐస్ కరిగి పానీయాలు పలచగా అయిపోయి రుచి లేకుండా పోతాయి. రియూజబుల్ ఫుడ్ సేప్ ప్లాస్టిక్ ఐస్ క్యూబ్స్ లో నీరు ఉంటుంది. వీటిని ఫ్రిజర్ లో పెట్టేస్టే నీరు గడ్డకట్టి చల్లగా అయిపోతాయి. ఈ క్యూబ్స్ ని పానీయాల్లో వేస్తే ద్రవాలు చల్ల బడతాయి. కానీ క్యూబ్స్ లోని నీరు అందరు […]

వేళ తప్పద్దు

ఒక వేళ ప్రకారం ఆహరం తీసుకొంటేనే ఆరోగ్యం ,వేళ తప్పి ఆహారం తింటేనూ ముఖ్యంగా రాత్రివేళ ఆలస్యంగా తినటం వల్ల శారీరక జీవక్రియ బాగా దెబ్బతింటుంది. హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. సాధారణంగా రాత్రి వేళ శరీర మెటబాలిజం తక్కువగా ఉంటుంది.ఒక నిర్ణీత సమయం భోజనం కోసం నిర్ణయించుకోకపోతే నిద్ర సమయం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా ఎసిడిటి ఇతర గ్యాస్ సమస్యలు ఏర్పడతాయి. మానవ శరీరం ఒక జీవన గడియారం పద్దతిగా పని చేస్తుంది. నిద్ర ,వ్యాయామం […]

చర్మాన్ని కాపాడే కర్బూజా

ఈ సీజన్ లతో కర్బూజ ఎక్కువ దొరుకుతుంది. ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిల్లో ఉండే విటమిన్ సి తెల్ల కణాలను పెంచటంతో పాటు ఫ్రీ రాడికల్స్ ను నిరోధించటం ద్వారా అనారోగ్యాలు రాకుండా కాపాడుతాయి. పీచు అధికంగా ఉండటంతో జీర్ణ క్రియ బావుంటుంది. క్యాలరీలు చాలా తక్కువ విటమిన్ ఎ తో పాటు కొరోటినాయిడ్లు పుష్కలంగా ఉండటంతో కంటికండరాల క్షీణత రాకుండా ఉంటుంది. పుష్కలంగా ఉండే ఫారలేట్లు గర్భిణులకు ఎంతో మేలు చేస్తాయి. […]

ఆలీవ్ తో జుట్టుకు జీవం

చిన్నవయసులోనే జుట్టు తెల్లబడటం సర్వ సాధరణం అయిపోతుంది. ఈ సమస్యని ఆలీవ్ నూనెలో చాలా వరకు తగ్గించికోవచ్చు అంటారు సౌందర్య నిఫుణులు. ఆలీవ్ నూనెలో ఉండే విటమిన్-ఇ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు తలపై చర్మాన్ని మృదువుగా చేస్తాయి. ఆలీవ్ నూనెతో మర్థన వల్ల జుట్టు పొడి భారీ పోకుండా తెల్ల బడటం వంటి సమస్యలు తగ్గి కుదుర్లు దృఢంగా ఉంటాయి. ఎండ వల్ల ఆగిపోయిన మెలినిన్ వర్ణ ద్రవ్యం తిరిగి ఉత్పత్తి కావటంలో జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. […]

వాయు కాలుష్యం కూడా కారణం

వాయు కాలుష్యం వల్లనే మధుమేహం భారీన పడుతున్నారని ఐక్య రాజ్య సమితికి చెందిన పర్యవరణ బృందం చైనా కాలుష్య మండిలి కలిసి పదకొండేళ్ళ పాటు చేసిన అధ్యయనాలు తేల్చారు. గాలిలో క్యూబిక్ మీటర్ కు 10 మైక్రో గ్రాముల కాలుషిత వాయువులు ఉంటే మధ్య వయస్సు లైన స్త్రీలు ,బరువు తక్కువగా ఉన్నా వాళ్ళు అత్యధిక శాతం మధుమేహనికి గురయ్యే అవకాశం ఉందని అధ్యయనం చెపుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది షుగర్ వ్యాధికి గురవుతూ […]

