Friday, 31 Jul, 2026

ఆర్నమెంటల్ క్యాబేజీలు

తోట అలంకరణ లోని మిగతా పువ్వుల వరుస లోకి  క్యాబేజీలు కూడా వచ్చి చేరాయి . ఇవి పువ్వుల్లా వుండే  క్యాబేజీలు . గులాబీ,పీచ్ ,వంగపువ్వు,గోధుమ మొదలైన మిశ్రమ వర్ణాల్లో ఈ పువ్వు చుట్టూ ఆకులూ విచ్చుకొని మధ్యలో ఆకులన్నీ కలిసి బంతిపువ్వులా ఉంటాయి . చల్లని వాతావరణంలో పెరిగే ఈ  క్యాబేజీలు ముదురు వర్ణం లోకి మారుతూ చాలా అందంగా ఉంటాయి . పులా తోటలను విభిన్నంగా తీర్చిదిద్ధేందుకు వంగపువ్వు,గోధుమ,గులాబీ రంగులు వారసులుగా వేస్తూ పెంచుతారు […]

శిశువు మీద ప్రభావం 

గర్భిణిగా ఉన్నపుడు ఎప్పుడు విషాద వార్తలు వింటూ వున్న లేదా ఏదైనా విషయంలో బాగా ఆందోళన చెందుతూ ఉన్న ఆ ప్రభావం గర్భస్థు శిశువు మెదడులో భావోద్వేగాలు,మాట్లాడటానికి సంబందించిన భాగంలో చురుకుదనం తగ్గి పోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి. ఇందుకోసం కొంత మంది గర్భిణీలను ఎంపిక చేసి వాళ్ళకు ఎన్నో భావోద్వేగపరమైన విషయాలు వినిపిస్తూ,గర్భస్థ శిశువు మెదడులోని రక్త ప్రసారంలో జరిగే మార్పులను స్కానింగ్ లో ప్రతి ఫలిస్తున్న కాంతి ద్వారా తెలుసుకున్నారు. పాత రోజుల్లో కూడా గర్భవతులుగా […]

      “శివశక్తి  ప్రసాదం”

ఓం నమో నమః !! భువనగిరి సమీపంలో చిట్యాల లోని నాగర్ కర్నూల్లో స్వర్ణ లింగంతో దర్శనం ఇస్తున్నారు.ఇక్కడ లింగ మూర్తి 750 కిలోల బంగారంతో మెరిసి పోతూ ఉంటుంది. ఆ ప్రాంగణంలోనే 1,0008 లింగాలు,పార్వతీ దేవి,గణపయ్యలు కూడా దర్శనం ఇస్తారు. ఈ ఆలయంలో రోజూ ప్రొద్దుట 7 గంటలకు భక్తులు స్వయంగా శివలింగాన్ని అభిషేకం చేసుకుని తరిస్తారు.ఈ అవరణలోనే శ్రీ శివశక్తి సాయి మహా ధుని కూడా దర్శనం ఇస్తుంది.భక్తులు కోరికతో వచ్చి ప్రదక్షిణం చేసి […]

ప్రియా అండ్ ది లాస్ట్ గర్ల్స్

మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేసిన పోరాటం గురించి ” ప్రియా అండ్ ది లాస్ట్ గర్ల్స్ “పుస్తకం తీసుకొస్తోంది ఇండియన్ అమెరికన్ రచయిత్రి దీప్తి మెహతా . గతంలో ఢిల్లీలో నిర్భయ దుర్ఘటన గురించిన నేపథ్యంలో దీప్తి . మోడర్నేడ్  ఫిమేల్ సూపర్ హీరో పేరుతో పుస్తకం రాసింది . ప్రస్తుతం విడుదల కానున్న పుస్తకంలో ,దేశంలో అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా కలకత్తా లోని సోనాగచి లోని వేశ్యల జీవితాల గురించిన అంశం ప్రధానంగా […]

ఇది నా వ్యక్తిగత ప్రయాణ గాధ

అయోధ్య అంశం నేపథ్యంలో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నానంటోంది కంగనా రనౌత్ . అపరాజిత్ అయోధ్య పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నట్లు చెపుతోంది . అయోధ్య రామమందిర నిర్మాణం ఏళ్ళుగా చర్చినీయాంశం అయింది . అయోధ్య కేసు భారత రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసింది తుది తీర్పు ఏళ్ళనాటి వివాదానికి ముగింపు పలుకుతూ దేశ లౌకిక స్ఫూర్తిని నిలబెట్టింది . అవిశ్వాసం నుంచి విశ్వాసం వైపుకు ప్రయాణించే ఓ వ్యక్తి కథగా ఈ సినిమా ఉంటుంది . ఓ రకంగా […]

