Chinna Maata
నేనెప్పుడూ ఊరుకోలేదు
అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినా ,కాలం గడుస్తున్నా కొద్దీ నా జర్నీలో నాకు సినిమా పైన చాలా ఇష్టం కలిగింది . సినిమా మాధ్యమంలో ప్రజలతో ఎమోషనల్ గా కనెక్ట్ కావచ్చని తెలుసుకోన్నా . ఇక ఏ అభిమానాన్ని వదులుకోలేక పోయా అంటోంది నిత్య . ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ ఉండదని మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఈ ఒక్క చోటేకాదు,అన్ని సెక్టర్స్ లోనూ మహిళల పై గౌరవం తక్కువే . నా కెరీర్ లో నాకు చాలా […]
చిన్ని మార్పులతో తాజాతనం
ఈ సీజన్ లో చల్లని వాతావరణంలో మొహం పొడిబారి పోయి తెల్లని పగుళ్ళు కనిపిస్తాయి . అలాటప్పుడు పౌడర్ రూపంలో ఉండే మ్యాటీ పైయింగ్ ఫౌండేషన్స్ వాడొద్దు . ఇవి చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి . ఆయిల్ బెస్ట్ ఫౌండేషన్ రాసుకొంటే చర్మం తాజాగా కాంతివంతం గా ఉంటుంది . దానిపైన బీ బీ క్రీమ్ లేదా సీ సీ క్రీమ్ మాయిశ్చరైజర్ రాసుకోవాలి . ఈ సీజన్లో లిప్ బామ్స్ తప్పకుండా వాడాలి . చాప్ […]
ఇంటి పెత్తనం ఆమెదే
అందమైన లోహపు ఆభరణాలు చక్కని నవ్వుమొహంతో కనిపించే బోండా గిరిజన మహిళల జీవితం చాల ప్రత్యేకం . ఒడిసా ,ఛతీస్ గఢ్ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులోని మత్కాన్ గిరి ఈ మహిళలది . వేట మొదలు వ్యవసాయం వరకు వీళ్ళదే బాధ్యత. ఆమే ఇంటిపెద్ద . ఎదురు కట్నం ,పశువులు పొలం కానుకగా ఇచ్చి ,తమకంటే వయసులో చిన్నవాడిని వివాహం చేసుకొంటారు . సమస్యలొస్తే విడాకులు తీసుకొంటారు . కుటుంబ సమస్యలకు భర్తే కారణం అయితే అతను […]
బేకడ్ బీన్స్ మ్యూజియం
ఈ ప్రపంచంలో ఒక్కొక్కళ్ళకీ ఒకో హాబీ ఉంటుంది . యూకే పార్ట్ టాల్ బాట్ లో ఉండే భారీ కిర్క్ కి ఓ హాబీ వుంది . బేకడ్ బీన్స్ డబ్బాలు ,పాట్ లు వాటికీ సంబందించిన టేబుల్స్ ,మొత్తం బీన్స్ కి సంబందించిన ప్రతి వస్తువును సేకరించటం హాబీ జాతీయ అంతర్జాతీయ ఛారిటీ సంస్థలకు విరాళాలు అందించే ఉద్దేశ్యం తో ఈ బీన్స్ మ్యూజియం ఏర్పాటు చేసి తన ఇంటిని ఈ వస్తువులతో నింపేశారు . […]
ఎన్నో రంగులు ,రుచులు
ప్రతి రోజు ఒక దోర జామ పండు తింటే చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాక వృద్దాప్య లక్షణాలు నెమ్మదై ,కళ్ళకింద ముడతలు ,మొటిమలు మాయం అవుతాయి అంటున్నారు డాక్టర్స్ . వీటిలో ఉండే పీచు, విటమిన్-ఎ ,ఫోలిక్ ,ఆమ్లాలు,పొటాషియం ,కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలం. మనకు తెలిసిన ఎరుపు, తెలుపే కాకుండా ఎన్నో రుచుల్ని సంకరీ కరించటం ద్వారా జామ ఎన్నో రకాలుగా పండుతుంది . ఆపిల్ ,సర్దార్,లలిత్ ,బిట్టిదార్ ఆర్క్ మృదుల,సఫెద, కోహిర్ రకాల […]
బార్లీ గింజలు మంచి ఆహారం
