Saturday, 01 Aug, 2026

 ఇలాగైతేనే గ్రాండ్ లుక్ 

చీరె అందం పూర్తిగా కనిపించాలి అంటే ఎంచుకొన్న బ్లవుజ్ ట్రెండీగా ఉండాలి. సాధారణంగా శారీ కలర్ లో కాంట్రాస్ట్ కలర్ లో లేదా బంగారు వెండి రంగుల్లో  బ్లవుజ్ తీసుకోవాలి అనుకొంటారు. అయితే ముదురు రంగు చీరెలకు కొద్దిగా లేత రంగు బ్లవుజ్ ను,డిజైన్ శాతం ఎక్కువ ఉంటే బ్రైట్ కలర్ ని ఎంచుకోమంటారు ఫ్యాషన్ డిజైనర్లు. గాఢమైన కంచి పట్టు ఎంచుకొంటే దాన్ని కాస్త డల్ చేయాలను కొంటె బ్లౌజ్ కు వర్క్ చేయించాలి అలాగే […]

శుభ్రం చేయండి 

పొలం నుంచి మన ఇంట్లో ఫ్రిజ్ లోకి చేరేలోగా కూరగాయలు పండ్లు ఎన్నో మజిలీలలో దుమ్ము మురికి నింపుకొంటాయి పైగా వాటిని పండించేందుకు వాడిన రసాయనాల బెడద కూడా వుంటుంది. వాటిని శుభ్రం చేయాలంటే ముందుగా చల్లని నీటిధార కింద పెట్టి చేత్తో రుద్ది కడగాలి. అలాగే నీళ్ళలో వెనిగర్ కలిపి అందులో కాయగూరలు నానా బెట్టి రుద్ది కడగాలి లేదా ఉప్పు గానీ బేకింగ్ సోడా గానీ వేసిన నీళ్ళలో కూరగాయలు ఐదు నిముషాలు ఉంచి […]

 ఎంత ఘనమైన కోరిక 

ఇంత మంచి కోరిక కోరింది గనుకనే జనం మెచ్చేసి అభినందనలు కురిపించారు. కేరళకు చెందిన పెళ్ళికూతురు అజ్న్ నజీమ్,ఇజస్ హకీం ని వివాహం చేసుకొంది. పెళ్ళికొడుకు ఎదురు కట్నంగా ఏదైనా కోరుకోమన్నాడు నగలో,నాణ్యలో,విహార యాత్ర లో అడుగుతోంది అనుకోని చూస్తుంటే 100 పుస్తకాలు కానుకగా అడిగింది,పైగా ఆ లిస్ట్ లో  భగవద్ గీత ఖురాన్ బైబిల్  కాన్ స్టి ట్యూషన్ ఆఫ్ ఇండియా వగైరాలున్నాయి. ఈ కోరిక కాస్త వైరల్ అయి ఆమె అభిరుచిని అందరు మెచ్చుకొంటున్నారు. […]

 91 ఏళ్ళ టీచర్ 

బెంగళూర్ లోని మానసిక విద్యార్థుల పాఠశాలలో టీచర్ లక్ష్మి కళ్యాణ్ సుందరం వయసు 91. ఆమె భర్త చనిపోయాక 67 వ ఏట చేరారామె. ఈ వయసులో ఉద్యోగం ఎలా చేస్తున్నారు అంటే నేనెప్పుడు పని చేయలేదు ,నాశక్తి అంత నాలోనే వుండి పోయింది అంటారామె నవ్వుతూ. ఆమె పెళ్ళయ్యాక కుటుంబ భాద్యతల్లోనే ఉన్నారు. భర్త పోయాక ఆ జ్ఞాన కలల్లోంచి బయట పడేందుకు ఉద్యోగం ఎంచుకొన్నారామె .ఏ వయసు అయినా స్వయం శక్తితో నిలబడేందుకు అడ్డం […]

మట్టి ఇంట్లో చల్లగా 

అందమైన అధునాతనమైన ఇళ్ళు నిర్మించుకునే వాళ్ళు ప్రపంచం మొత్తంగా ఉన్నారు. కానీ ఏరికోరి బురద మట్టి,మంగళూరు ఎర్ర పెంకుల తో ఇల్లు కట్టుకొని మురిసిపోతున్నారా? అంటే పూణెకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లు అన్విత్ పాథక్ దంపతులను చూపించ వచ్చు. మేం రెండు అంతస్థుల మట్టి ఇల్లు కట్టుకున్నాం. వీలైనంత ఎక్కువగా ప్రకృతి సిద్ధమైన మెటీరియల్ ఉపయోగించారు. ఆ మెటీరియల్ వాసన బ్రీతింగ్ సమస్యలను కూడా దూరం చేస్తుంది ఎండా కాలం బయట ఉష్ణోగ్రత కంటే […]

