Saturday, 01 Aug, 2026

చిలకపచ్చ అందం

పూల అలంకరణ కోసం బటన్ మామ్స్ అంటే చిట్టి చామంతులు చాలా బావుంటాయి. అందులోనూ ఆకుపచ్చని చామంతులు మరీ బావుంటాయి త్వరగా వాడిపోవు బ్యాక్ డ్రాప్ డెకరేషన్ లో ఎంబ్రాయిడరీ చేసినట్లుగా అనిపించేందుకు ఈ ఆకుపచ్చని బటన్ చామంతి ని ఎక్కువగా వాడుతున్నారు. దండ లతోపాటు పెళ్లి వేదిక అలంకరణతో ఇవి చక్కగా విరుస్తున్నాయి. ఇవి తెలుపు, నారింజ, పసుపు, ఎరుపు, ఇలా ఏ రంగు పూల మధ్యలో అయినా అందంగా ఒదిగిపోతాయి. బోకెల్లోనూ వేజుల్లో కూడా […]

ఒమిక్రాన్ కు చెక్

హృదయ కారపు ఆకులతో పాకే తిప్పతీగను ఆయుర్వేదంలో వందల సంవత్సరాల నుంచి వాడుతున్నారు.టెర్మినాయిడ్లు, ఆల్కలాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్లు పీచు ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఈ తీగలు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కూడా వాడుతున్నారు దీన్ని ఇన్ఫెక్షన్ సంబంధిత జ్వరాలు, డయేరియా, డయాబెటిస్ నివారణకు ఎక్కువగా ఉపయోగిస్తారు దీన్ని డెంగ్యూ, చికెన్ గున్యా వంటి జ్వరాలతో పాటు కోవిడ్ కు వాడచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఒమిక్రాన్ ని కొంత వరకు అడ్డుకుంటుంది […]

పింగాణీ వస్తువులు భద్రం

పింగాణీ పాత్రలు చూసేందుకు అందంగా ఉంటాయి అవి చక్కగా ఎక్కువ కాలం మన్నాలంటే వాటిని వేడి తగలని చోట ఉంచాలి. రసాయనాల గాఢత తక్కువగా ఉండే సోప్ వాటర్ తో శుభ్రం చేయాలి. దీనికి ఉపయోగించే పీచు మెత్తగా ఉండాలి. ప్లేట్లు, కప్పులు పైన మరకలు వాసన పోవాలంటే కడిగాక గోరువెచ్చని నీటిలో ఉంచి తీయాలి. ప్లేట్, ప్లేట్ కి మధ్య టిష్యూ పేపర్ పెట్టడం వల్ల ఒకదానికి ఒకటి వద్దు వత్తుకొని పగలకుండా ఉంటాయి. ఒవెన్ […]

బ్యూటీ జ్యూస్

ఆపిల్, బీట్ రూట్ క్యారెట్ తో చేసిన జ్యూస్ ని ఎ, బి, సి అంటారు ఈ మూడింటితో జ్యూస్ తయారు చేసేటప్పుడు పుదీనా అల్లం కూడా కలుపుకుంటే రుచిగా ఉంటుంది. యాపిల్, క్యారెట్ బీట్ రూట్ సన్నగా ముక్కలు చేసి మిక్సీలో గ్రైండ్ చేయాలి. రెండు కప్పుల నీళ్ళు కలిపి బాగా బ్లెండ్ చేసి వడకట్టుకోవాలి ఈ రసంలో టీ స్పూన్ అల్లం రసం చిటికెడు నల్ల ఉప్పు చిటికెడు దాల్చిన చెక్క పొడి పుదీనా […]

అంతరిస్తున్న ప్రాణాలు

ఒక పదేళ్ల కాలంలో భూమి ఎక్కువగా వేడెక్కిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇలా వేడి ఎక్కడం వల్లనే తీవ్రమైన తుఫాన్ లు, వరదలు కరువు దావానలం  మొదలైనవి చోటుచేసుకుంటున్నాయి.ఈ వేగవంతమైన మార్పులు మనుషులకే కాదు ఇతర ప్రాణులకు కూడా ముప్పే. నీటిలో ఉండే జీవులు చల్లని ఎత్తయిన ప్రాంతాలకు తరలిపోతున్నాయి. వీటి సీజనల్ ప్రవర్తన సాంప్రదాయ వలస పద్ధతులు మారుతున్నాయి. వాతావరణంలో మార్పులు కాలుష్యం అడవులు నరికివేతలు చేపలు పక్షులు క్షీరదాలు ఉభయదారులు కూడా 114 రేట్ల వేగంగా […]