చర్మం మెరిసేట్టు

బరువును అదుపులో ఉంచుకోక పోతే చర్మమూ జుట్టు కాంతిహీనంగా మారటం జుట్టు పలచబడి పోవటం వయస్సు మించినట్లు కనిపించటం సర్వ సాదారణం …. ఊబకాయం,పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించు కోవాలి . అంటే ఆరోగ్యకరమైన ఆహారం శారీరక వ్యాయమం తో కూడిన జీవన శైలి ముఖ్యం . పిండి పదార్దాలు తీపి పదార్దాలు మితంగా తీసుకోవాలి . వేపుళ్ళు ,జంక్ ఫుడ్ ,కూల్ డ్రింక్స్ మనేయాలి . భోజనంలో అన్నం కంటే కూరలు,పప్పు పెరుగు ఎక్కువ మొత్తంలో […]

గాలికే బతికేస్తాయి 

మొక్కలు పెంచటం ఇష్టం,కానీ ప్రతి రోజు వాటి సంరక్షణ చేయటం మరచి పోకుండా నీళ్ళు పెట్టటం,కష్టమయిపోతోంది అనుకునే వాళ్ళకోసం ఎయిర్ ప్లాంట్స్ చక్కని ఎంపిక. ఇవి గాలిలో తేమ,పోషకాలు పీల్చుకొని బతుకుతాయి. ఈ మొక్కల పేరు తిల్లాండ్సియా,చిన్న చిన్న వేళ్ళు,చిన్న ఆకులతో నీలం,గులాబీ పసుపు రంగు పూలతో వుంటాయి. కాక్టస్ రకాలుగా కనిపించే వీటిని హ్యాంగింగ్ ప్లాంట్లుగా పెంచుతాయి . ఖాళీగా ఉండే బట్టీల్లో,లేదా తీగలు బట్టి వేలాడేదాని వీటిని పెంచుకోవచ్చు. మొక్కను తెచ్చుకొని కాసేపు నీళ్ళలో […]

అంత ప్రాక్టీస్ దండగే 

ఎంత సాధన చేస్తే అంత మంచిది అనుకొంటాము కదా. కానీ అలాగా ప్రాక్టీస్ చేసిన ఫర్ ఫెక్షన్ సంగతి అలావుంచి ప్రతికూల ప్రభావం చూపిస్తుంది అంటారు ఎక్స్ పర్ట్స్ . ప్రాక్టీస్ అన్నాక ఒక సమాచారం అనుకొంటే దాన్ని మెదడు స్వీకరించేందుకు దాన్ని సంఘటిత పరుచుకొనేందుకు కొంత సమయం పడుతోంది. ఇందుకు ట్రైనింగ్ స్టేషన్లు  నడుమ బ్రేక్ తీసుకోవలిసిన అవసరం ఉంటుంది. దీనికి నిద్రించే సమయం తోడుకావాలి. ఏ వీణ ,లేదా వయోలిన్ నేర్చు కోవాలన్న దేన్నయినా […]

సాహసంతో కనులకు విందు

భారతదేశంలో అతిపెద్దదీ సుందరమైన ప్రకృతి కలిగినది జోగ్ జలపాతం కర్నాటక రాష్ట్రం లోని మల్నాడు ప్రాంతంలోని అతిపెద్ద జలపాతం ఇది . షిమోగా ప్రాంతంలో ఉన్నా ఈ జలపాతం శరావతి నది కొండల పైన నుంచి కిందికి దూకటంలో ఏర్పడింది . 830 అడుగుల ఎత్తు నుంచి రాజా,రాణి,రాకెట్,రోదర్ అనే నాలుగు పాయలుగా కిందకి దూకుతుంది దాని ధ్వని భరించటం చాలా కష్టం . ఆ ధ్వనిని భరించే ధైర్యం అంతటి జలతాన్ని చూడాలన్నా సాహసం ఉంటే […]

ప్రపంచంలో పెద్ద పుస్తకం     

ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ప్రచురించిన పుస్తకాల్లో అది పెద్దది,విశేషమైందీ ప్రజైల్ నేచర్ అన్నది. 2010 లో ఈ పుస్తకం ప్రచురించారు. హంగేరీ దేశంలోని అగ్టెలిక్నేషనల్ పార్క్ గురించి ఈ పుస్తకం రాశారు. ఇద్దరు హంగేరియన్ రచయితలు,పాతిక మంది స్వచ్చంద సేవకులు  కలసి ఈ బ్రహ్మండమైన పుస్తకానికి రూపకల్పన చేశారు. ఈ పుస్తకం సైజు 4.18 మీటర్ల వెడల్పు ,3.77 మీ ఎత్తు బరువు 1420 కిలోలు.