నాజూకు ఇచ్చే నెయ్యి

నెయ్యి తిరుగు లేని సాత్విక ఆహారం అంటారు. అందాన్ని,నాజూకు తనాన్ని ఇస్తుంది నెయ్యి. ఇది ఫ్యాటీ ఫ్యామిలీ వరుసలో లేదు. విటమిన్ ‘ఇ’ గుండెకు ప్రయోజనం. ఈ విటమిన్ ను గ్రహించేందుకు నెయ్యి అవసరం. నెయ్యి లేకపోతే చర్మం పొడి బారి పోతుందన్నది వాస్తవం. శిరోజాలకు,కళ్ళకు చర్మానికి అవసరం అయ్యే విటమిన్ ‘ఏ ‘ ని శరీరం గ్రహించటానికి కొవ్వు అవసరం. నెయ్యిలో లాక్టోజ్ వుండదు. చెడు కొలెస్ట్ రాల్ అయిన ఎల్  కొలెస్ట్ రాల్ ప్లాస్మ […]

“రథ సప్తమి ప్రసాదం”

“రథ సప్తమి” శుభాకాంక్షలు !! ఆదిత్యుడిని అనగా సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవముగా పూజ చేసి వద్దాం పదండి సఖులూ!! ఈనాడు ముఖ్యంగా సంక్రాంతికి పెట్టిన ముగ్గులలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి ఈ రథసప్తమి నాడు సూర్య నారాయణ స్వామి వారి సన్నిధిలో ఆ పిడకలపై కొత్త గిన్నెలో, కొత్త బియ్యం,ఆవుపాలతో పొంగలి చేసి సమర్పించుకుంటారు. సూర్య నారాయణ స్వామి ఏడు సంఖ్య అంటే చాలా ప్రీతి.ఆయన ఉత్తర దిశగా సప్త అశ్వాలతో […]

“శ్రీ  మీనాక్షి సుందరేశ్వర ప్రసాదం”

తమిళనాడులో ని మధురై లో మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పాపం హరిస్తుంది.అమ్మవారి భుజం పైన చిలక తో ప్రసన్న వదనంతో భక్తులను ప్రసన్నులను చేస్తుంది. మీనాక్షి అమ్మవారి తో సుందరేశన్ స్వామి వారు కూడా దర్శనం ఇస్తారు.అమ్మ సకల పాపాలను తొలగించి మోక్షం ప్రసాదిస్తుంది.ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి.హైదరాబాద్ లో కార్తీక మాసంలో జరిగే కోటి దీపోత్సవం కార్యక్రమానికి మీనాక్షి సహిత సుందరేశన్ స్వామి వారు విచ్చేసి భక్తులకు దర్శనం […]

అద్భుత వర్ణాల ఇల్కాల్

మగ్గాలపైన తయారయ్యే నేత చీరెలకు డిమాండ్ ఎప్పుడు తగ్గదు . బళ్ళారికి చాలా దగ్గరలో ఉన్నా ఇల్కాల్ అనే చిన్నా పట్టణంలో తయారయ్యే తొమ్మిది గజాల ఇల్కాల్ చీరెలు చాలా ప్రసిద్ధి వర్మిలియన్ గిరి కుంకుమ అనే ప్రత్యేక రంగుతో పెళ్ళి దుస్తులు తయారు చేస్తారు . ఇవి సంప్రదాయ సిద్దమైన చీరెలు . నూలు పట్టు మిశ్రమంతో ,చీరెను ఎన్నో డిజైన్ లతో నేస్తారు . ఈ చీరెలో ప్రత్యేకంగా పైటకొంగు విడిగా తయారు చేసి […]

ఇలాంటి వివరాలు ఇవ్వద్దు 

ఇంటర్నెట్ జీవితంలో ఒక భాగం అయ్యాక సైబర్ నేరాలు సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. కనుక సోషల్ నెట్ వర్క్ లో యాక్టివ్ గా ఉండేవాళ్ళు తమ వ్యక్తిగత సమాచారం అసలు పంచుకోకుండా వుంటేనే మంచిది. ఇంటి చిరునామ ఫోన్ నెంబర్స్,ఫోటోలు పెట్టకూడదు. ఇ-మెయిల్స్ లో పర్సనల్ డాకుమెంట్లు వాటికీ సంబందించిన సమాచారం అసలు పొందు పరచవద్దు. అలాగే బయట నుంచి తెలియని వ్యక్తులు,ఏ బ్యాంక్ నుంచో ఫోన్ చేస్తున్నామని చెపుతూ ఆధార్ కార్డ్ నంబర్,సివీవీ ఓటిపి అడిగితే […]