వారంలో పెరుగుతాయి

ఎన్నో వంటకాలకు ఉల్లికాడలు రుచి ఇస్తాయి. ఈ కాడల్ని చిన్న ముక్కలుగా తరిగి బాగా ఆరనిచ్చి ఖాళీ నీళ్ల బాటిల్లో పోసి ఫ్రిజ్ లో పెడితే పాడవకుండా ఉంటాయి. తడిచేయి తగలకుండా ఈ కాడల్ని కూరల్లో చల్లుకోవచ్చు. అలాగే వీటిని ఫ్రిజ్ లో ఉంచే ముందర పేపర్ టవల్ లేదా కాటన్ క్లాత్ లో చుట్టి పెడితే తాజాగా ఉంటాయి. ఉల్లికాడలు పచ్చని భాగం వరకు కట్ చేసుకొని కింద వేర్లతో సహా ఉండే తెల్లని భాగాన్ని […]

‘చుంబక్’ లోనా డిజైన్ లే

దుస్తులు, ఆభరణాలు, స్టేషనరీ మొత్తం 30 రకాల ఉత్పత్తులు చుంబక్ ద్వారా దేశ విదేశీయులు ముచ్చటపడి కొంటున్నారు. ఎవరు ఎలాటి కానుక ఇవ్వాలన్నా నేను నాదైన శైలిలో చక్కగా డిజైన్ చేసి ఇస్తాను అంటోంది సుబ్రా చద్దా. చుంబక్ కో ఫౌండర్ ఒక ఏడాది పాటు పూర్తిగా తల్లి గా బాధ్యతలు నిర్వహించాక ఇక ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొగలను అనిపించింది. తల్లి కావడం కంటే గొప్ప బాధ్యత ఇంకేముంటుంది. ఉద్యోగం చేయటం ఇష్టం లేదు అందుకే చుంబక్ […]

ఇవి అలంకరణకే

సహజమైన నాచు బంతుల గుట్టలు చూడాలి అంటే, ఐస్ ల్యాండ్, స్కాట్ ల్యాండ్, ఐర్లాండ్, జపాన్ దేశాల్లోని కొన్ని సరస్సుల్లో చూడాలి అక్కడ ఒక రకమైన నాచు బంతులు గుట్టలుగా పెరుగుతుంది. మోరియో అనే ఆల్గే ఫంగస్ నీళ్ళల్లో కొంచెం కొంచెంగా పెరుగుతూ బంతుల్లా మారిపోతుంది. క్రికెట్ బాల్ అంత దగ్గర నుంచి ఫుట్ బాల్ అంత ప్రమాణం వరకూ ఎన్నో సైజుల్లో పెరుగుతుంటాయి. జపాన్ లోని సరస్సుల్లో పరచుకుని ఉండే ఈ నాచు బంతులు చూసేందుకు […]

అత్యంత ఖరీదు

అంతర్జాతీయ మార్కెట్ లో టన్ను కోటిన్నర రూపాయల పైనే ధర పలుకుతోంది ఎర్రచందనం. ఇది పరిమళభరితమైన చక్క కాదుకానీ దీని నుంచి తీసిన తైలాన్ని కాస్మెటిక్స్ లో వాడుతారు. ఇది చర్మాన్ని మెరిపింస్తుందని మొటిమలు మచ్చలు మొదలైనవాటిని తొలగిస్తుందని వయస్సు కనిపించ నివ్వదని అంటారు. ఈ చెక్కని ఒకలాటి రుచికోసం ఆల్కహాల్ తయారీలోనూ వాడతారు ఎర్ర చందనం పొడి తేనె లేదా రోజ్ వాటర్ కలిపి మచ్చలు మొటిమల పైన రాస్తే అవి క్రమేణా తగ్గుతాయి. విలాసవంతమైన […]

మహిళలకే అప్పులు

కెలడియోఫిన్‌  సాయంతో కూలీల,చిరువ్యాపారులకు,రుణాలిస్తారు సుచిత్ర ముఖర్జీ.ఐఐఎమ్‌ అహ్మదాబాద్‌లో ఎంబీఏ, డిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసి లండన్‌లో మోర్గాన్‌స్టాన్లేలో ఉద్యోగం చేశారామె.‘వ్యవసాయ కూలీలకు, భవన నిర్మాణ కార్మికులకు టిఫిన్‌బండ్ల వాళ్ళు,మిషన్‌ కుట్టే వాళ్లు, కాయగూరలు అమ్మే వాళ్ళు, కూలీలను పొదుపు మార్గాల వైపు మళ్ళించి బీమా గురించిన అవగాహన కల్పించి,వారికి మన సదుపాయం ఏర్పాటు చేశారు సుచిత్ర.వినియోగ దారుల్లో ఎక్కువ మంది మహిళలే అంటారు సుచిత్ర.

