Monday, 28 Sep, 2026

కొత్త తరహా ఫర్నిచర్ వ్యాపారం

వైజాగ్ లో ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ పూర్తిచేసిన సుమని కలిదిండి హైదరాబాద్ లో ది సీటింగ్ ప్రాజెక్టు పేరుతో ఈవెంట్స్ కి ఫర్నిచర్ అద్దెకిస్తుంది సాధారణంగా టెంట్ హౌస్ అంటే సాదాసీదా కుర్చీలు టెంట్లు ఇవే ఇస్తారు కానీ  సుమని కలిదిండి చైనా నుంచి తెచ్చిన కుర్చీలు సోఫాలు అలాగే థీమ్ తగ్గట్టు  జర్మన్ సిల్వర్ తో పాటు వింటేజ్ చిక్ , మినిమలిస్ట్ మోడల్.. ఇలా ఈవెంట్స్ కు తగ్గట్టు ఫర్నిచర్ మార్చడం చేస్తుంది.సెలబ్రిటీ తో పాటు ప్రముఖుల ఇళ్లల్లో ఈవెంట్స్ కి సుమని కలెక్ట్ చేసిన ఫర్నిచర్ ఎంతగానో మ్యాచ్ అవుతుంది .తను చేసే ఈవెంట్స్ గురించి మాట్లాడుతూ ఈ ఫర్నిచర్ బిజినెస్ లో మగవాళ్ళే ఉంటారు. దీనిలో ఒక మహిళ రాణించటం అంత సులువేం కాదు రాత్రి వేళలోనూ పని చేయాలి. టీమ్ ను మేనేజ్ చేయాలి రవాణా జాగ్రత్తగా చూసుకోవాలి వీటన్నిటిని ధైర్యంగా చేయగలిగితే ఈ రంగంలో రాణించటం అమ్మాయిలకు ఈజీనే అంటుంది సుమని కలిదిండి.ఫర్నిచర్ మొత్తం ప్రసిద్ధ ఆలయపు డిజైన్లు దేవాలయాలపైనే ఉండే శిల్పకళ  తరహా డిజైన్లు తయారు చేయించింది సుమని కలిదిండి.

Leave a Reply