కబడ్డీలో అర్జున అవార్డు
భారత కబడ్డీ క్రీడాకారిణి పూజ కాజ్లా కు క్రీడారంగంలో కనపరిచిన ప్రతిభకు గుర్తింపు గా కేంద్ర ప్రభుత్వం ఆమెకు అర్జున్ అవార్డు బహుకరించింది.అలాగే జాతీయ కాజ్లా కప్ అందించే కాజ్లా గౌరవ బిరుదును కూడా అందుకున్నారు.హర్యానా లోని హత్వాలా గ్రామానికి చెందిన పూజ చిన్నతనం నుంచే క్రీడల కు ప్రాధాన్యత ఇచ్చే వాతావరణంలో పెరిగింది. కాబట్టి ఆమెకు క్రీడలపై ఆసక్తి ఉంది. కుటుంబ సభ్యుల మద్దతుతో పాఠశాల స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి ఛాంపియన్ షిప్ లో అడుగుపెట్టిందామె .ఇండియన్ రైల్వేస్ ఉమెన్స్ కబడ్డీ జట్టులో చోటు సంపాదించింది. ఈ అవకాశం అంతర్జాతీయ టోర్నమెంట్ లకు సిద్ధం కావడానికి సాయపడింది లెఫ్ట్ హ్యాండ్ రైడర్ గా తనకున్న బలంతో మెరుపు వేగంతో చురుకుగా ప్రత్యర్థుల నుంచి తప్పించుకునేది పూజ. 2022 లో చైనా లోని హ్యాంగ్జౌ లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడం లో పూజా కీలక పాత్ర వహించింది.2025 లో టెహ్రాన్ లో జరిగిన ఆసియా ఆరో మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్ లో కూడా అద్భుతమైన ప్రతిభ చూపించింది పూజ.
