Chinna Maata
పర్లేదు తగ్గిపోతాయి
సాధారణంగా గర్భవతిగా ఉంటే వాంతులు వికారం ఉండటం సహజం . నెలలు గడుస్తున్నా కొద్దీ వాటంతట అవే తగ్గుమొహం పడతాయి కానీ ఆ సమయంలో సరైన ఆహారం తీసుకోకపోతే నీరసం వస్తుంది . కడుపులో బిడ్డ ఎదుగుదల బావుండాలి అంటే వివిధ రకాల పండ్లు ఆకుకూరలు పాలు ,పెరుగు తప్పకుండా తీసుకోవాలి . రోజు ఓ పిడికెడు ఆక్రోట్ ,పిస్తా,బాదం పప్పులు తీసుకోవాలి . వైద్యులు సూచించిన మందులు వేసుకోవాలి అలాగే ఉదయం లేచిన వెంటనే వికారం […]
రిలాక్సింగ్ డైట్
ఒత్తిడిగా ఉంటే చిరాకు,పరాకు ఎక్కువవుతాయి ఏవో చేయాలన్న తోచనట్లు ఐపోతు ఉంటుంది. ఈ ఒత్తిడి కారణం గానే,డైట్ విధానం,శారీరక పనితీరు మారిపోతాయి క్యాలరీలు ఎక్కువ వుండే పదార్ధాలు తినాలని మనస్సు తొందర పెడుతు ఉంటుంది. ఇలాంటి సమయంలో ఓ గ్లాస్ నీళ్ళు తాగి,పదినిముషాలు ఆలా శాంతంగా ఉండమంటున్నారు ఎక్స్ పర్ట్స్. అలాగే ఓ కప్పు హెర్బల్ టీ ఆకలిని సంతృప్తి గలుగుతుంది. అలాగే త్వరగా ఆకలిని తీర్చగల పోషక పదార్ధాలు అందు బాటులో ఉంచుకోవటం చాలా మంచిది. […]
పోషకాల నిమ్మ
ఏ సీజన్ లో అయినా నిమ్మకాయలు దొరుకుతాయి. ఇప్పుడిక విరివిగ దొరికే రోజులివి. నిమ్మకాయల్లో విటమిన్ -సి పీచు పదార్ధాలు ఇతర పోషకాలు ఎన్నో ఉంటాయి. గుండె ఆరోగ్యానికి బరువు నియంత్రణకు జీర్ణకోశ ఆరోగ్యానికి నిమ్మ మేలు చేస్తుంది. ఓ నిమ్మకాయలో 30 మిల్లీగ్రాముల విటమిన్ -సి ఉంటుంది. ఇది మనిషికి రోజుకు అవసరం అయ్యే విటమిన్ -సి లో సాగనికి పైన నిమ్మలోని హెస్పిరెడిన్ డయోస్కిన్ లు కొలస్ట్రాల్ తగ్గించటంలో ఉపయోగ పడుతాయి అరకప్పు నిమ్మరసం […]
ముళిక్కల్ పంకజాక్షి
కేరళకు చెందిన కళాకారిణి Moozhikkal Pankajakshi కి ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డు లభించింది . ఆమె పెదవి పైన తోలు బొమ్మను నిలబెట్టి రామాయణ ,మహా భారత కథలను నాలుకతో ఆడించగలదు . తల్లిదండ్రులు ఆమెకు నేర్పిన ఈ మాల్కవిద్యా ‘ పవక్కలి ‘తన 12వ ఏట నుంచే కాపాడుతూ వస్తున్నారు . కేరళలోని మోనిపల్లి తాలూకా కొట్టాయింకు చెందిన పంకజాక్షి భర్త శివరామ పాణిక్కల్ కూడా కళాకారుడే . ఐదు వందల సంవత్సరాల నాటి […]
అందం పేరు ఆత్మవిశ్వాసం
ఆమెకు పుట్టుక తోనే చేతులులేవు. అయినా అంగవైకల్యం. ఆమె ఆత్మవిశ్వాసానికి ఏమాత్రం అడ్డం రాలేదు. మేక్సీ కో మోడల్ అనా గాబ్రియెలా మొలీనా ఇటీవల నిర్వహించిన అందాల పోటీలో గెలిచి మిస్,నాన్ బిటాల్ 2020 గా ఎంపికైంది. వైకల్యం ఒక శాపం కాదు,భారం కూడా కాదు. దీన్ని గెలిచేందుకు నేను చిన్నపుటి నుంచి కృషి చేశాను. చేతులు లేకపోయిన నష్టాన్ని కాలివేళ్ళలో పూరించాను అందాల పోటీలంటే శారీరక కొలతలే కాదు, ఆత్మవిశ్వాసం కూడా అని నిరుపించేందుకే ఇంత […]
జంతువులకు వంతెనలు
