Thursday, 30 Jul, 2026

ఉప్పు హోటల్

ఈ హోటల్ లో అడుగు పెట్టిన వాళ్ళని దయచేసి గోడలు నాకొద్దు అని చెప్తారట నిర్వాహకులు. ఎందుకంటే ఈ హోటల్ లోని గోడలు పైకప్పు మొదలు కుర్చీలు టేబుళ్లు వరకు అన్ని ఉప్పు తోనే నిర్మించారు. బొలీవియా లోని ‘పాలాసియో డి సాల్’ అనే హోటల్ ప్రపంచంలోనే ఏకైక సాల్ట్ హోటల్ విశాలమైన 12 గదులు డైనింగ్ హాల్ ఈత కొలను వంటి సకల సౌకర్యాలతో ఉండే ఈ హోటల్ ఉప్పుతో మెరిసిపోతుంది. ఇక్కడి ‘ సాలార్ […]

చూసి కొనండి

ఇప్పుడన్ని ఆన్ లైన్ లో చూసి ఆర్డర్ ఇవ్వటమే. తీరా ఇంటికి వచ్చాక అసంతృప్తిగా ఉంటుంది. చూసి నచ్చితేనే కొనటం లేదా వాపస్ పంపించే ఏర్పాట్లు ఉంటాయి కనుక ముందుగా ఆర్డర్ చేసిన దుస్తుల నాణ్యత చూడాలి. అంచుల నుంచి దారాలు ఊడుతున్నాయా కుట్టు సరిగ్గా ఉందా లేదా చూడాలి. ఆర్డర్ ఇచ్చిన డ్రెస్ చూసేందుకు రంగు బావుండచ్చు కానీ చర్మానికి మెత్తగా తగులుతుందో లేదో   మెడ పైన వస్త్రం తో రుద్ది చూసుకోవాలి. ఒకసారి […]

ఫోల్డింగ్ బేబీ బెడ్

ప్రయాణాల్లో పసిపిల్లలు ప్రశాంతంగా నిద్ర పోయేలా చూడటం తల్లులకు కాస్త కష్టమే. మేలుకుని ఆడుకొన్న అంత సేపు పర్లేదు కానీ నిద్ర వస్తే మాత్రం వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. ఫోల్డింగ్ బేబీ బెడ్ లో అలాంటి సమస్యలు ఏవీ లేకుండా హాయిగా ప్రయాణాలు చేసేయచ్చు. హై క్వాలిటీ లగ్జరీ కెపాసిటీ కలిగిన ఈ బ్యాగ్ ని పిల్లల వస్తువులు అన్నీ చక్కగా తట్టుకునేందుకు వాళ్ళకి నిద్ర వస్తే దాన్ని బెడ్ గా మార్చేందుకు సౌకర్యంగా ఉంటుంది. తల […]

ఆకలి తీర్చే ఫ్రిజ్

ది పబ్లిక్ ఫౌండేషన్ పేరుతో ఆహారం తో పాటు దుస్తులు, స్టేషనరీ, నిత్యావసరాలు, బొమ్మలు పేదలకు పంచి పెడుతోంది చెన్నై కు చెందిన ఫాతిమా జాస్మిన్. ఈమె దంత వైద్యురాలు పేదల కోసం నిత్యం భోజనం పెట్టాలి అనుకుందామె. అందుకే ఫ్రిజ్ లను ఏర్పాటు చేసి రోజంతా అందులో ఉండేలా ఆహారపదార్థాలు పెడుతుంది. చెన్నై లోని 15 చోట్ల ఫ్రిజ్ లు పేదలకు అందుబాటులో ఉన్నాయి.  వాలంటీర్ల సాయంతో హోటళ్లలో ఆహారం కొని, పండ్లు, మంచినీళ్లు, బిస్కెట్లు […]

లోటు తీరిపోతుంది

ఇప్పటి ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక్క బిడ్డ ఉంటే చాలు అనుకుంటున్నారు తల్లిదండ్రులు. అలా ఒక్కరే ఉన్నా ఇంట్లో పిల్లలు వంటరితనం ఫీలవకుండా దగ్గర లో వారి కజిన్స్ ఉంటే వాళ్లకు అనుబంధం ఏర్పడేలా చూడాలి. అలాగే బంధుత్వానికి మించిన బలం స్నేహానికి ఉంది. స్నేహితులు ఉంటే ఒంటరి భావన పిల్లల్లో కలగదు. ఇంటికి పరిమితం చేసే కొద్ది ఒంటరితనం పెరుగుతుంది. పుట్టిన రోజులు, పండుగ రోజులు ఒకే ఈడు పిల్లలు ఒకే చోట కలిసేలా చూడాలి. […]

