Thursday, 30 Jul, 2026

టట్టింగ్ విజేత నిధి

అంతర్జాతీయ టట్టింగ్ కాంపిటీషన్ లో విజేతగా నిలిచింది నిధి అచ్చా. ముంబైలోని కుర్లా కు చెందిన డాన్సర్ నిధి అచ్చా సరదాగా చేసిన ఈ డాన్స్ ఆమెను అంతర్జాతీయ పోటీలకు తీసుకుపోయింది. టట్టింగ్ అనేది ఒక స్ట్రీట్ డాన్స్.1960-70 ల్లో కాలిఫోర్నియా లో వాడుకలో ఉంది. జామెంట్రీ కల్ ఆకారంలో 90 డిగ్రీల కోణంలో చేతులు కాళ్ళను కదిలించటానికి ఈ డాన్స్ ప్రత్యేకత అమెరికా, చైనా రష్యా బ్రిటన్ దక్షిణాసియా దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో ఇండియా […]

ఇది రారాజుల ఫ్యాషన్  

ఎన్ని రకాల ఫ్యాషన్ లు వస్తున్నా, వేసవిలో మాత్రం పప్డ్ స్లీవ్స్ ఓటేస్తారు అమ్మాయిలు వీటినే బుగ్గ చేతులు అంటారు. చిన్నవిగా అయినా పెద్దవిగా అయినా  పప్డ్ స్లీవ్స్ లో ఎంతో ఫ్యాషన్ గా కనిపిస్తారు. ఎప్పుడో రాజుల కాలం నాటి ఈ స్లీవ్స్ ఇప్పటికీ యువతరాన్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఇవి లెహంగా పైన చక్కగా మ్యాచ్ అవుతాయి. బరువు తక్కువ ఉండే జార్జెట్ చీర కు జోడీగా  పప్డ్ స్లీవ్స్ బ్లవుజ్ వేసుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. […]

రసాయనాలు లేని టోనర్

మార్కెట్ లో దొరికే రసాయనాలు ఉన్న టోనర్ కంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని దానిమ్మ టోనర్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కప్పు వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ వేసి ఆ డికాషన్ చల్లారనివ్వాలి. ఆ నీళ్లలో అర కప్పు దానిమ్మ రసం ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసి కలిపితే టోనర్ తయారైనట్లే. దాన్ని పొడి సీసాలో ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకోవచ్చు. ఈ టోనర్ తో మొహం మెడ మర్దన చేసి ఉదయం […]

ప్రయోగాలు వద్దు

తెరపైన తారలను చూసి అలా నాజూగ్గా అయిపోవాలని అనవసర ప్రయోగాలు చేయొద్దు బాడీ సైజ్ రూపం మార్చాలంటే ఎక్సపర్ట్స్  పర్యవేక్షణలో ఎన్నో వర్క్  వుట్స్ చేయాలి. సహజంగా ఉన్నదే అందం సినిమా వాళ్ళ అందం మేకప్ మహిమ మాత్రమే అంటోంది  యామీ గౌతమి. బ్యూటీ కేర్ ప్రకటనల్లో ఎక్కువగా కనిపించే ఆమె సహజమైన గాలి, వెలుతురు వాతావరణంలోనే అందం ఆనందం  ఉన్నాయంటుంది. మహిళలు చక్కగా చదువుకుంటేనే భవిష్యత్ అంటోంది. అచీవ్మెంట్, యాంబిషన్, సక్సెస్ అన్న పదాలు ప్రతి […]

చినుకుల్లో పూవులే మ్యాచ్

చినుకులు రాలే వర్షాకాలంలో పూవ్వుల ప్రింట్స్ ఉన్నా దోస్తులు బెస్ట్ ఎంపిక అంటుంది ప్రముఖ డిజైనర్ మసాబా గుప్తా. ఈ రోజుల్లో ప్రకాశవంతమైన నారింజ, ఎరుపు, గులాబీ, నీలం రంగుల్లో లైక్రా లేదా పాలిస్టర్ వంటి ఫాబ్రిక్ లు ధరిస్తే బావుంటాయి. అవి ముడతలు పడకుండా సులభంగా పొడిగా అయిపోతాయి. పలాజోలు బాటమ్ గా విశ్రాంతిగా ఉంటాయి. ప్రింటెడ్ ఆర్గాంజాలు సిల్క్ డ్రెస్ లు బాగుంటాయి. ఓవర్ కోట్స్, జంప్ సూట్స్ ఏవైనా సరే చిన్న ప్రింట్ […]