నదులు ,కాలువల పైనే కాదు ఏకంగా అడవుల్లో కూడా వంతెనలు నిర్మించారు . వన్య మృగ సంరక్షణ మండలి చేసిన సర్వేలో అడవిప్రాంతాల్లో ఎన్నో జంతువులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతున్న సమయంలో అడవుల్లో ఉండే రోడ్లు దాటుతూ మరణిస్తూ ఉన్నా సంగతి తెలిసింది . ఒక్క నెలలోనే 21 జాతులకు చెందిన 106 వన్యప్రాణులు ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు తేలింది . పర్యావరణ పరిరక్షణ లో భాగంగా జంతువులకు సంరక్షించు కోవాలనే పిలుపులో భాగంగా,ఈ […]
రెడీ మిక్స్ లతో అనారోగ్యం
మార్కెట్ లో ఎన్నో రెడీ మెడ్ మిక్స్ మసాలా పొడులు కనిపిస్తాయి . ప్రకటనల్లో ఊరిస్తాయి కూడా . కానీ ఇవి పరిమితంగా వాడుకోకపోతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఈ రెడీమిక్స్ లు ,పొడులు ,కూల్ డ్రింక్స్ లో కొన్ని రసాయనాలు ఉపయోగిస్తారు . ఇవి ఆ పదార్దాలు గడ్డకట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు . తేలికగా ఆహారంలో కలిసిపోయేందుకు కూల్ డ్రింక్స్ లో నురగ రాకుండా ఇలా వివిధ […]
” సాయి ప్రసాదం “
ఈ రోజు మనకు ఇష్టదైవంను స్మరిస్తూ పూజలు చేసుకుని కటాక్షం పొందడం విశేషం. గురువారం లక్ష్మీవారం అని కూడా అంటారు.భక్తులకు ఏ దేవుడిని భక్తిగా పూజించిన పుణ్యం.మనసు కల్మషం లేకుండా మంచి ఆలోచనతో మంచి నడవడితో ప్రవర్తించిన భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.సాయి బాబా సాక్షాత్తూ శివ అంశం.భజనలు వినటం సాయి కి చాలా ఇష్టమైన పూజ.దుర్గా దేవి కూడా సాక్షాత్తూ పార్వతి దేవి అంశం.అమ్మవారికి నిత్యం పూజలు చేసి ముక్తి పొందడానికి యోగ్యత సాధించినట్లే.సాయిబాబాకి ఐదు […]
వృత్తిని ప్రేమిస్తే అన్ని సాధ్యమే
బాలీవుడ్ లో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు దాటినా అదే ఉత్సహం తో ఉండటం ఎలా సాధ్యం అని అడిగితే కరీనా కపూర్ పనిని ప్రేమిస్తూ,దాన్ని క్రమశిక్షణతో పూర్తి చేస్తే మనలో ఆ ఉత్సాహం,పట్టుదల అన్ని ఉంటాయంటోంది. ఏ పాత్ర నటిస్తే ఆ క్షణాలను ఆస్వాదిస్తాను,వృత్తికి వ్యతిగత జీవితానికీ మధ్య అనే రేఖని ఎప్పుడు దాటను. దేని సమయం దానికే కేటాయిస్తాను అలాగే శరీరానికి అవసరం అయ్యే ఆహారం మాత్రమే తీసుకొంటాను. రోజు గంటసేపు వ్యాయామం చేస్తాను […]
సౌందర్య ఫలం పియర్స్
అందం,ఆరోగ్యం ఇచ్చే పండ్ల వరసలో వుంటుంది బేరీ పండు. యాపిల్స్ కు సీమ దానిమ్మలకు దగ్గరగా పసుపు ఆకుపచ్చ గోధుమ లేదా ఎరుపు రంగులో ఉండే ఈ పండు రుచి చాలా బావుంటుంది. క్రమం తప్పకుండా ఈ బేరీ పండు తింటే వయసు రిత్యా వచ్చే కండరాల బలహీనతను ఆపవచ్చు. పియర్ గా పిలిచే ఈ పండులో గ్లూకోజ్,ఫుక్ట్రోజ్ పుష్కలంగా ఉండటం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఒక్క గ్లాస్ బేరీ పండు రసం తాగితే జ్వరం […]
యవ్వనానికి స్వాగతం
