Chinna Maata
లిప్ లైనర్ అవసరం
లిప్ స్టిక్ వాడే ఎంతోమంది లిప్ లైనర్ ప్రయోజనం గురించి ఆలోచించకుండా నేరుగా లిప్ స్టిక్ తో పెదవులు నింపేస్తారు పెదవుల అందాన్ని లిప్ లైనర్ మెరుగుపరుస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. లిప్ లైనర్ తో పెదవులు సహజసిద్ధ అవుట్ లైన్ స్పష్టంగా కనిపిస్తుంది. లిప్ స్టిక్ చెక్కుచెదరకుండా ఉంటుంది. క్రీమీ లిప్ స్టిక్, లేదా లిప్ గ్యాస్ ఏది వేసుకొన్న మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు లిప్ లైనర్ తోడ్పడుతుంది. కనుక పెదవుల అంచులు ఎలివేట్ అవ్వటం కోసం […]
ఇకపై డిజిటల్ అడ్రస్
ఏ మారుమూల అడ్రస్ ని అయినా సరిగ్గా చూపగలిగే ‘పతా’ యాప్ తయారు చేసింది కృతిక జైన్. ఇండోర్ కు చెందిన కృతిక న్యూయార్క్ యూనివర్సిటీ లో మేనేజ్మెంట్ టెక్నాలజీ లో మాస్టర్స్ చేసింది. చదువు లో భాగంగా న్యూయార్క్ లో ఉన్న కాలంలో అక్కడి రోడ్ల అడ్రస్ తెలిపే మార్కింగ్ ఎంతో ఆకర్షించాయి. ఇండియా వచ్చి పతా యాప్ సృష్టించింది. డిజిటల్ అడ్రస్ రూపొందించే ‘పతా’ యాప్ ప్రతి ఇంటి అడ్రస్ కు ఒక కోడ్ […]
ఫలించిన కల
బెంగళూర్ కు చెందిన నాగరత్నమ్మ 62 ఏళ్ల వయసులో పశ్చిమ కనుమల్లో అగస్త్య కూడమ్ పర్వతాన్ని కొడుకు అతని స్నేహితులతో కలసి ఎక్కేసి చరిత్ర సృష్టించారు. ఆ పర్వతం ఎత్తు ఆరు వేల అడుగుల కంటే ఎక్కువే చీరకట్టుతో తోనే నాగరత్నమ్మ ఆ పర్వతాన్ని ఎక్కేసి సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలందుకున్నారు. ఈ పర్వతారోహణ నాలో కొత్త శక్తి నింపింది. నేను మరిన్ని పర్వతాలు ఎక్కేసి నా నా చిన్నప్పటి నుంచి అనుకున్న ఈ ట్రెక్కింగ్ కోరికను తీర్చుకుంటాను […]
చేనేతకు చేయూత
మాధుర్య క్రియేషన్స్ స్థాపించి వెయ్యికి పైగా చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది భారతి హరీష్ బిట్స్ పిలానీ లో ఇంజనీరింగ్ చదివిన భారతి కంచి చీరలు అంటే ఎంతో ఇష్టం కాంచీపురం, ఉప్పాడ, బనారస్, చందేరి, ఫులియా ఇక్కత్ పట్టు చీరలు రీ డిజైన్ చేయించి ఆన్ లైన్ లో అమ్మేస్తారు. ఈ మధ్య కాలంలో తన సినిమా ప్రచారంలో భాగంగా ఓ తెల్లని రంగు చీర బాందిని చీరకట్టుకుంది అలియాభట్ ఈ చీర తయారుచేసింది భారతి […]
ఐ.పి.ఎస్ లక్ష్యం
అమ్మాయిలు నాజూగ్గా సుకుమారంగా ఉండాలని భావించే రోజులు కావు ఇవి. ఎంతో శ్రమతో కూడిన వెయిట్ లిఫ్టింగ్ వంటివి ఎంచుకుంటున్నారు మంగళగిరి కి చెందిన షేక్ సాదియా అల్మాస్ కు పవర్ లిఫ్టింగ్ జాతీయ ఛాంపియన్ అయిన తండ్రి సంధాని స్ఫూర్తి. 2017 లో పదవ తరగతి లోనే సబ్ జూనియర్ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో స్వర్ణ పతకం గెలుచుకుంది. గత సంవత్సరం డిసెంబర్ లో టర్కీ లో జరిగిన ఆసియా ఛాంపియన్ షిప్ పోటీల్లో […]
డాండెలియన్ టీ