మానసిక ఒత్తిడి మాయం

రుచి, వాసనతో పాటు పుదీనా లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పుదీనా లో ఎ-విటమిన్, ఐరన్ మెగ్నీషియం తదితరాలు ఉన్నందున ఇది మంచి పోషకాహారం. పుదీనా పరిమళంతో అరోమా థెరపీ లు చేస్తున్నారు. దీనితో తయారు చేసే పెప్పర్ మింట్ ఆయిల్ మానసిక వత్తిడి తగ్గుతుంది. మెదడు పనితీరు కూడా పెరుగుతుంది. పాలిచ్చే తల్లులకు చనుమొనలు వాచిన, పగుళ్ళు వచ్చిన పుదీనా ఆకుల పేస్ట్ రాస్తే తగ్గిపోతుంది.

మళ్లీ ఆఫ్గాన్ వెళ్తా

విద్యతో జీవితాలు ఎట్లా మారుతాయో తెలుసుకొన్నాను. భారతదేశం నన్ను అక్కున చేర్చుకుంది. ఈ దేశం చూపిన ప్రేమ ఆప్యాయత మరువలేను. లండన్ లో కోర్స్ పూర్తి కాగానే ఆఫ్గాన్ వెళ్తాను అక్కడ ఆడపిల్లల మహిళల చదువుల కోసం కృషి చేస్తా నంటోంది లైలా రాసేఖ్. ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో పుట్టిన లైలా తల్లే వ్యభిచార ముఠాకు అప్పగించింది. ఏడేళ్ల వయసు నుంచి ఆ నరక కూపం లో గడిపిన లైలా ను డబ్ల్యూ ఏ డబ్ల్యూ […]

ఇక్కడొక మ్యాజిక్

ఈ నగరంలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది. అది మనల్ని కట్టిపడేస్తుంది ఇది ఒక డివైన్ సౌందర్యం అంటారు పర్యాటకులు. ఎల్లో సిటీ గురించి చెబుతూ మెక్సికో లోని ఒక ఊరు ఇజామెల్ ఈ నగరంలో ప్రతి భవనం ఇల్లు సమస్తం పచ్చ రంగులో ఉంటాయి. ఇక్కడి ప్రజలు సూర్య దేవతారాధకులు ఆయిన పై భక్తితోనే ఊరంతా పసుపు రంగు వేసుకున్నారు. మెక్సికన్ సంస్కృతుల సమ్మేళనంతో కనిపించే ఇక్కడి కొలోనియల్ ఆర్కిటెక్చర్ ఆకట్టుకుంటుంది.

అక్కడ యాక్షన్ కు స్కోప్ లేదు

వెండితెర పైనా గ్లామర్ కు ఉన్నంత స్కోప్ యాక్షన్ కు ఉండదు. అరణ్యక్ వెబ్ సిరీస్ నాకు అనుకోని సువర్ణ అవకాశం అంటుంది రవీనాటాండన్.పత్తర్ కే ఫూల్ సినిమా లో బాలీవుడ్ లోకి వచ్చిన రవీనా అగ్ర హీరోయిన్ గా పదేళ్లపాటు స్టార్స్ సరసన నటించారు. 2004లో పెళ్లి చేసుకొని వెండితెరకు దూరంగా ఉంది. గత సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన అరణ్యక్ లో ఇన్ స్పెక్టర్ కస్తూరి డోగ్రా పాత్రలో చాలా పవర్ ఫుల్ […]

అమ్మాయిలు జాగ్రత్త

ఆడపిల్లల విషయంలో నేరాలు, ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆడపిల్లలు కొన్ని జాగ్రత్తలు పాటించండి అంటున్నారు పోలీసు అధికారులు. కాస్త పరిచయం ఉన్నంత మాత్రాన వాళ్లను నమ్మి బైక్ పైన కార్ లోనూ వెళ్ళవద్దు. అలాగే రాత్రి వేళ ఒంటరిగా ప్రయాణాలు వద్దు. తప్పనిసరి అయితే ఆటో అతని ముందే ఆటో నెంబర్ ఇంట్లో వాళ్లకి పంపించి మరీ ఎక్కండి. ఏదైనా అనుమానం అనిపిస్తే 100 నంబర్ కి కాల్ చేయాలి దగ్గరలో ఉన్న పోలీస్ […]