గాలి తెమ్మెర తాకెనా, పువ్వు విరిసినా సంతోషంతో పొంగిపోయే యువతరం కోసం ఎన్నెన్నో సంబరాలు ఉంటాయి. పదిమంది కలిస్తే ఏ వేడుకను వాళ్ళు వదలరు. జపాన్ లో దేశవ్యాప్తంగా యుక్త వయసు సంబరాలు జరుగుతాయి. ఇరవయ్యో వసంతం లోకి అడుగు పెట్టిన యువతీ యువకులు యవ్వనాన్ని స్వాగతిస్తూ కమింగ్ ఆఫ్ ఏజ్ డే ఉత్సావాలు జరుపుకొంటారు. ఈ యుక్త వయసు సంబరాలు విశ్వవిద్యాలయాల్లో ఎంతో ఘనంగా జరుగుతాయి. యువతీ యువకులు సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై ఎంతో కోలాహలంగా […]
లేస్తూనే హుషార్
ఉదయాన్నే నిద్ర లేస్తూనే హుషారుగా అనిపించాలంటే శ్రావ్యమైన సంగీతం వినిపించే అలారం పెట్టుకొని ఆ సంగీతపు పలకరింపుతో నిద్ర లేవండి. బద్ధకం నీరసం అన్నీ ఎక్కడికక్కడ పారిపోతాయి అంటున్నారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. నిద్రలేవగానే చురుగ్గ పని చేయవలసిన అవసరం ఉన్న షిఫ్ట్ కార్మికులు దగ్గర నుంచి భూకక్ష్యలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమ గాములు వరకు ఉదయాన్నే లేవగానే ఒక నిర్లిప్తత బద్ధకం వెంటాడుతోందంటూ ఉంటారు. ఎన్నో పరిశోధనల తరువాత చెవికి ఇంపైన సంగీతం వింటూ […]
వృద్ధులుంటారు జాగ్రత్త
అరవై ఐదు,అంతకన్నా ఎక్కువ వయసున్న వృద్దులు 40 శాతం మంది కింద పడటం వల్ల గాయపడటం,లేదా ఆ గాయాలు ఎంతకీ తగ్గక మరణించటం సంభవిస్తోందని పరిశోధికులు చెపుతున్నారు. వీటిని నివారించేందుకు వృద్దులు నివసించే ఇళ్ళలో సోఫాలు టేబుళ్ళు నడిచే దారిలో అడ్డంగా కాకుండా గోడలకు దగ్గరగా ఉంచాలంటున్నారు. కార్పెట్ తట్టుకొని పడిపోకుండ సరిగ్గ వుండేలా చూడాలి. ఫ్లోర్ తడిగా,జారిపోయేలా ఉండకూడదు బాత్ రూమ్ చేత్తో పట్టుకొని నడిచేందుకు వీలుగా గోడలకు హాండ్ రెయిల్స్ ఉండాలి. నేలపైన జారని […]
బెర్రీలు బి .పి కి ఔషధం
లింగన్ బెర్రీల రసం అధిక బి. పి తో బాధపడే వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుందని హెల్సింకీ విశ్వవిద్యాలయ నిపుణులు చెపుతున్నారు . ఉత్తరా ఖండ్ లో ఎక్కువగా పండే ఈ బెర్రీలుమాత్రమే కాదు ,నల్లద్రాక్ష క్రాస్ బెర్రీల్లో పుష్కలంగా ఉండే పాలిఫినాల్స్ హృద్రోగాలతో పాటు బి. పి నీ తగ్గిస్తాయని గుర్తించారు . ఎనిమిది నుంచి పదివారాల పాటు పాలిఫినాల్స్ ఎక్కువగా ఉండే ఈ జ్యుస్ తాగిన వాళ్ళలో రక్త ప్రసరణ లో తేడా కనిపించింది . […]
మెరిసే మేనిఛాయ కోసం
చర్మంపైన కొవ్వు కణాలు మృతకణాలు పేరుకొని ఆ భాగం నల్లగా బిరుసుగా అనిపిస్తుంది. నడుము కింద భాగం లో తొడలపైనా ఈ సమస్య కనిపిస్తుంది. ఈ చిన్న చిట్కాతో ఆ సమస్య ను అధిగమించవచ్చు. ఫిల్టర్ లో వేసే బరక వంటి కాఫీ పొడిని ఓ టేబుల్ స్పూన్ తీసుకొని నీళ్ళలో కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ ను నల్లబడిన శరీర భాగం పైన వేసి మర్దన చేయాలి. ఇలా చేస్తే కొవ్వుకణాలు మృత […]