ప్రతి రోజు బార్లీ జావ తాగండి ఆరోగ్యం అంటున్నారు డైటీషియన్ లు.. వందగ్రాముల ఉడికించిన బార్లీలు 350 కేలరీలు 75 గ్రాముల పిండి పదార్దాలు 15 గ్రాముల ప్రోటీన్లు 17 గ్రాముల పీచు పదార్దాలు ఉంటాయి . కొవ్వులు మాత్రం రెండు గ్రాములే శరీరానికి శక్తి నిచ్చే బి-విటమిన్లు ఐరన్ మెగ్నీషియం ,మాంగనీస్ ,సెలీనియం వంటి ఖనిజాలు బార్లీ ఎక్కువే . పీచు ఎక్కువ,పిండి పదర్దాలు తక్కువ ఉన్నా బార్లీని అల్పాహారంగా తీసుకోవచ్చు . ఉడికించిన బార్లీ […]
“భీమేశ్వర ప్రసాదం”
తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో వేములవాడ మండలంలోని భీమేశ్వరాలయానికి వెళదాం రండి….ఈ ఆలయానికి పురాతన చరిత్ర వుంది.ఇక్కడ భీమకవి జన్మించిన ప్రదేశం.ముందుగా రాజరాజేశ్వరాలయం దర్శనం చేసుకుని భక్తులు భీమేశ్వరాలయానికి వస్తారు.ఇక్కడ మర్రిచెట్టు ప్రసిద్ధి. భక్తులు పూజించి భీమేశ్వరుని కటాక్షం పొందుతారు.పురాతన కాలం నుంచి ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తూ వస్తున్న ఆచారం. నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాభిషేకం. -తోలేటి వెంకట శిరీష .
నిద్ర లేమి తోనే ఈ సమస్య
మెనోపాజ్ తర్వాత చాలా మంది నిద్ర పట్టటం లేదనే చెపుతుంటారు . ఈ సమస్య ఎముకల పైన ప్రభావం చూపిస్తుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ముఖ్యంగా ఐదుగంటల కన్నా తక్కువ నిద్ర పోయే వాళ్లలో ఎముక సాంద్రత తగ్గి ఆస్ట్రియా పోరోసిస్ కు దారి తీసే అవకాశం ఉంది అంటున్నారు . 12 వేల మంది మహిళల పై చేసిన అధ్యయనం ఎముకల సమస్యకి నిద్రలేమికీ సంబందం ఉందని తేల్చింది సాధారణంగా మెనోపాజ్ దాటార్ హార్మోన్ల […]
ఇది కొత్త లుక్
స్కార్ఫ్ తో జీన్స్ షర్ట్ కి ఓ కొత్త అందం వస్తుంది . సాదాసీదా డ్రస్ పైకి ఇప్పుడొస్తున్నా త్రీడీ స్కార్ఫ్ లు చాలా అందంగా ఉంటాయి . భిన్నమైన రంగులు అందమైన పూలు ,పూమొగ్గలతో ఈ 3-డి స్కార్ఫ్ లు కళ్ళ ను ఆ కట్టు కొంటున్నాయి . ప్రత్యేకం వింటర్ కోసం తయారు చేసిన ఈ అందమైన స్కార్ఫ్ లు త్రీడీ లుక్ తో పాటు ,ఒక కొత్త ఫ్యాషన్ ను కూడా తీసుకొచ్చాయి […]
తొక్కలే అని తీసేయద్దు
కూరలు,పండ్లు కోస్తున్నపుడు వాటి తొక్కలు పారేయకండి వాటితో సూప్ లు ఇతర పదార్దాలు తయారీ కోసం వెజిటబుల్ స్టాక్ తయారు చేయండి అంటున్నారు డైటీషియన్ . రకరకాల కూరగాయల తొక్కల్ని పడేసి అందులో అల్లం తరుగు ,ఉప్పు,కొన్ని లవంగాలు దాల్చిన చెక్క ముక్క వేసి మరిగిస్తే కాస్త చిక్కగా వెజిటబుల్ స్టాక్ సిద్దం అవుతుంది . ఇది చాలా విలువైంది . ఎన్నో పోషకాలున్నదీ . దీనితో సూప్ లు ఇతర పదార్దాలు చేసుకోవచ్చు . చారు […]
పర్లేదు స్నాక్స్ తినచ్చు