వాళ్ళే నాకు స్ఫూర్తి

నిరుపేద కుటుంబం నుంచి వచ్చి విజేతలైన ఎంతో మంది నాకు ప్రేరణ. నేను గెలుచుకున్న గోల్డ్ మెడల్ నా పసి తనంలోనే కోల్పోయిన మా నాన్నకు అంకితం ఇస్తున్నాను. నా సక్సెస్ వెనుక మా అమ్మ నా కోచ్ ప్రోత్సాహం బలం ఉంది అంటోంది సుప్రీత్ కచ్ఛాప్.  హర్యానాలోని పంచకుల లో జరుగుతున్నాఖేలో ఇండియా యూత్‌ అథ్లెటిక్స్‌లో జార్ఖండ్‌కు చెందిన సుప్రీతి కచ్చప్‌  3000 మీటర్లను 9 నిమిషాల,46.14 సెకన్లలో పరుగెత్తి సరికొత్త రికార్డు సృష్టించింది. ట్రాక్‌ […]

ఆపదలో అభయం

ఆపదలో ఆదుకునే ఆభరణాలు ఉన్నాయి రివోలర్ అలాటిదే. దీన్ని కీ చైన్ కు తగిలించుకోవచ్చు దుస్తులకు స్టైల్ గా పిన్ చేసుకోవచ్చు. వైఫై తో పనిచేసే ఈ రివోలర్ అత్యవసర సమయంలో సింగిల్ క్లిక్ తో కుటుంబ సభ్యులకు ప్రమాద హెచ్చరిక ఇస్తుంది. ఈ రివోలర్ కంపెనీ సి ఇ ఓ జాక్వీలైన్‌ రోజ్‌ సోదరి రెండుసార్లు లైంగిక వేధింపులకు గురయి అతికష్టంమీద బయటపడింది. ఆ చేదు జ్ఞాపకాలను దృష్టిలో ఉంచుకొని ఎంతోమంది బాధితుల అనుభవాలు దృష్టిలో […]

క్రాఫ్ట్ టూరిజం లక్ష్యం

ఆదివాసీల హస్తకళల ఉత్పత్తులు క్రాఫ్ట్ పోట్లీ అన్న సంస్థ ద్వారా కస్టమర్స్ కు చేరుస్తున్నాను. నా ధ్యేయం క్రాఫ్ట్ టూరిజం హస్తకళలు ఉన్న గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా మార్చడం. కార్పొరేట్ ప్రాంతం లోని నియమ గిరి కొండల దగ్గర డోంగ్రియా తెగ ఆదివాసీలు గడ్డి తో చాలా అందమైన వస్తువులు తయారు చేస్తారు. 47 రకాల బియ్యం పండిస్తారు. అలాగే హడప గంధ అనే శాలువాలు అల్లుతారు. ఇలాంటి ఉత్పత్తులు మార్కెట్ చేయడం నా లక్ష్యం అంటుంది […]

కాస్త శ్రద్ధ తో మరింత అందం

సహజమైన మెరుపుతో ఉండే మ్యాట్ లిప్ స్టిక్ వేసుకునే ముందు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా పెదవులకు లిప్ బామ్ లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి. లిప్ లైనర్ తో అవుట్ లైన్ వేసుకొని బ్రష్ తో కాకుండా ట్యూబ్ తోనే మ్యాట్ లిప్ స్టిక్ వేసుకోవాలి. లిప్ స్టిక్ ఆరేందుకు కాస్త సమయం తీసుకుంటుంది కనుక వెంటనే పెదవులను ముట్టుకోకూడదు. లేదంటే లిప్ స్టిక్ షేప్ అవుట్ అవుతుంది. లిప్ స్టిక్ కొనే ముందే […]

ఎలా నడుస్తున్నారు ?