నాజుకే కాదు ఆరోగ్యం కూడా

నాజూకుగా మారేందుకు మాత్రమే కాదు,ఆరోగ్యంగా ఉండేందుకే వ్యాయామం చేయండి అంటున్నారు ఎక్సపర్ట్స్. వ్యాయామం తో గుండె వేగం పెరిగి ఎక్కువ మొత్తం లో ఆక్సిజన్ మెదడుకు చేరుతుంది దీని ద్వారా హార్మోన్ల ఉత్పత్తి పెరగటమే కాకుండా మెదడు కణాల అభివృద్ధి జరుగుతుంది. పనుల వత్తిడిలో నిద్ర సరిగా పోకపోతే అది జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపెడుతుంది. దీనికి వ్యాయామమే పరిష్కారం కనీసం అరగంట అయినా నడిస్తే మంచిది. బయట వాతావరణం అనుకూలంగా లేకపోతే మెట్లు ఎక్కి […]

ఐ పి ఎస్ నా ధ్యేయం

థాయ్ లాండ్  లో జరిగిన 14 వ ఏషియన్ వాలీబాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనడం నాలో ఆత్మవిశ్వసం పెంచింది.మేము గెలిచింది ఒక మ్యాచ్ లో అయినా వివిధ జట్ల క్రీడాకారిణుల ఆటను దగ్గర నుంచి చూడటం నాకు ఉత్సాహాన్ని స్ఫూర్తిని ఇచ్చింది. జాతీయ స్థాయి సీనియర్స్ జట్టుకు ఎంపిక కావటం,ఐ పి ఎస్ సాధించటం నా ఆశయం అంటోంది శాంతకుమారి. ఉమ్మడి పాలమూరు వనపర్తి జిల్లా చిట్యాల మండలం తూర్పు తాండ కు చెందిన క్రీడా […]

ఎం ఎల్ సి మున్నీ రజక్

రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ తరఫున ఎం ఎల్ సి గా 75 మంది సభ్యుల విధాన పరిషత్ లో కాలు పెట్టబోతుంది. మున్నీ రజక్. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి జీవించే మున్నీ రజక్ లాలూ యాదవ్ మెప్పుదల పొందింది.గత పదేళ్లుగా మున్నీ ఆర్జేడీ కార్యకర్తగా ఉంది చక్కగా పాటలు పాడగలదు పార్టీ సభల్లో పడుతుంది గట్టిగా మాట్లాడగలదు. ఎం ఎల్ సి ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున పోటీ లేకుండానే గెలిచింది మున్నీ రజక్.

పిసీఐ చైర్మన్ గా రంజనాదేశాయ్

ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్ ఇండియా (పిసీఐ) చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్ (72) ని ఎంపిక చేశారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా,సిపిఐ సభ్యుడు ప్రకాష్ తో కూడిన కమిటీ సమావేశంలో ఆమోదం తెలిపారు. జస్టిన్ రంజనాదేశాయ్ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన కమిషన్ కు నేతృత్వం వహించారు.

జుట్టుకు పోషణ

కరివేపాకు భోజనం లోని రుచి ఇవ్వటమే కాదు జుట్టు పెరుగుదలకు మంచి ఔషధం వంటిది అంటున్నారు ఎక్సపర్ట్స్. కరివేపాకు లో ఉల్లిపాయ రసం కలిపి మెత్తగా రుబ్బి మాడుకు పట్టించి గంట తర్వాత షాంపూ చేస్తే తల నెరవటం వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. మెంతి ఆకులు, కరివేపాకు కప్పు చొప్పున తీసుకొని మెత్తగా రుబ్బి దానికి రెండు స్పూన్ల ఉసిరి పొడి కలిపి మాడుకు రాసి అరగంట పాటు ఉంచి తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి జుట్టు […]