ఆహ్లాదానిచ్చే ఆహారం
సంతోషం కలిగినపుడు మెదడులో సెరటోనిక్ రసాయనం విడుదల అవుతుంది . దీన్ని హ్యాపీ నెస్ హార్మోన్ గా పిలుస్తారు . ఈ హార్మోన్ లోపం వల్లనే డిప్రెషన్, మూడ్స్ త్వరగా మారిపోవటం వంటి సమస్యలు వస్తాయి . ఈ సెరటోనిక్ నేరుగా లభ్యం కావాలంటే పైనాపిల్ ,అరటి పండ్లు వంటివి తినాలి అలాగే రాత్రివేళ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి ఓ గ్లాస్ గోరువెచ్చని పాలు తాగితే వెంటనే శరీరం తేలికై చక్కని నిద్ర పడుతుంది . […]
క్లాసిక్ బ్లూ తో మరింత అందం
మేకప్ ఉత్పత్తుల్లో ఈ సంవత్సరం క్లాసిక్ బ్లూ ట్రెండ్ నడుస్తోంది. మాస్కరా నుంచి ఐ షాడో,ఐ లైనర్ ,న్యూ లుక్ తో కనిపిస్తున్నారు .అమ్మాయిలు బోల్డ్ లుక్ కోసం బ్లూ ఐ షాడో బావుంటుంది. కనురెప్పల మీద బ్లూ గ్లిట్టర్ అడ్డుకొంటే చాలా పేషన్ ఫ్యాషన్ గా కనిపిస్తుంది .సాయంత్రం పూట పార్టీలకు వెళ్ళేప్పుడు బ్లూ మస్కారా చాలా అందం ఇస్తుంది. మేచింగ్ తో సంబంధం లేకుండా బ్లూ నెయిల్ పాలిష్ వేసుకోవటం ఇప్పటి ట్రెండ్. పెదవులకు […]
ఈ మాస్క్ అద్భుతం
వివిధ దేశాలలో రకరకాల పేస్ మాస్క్ లు ఫేమస్ . భారతదేశంలో పసుపు ,శనగ పిండి ,రోజ్ వాటర్ ,ఫేస్ మాస్క్ ఎప్పటి నుంచో ప్రసిద్ధి . అమెరికా లో బ్లాక్ హెడ్స్ పోయేందుకు ,బార్ కోల్ ఏ రకం మాస్క్ అయినా ఇష్టపడతారు మొరాకో లో సబ్బులాగా అంటే షు సోల్స్ క్లే చర్మాన్ని మృదువుగా చేస్తుందని నమ్ముతారు . జపాన్ లో మాయిశ్చర్ మాస్క్ కు ప్రాధాన్యత ఇస్తారు . రష్యాలో గుడ్లు,ఓట్స్ డయిరి […]
జీవన విధానమే కారణం
అవసరానికి మించి ఆహారం తీసుకొన్న ఎక్కువ సేపు కూర్చొని ఉన్న. వ్యాయమం చేయకపోయినా పొట్ట చుట్టు కొవ్వు పేరుకు పోతుంది. మొత్తం శరీరం సరైన తీరులో ఉండి,పొత్తి,కడుపు మాత్రం లావుగా వుంటే దానికి జీవన విధానమే కారణం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. సరైన వ్యాయామం లేకపోతే పొట్ట చుట్టు కండరాలు పట్టు తప్పి కొవ్వు పేరుకు పోతుంది. వైద్యుల సాయంతో సమస్య కారణం తెలిసుకొని వ్యాయమం చేయాలి. ఆహారం లో మంచి కొవ్వులు ఉండేలా బాదం,పిస్తా,ఆక్రూట్ లు,పీచు […]
అత్యంత సౌందర్యం
ముక్కెరలు,ముక్కు పుడకలు ఎప్పుడూ ఫ్యాషనే. ముక్కుకు రంద్రం వేయించుకొని,లేదా ముక్కు తమ్మెకు పైన చేసుకొనే రకం అయినా అమ్మాయిలు ఒకే అనేస్తారు. ప్లాటినమ్ తో ఒంటి వజ్రం ఉన్న ముక్కుపుడక టీనేజర్లకు చక్కగా సూట్ అవుతోంది. ఎలాంటి నగలేకపోయినా ఆ ఒక్క ముక్కుపుడకలో ఎంతో ఆధునికంగా కనిపించవచ్చు. రోజ్ గోల్డ్ లో వజ్రాలు పొదిగిన ముక్కుపుడక కు ప్రాధ్యాన్యత ఇవ్వాలి. దుస్తులతో,అలంకరణతో మ్యాచ్ అయ్యేలా రాళ్ళు పొదిగినవి,వేలాడే ముత్యం మువ్వలు ఉన్నవి కూడా బావుంటాయి. ముక్కు లోపలి […]