రాయితీ తో రుణాలు

కినారా క్యాపిటల్‌’ యాప్‌ 2.5 లక్షల మందికి ఉపాధి చూపెట్టింది హార్దికాషా. వారికి అందిన రుణాల మొత్తం రూ.700 కోట్లు. మధ్యతరగతి గుజరాతీ అమ్మాయి హార్దిక. చిన్న వ్యాపారం చేసేందుకు రుణం కోసం తల్లి చేసిన ప్రయత్నం మనసులో నింపుకొని పెద్దయ్యాక ‘హెర్‌ వికాస్‌’ పేరుతో రాయితీతో రుణాలు ఇచ్చే యాప్ సృష్టించింది.ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ ఆధారంగా పనిచేసే ఈ యాప్‌ అతి సులభంగా ఒక్క రోజులోనే రుణం అందేలా చేస్తుంది. ప్రత్యేకంగా మహిళలకే 75 కోట్ల […]

ఇలాగూ పెంచచ్చు

మొక్కల పైన ఎంతో ఇష్టం ఉంటుంది కానీ ఇంట్లో చోటు ఉండదు అలాంటప్పుడు వర్టికల్ గార్డెన్ ఎంచుకోండి. గోడకు చెక్కను అమర్చి వాటికి నిలువుగా అమర్చిన ప్లాస్టిక్ కంటెయినర్స్ బాస్కెట్స్ వేలాడదీసి పుదీనా, కొత్తిమీర వంటి వంటింటికి ఉపయోగపడే ఆకుకూరలు పెంచచ్చు. బాల్కనీ రెయిలింగ్ కు హ్యాంగింగ్ బాక్స్ లు ఏర్పాటు చేసుకుని కూడా మొక్కలు పెంచచ్చు చూసేందుకు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇండోర్ మొక్కలకు నీటి అవసరం కూడా తక్కువే ఉంటుంది. ఎప్పటికప్పుడు పాదాల దగ్గర […]

రక్షణ చర్యలు అవసరం

ఒమి క్రాన్ రిస్క్ గర్భిణులకు ఎక్కువే అంటున్నారు పరిశోధకులు. వ్యాక్సిన్ తో పాటు కొన్ని రక్షణ చర్యలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు. ఇమ్యూనిటీ పెంచే పోషకాహారం తీసుకోవాలి ఎక్కువ సమయం విశ్రాంతి గా నిద్ర ఎనిమిది గంటలకు తగ్గకుండా చూసుకోవాలి. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి ఇందుకోసం యోగా ధ్యానం సాధన చేయాలి. జనసమ్మర్ధం ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం కావాలి. ఇంటికి వచ్చే పరిచయస్తులు అతిథులు సంఖ్య తప్పనిసరిగా తగ్గించాలి. ఒకవేళ కోవిడ్ సోకితే […]

కాఫీ లాలీపాప్

పిల్లలకు ఇష్టమైన కాండీ లాలిపాప్ ఇప్పుడు టీ, కాఫీ కోసం కూడా లాలీపాప్ లు వచ్చాయి. టీ బ్యాగ్ ల్లాగే వీటిని వేడి నీళ్లు వేడి పాలల్లో ముంచి నచ్చిన పానీయం తయారు చేసుకోవచ్చు. బ్లాక్ టీ, లెమన్, అల్లం, హెర్బల్ ఫ్లవర్, ఫ్రూట్ టీ లు వెనిల్లా, హాట్ చిల్లీ టీ, స్పైస్ టీ అంటూ రకరకాల లాలీ పాప్ లు వచ్చాయి. కాఫీ లాలీ పంచదార, కాఫీ పొడి కలిపిన సిరప్ తో చేస్తారు. […]

ఏదైనా భోజనమే

ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు భోజనం సరిగ్గా సమయానికి అందటం కష్టమే. ఆఫీస్ సమయాలు ఒక్కసారి తినేందుకు అవకాశం ఇవ్వకపోవచ్చు. భోజనం అంటే రొట్టెలు, అన్నం, కూర, పప్పు, పెరుగు అనుకోవద్దు అందుబాటులో ఉన్న ఏ ఆహారమైనా ఎంచుకోవచ్చు అంటారు ఎక్సపర్ట్స్. రొట్టె, పప్పు, మజ్జిగ పర్వాలేదు. అరటి, యాపిల్, జామ, కమల, ద్రాక్ష, వేరుశెనగపప్పు మొదలైనవి తీసుకోవచ్చు. బయట లభించే సమోసాలు, స్వీట్లు, బేకరీ ఫుడ్ కంటే మొలకెత్తిన గింజలు తిన్నా మంచిది అంటారు. రోజంతా ఏమీ […]