రిటైర్ మెంట్ కోసం పొదుపు అవసరం

ఉద్యోగ విరమణ తర్వాత ప్రతినెలా తమకు ఎంతడబ్బు అవసరం ఉంటుందో లెక్కలు వేసుకొని అంతసొమ్ము తప్పని సరిగా నెలసరి వేతనంలో పొదుపు చేసుకోండి అంటున్నారు నిపుణులు . రిటైర్ మెంట్ కోసం చేసే పొదుపు 30 ,40  ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ప్రారంభం చేయాలి . పిల్లలు భాద్యతగా ఉండచ్చు నిజమే . వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళకున్న బాధ్యతలతో కూడా అంత భౌతికంగా,మానసికంగా,ఆర్థికంగా సాయంగా ఉండగలదా అన్నా ప్రశ్నకు సమాధానం చెప్పటం కష్టమే అంటారు నిపుణులు. అందుకే […]

సెల్ఫీకి ఫోజ్ ఇస్తున్నారా ? 

అస్తమానం సెల్ఫీలు తీసుకోవటం,సోషల్ మీడియాలో పోస్ట్ చేసి,లైకులు కోసం చూడటం అమ్మాయిల హాబీల్లో ఒకటి మరి ఫోటోల్లో పర్ ఫెక్ట్ గా కనిపించాలి అంటే చిన్న కిటుకులు పాటించాలి. ఫోటో జెనిక్ గా ఉండటం కూడా నేర్చుకొని సాధించవలసిన విషయాలే ఫోటోకి ఫోజ్ ఇవ్వాలంటే చర్మ పరి రక్షణ చాలా అవసరం. కెమెరా ప్రతి చిన్న అంశాన్ని పవర్ ఫుల్ గా పాటిస్తుంది. చర్మం ముదువుగా కనిపించేలా కాస్తయినా శ్రద్ధ తీసుకోవాలి. సింపుల్ మేకప్ చాలా అవసరం […]

“శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి ప్రసాదం”

      సుబ్రహ్మణ్యం..సుబ్రహ్మణ్యం..షణ్ముఖనాధా సుబ్రహ్మణ్యం!! ఈ రోజు మార్గశిర శుద్ధ షష్ఠి.దినినే సుబ్రహ్మణ్యం షష్ఠి అని,స్కంద షష్టి అని జరుపుకుంటాము.సుబ్రహ్మణ్యేశ్వరునికి,వల్లీదేవికి వివాహం జరిగిన రోజు అని కూడా పిలుస్తారు. తమిళనాడులో “పళని” అనే క్షేత్రంలో కార్తికేయుడుగా,కుమారస్వామిగా కొండ పైన పూజలు అందుకుంటున్నాడు.షష్టి నాడు కావడి ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతాయి.భక్తులు షష్టినాడు పాలు,విభూతి,పూలు,తేనె,నెయ్యి వీటిలో ఒకటి కావడిలో పెట్టుకుని పాదచారులై కొండకు వస్తే తనని ఆరాధించిన ఫలితం ఉంటుంది అని సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆదేశం. సంతానం లేని వారికి సంవత్సరం […]

  “శ్రీ వేణుగోపాల స్వామి ప్రసాదం”

బాల…గోపాల కృష్ణ పాహి పాహి!! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  కృష్ణజిల్లా దివిసీమకు సమీపంలో ఉన్న మొవ్వ గ్రామంలో  శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం దర్శించి వద్దాం పదండి.గర్భాలయంలో శ్రీ వేణుగోపాల స్వామి,గర్భాలయ వెలుపల శ్రీ రాజ్యలక్ష్మిదేవి, గోదాదేవి కొలువై ఉన్నారు.ఈ ఆలయం ఎంతో భక్తి ప్రపత్తులతో భక్తులు కొలుస్తారు. ఈ అరణ్య ప్రాంతంలో మౌద్గల్య మహాముని తపస్సు ఆచరిస్తున్న అక్కడ ఇసుకతో చిన్న వేణుగోపాల స్వామిని తయారు చేసుకుని పూజలు చేసేవారు.సమీపంలో ఒక బ్రాహ్మణ పల్లె ఉంది.వరదయ్య అనే […]

ఇంట్లోనే మ్యానిక్యూర్

శరీరంలో నిరంతరం పనిచేసేది చేతులే . రసాయనాలు, ఇతర పదార్దాలు నిరంతరం చేతులకు తగులుతూనే ఉంటాయి . వీటి పట్ల అత్యంత శ్రద్ధ చూపించాలి . నెయిల్ పెయింట్ రిమూవ్ చేసి బౌల్ లోకి గోరువెచ్చని నీళ్ళను తీసుకోని ఆ నీటిలో చేతులు మంచి మృదువుగా రుద్దితే మృతకణాలు పోతాయి . తర్వాత చేతులు పొడిగా ఉంచుకొని హొండ్ క్రీమ్ అప్లయ్ చేస్తే చేతులకు చక్కని మాయిశ్చరైజర్ లభిస్తుంది . గోళ్ళను నీతిగా కట్ చేసుకొని షేప్ […]