గోధుమ గడ్డి పెంచేయవచ్చు

ఇంట్లో కాస్త ఎండపడే స్థలం ఉంటే వంటింటికి అవసరంఅయ్యే కూరగాయలు,ఆకు కూరలు పెంచుకోమంటున్నారు నిపుణులు. కాస్త లోతుగా వెడల్పుగా ఉండే కుండీలు లేదా పెద్ద నీళ్ళ డబ్బాలు,బకెట్ లు ఎంచుకుని కంపోస్ట్ ,కాక్ పిట్ కలిపిన మట్టితో వాటిని నింపుకోవాలి.తులసి,పూదినా,పచ్చి మిర్చి ,నిమ్మగడ్డి,గోధుమ గడ్డి ,పాలకూర వంటివి తక్కువ ఎండలో సులభంగా ఎదుగుతాయి.హైబ్రీడ్ విత్తనాలు బదులు సహజమైనవి ఎంచుకోవాలి.చాలా తక్కువ సమయంలో మొలకలు వస్తాయి. వాటి ఎదుగుదల విషయంలో దృష్టి పెట్టాలి.సేంద్రియ ఎరువుగా వంటింట్లో కూరగాయల తొక్కలు […]

ప్రత్యేకత కనిపించాలంటే

చిన్ని చిన్ని అకేషన్స్,పార్టీలకు కాస్త కొత్తగా ప్రయత్నిస్తే బావుండు అనుకుంటారు అమ్మాయిలు. పెళ్ళయినవాళ్ళు పెళ్ళికాని అమ్మాయిలు కూడా పరికిణి ఓణి ప్రయత్నించవచ్చు అంటారు డిజైనర్స్. ప్రత్యేకంగా అంటే పట్టు పావడలే బావుంటాయి.వీటి అంచులు,నేత పనితనమే ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.ఇకాత్ ,గద్వాల్,నారాయణ పేట రకాలు ఎంచుకోవచ్చు.వీటికి తగ్గ చక్కని ప్యాట్రన్ బ్లౌజులు,అందమైన జరీ ఉంటే చాలు. ఆకాశ నీలం,పీచు,గులాబీ,పసుపు,ఎరుపు వంటి రంగుల పరికిణీలు ఎంచుకుని కాస్త ఆడంబరంగా కనిపించేందుకు బెనారస్,చాందిని,జార్జెట్ దుపట్టాలు వాటి పై కచ్ వర్క్ ,అద్దాలు,కుందన్ […]

కొన్ని జాగ్రత్తలు అవసరం

వ్యాయామం లోసం జిమ్ కి వెళితే కోత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెబుతుంటారు. జిమ్ కి వెళ్ళే ముందర కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు తలెత్తవు.జిమ్ లో షోల్డర్స కి వెయిట్ లో కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఉంటే లోయర్ బ్యాక్ సపోర్టర్ వాడాలినేల పైన పడుకుని చేసే స్ట్రెచెస్,క్రంచెస్ నిపుణుల పర్యవేక్షణలో చేయాలి లేకుంటే బ్యాక్ పెయిన్ సమస్య తప్పదు.నొప్పులు వచ్చేలా వ్యాయామం చేయకూడదు. నొప్పులు అనేవి మజిల్ పై పెరిగిన ఒత్తిడికి సూచన. అధికంగా చెమట […]

రోజుకో రెండు చాలు

రోజుకో రెండు సపోట పండ్లు తిన్నా చాలు శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది.శరీరంలో వేడిని తగ్గించి బలాన్నిస్థాయి. ఆయుర్వేదపరంగా చూసుకున్న సపోటా తింటే చాలు తక్షణ శక్తి లభిస్తుంది.ఈ పండ్లలో పీచు జీర్ణశక్తి పెంచుతుంది.ఫైల్స్ సమస్యకు ఉపశమనంగా ఉంటుంది.సపోటా,గుజ్జులో పెరుగు ఎండు ఖర్జురాలు పంచదార ఉప్పు కలిపి జ్యూస్ చేసుకుని తాగితే శరీరానికి కావల్సిన ఐరన్ కాల్షియం లభిస్తాయి. మెత్తగా జ్యూసీగా రుచిగా ఉండే సపోటా ను ఈ వేసవిలో రోజుకు రెండు తప్పనిసరిగా తినాలి.

