భక్తుల రద్దీకి ఆధునిక సాంకేతికత
శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న టి శోభారాణి ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్ సాంకేతికత రూపొందించారు.ఇది భక్తుల రద్దీని శాస్త్రీయంగా అంచనా వేసి భక్తుల సమూహాల్లో రద్దీ, పెరుగుదలను అసాధారణ కదలికలను గుర్తిస్తుంది. సీసీ కెమెరాలు డిజిటల్ అనలిటిక్స్ , ఐఓటి పరికరాలు ఏఐ ఆధారిత అల్గారిథం సమన్వయం చేయడం ద్వారా ఈ పరికరం భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. క్యూ లైన్ లో ఏర్పడే అసాధారణ పరిస్థితిలను గుర్తించిన సిబ్బంది అధికారులను అప్రమత్తం చేస్తుంది.పర్వదినాల్లో భారీగా జనాలు తరలి వచ్చే సందర్భాల్లో ఈ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుంది.ఆధ్యాత్మిక పర్యటన కేంద్రాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి ప్రాధాన్యత పెరుగుతున్న సమయంలో ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమని దీనికి తిరుమల తిరుపతి అధికారులు ఆర్థిక సహాయం అందించారు.ఈ పరికరం ద్వారా ఏఐ డిజిటల్ పరిజ్ఞానం స్మార్ట్ పర్యవేక్షణ వ్యవస్థలతో భక్తులకు మెరుగైన సేవలు అందించవచ్చు.