అందాల పోటీల్లో శివాని

ఎవరిపై వారికి నమ్మకం ఉండాలి. ఎంతమంది నీ అభిప్రాయాన్ని మార్చాలని చుసినా మనసు చెప్పిందే విను నీకలాల్ని నువు నెరవేర్చుకో అంటుంది శివాని. హీరో రాజశేఖర్‌,జీవిత ల పెద్ద కూతురు. శివాని సినిమాల్లో నటించి,ఇప్పుడు మోడలింగ్ పైన దృష్టి పెట్టింది. ఎంబిబిఎస్ మూడో సంవత్సరం చదువుతోంది ఫెమీనా ఇండియా అందాల పోటీల్లో తమిళనాడు తరఫున ఎంపికైంది. జులై లో జరగనున్న అందాల పోటీలకు దరఖాస్తులో వివిధ రాష్ట్రాలను ఎంచుకొనే అవకాశం ఉంటే శివాని ఆంధ్రప్రదేశ్‌,తమిళనాడు,తెలంగాణ లను ఎంచుకొంది. […]

నాననిస్తే ఆరోగ్యం

గింజలను నానపెట్టి తింటే అందులో ఉన్న ఇరాన్ క్యాల్షియం జింక్ వంటి ముఖ్యమైన పోషకాలను శరీరం సులభంగా గ్రహించ గలుగుతుంది. ప్రీరాడికల్స్ తొలగించటంలో వాల్ నట్స్ బాదం పలుకులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. నానబెట్టిన గింజలు నిత్య యవ్వనాన్ని ఇస్తాయి. రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంచేందుకు నట్స్ సాయపడతాయి ముఖ్యంగా డయాబెటిస్ రోగులు నానపెట్టిన నట్స్ తినాలి.కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది బరువు తగ్గాలనుకొనే వారు పిస్తా పలుకులు లేదా వాల్ నట్స్ […]

సంతోషంతోనే అందం

నిత్యం సంతోషంగా ఉండే వాళ్లలో హ్యాపీ హార్మోన్ లు ఉత్పత్తి అవుతాయి. అవి శరీరమంతా వ్యాపించి,ప్రతి అవయవానికీ సమాచారం అందించి జీవక్రియలు సక్రమంగా జరిగేలా చూస్తాయి ముఖ్యంగా మెదడును ఉత్సాహంగా ఉంచుతాయి హ్యాపీ హార్మోన్స్ లో డోపమైన్,సెరోటోనిన్,ఆక్సిటోసిన్ ఎండోర్షిన్ లు అన్ని కలసి అనారోగ్యం,మానసిక వత్తిడి నుంచి ఉపశమన్నానిస్తాయి. దీనితో రక్తప్రసరణ సవ్యంగా జరిగి కండరాలకు మంచి వ్యాయామం అందుతోంది. ముఖ చర్మం ఆరోగ్యంగా మారి కొత్త మెరుపు సంతరించుకొంటుంది.

క్రికెట్ తోనే ఫ్యూచర్ కూడా

వన్డే ప్రపంచ కప్ లో నిరాశ ఎదురైంది. ఇంకో ప్రపంచ కప్ ఆడే పరిస్థితి లేదు అలాంటప్పుడు క్రికెట్ లో కొనసాగటం లో అర్థం లేదు. అందుకే వీడ్కోలు పలికాను అంటోంది మిథాలీ రాజ్.రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్ లో ఎన్నో రికార్డ్ లు అందుకొన్న మిథాలీ ఇటీవలే ఆటకు వీడ్కోలు పలికారు. భవిష్యత్ లో కూడా కెరీర్ క్రికెట్ మాత్రమే. కోచ్ గా ఉండచ్చు లేదా వ్యాఖ్యాత గానో నన్ను చూడచ్చు. దేశం కోసం […]

పాలతో అందం

పాలతో చర్మానికి మంచి పోషణ అందుతుందని చెపుతున్నారు ఎక్సపర్ట్స్. పచ్చి పాలతో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. చర్మానికి తేమ అందించి పొడిబార నివ్వదు అందుకే పాలు మంచి క్లెన్స్‌ర్ గా టోనర్ లుగా పనిచేస్తాయి. పచ్చి పాలను మొహానికి రాసి ఐదు నిమిషాలు మర్దన చేసి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. అలాగే కుంకుమ పువ్వు లో యాంటీ ఏజింగ్ ఔషధ గుణాలున్నాయి కొన్ని కుంకుమ పువ్వు రేకలను పచ్చి పాలలో నానపెట్టాలి. […]