హెర్బల్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మనసు ప్రశాంతంగా తాజాగా ఉంచుతాయి. షుగర్ బ్యాలెన్స్ పెంచుతాయి. ముఖ్యంగా డాండెలియన్ వేరు తో చేసే టీ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చామంతి పువ్వు వంటి పూలు పూసే సింహ దంష్ట్రిక అనే కలుపు మొక్క వేరు మార్కెట్ లో దొరుకుతుంది దాన్ని ఓ పిచ్చి మొక్క అనుకుంటారు కానీ ప్రాచీన కాలం నుంచి దాన్ని చికిత్స కోసం వాడుతున్నారు. […]
బ్రెయిన్ ఫాగ్ ప్రాబ్లం
40-50 ఏళ్ల మధ్య వయసులో వచ్చే మెనోపాజ్ తో ఏర్పడే హార్మోన్ లోపం మహిళల మెదడుపై ప్రభావం చూపెడుతుంది మెదడు కాస్త గందరగోళానికి గురి కావడంతో దేన్ని సరిగ్గా గ్రహించలేక పోతుంది. ఈ కారణం వల్లనే పని పైన దృష్టి కేంద్రీకరించ లేకపోవడం మెదడును ఏదో కప్పేసి ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఈ స్థితినే బ్రెయిన్ ఫాగ్ అంటారు అంటున్నారు ఎక్సపర్ట్స్. మెదడు పనితీరు మందగించి తగ్గిపోయిన జ్ఞాపకశక్తి ఉద్యోగ సమర్థతను దెబ్బతీస్తుంది. ఇలాంటి సమస్య రాకుండా […]
శిరోజాల సంరక్షణ
వాతావరణం మారినప్పుడు, ఆ మార్పు శిరోజాలపై పడుతుంది. అందుకే కేశ సంరక్షణ తప్పదు అంటున్నారు నిపుణులు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే శెనగపిండి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది అంటున్నారు. నాలుగు స్పూన్ల శనగపిండి కి రెండేసి స్పూన్ల ఆలివ్ ఆయిల్, పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి పావుగంట ఆరాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి అలాగే శనగపిండిలో మెత్తగా చేసిన మెంతుల పొడి, కొబ్బరి పాలు కలిపి వాడు కొన్న మంచిదే అరటిపండు గుజ్జు కొబ్బరి […]
అత్యంత ప్రయోజనకరం
డాక్టర్ మాధురిమా గుప్తా సౌరశక్తితో పనిచేసే సోలార్ ప్యాడ్ ఇన్సిన్ రేటర్ తయారు చేశారు మై వెట్స్ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తాము సొంతంగా తయారు చేసుకొన్న శానిటరీ ప్యాడ్స్ ను అటవీ ప్రాంతంలో పారేస్తున్నారు అని వాటి వాసనకు అడవి జంతువులు గ్రామాల సమీపంలోకి వస్తున్నాయని చూసి దానికి పరిష్కారంగా ఈ సోలార్ యంత్రాన్ని తయారు చేసింది రోజుకి దీనిలో 250 ప్యాడ్స్ దగ్ధం చేయొచ్చు ఎటువంటి పొగ బయటకు రాదు […]
అరికాళ్ళ పగుళ్లు మాయం
పాదాల పట్ల సరైన శ్రద్ధ తీసుకోకపోతే దుమ్ముధూళి సోకే వీలున్న పాదాలు కనుక పగుళ్ళు వచ్చేస్తాయి. రకరకాల చర్మ సమస్యలు కూడా వస్తాయి. కనుక పాదాలకు సౌందర్య చికిత్సలు కావాలి అంటారు ఎక్సపర్ట్స్. పాదాల మురికి వదలాలి అంటే వారానికి ఒకసారి ముల్తానీ మట్టితో ప్యాక్ వేసుకోవాలి బాగా ఆరాక కడిగేసి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. గులాబీ రేకులు, రోజ్ వాటర్, పాలు, తేనె కలిపి మెత్తగా గుజ్జులాగా చేరుకొని పాదాలకు పట్టించాలి ఆరిపోయాక కడిగేసుకోవాలి ఇలా వారానికి […]