పట్టించుకోకండి

మాస్క్ తో ఆక్సిజన్ పీల్చు కొనేందుకు బదులుగా వదిలిన కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా పీల్చ వలసి వస్తోంది. ముఖ్యంగా వ్యాయామం సమయంలో ఊపిరి సరిగ్గా ఆడదని ఇబ్బంది పడే వాళ్లు, దాన్ని ఇక పట్టించుకోకండి అంటున్నారు పరిశోధకులు. మాస్క్ లు ఆక్సిజన్ బదులు కార్బన్ డయాక్సైడ్ పెంచడం వల్ల మొహానికి చెమట పట్టి వేడిగా అనిపిస్తుంది. కానీ ఇదేమి ఊపిరితిత్తుల పనితీరు పైన అంతగా ప్రభావం చూపెట్టడం లేదట. అది చిన్న ఇబ్బందే కానీ కరోనా ముప్పు […]

ఈ జ్యూస్ తో ఎంతో మేలు

గోధుమ గడ్డి రుచిగా ఉండదు కానీ అందులో అధిక పీచు A,C,E,K,B6 వంటి విటమిన్లు ఖనిజాలు ఫైటోకెమికల్స్ వంటివి సమృద్ధిగా ఉండటంతో అన్ని కలిపి శరీరం  విడుదల అయ్యే హానికర ఫ్రీ రాడికల్స్ సంఖ్య తగ్గేలా చేస్తాయి. క్యాలరీలు తక్కువ ప్రోటీన్ ఎక్కువగా వుండే వీట్ గ్రాస్ ను ఆహారంలో భాగంగా చేర్చుకుంటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. రక్తహీనత తగ్గిస్తుంది ముఖ్యంగా మెనోపాజ్ సమస్యలు తగ్గిస్తుంది. దీన్ని జ్యూస్ రూపంలో తప్పనిసరిగా తీసుకోండి అంటున్నారు […]

గుండ్రని సైకిల్ వంతెన 

నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు గురించి చెప్పే పని లేదు. ముఖ్యంగా పాదచారులు సైక్లిస్ట్ లు పడే ఇబ్బందులు మామూలుగా ఉండదు సైక్లింగ్ మంచి వ్యాయామం కదా డచ్ నగరం ఇండ్ హావెన్ లో సైక్లిస్ట్ లా కోసం ఒక చక్కని పరిష్కారం కనుక్కున్నారు మధ్యలో పైలాన్ నిర్మించి మొత్తం 24 కేబుళ్ల తో ఓ గుండ్రని వంతెన నిర్మించారు. 2012 నుంచి సైక్లిస్ట్ లు ఎలాంటి ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రయాణం చేస్తున్నారు. ప్రపంచంలో ఇ

ఇవ్వాల్టి అవసరం నవ్వే

ఆనందానికి నిజమైన ఔషధం నవ్వు శారీరకంగా మానసికంగా రిలీఫ్ ఇచ్చేది నవ్వే. నవ్వితే శరీరం మైండ్ రిలాక్స్ అవుతాయి. పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. కెరీర్ లో టార్గెట్స్,ప్రస్తుతం విసిగిస్తున్న కరోనా తో పరిస్థితుల్లో సీరియస్ గా ఉండటం వల్ల నష్టమే అంటారు పరిశోధకులు. నవ్వెందుకు పెద్ద ఖర్చేమీ కాదు పైగా ఆ నవ్వు పదిమందికి పంచడం మంచిదే అది మరింత మందికి చేరుతుంది. ఆ కరోనా తో భయాందోళనల్లో ఉన్న సమాజానికి నువ్వు అవసరం ఎంతో ఉంది […]

కోటీశ్వరుల గ్రామం హువాక్సీ

చైనా లో ఉన్న హువాక్సీ ఈ ప్రపంచంలో కెల్లా రిచ్చెస్ట్ విలేజ్ అంటారు గ్రామస్థులు అందరూ ధనవంతులే ఎక్కడ కన్న వెళ్లాలంటే హెలికాఫ్టర్ లోనే ప్రయాణం చేస్తారు. ఇది ఎలా సాధ్యం అయ్యిందంటే ఇక్కడ మల్టీ సెక్టార్ ఇండస్ట్రీ ఒకటి ఉంది. ఈ గ్రామస్థులు  అందరూ ఆ కంపెనీ లో షేర్ హోల్డర్స్ గా ఉన్నారు. కంపెనీ లాభాల్లో అందరికీ వాటా ఉంది అందుకే ఈ గ్రామం చైనా లోనే రిచ్చెస్ట్ గ్రామం గా పేరు పొందింది. […]