రోజంతా తీరుబడి లేకుండా పనిచేసే మహిళలు ప్రోటీన్లు న్నా పల్లీలు, బాదం వంటి స్నాక్స్ రాత్రివేళ తిన్న పెద్దగా అనారోగ్య సమస్య కానీ ,పొట్టిపెరగటం గానీ ఉండదు అంటున్నారు అధ్యయన కారులు . రాత్రివేళ ఈ స్నాక్స్ తిన్న జీవక్రియలు ఎలాంటి లోపాలు తలెత్తవని అంటున్నారు . దీనికోసం చేసిన ఒక ప్రయోగంలో వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ పొందుతున్న కొందరు మహిళలకు ప్రోటీన్ షేక్ ను పాడుకొనే ముందు రెగ్యులర్ గా ఇచ్చారు రాత్రివేళ కొవ్వులు […]
అవీ అవసరమే
కార్బోహైడ్రేట్స్ పేరు ఎత్తితే ఆమ్మో అంటారు అమ్మాయిలు డయాబెటిస్ ,ఒబిసిటీ అంటూ వీటికి చాలా దూరంగా ఉంటున్నారు . అయితే కార్బోహైడ్రేట్స్ మెదడు ఆరోగ్యానికి అత్యంత అవసరం అంటారు పరిశోధకులు. కార్బోహైడ్రేట్స్ తీసుకొనే వారిలో మెదడు పని తీరు బావుండటంతో పాటు మతిమరుపు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని అధ్యయనాల్లో గుర్తించారు . అంతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్వల్ల గుండె ఆరోగ్యం చాలా బావుంటుందని ఆయుః ప్రమాణాలు పెరుగుతాయని వివరించారు . ఇతరత్రా ఆరోగ్య సమస్యలు లేనివాళ్ళు […]
ఏదైనా నాకిష్టమే
ఓ నటిగా నాకు మంచి గుర్తింపు వస్తే చాలు. హీరోయిన్ గానే కనిపించాలని నేనెప్పుడూ కోరుకోలేదు కొన్నింటిలో మొహమాటం వదిలిపెట్టి విలన్ గా కూడా నటించా అంటోంది వరలక్ష్మి శరత్ కుమార్ .తమిళనాడు లో ఆమె నటించిన సినిమాల సంఖ్య పాతికపైనే ఉన్నాయి. తెలుగు లో చాలా తక్కువే కాకపోతే తమిళ సినిమాలు తెలుగులోకి రావటం వల్ల వరలక్ష్మి పరిచితురాలే హీరోయిన్ ల ప్రతికూల పాత్రలు చేయాలంటే సాధారణంగా సందేహిస్తారు. నాకు అటువంటి భయాలు ఏవీ లేవు […]
పియానో హౌస్
సంగీత ప్రేమికులకు కనువిందు చేసేదే పియానో హౌస్ . ఈ అద్భుతమైన నిర్మాణం చైనా లో huainan సిటీలో ఉంది . పర్యాటకుల సంఖ్య పెరిగేందుకు గానూ 2007 లో ఈ పియానో హౌస్ ని నిర్మించారు . ఈ హౌస్ డిజైన్ ను హె ఫె యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన అర్కిటిక్చర్ విద్యార్థులు రూపొందించారు. కేవలం నలుపు ట్రాన్సపరెంట్ అద్దాలతో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోని అందమైన భవనాల్లో ఒకటి . ఈ […]
నేను అన్ని పనులు చేయగలను
ఇండియాలో అమ్మలు,తమ కూతుళ్ళకి అన్ని పనులు చేసి పెడుతూ చెడగొట్టేస్తారాని పిస్తుంది నాకు అంటోంది దిశా పటాని . నేను లక్నో ఇంజనీరింగ్ చేస్తున్నపుడు మోడ లింగ్ ఆఫర్లు వచ్చాయి. ఈ కొత్త కెరీర్ కోసం ముంబయ్ వెళ్ళి విదేశీ మోడ్ ళ్ళ తో కలపి పనిచేస్తున్నప్పుడు నేనెన్నో నేర్చుకొన్నాను. వాళ్ళంతా పూర్తి స్వతంత్రంగా ఉంటారు . ఎవరి పన్లు వాళ్ళు చేసుకుంటారు. అన్ని పనులు వాళ్ళకి వచ్చు .అలాగే నేనూ నేర్చుకొన్నాను. బద్దకంగా ఉండగూడదు అంటారు […]
ముఖాకృతిని బట్టే ఎంపిక