ఊరంతా పండుగ
మెంటన్ లెమన్ ఫెస్టివల్ బత్తాయి, నిమ్మ, నారింజ వంటి పండ్ల తో జరిపే పెద్ద పండుగ ఈ ఫెస్టివల్ స్పెయిన్ లోని మధ్యధరా సముద్ర తీరంలోని చిన్న నగరం మెంటన్ లో జరుగుతుంది ప్రతి ఫిబ్రవరిలో జరిగే ఈ ఉత్సవానికి లక్షలకొద్దీ యాత్రికులు వస్తారు. నిమ్మజాతి పండ్ల వీధులు పార్క్ లు అద్భుతమైన బొమ్మలు తయారు చేస్తారు. ప్రపంచంలో అతిపెద్ద నిమ్మ పండుగ ఇదే ఈ పండుగ కోసం 145 టన్నుల బత్తాయి నిమ్మ పండు వాడుతారు […]
నా ప్రయాణమే సందేశం
33 ఏళ్ల గృహిణి నజీరా నౌషాద్ ఒంటరిగా కేరళలోని అలెప్సీ జిల్లా మన్ కొంచ్ నుంచి నేపాల్ లో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు ప్రయాణం చేశారు ఆమె స్వస్థలం పుదుచ్చేరి లోని మహే భర్త ఉద్యోగరీత్యా ఒమెన్ లో ఉంటున్న నజీరా నౌషాద్ భారతదేశం నలుమూలల ప్రయాణం చేయాలని కోరిక తో ఇద్దరు స్నేహితులతో కలిసి 17 రాష్ట్రాలు 5 కేంద్ర పాలిత ప్రాంతాలు పర్యటించింది. ఎవరెస్ట్ ఎక్కేసి కొద్దిరోజుల్లో నేపాల్ చేరుకుంటారు […]
ఎన్నో ప్రయోజనాలు
వ్యాయామం తో వచ్చే లాభాలు తెలుసుకుంటే మీరు ఒక నిమిషం కూడా వృధా చేయరు అంటారు ఎక్సపర్ట్స్ . కొన్నేళ్ల పాటు వ్యాయామం చేస్తే జీవితకాలం పెరుగుతుంది దీర్ఘకాలం యవ్వనం తో ఉంటుంది. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు శరీరం నాలుగు రెట్లు వేగంగా జీర్ణం చేస్తుంది. మూడ్ మార్చే ఎండార్షిన్ లు విడుదలవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. జీవక్రియలు రేట్లు పెరుగుతుంది. ఒత్తిడి ఆందోళన మానసిక అలజడి దగ్గరకు రాదు కండరాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ఎముకలు దృఢంగా […]
స్వర్ణం సాధిస్తా
పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాకనే తనకి ఇష్టమైన క్రీడలో అడుగుపెట్టి అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించింది విశాఖ జిల్లా అనకాపల్లి కి చెందిన ఇరవై నాలుగేళ్ల రాజనాల పూర్ణ. బి ఏ రెండో సంవత్సరం చదువుతున్న పూర్ణ గత రెండేళ్లలో జాతీయ స్థాయిలో జూనియర్ సీనియర్ విభాగాల్లో మూడు స్వర్ణాలు రెండు కాంస్యాలు సాధించింది 2021 డిసెంబర్ లో టర్కీ లో జరిగిన ఆసియా స్థాయి పోటీల్లో యాభై రెండు కిలోల జూనియర్ […]
భిన్న రంగాల్లో ప్రతిభ
కేరళలో మహిళ కలెక్టర్ సంఖ్య పెరుగుతోంది కేరళ లో ఉన్న 14 జిల్లాల్లో పది జిల్లాల కలెక్టర్లు స్త్రీలే గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ కలెక్టర్ గా నిధులు చేపట్టిన పథనంతిట్ట జిల్లా కలెక్టర్ డాక్టర్ దివ్య ఎస్ అయ్యర్ ఒకరు. ఈమె డాక్టర్, ఎడిటర్, రైటర్, సింగర్, యాక్టర్ కూడా మలయాళీ వెండితెర పైనా క్రిస్మస్ ప్రధాన అంశంగా ఉన్న సినిమాలు కూడా నటించారు. గతంలో ఆమె మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ […]