భోజనం తర్వాతే బెస్ట్

రక్తంలో చెక్కర నిల్వలను నియంత్రణలో ఉంచే ముందు వ్యాయామం ఒక్కటే . క్రమం తప్పకుండా 30 నుంచి 60 నిముషాలు వాకింగ్ అందరికి సాధ్యపడదు. అయితే భోజనం చేసిన తర్వాత,ఓ అరగంట ఆగి,ఆ తర్వాత 15 నిముషాలు పాటు నడిస్తే,ఈ వ్యాయామం,ప్రతి రోజు 45 నిముషాల చొప్పున నడిస్తే 24 గంటలో రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రణలో ఉంచు కొన్నంత ఫలితం లభిస్తుందని పరిశోధనలు చెపుతున్నాయి అన్ని రకాల వ్యాయామలు గ్లూకోజ్ స్థాయుల్ని దాదాపు సమంగా మెరుగుపరుస్తాయి. […]

21 రోజులు చాలు

ఏదైనా ఒక కొత్త అలవాటును 21 రోజుల నిబంధనగా పెట్టుకొని తప్పకుండ ఆచరిస్తే అది జీవితం మొత్తం కొనసాగుతుందని విజ్ఞుల అభిప్రాయం . ఓకే అలవాటును మెదడు నెమ్మదిగా స్వీకరించి అంగీకరించేందుకు పట్టే సమయం ఇది . చిన్నిచిన్ని అలవాట్లు జీవితాన్ని మార్చేయవచ్చు . ఒత్తిడి తగ్గేందుకు ప్రతిరోజు ఉదయాన్నే ఒక పాత వినటం,పది నిముషాలు పరుగుతీయటం ,ఒక పుస్తకంలో పదిపేజీలు చదవటం ,ధ్యానం ఏదైనా 21 రోజులు నిబంధనగా చేసి చూడండి . జీవితం ఆ […]

రోజు తినండి 

హడావుడిగా ఆఫీస్ పని, ఇంటి పనిలో నీళ్ళు సరిగా తాగక డీహైడ్రేషన్ సమస్య వస్తోంది. అలాంటి ఇబ్బంది రాకుండా నీటిశాతం అధికంగా వుండే కీర దోస ఎక్కువగా తింటే మంచిది. అలాగే విటమిన్-సి నీటి శాతం అదికంగా ఉన్న ముల్లంగి కూరల్లో భాగంగా చేసుకొంటే చాలా మంచిది. ఇక సొరకాయి బీరకాయి అయితే శరీరంలో నీటి నిల్వలు కోల్పోకుండా చేస్తాయి. జ్వరంతో బాధపడుతున్న ,వారికీ గర్భవతులకు ఈ రెండు విరివిరిగా తినమంటారు వైద్యులు ,వాటిలో వుండే పీచు […]

సముద్రంలో గవ్వల కొండలు

సముద్ర తీరంలో అక్కడక్కడ కొన్ని తెల్లని కోండలు ఏర్పడి ఉండటం కొన్ని దేశాల్లో కనిపిస్తుంది ,ఎంతో అందంగా ,అద్భుతంగా అనిపించే ఈ తెల్లని కొండల పైన షూటింగ్స్ చేస్తుంటారు . అవి మాములు కొండలు కావు . సుద్ద కొండలు . సముద్రంలో నివశించే ఎన్నో జీవుల పైన షెల్ ఉంటుంది . నత్త గుల్లాలు చూస్తాం కదా వాటికి వుండే షెల్ లాగా . ఆ జీవులు మరణించాక అలల తాకిడికి అవన్నీ ఒక చోటచేరి […]

సంపాదన తగ్గితే సమస్యే   

మంచి జీవితం,చక్కని ఉద్యోగం ,సరిపోయే జీవితం లభిస్తే ఆ మెరుగైన ఆర్ధిక పరిస్థితితో పాటు,ఆరోగ్యంగా కూడా బావుంటుంది అని అధ్యయనాల సారాంశం. అదే కనుక జీవితం తగ్గిపోతే, సంపాదన అవకాశాలు తగ్గుతోంటే క్రమంగా ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెపుతున్నారు . సంపాదన తగ్గి ఆలోచనలు పెరుగుతాయి. దీనివల్ల ఒత్తిడి, అధిక రక్తపోటు ఇతర సమస్యలు వస్తాయి. అధికమైన స్థిరత్వం ఆరోగ్యానికి ఔషధం అని చెపుతున్నారు.