Thursday, 27 Aug, 2026

కుల వివక్షపై పోరాటం

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సునీత విశ్వాస్ తృతీయ రత్న అనే సంస్థ ద్వారా పేద పిల్లల జీవితాల్లో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకుని వచ్చింది. ఢిల్లీలో జన్మించిన సునీత బాల్యం తీవ్ర పేదరికంలో గడిచింది. పాఠశాల స్థాయి నుంచి ఆమె తీవ్రమైన కుల వివక్ష ఎదుర్కొన్నది. 2014లో ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో సోషల్ వర్క్ లో ఎంఏ చేయడం కోసం చేరటం సునీత జీవితంలో పెద్ద మలుపు తీసుకువచ్చింది. అక్కడ ఆమె కుల వ్యతిరేక ఉద్యమాలు, అంబేద్కర్, ఫూలే సిద్ధాంతాలను లోతుగా అధ్యయనం చేసింది ఆ తర్వాత ఆమె పిహెచ్ డి కూడా పూర్తి చేసింది. లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది నిరుపేద పిల్లలు ఆకలితో అల్లాడుతూ భిక్షాటన  చేయడం చూసాక సునీత ఆ పిల్లల చదువు ఆగిపోకుండా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది పిల్లలకు నిత్యావసర సరుకులు, చదువు అందించింది ప్రసన్నకుమారి తో కలిసి 2024లో ఉప్పలం ఫౌండేషన్ కింద తృతీయ రత్న పేరుతో ఒక సంస్థ నమోదు చేసింది ఈ సంస్థ 4 విభాగాల్లో పనిచేస్తుంది కమ్యూనిటీ లైబ్రరీలు, విద్యార్థులకు ఉచితంగా చదువు, పుస్తకాలు, అమ్మాయిలకు స్కాలర్ షిప్ లు,బాల సభల ద్వారా పిల్లల్లో సామాజిక స్పృహ, రాజ్యాంగ విలువలు, లింగ సమానత్వం పై అవగాహన కల్పించడం తృతీయ రత్న కార్యక్రమాలు .ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందేలా చూస్తూ బాల్య వివాహాలు అడ్డుకుంటూ బాధితులకు చట్టపరమైన సాయం అందిస్తుంది తృతీయ రత్న.ఎన్నో వేల మంది చిన్నారుల భవిష్యత్తుకు వెలుగు దీపం సునీత.

Leave a Reply