ఒకే సారి గంట సేపు వాకింగ్ చేసే కంటే ప్రొద్దుట టిఫిన్ చేసిన తర్వాత ఐదు నుంచి పది నిమిషాలు మధ్యాహ్నం లంచ్ తర్వాత పది నిమిషాలు రాత్రి డిన్నర్ తర్వాత పది నిమిషాలు అలా రోజు మొత్తం అరగంట నడిస్తే రక్తంలో షుగర్ నిల్వలు బాగా తగ్గుతాయి అంటున్నారు అధ్యయనకారులు. తిన్న తర్వాత ఐదు నిమిషాల లోపు లేచి ఐదు పది నిమిషాలు వాకింగ్ చేస్తే రక్తంలో షుగర్ నిల్వ 11 శాతం నుంచి 44 […]

అందం ఆరోగ్యం

అందంగా కనిపించడం తో పాటు ఆరోగ్య సంరక్షణ చేసే ఆభరణాలు వస్తున్నాయి. అందాన్ని రెట్టింపు చేసే లా కనిపించే హారం బెల్లా బీట్ లీఫ్. ఇది చూసేందుకు నగల గా ఉంటుంది కానీ ఇది ఫిట్ నెస్ ని కాపాడే యాప్ తో పని చేసే పరికరం. హారంగా బ్రాస్ లేట్ గా  బ్రూచ్ గా వివిధ రూపాల్లో కనిపిస్తుంది. కానీ ఈ పరికరం 24 గంటలు పనిచేస్తుంది. రోజంతా ఖర్చుచేసే కేలరీలు లెక్కిస్తుంది. నెలసరి సమయాన్ని […]

నృత్య శిక్షణ నా లక్ష్యం

ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి గ్రామీణ ప్రాంత అమ్మాయిలకు కూచిపూడి నేర్పేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న నంటోంది నాట్యకారిణి నిహంత్రీ రెడ్డి మణి కొండలో మాకు అకాడమీ ఉంది. ఆస్ట్రేలియా అమెరికా లో ఉంటున్న వారికి ఆన్ లైన్ లో శిక్షణ ఇస్తున్న. ఇప్పటివరకు ఎన్నో దేశాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. 2012 లో ఆల్ రౌండర్ గా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాను. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే స్త్రీ శక్తి […]

ఊహా సుందరి కైరా

కైరా మన దేశపు వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్.ఊహ జనిత పాత్రా. ఈ సంవత్సరం జనవరి 28 వ తేదీన ఇన్‌స్టాగ్రామ్ లో అడుగుపెట్టింది కైరా. ఈమెను అనుసరించే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఈమె పేరుతో వీడియోలు, ఫోటోలు పెట్టేందుకు ప్రత్యేక బృందం ఉంది. హిమాన్షు గోయల్ రూపొందించిన కైరా పూర్తిగా ప్రకటనల కోసం సృష్టించారు. ఈమెతో అడ్వటైజ్మెంట్ తీసేందుకు దూర ప్రాంతాలకు వెళ్లే ఖర్చులు ఉండవు. ఏ ప్రాంతంలో అయినా త్రీడీ సాయంతో ఈమెను జత చేస్తారు. […]

ఇట్లా అయితే ప్రమాదం

బ్రా ఎంపికలో నిర్లక్ష్యం చేస్తే చాలా సమస్యలు అంటున్నారు డాక్టర్స్. బిగువైన బ్రా ధరిస్తే రొమ్ము నొప్పి మొదలై చేతిలోకి వ్యాపిస్తుంది. బ్రా స్ట్రాప్స్, దాని వెనుక భాగాన్ని సరైన సైజు లో లేకపోతే మెదడు భుజాలను కలిపే ట్రెపీజియం కండరం పైన ఒత్తిడి పడిపోతుంది దానితో భుజం నొప్పి మొదలై అది మెడకు, ఛాతికి పాకుతుంది. అవసరం కంటే చిన్న బ్రా ధరిస్తే మహిళల్లో రక్తప్రసరణ సమస్యలు మొదలవుతాయి.బ్రా ధరించినపుడు చివరి హుక్ పెడితే బిగుతుగా, […]

సహజమైన టోనర్

ఈ ఎండలకి టమోటా ఒక టోనర్ లాగా పనిచేస్తుంది జిడ్డుగా ఉండి మొహం మరి ఇబ్బంది పెడుతూ ఉంటే పచ్చి టమాటో రసం ముఖానికి రాసుకుంటే చాలు. అలాగే మొహం ఎండకు కమిలి నల్లబడినట్లు ఉంటే ఒక స్పూన్ టమోటా గుజ్జు, రెండు స్పూన్లు ముల్తానీ మట్టి, టేబుల్ స్పూన్ పుదీనా ఆకుల పేస్ట్ కలిపి ఆయా ప్రదేశాల్లో రాసి ఆరిపోయిన తర్వాత కడిగేస్తే చాలు. నలుపు తగ్గి చర్మం బిగుతుగా అయిపోతుంది. చర్మం మురికి వదలాలన్న […]