కురాష్ క్రీడల్లో గెలుపు
హర్యానాలోని నేవాల్ అన్న చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన పింకీ బల్హారా ఆసియా క్రీడల్లో కురాష్ లో కాంస్య పతకం అందుకున్నది.వ్యవసాయ కుటుంబంలో పుట్టిన పింకీ ముందుగా జూడో లో నైపుణ్యం సంపాదించింది కానీ ఆ క్రీడ తో పోటీల్లో ఆర్థికంగా నిలదొక్కుకోవడం తనకు పెద్ద సవాలుగా మారింది ఆ సమయంలో జూడో ని పోలి ఉండే కురాష్ అంటే అది ఉజ్బెకిస్తాన్ సంప్రదాయ మల్లయుద్ధం మార్షల్ ఆర్ట్ మీద పింకీ దృష్టి పడింది. కోచ్ సలహాతో ఆ క్రీడలో శిక్షణ తీసుకున్నది.తక్కువ సమయంలోనే ఆటలో మెళకువలు నేర్చుకొని జాతీయ స్థాయిలో వరుసగా విజయాలు సాధించింది పింకీ. 2018 లో ఇండోనేషియాలోని జకార్తా లో జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల 52 కేజీల విభాగంలో భారతదేశం తరఫున ఉజ్బెకిస్తాన్ క్రీడాకారులతో తలపడి వెండి పతకం సాధించింది.అప్పటి ఆశయ క్రీడల్లో కురాష్ విభాగంలో భారత్ కు లభించిన తొలి చారిత్రక పతకాలలో ఇది ఒకటి .ఆసియా క్రీడల్లో భారత దేశానికి కంస పతకాన్ని అందించి తన దృఢత్వాన్ని సాధనను నిరూపించుకుంది పింకీ.