పోషకాల నిలయం సోయా

ఆరోగ్యాన్ని అందించడంలో సోయాకి చక్కని పాత్ర ఉందంటున్నారు ఎక్స్ పర్ట్స్. పశుమాంసం,పాలీష్ బియ్యం ,గోధుమలకు ప్రత్యామ్నాయం సోయా అంటారు డైటీషియన్లు. సోయా ద్వారా అన్ని రకాల నాణ్యమైన ప్రోటీన్లు అందుతాయి.వీటి ద్వారా అమైనో అమ్లాలు లభిస్తాయి.సోయా ఉత్పత్తుల్లో సోయా ఐసోలేట్స్,సోయా లెసిలిన్స్ ,సోయా నట్స్ ,సోయా బీన్స్ ,సోయా మిల్క్ ,సోయా యాగర్ట్ పేరుతో మార్కెట్లో దొరుకుతాయి.ఎడమేమ్ అనేది ఉడికించి ,ఉప్పుతో కలిపి చిరుతిండిగా తినవచ్చు.సోయాను సూప్ లు,సలాడ్స్ లో కలుపుకుని తినవచ్చు. సోయాసాస్ వాడకం కూడా […]

ఇలా వాడి చూడండి

షాంపులో కొన్ని పదార్ధలు కలిపి వాడుకుంటే తలకు సంబందించిన సమస్యలు పోతాయి అంటారు ఎక్స్ పర్ట్స్. తల దురదగా ఉంటే షాంపులో కాస్త రోజ్ వాటర్ కలిపి వాడితే పోతుంది. షాంపులో నిమ్మరసం వేసి వాడితే నిర్జీవంగా ఉన్న జుట్టు నిగనిగలాడుతుంది.తేనె కలిపి వాడితే జుట్టుకు తేమ అందుతుంది.జుట్టు ఊడిపోతుంది అనిపిస్తే కొన్ని చుక్కలు అరోమా ఆయిల్ కలిపి వాడితే సమస్య అదుపులోకి వస్తుంది.కలబంద కలిపిన షాంపు వాడుతుంటే జుట్టు సమస్య తగ్గిపోతుంది.ఉసిరి రసం కలిపితే జుట్టు […]

ఎంతో నెయ్యి వద్దు

పూర్వ కాలంలో గర్భిణిగా ఉన్న అమ్మాయికి నెయ్యి వేసిన ఆహరం తినిపించేవాళ్ళు .నెయ్యి ద్వారా వచ్చిన కొవ్వు ప్రభావం పొట్ట తుంటి పైన ఉంది ప్రసవం సులభం చేస్తాయని నమ్మేవాళ్ళు. అలాగే ఈ పుష్టికరమైన ఆహారం ద్వారా కేలరీలు పెరిగిన ప్రసవం తర్వాత పిల్లలను సాకే క్రమంలో చేసే శ్రమకు ఆ అదనపు బరువు తగ్గిపోతుంది అనుకునే వాళ్ళు కానీ ఇప్పుడున్న పరిస్తితిలో గర్భిణులకు ఎక్కువ నెయ్యి అవసరంలేదంటున్నారు. కడుపులో పిండం పెరిగే సమయంలో శరీరం తీవ్రమైన […]

వెండి దారాల సోయగం

లెనిన్ చీరెలు చాలా తేలికగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈసారిలెణిన్ తో కంచిపట్టున్న అంచున్న చీరెలుమార్కెట్లోకి వచ్చాయి.పెళ్ళి చీరెలు ఇవి వధువు నిండుగా కనిపించాలంటే నిండు రంగులు బంగారు జరీ మోటిఫ్ లో ఉన్న చీరెలు అందం.లెనిన్ కంచికోటి పట్టు చీరెలు భారీ కొంగులతో జరీ దారాలతో నేసిన మోటీఫ్ లు చూడగానే ఆకట్టుకునేలా ఉన్నాయి.చీరె మొత్తం జరీ గీతలు చక్కని అంచులతో చీరెలు ఎంతో అందంగా వేడుకను ప్రతిబింబించేలా ఉన్నాయి.

చర్మం జాగ్రత్త

ఈ వేసవి ఎండలకు ఈత మంచి వ్యాయామం అనిపిస్తుంది. కానీ నీళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటేనే అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.ఈత కొలనుల్లో ఇన్ ఫెక్షన్లు రాకుండా క్లోరిన్ కలుపుతారు.దీనివల్ల చర్మం జుట్టుకు కూడా హాని జరుగుతుంది.కొన్ని చోట్ల వేడి నీటి స్విమ్మింగ్ ఫూల్స్ ఉంటాయి, నీటిని వేడి చేసేందుకు ఆటోమేటిక్ మిషన్లు వాడతారు. క్లోరిన్ కలిపిన వేడి నీటితో చర్మంలోని సహజ తేమ,నూనెలు పోతాయి.దాంతో చర్మం బరకగా అవుతుంది.జుట్టు పొడిబారి చిట్లిపోతుంది. ఈతకొట్టే ముందర స్నానం చేసి […]

