ఇలా చేస్తే రంగు మారవు
సాధారణంగా యాపిల్ ముక్కలు కోసి ప్లేట్లో ఉంచగానే కాసేపట్లో రంగు మారిపోతూ ఉంటాయి. అలా ముక్కల రంగు మారకుండా కోసిన ముక్కల మీద నిమ్మరసాన్ని స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది.లేదా ఉప్పునీటిలో కోసిన యాపిల్ ముక్కలు వేసి ఐదు నిమిషాలు ఉంచి,తీసి ప్లేట్లో పెట్టినా రోజంతా తాజాగా ఉంటాయి. కప్పు గోరువెచ్చని నీటిలో చెంచా తేనె కలిపి ఆ నీటిలో యాపిల్ ముక్కలు వేసి ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత పళ్లెంలోకి తీస్తే తేనెలోని సహజ సమ్మేళనాలు యాపిల్ ముక్కలు రంగు మారనీయవు. తాజాగా ఉంచుతాయి లేదా వాటిపై కొద్దిగా దాల్చిన చెక్క పొడి చల్లినా మంచిదే యాపిల్ని కోసిన వెంటనే గాలి చొరబడని కంటైనర్ లో వేసి మూత పెడితే ఎంతసేపైనా తాజాగా ఉంటాయి లేదా ప్లాస్టిక్ రాపర్ లో చుట్టి జిప్ లాక్ కవర్లో వేసి ఫ్రిజ్ లో పెట్టినా తాజాగా ఉంటాయి.