టీ ఇప్పుడు ఆరోగ్య పానీయం  

టీ రుచి ఎప్పుడు అద్భుతం. ఈ తేయాకు తోటల పెంపకానికి నిలయం అస్సాం. ఇప్పుడు వస్తున్న కొత్త తరం టీ తయారీ పైన ఎన్నో ప్రయోగాలు చేసి కొత్త రుచులు సృష్టిస్తున్నారు. ప్రధానంగా బ్లాక్ టీ,గ్రీన్ టీ,వైట్ టీ ఊలాంగ్ టీ ఇవన్నీ ఒక జాతి మొక్క నుంచి తయారయ్యేవే అయినా అవి పెరిగిన ప్రదేశం ఎలా కోశారు అన్న దాని పైన రుచి ఆధారపడి వుంటుంది. టీ లీఫ్ ప్రాసెసింగ్ పద్దతి పైన చిక్కదనం,రంగు,వస్తాయి. ఈ […]

ఇంటికి వెలుగే ముఖ్యం

అందమైన అలంకరణ వస్తువులున్నా ఇంటికి లైటింగ్ మరింత అందం ఇస్తుంది అంటారు ఎక్స్ పర్డ్స్ . లైటింగ్ ఎంత బావుంటే వస్తువులు అంత విలువగా కనిపిస్తాయి . లివింగ్ రూమ్ లో  లైటింగ్ ఎక్కువ అవసరం ఉండదు . చదువుకొనేది ,టి వి చూసేది ఇక్కడ . గదిమూలల్లో గోడల పైన పెయింటింగ్స్ ,ఫోటోల పైన,సోఫాలు ,కూర్చునే ప్రాంతంలో చక్కగా వెలుతురు పడాలి ,అలాగే బెడ్ రూమ్ లైట్స్ మూడ్ మార్చేవిగా ఉండాలి . గదిలోకి వెళ్ళగానే […]

చర్మం పైన చారలా ?

యుక్త వయసులో బరువు పెరిగినా, గర్భధారణ తర్వాత చర్మం సాగి చారలు పడుతాయి . అలాగే అధిక బరువు నియంత్రించుకొనేందుకు ఆహార నియమాలు పాటించినా శరీరం సన్నగా అవుతుంది . అప్పుడు సాగిన చర్మం పూర్వ స్థితికి రాక చారలుగా కనిపిస్తుంది . పై పూతలు వ్యాయామాలతో వీటిని తగ్గించవచ్చు . చర్మానికి ప్రతిరోజు ఆముదం రాయాలి . చారలున్నా ప్రాంతంలో వేడిచేసి ఆముదం రాస్తూ మసాజ్ చేయాలి . ఓ అరగంట తర్వాత స్నానం చేసేయచ్చు […]

సౌందర్యాన్నిచ్చే మునగ

మునగ పేరు వినగానే రుచిగా ఉండే సాంబారు,చారు గుర్తుకొస్తాయి . కానీ మునగ పొడి సౌందర్యాన్నీవ్వటంలో ముందు ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . మునగాకు పొడి చర్మం ముడతలను తగ్గిస్తుంది . యవ్వన కాంతిని తీసుకువస్తుంది . మునగాకు పొడిలో రోజ్ వాటర్ కలిపి నల్ల మచ్చలు యార్క్ ఉన్నా చోటరాసి ఆరిన తర్వాత శుభ్రపరిస్తే మచ్చలు ,మొటిమలు యార్క్ సమస్య తగ్గుతుంది .మునగాకు పొడిలో తేనే,రోజ్ వాటర్ కలిపి కాసిని నీళ్ళు కూడా కలిపి […]

ప్రభుత్వం పై గెలిచిన ఆమికా జార్జ్

బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ నిర్వహించిన గోల్ కీపర్స్ గ్లోబల్ గోల్స్ అవార్డ్ అందుకొంది 20 ఏళ్ళ ఆమికా జార్జ్.  భారతీయ మూలాలున్న అమ్మాయి యుక్త వయసులో తోటి బాలికలు నెలసరి సమయంలో అవసరం అయ్యే నాప్కిన్లు కొనుక్కోలేక ఇబ్బంది పడే విషయాన్ని గుర్తించి ప్రభుత్వానికి ఈ విషయం తెలిసేలా ప్రచారం ప్రారంభించింది అమికా. ముందుగా తన వంతుగా నాప్కిన్లు పంచుతు సాయం చేసింది,కానీ ఎంతోమంది పిల్లలకు తాను చేసే సాయం సరిపోదని ప్రభుత్వం సాయం అందితే […]