ప్రతిభ ముఖ్యం
పెద్ద సినిమాల్లో రాని గుర్తింపు కేవలం పది సెకండ్ల వీడియో తో సాధించింది టిక్ టాక్ స్టార్ మోక్షిత రాఘవ్. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ తో ఎన్నో బుల్లి తెర అవకాశాలు తెచ్చుకొంది మోక్షిత. అందాల పోటీల్లో పాల్గొని మోడల్ గా గుర్తింపు తెచ్చుకొంది ‘రూబరూ ఫేస్ ఆఫ్ బ్యూటీ ఇంటర్నేషనల్,‘మిస్ ముంబై 2019’ పోటీల్లో విజేతగా నిలిచింది. ఇప్పుడామె వెబ్‌స్టార్. ‘అతిథి ఇన్ హౌస్’, ‘ప్రభా కి డైరీ సీజన్ 2’, ‘కాంట్రాక్ట్ కిల్లర్’ సిరీస్ […]
మొక్కలు భద్రం
గ్రీక్స్ ఆఫ్ గ్రీన్ అనే యూట్యూబ్ ఛానల్ కు 80 వేల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్ ప్రారంభించిన అన్నేత్తే మాథ్యూ మొక్కలంటే చాలా ఇష్టం మహారాష్ట్రకు చెందిన అన్నేత్తే మాథ్యూ తన ఇంటి ఆవరణలో 300 రకాల మొక్కలు పెంచుతోంది. మొక్కల పెంపకం గురించి తాను అనుసరించే మెలుకువలు పరిరక్షణ పద్ధతులు వీక్షకుల తో పంచుకుంటుంది. ఇంట్లో చెట్లు పెంచే వాళ్ళు ఒక వారం రోజులు బయట ఊరికి వెళ్ళవలసి వస్తే వాళ్లు తిరిగి […]
చురుగ్గా ఉన్నారా ?
వయసుని తగ్గించుకోవాలనీ జీవితంలో నవ చైతన్యం రావాలంటే జీవన క్రియల్లో చురుకు తీసుకురవాలి అంటారు ఎక్సపర్ట్స్. మనలో గడియారం అనే వ్యవస్థ ఉంటుంది. సరైన సమయాన్ని నిద్ర, ఆహారం వేళలను నియంత్రించే వ్యవస్థ లేత సూర్యకిరణాలకు ఈ జీవన గడియారాన్ని సరిగ్గా నడిపించే శక్తి ఉంటుంది. అందుకే ప్రతి రోజు ఉదయం సూర్య కిరణాలు శరీరం పైన పడేలా నడవాలి సరైన సమయానికి నిద్రపోవాలి శరీరాన్ని చురుగ్గా ఉంచేందుకు వారం లో ఓ పూట ఉపవాసం కూడా […]
సంగీత దర్శకత్వం లక్ష్యం
గిటారిస్ట్ శుభశ్రీ గానే నేను అందరికీ తెలుసు గానకోకిల పి సుశీల మనవరాలు గా నన్ను నేను పరిచయం చేసుకోవాలంటే ఇంకాస్త ప్రయాణం చేయాలి అంటుంది శుభశ్రీ. తండ్రి జయ కృష్ణ, తల్లి సంధ్య నాయనమ్మ లాగా పాటలు పాడాలి అనుకోలేదు గిటార్ నాకు చాలా నచ్చింది చిన్నప్పటినుంచి శ్రద్ధగా గిటార్ నేర్చుకున్న. అలవైకుంఠపురం సినిమాలో నా ప్రయాణం మొదలైంది. వెంకీ మామ, వకీల్ సాబ్, బీమ్లా నాయక్, రాధే శ్యామ్ లకు పనిచేశాను. సంగీత దర్శకురాలు […]
మట్టి పాత్రలు మేలు
మట్టి పాత్రలు పర్యావరణ హితం. వీటిని శుభ్రపరచడం తేలిక ఖరీదు తక్కువ. వీటిలో వండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువే. వీటిలో వంట నెమ్మదిగా సాగుతుంది. మట్టిపాత్రలో ని సూక్ష్మమైన రంధ్రాల వల్ల వేడి తేమ పాత్రంతా వ్యాప్తి చెందుతూ పదార్థాన్ని ఉడికి స్థాయి. పదార్థాలు రసాయన చర్యలకు గురి కావు. ఆహార పదార్థాల లోని పోషకాలు, క్యాల్షియం, మెగ్నీషియం, ఇనుము, ఫాస్ఫరస్ వంటి ఎన్నో మైక్రో న్యూట్రియంట్స్ అలాగే ఉంటాయి. పైగా నూనె చాలా తక్కువ […]