సన్ గ్లాసులు ఇపుడు కళ్ళకు రక్షణే కాదు. ఓ స్టైల్ స్టేట్ మెంట్ కూడా పెట్టుకొనే సన్ గ్లాస్ మొహనికి నొప్పితేనే ఫ్యాషన్ యాక్ససరీ అవుతోంది. ముఖాకృతిని బట్టి సరైన సన్ గ్లాస్ ఎంచుకోవాలి. ముఖం గుండ్రంగా వుంటే రెక్టాంగ్యాలర్ ఫ్రేమ్ నప్పుతోంది . గుండ్రని మొహం గలవారికి మొహం,వెడల్పు పొడవు సమంగా ఉంటుంది. కనుక ఈ రెక్టాంగ్యాలర్ ఫ్రేమ్ గుండ్రని ఆకృతిని కొంత తగ్గించి మొహం పొడవుగా ఉన్నట్లు చూపుతోంది. అంతే కాకుండా మొహం స్లిమ్ […]
“శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదం”
తెలంగాణా రాష్ట్రం,మహబూబ్ నగర్ జిల్లా,కోయల్ కొండ కి సమీపంలో మన్యం కొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా వెలసి పూజలు అందుకుంటున్న స్వామిని దర్శించి వద్దాం పదండి!! పురాణ గాథల ప్రకారం ఇక్కడ గుహలో మునులు తపస్సు చేసుకునే వారని అందుకే మునుల కొండ అని పిలిచేవారు కాలక్రమేణా మన్యం కొండగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామి శేషశాయి రూపంలో దర్శనం ఇస్తారు. దిగువ కొండలో అలివేలుమంగా దేవి కొలువై ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళలేని […]
అరిటాకులో భోజనం ఆరోగ్యం
ఇంట్లో శుభకార్యాల్లో అరిటాకుల్లో భోజనం వడ్డిస్తూ ఉంటారు . ఇలా అరటాకుల్లో భోజనం చేయటం వెనక సంప్రదాయంతో పాటు ఎన్నో ఆరోగ్య లాభాలు దాగి ఉన్నాయంటున్నారు పరిశోధకులు . గ్రీన్ టీ లో లభించే “ఎపిగాలోకె టి బిన్ గాలెట్ అనే పాలి ఫినాల్ అరిటాకుల్లో ఎక్కువగా లభిస్తుంది . ఆకులో వేడివేడి పదార్దాలు వడ్డించుకొని తినటం వల్ల వాటిలోని ఫాలి ఫినాల్ ఆహారం ద్వారా శరీరంలోకి చేరుతుందనీ ఇది చాలా వ్యాధులను దరి చేర నీయదనీ […]
ఎండ తగలక పోతే నష్టం
ఎండ మొహం చూడకపోతే ఎన్నో అనర్దాలు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . శరీరానికి సూర్యకిరణాలు తగలటం వల్లనే సోరియాసిస్ మొటిమలు ఎగ్జిమా వంటివి రాకుండా ఉంటాయి . సూర్యకిరణాలు సహజ బూస్ట్ గా పనిచేస్తాయి . చర్మంపై పడిన సూర్యకిరణాల తోనే శరీరం విటమిన్-డి ని ఉత్పత్తి చేసుకొంటుంది . గుండె జబ్బులు, డిప్రషన్, ఆస్ట్రియో పారోసిస్ ,కొన్ని రకాల కాన్సర్ లతో పోరాడేందుకు,ఇలా శరీరం ఉత్పత్తి చేసుకొన్నా విటమిన్ -డి ఉపయోగ పడుతుంది . ఎండా […]
పిల్లలు వల్లే ఆరోగ్యం
పిల్లలున్న ఇళ్ళు దేవతల నిలయం అంటారు. వాళ్ళతో ఆటలాడుతూ గడిపితే ఆరోగ్యం చాలా బావుంటుంది, పిల్లలతో మంచి అనుబంధం ఉన్న తల్లితండ్రుల్లో ఒత్తిడి శాతం తక్కువగా ఉంటుందని పరిశోధికులు చెపుతున్నారు. ఒత్తిడి తక్కువగా ఉండటం వల్ల నిద్రలేమి, అజీర్ణం,డిప్రెషన్ ఛాతినొప్పి వంటి లక్షణాలు దూరంగా ఉండటాన్ని పరిశోధికులు గమనించారు. అంతేగాక పిల్లలున్న తండ్రులు తమ దురలవాట్లని తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు. తమ దురలవాట్లు పిల్లలపైనా దృష్ప్రభావం చూపిస్తాయనే భయంతో తండ్రులు వాటికీ దూరంగా ఉంటారని […]