మహిళలకోసం టాయ్ లెస్

ఏ పని చేసిన సామాజిక బాధ్యత కోణం నుంచే ఆలోచిస్తాను నేను మొదలుపెట్టిన పూర్ లివింగ్ పేపర్ పెన్ కాన్సెప్ట్ మొదలైనవి, దేశవిదేశాల్లో ఆదరణ పొందాయి. ఇప్పుడు ప్రారంభించిన ‘టాయ్ లెస్’  స్టార్టప్ కేరళ మొత్తం వ్యాప్తి చేయాలన్నదే నా లక్ష్యం అంటుంది లక్ష్మీమీనన్. కేరళ కు చెందిన లక్ష్మి మీనన్ ప్రయాణాలు చేసే మహిళలకు శుభ్రమైన వాష్ రూమ్స్ గురించి సమాచారం సదుపాయం కలిగించేందుకు టాయ్ లెస్ స్టార్టప్ ని ప్రారంభించారు. మహిళలు కాసేపు ఫ్రెషప్ […]

ఒక చిన్న బ్రేక్ అవసరం

బిజీ లైఫ్ వల్లే మహిళలు వత్తిడి ని గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంట్లో పని ఒత్తిడి,కెరీర్ ఒత్తిడి నుంచి మానసికంగా స్ట్రాంగ్ అయ్యేందుకు రెండు నెలలకో చిన్న బ్రేక్ తీసుకుని ఏదైనా ప్రయాణం చేయాలి. కొత్త ప్రదేశం ఆటోమేటిక్ గా ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతిదీ అనుకొన్న టైమ్ టేబుల్ ప్రకారం చేసి తీరాలనే భారం వదిలేయాలి. ప్రతిదీ అనుకున్న సమయం లోనే పూర్తి అవుతుందన్న గ్యారంటీ ఉండదు. లక్ష్యాలు మార్చుకుంటూ ఉండొచ్చు. ఐరన్, క్యాల్షియం ఉండే ఆహారం […]

నాటి క్రేజీ స్టయిల్

బెల్ స్లీవ్స్ 60,70 ల నాటి ఫ్యాషన్.. ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. వీటిని స్టేట్ మెంట్ స్లీవ్స్ అంటున్నారు భుజం దగ్గర బిగుతుగా ఉండి కిందికి వచ్చేసరికి వెడల్పుగా గంట ఆకారంలో స్లీవ్స్ ఉంటాయి వీటిలో ఆఫ్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ త్రీ ఫోర్త్ మోచేతి వరకు మన ఇష్టం కొద్దీ కుట్టించుకోవచ్చు. మోచేతి వరకు బిగుతుగా ఉండి కిందకు బెల్ లాగా ఉండే ఫ్యాషన్ ఇప్పటి ట్రెండ్. జార్జెట్ చీరెల పైకి బెల్ స్లీవ్స్ […]

ఇది మహాదానం  

అన్నదానం మాత్రమే కాదు రక్త దానం కూడా మహాదానం అంటుంది ఆశ సూర్యనారాయణ్ బెంగళూరుకు చెందిన ఆశా ను గోల్డెన్ బ్లడ్ డోనర్ అంటుంటారు అభిమానులు. 24 సంవత్సరాల వయసు నుంచి ఆమె నిరంతరం రక్తదానం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడామె వయస్సు 55 సంవత్సరాలు రక్తదానం తో మొదలైన ఆమె సమాజ సేవ అక్కడితో ఆగిపోలేదు కోవిడ్ సమయంలో అన్నదానం అనాధ శవాలకు దహన సంస్కారాలు చేయటం. వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆమె చేసిన మంచి పనుల్లో కొన్ని.

మ్యూజియం ఆఫ్ ఫెయిల్యూర్

ఇదొక వింత మ్యూజియం వివిధ సంస్థలకు చెందిన ఫెయిల్యూర్ వస్తువులు ఇక్కడ కనిపిస్తాయి. గొప్ప కంపెనీలు తయారు చేసిన ఎన్నో వస్తువులు మార్కెట్లో ఆదరణ పొందలేదు. బిజినెస్ పాఠాల్లా నిలిచిన ఈ ఉత్పత్తులు గురించి ప్రపంచానికి తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో 2017లో శామ్యూల్ వెస్ట్ అనే ఒక ఆయన మ్యూజియం ఏర్పాటు చేశాడు. మ్యూజియం ఆఫ్ ఫెయిల్యూర్ పేరుతో స్వీడన్ లోని హెల్సింగ్‌బోర్గ్ లో ఉందీ మ్యూజియం. దీన్ని చూడాలనుకుంటే ఈ మ్యూజియం సైట్లోని వర్చువల్ టూర్ […]