ఇవి రాచరికపు స్టైల్

గుజరాత్ లోని కచ్ పచ్చికమ్ జ్యూవెలరీకి ప్రసిద్ది. ఇవి ఎంతో సున్నితమైన నగలు. ఈ నగలకు చేసే మెటల్ గా వెండిని వాడతారు. అంచేత ఈవి ప్లాటినమ్ నగల్లా కనిపిస్తాయి.అన్ కట్ గ్లాస్, సెమీ ప్రెషియన్ స్టోన్స్ పొదిగిన ఈ నగలు చెత్తో చాలా శ్రద్దగా చెక్కినట్లు తయారు చేస్తారు.తెలుపు,ఏరుపు,ఆకుపచ్చ ఇలా ముదురు రంగుల జాతి రాళ్ళను వాడి ఈ నగలు చేస్తారు.ముత్యాల అల్లిక చాలా ప్రత్యేకం.జరీ గళ్ళ పట్టు చీరెలకు ఈ నగలు చాలా చక్కగా […]

బియ్యం గింజంత టూత్ పేస్ట్ చాలు

పాలపళ్ళు కనిపించాక పిల్లలకు బ్రెషింగ్ చేయోచ్చు అంటారు డాక్టర్లు. పేస్ట్ బ్రెష్ పైన వేసి నోట్లో పెట్టగానే పిల్లలు చప్పరించేస్తుంటారు.సాధరణంగా ఫ్లోరైడ్ కలిగిన పేస్ట్ ఇళ్ళలో వాడుతుంటారు. ఈ ఫ్లోరైడ్ వాడకం వల్ల దంతాల ఆరోగ్యం బావుంటుందంటారు.కానీ పిల్లలు ఈ పేస్ట్ తినేయడం మటుకు వాళ్ళకు ఆరోగ్యకరం కాదు.బ్రెష్ చేసేటప్పుడు బియ్యపు గింజపరిమాణంలో వేస్తే చాలు. మూడేళ్ళు వచ్చాక దాన్ని కాస్త పెంచుతూ పోవచ్చు.ఆరేళ్ళు వచ్చాక బ్రెష్ నిండా పేస్ట్ వేసిన ఏంకాదు.సంవత్సరం నిండాక దంతవైద్యుడిని సంప్రదించి […]

సరిపోదు అనిపించేది

కొన్ని సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు దానికి ఎన్నో రకాలు, కానీ నేను నటిగా ఫెయిల్ అవ్వలేదు అంటుంది అనుపమ పరమేశ్వరన్.సెలబ్రిటిలకు సంతృప్తి తక్కువని ఎవరైన అంటే మందు నాకు అర్ధం కాలేదు. ఎంతో కష్టపడే తమకు మాత్రం సంతృప్తి ఎందుకు ఉండదు అనుకునేదాన్ని, కానీ కొన్నాళ్ళకు కెమెరా ముందు నటించాక నాకు ఆ మాటలకు అర్ధం తెలిసింది.డైరక్టర్ ఒకే అన్న నాకు సరిపోదని ఇంకా బాగా చేయాలని ఆరటపడేదాన్ని నటనలో మరింత పరిణితి సంపాదించి ఆత్మ సంతృప్తి […]

సలాడ్స్ తింటే ఆరోగ్యం

ఈ వేసవిలో సులువుగా జీర్ణం అయ్యే పదర్థాలు తింటేనే ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటారు. ఉల్లికాడలు తినటం ఈ సీజన్ కు మంచిదే . సలాడ్స్ లో వీటిని కలుపుకోంటే రుచిగా తినవచ్చు. ఫ్లూతో పోరాడగల అద్భుత ఔషధం. ఈ ఉల్లి కాడలు కెరోటనాయిజ్ల్ అధికంగా ఉంటాయి. కీరా ,కేలట్లతో కలిపి తీసుకోంటే తగినంత విటమిన్ ఎ లభిస్తుంది. తాజాగా ఉన్నా ఉల్లి కాడలు ,వాటిలోని ఫేవర్ రుచివల్ల సలాడ్ కు మంచి రుచి ఇస్తాయి. ముల్లంగి […]