అచ్చం మన ప్రభుత్వ పాలనల్లాగే

జెడ్ ప్లస్ మూవీ ఇప్పుడు ప్రైమ్ లో ఉంది. అరిల్ హుసేన్ ఈ సినిమాలో టైర్లకు పంక్చర్లు వేసే పనివాడుగా నటించాడు. పి .ఎం అనుకోకుండా  ఆ పల్లెటూరులో ఉన్న దర్గా దర్శనానికి వస్తాడు . ఆయన కోసం దర్గాలో ప్రార్థనలు చేయించేందుకు  పంక్చర్లువేసే హీరోని పిలుస్తారు . ప్రధాని ప్రార్థన ముగించుకొని నీకేం కావాలన్న ఇస్తాను అంటాడు .  పంక్చర్ల అస్లామ్ తనకు పొరుగింటి వాడితో తగవు ఉందని మీరు పక్కనున్న పాకిస్థాన్ తో ఇబ్బందిపడుతున్నట్లు […]

 తప్పిపోయిన పిల్లల ఆచూకి కోసం దర్పన్ 

తప్పిపోయిన పిల్లలు , బిక్షాటనలో ఉన్న పిల్లలు, ట్రాఫికింగ్ కు గురైన పిల్లలను గుర్తించటం కోసం తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలోని విమెన్ సేఫ్టీ వింగ్ ఇటీవల ఆపరేషన్ స్మైల్ ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన ముఖాన్ని గుర్తించేందుకు వీలుగా దర్పన్ పేరుతొ ఒక టూల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ టూల్ సహాయంతో తెలంగాణ పోలీసులు అస్సాం లోని లఖిమ్ పూర్ లో భోగినోడికి చెందిన అంజలి,ఢిల్లీలో జీవనోపాధి కోసం వెళ్ళి తప్పిపోయి అస్సాం చేరిన విషయం గుర్తించారు. […]

అక్కడ టిప్పు ల్లేవు 

హోటల్ కి వెళ్ళి కప్పు కాఫీ తాగినా టిప్పు ఇవ్వటం అందరికీ అలవాటే అయితే జపాన్ లో మటుకు టిప్పు ఇస్తే తప్పు. అక్కడ కష్టమర్స్ కి నచ్చేలా సేవ చేయటం సర్వర్ల బాధ్యత గా అనుకొంటారు. అసలు వాళ్ళ ఉద్యోగం అదే కనుక ఎప్పుడు వాళ్ళకి టిప్పు ఇవ్వక్కలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా టిప్పు ఇచ్చే అలవాటు ఉంది కానీ ఒక్క జపాన్ లోనే ఇందుకు మినహాయింపు. అక్కడ స్థానికులు ఎవ్వరు టిప్పు ఇవ్వరు. విదేశీయులైనాసరే […]

20 నిముషాలు చాలు 

ఆరోగ్యంగా ఉన్నవాళ్ళకి రోజుకు 1000 నుంచి అంటే 25 మైక్రోగ్రాముల నుంచి 2000 వరకు అంటే 50  25 మైక్రోగ్రాములు విటమిన్-డి అవసరం అవుతుంది. ఇంత మొత్తంలో డి విటమిన్ శరీరానికి అందాలంటే ఎలాటి సన్ స్క్రీన్ లు రాసుకోకుండా రోజుకు 20 నిమిషాల నుంచి 50 నిమిషాల చొప్పున వారంలో మూడు రోజులు ఎండలో నిలబడాలంటున్నారు ఎక్సపర్ట్స్ దుస్తులు ధరించిన ఆ సూర్య కాంతి చర్మానికి తగులుతుంది వాటిని సంగ్రహించి తగినంత గా మన దేహం […]

ఒకే ఒక్క గ్లాస్  

గోరు వెచ్చని పాలు నీళ్ళలో చిటికెడు పసుపు,దాల్చిన చెక్క పొడి వేసి తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నారు నిపుణులు.వేడి పాలలో పసుపు కలిపి తీసుకుంటే,పసుపులో ఉండే కార్క్ మిన్ వల్ల ఎన్నో ప్రయోజనాలు సమ కూరుతాయి  అంటున్నారు. అయితే కొబ్బరి పాలలో పసుపు వేసి తాగితే ఇంకెంతో ప్రయోజనం,అనీ, ముఖ్యంగా శీతాకాలమో ఈ పానీయాల వల్ల మరింత మేలు జరుగుతుందనీ సెలబ్రిటీలకు డైటీషియన్ లు గా ఉన్న న్యూట్రిషనిస్ట్ లు చెపుతున్నారు. ఉదయాన్నే పసుపు,దాల్చిన్ చెక్క […]