తొలి మహిళా భౌతిక శాస్త్రవేత్త
బిభా చౌదరి ఆధునిక భారతదేశపు మొదటి మహిళా భౌతిక శాస్త్రవేత్త. అణు కేంద్రకంలో ఉండే మెసాన్ ద్రవ్యరాశిని తొలిసారిగా లెక్కించిన శాస్త్రవేత్త బిభా.మనదేశంలో హై ఎనర్జీ ఫిజిక్స్ విభాగపు తొలి మహిళా శాస్త్రవేత్త కూడా.ఆమె శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ కి బంధువు. బిభా చౌదరి 1913లో కలకత్తాలో బంకు బిహారి చౌదరి ఊర్మిళాదేవి దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి జమీందారీ వంశానికి చెందిన వైద్యులు కలకత్తా విశ్వవిద్యాలయం లో 20 ఏళ్ల ఫిజిక్స్ శాఖ చరిత్రలో ఎంఎస్సీ చేసిన మూడో మహిళ. ఆచార్య డి ఎం బోస్ తో కలిసి మెసాన్ గురించిన పరిశోధనలు చేశారు. భారతదేశంలో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో ఫెలో గా చేరారు.బిభా అక్కడ చేరిన తొలి మహిళ శాస్త్రవేత్త. క్లౌడ్ చాంబర్ పరిశోధక బృందానికి ఆమె నాయకత్వం వహించారు. 1966లో అహ్మదాబాద్ లోని విక్రం సారాభాయ్ నేతృత్వం వహించే ఫిజికల్ రీసెర్చ్ లేబరేటరీ లో చేరారు. 1991 జూన్ రెండో తేదీన బిభా కన్నుమూశారు. ఆమె మరణించాక ఆమెకు రెండు గొప్ప గౌరవాలు లభించాయి. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ (Sextans) సెక్టాన్స్ నక్షత్ర మండలం లోని ఒక తెల్లని పచ్చ నక్షత్రానికి ఆమె పేరు పెట్టారు. అలాగే 2020 లో భారత ప్రభుత్వపు మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన 11 పీఠాల్లో ఫిజిక్స్ శాఖకి బిభా చౌదరి పేరు పెట్టారు.
