Thursday, 20 Aug, 2026

గాయత్రికి అర్జున అవార్డు

ప్రముఖ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రి గోపీచంద్ తాజాగా అర్జున అవార్డుకు ఎంపిక అయింది.11 ఏళ్లకే రాష్ట్రస్థాయి విజేత ఆమె.14 ఏళ్లకు జాతీయ ఛాంపియన్.15 ఏళ్ల వయసులో ప్రపంచ స్థాయి క్రీడాకారిణి కూడా.తల్లి పీవీ లక్ష్మీ కూడా ఒలింపిక్ ఛాంపియన్.తండ్రి గోపీచంద్ అకాడమీ లోనే కఠోర సాధన చేసి క్రమశిక్షణ అలవర్చుకుంది గాయత్రి.సింగిల్స్ క్రీడాకారిణి గా జూనియర్ సీనియర్ స్థాయిలో చక్కని విజయాలు సాధించింది.తన ఆసక్తి డబుల్స్ ఉండటంలో అటే మొగ్గు చూపింది.అదే ఆమె కెరియర్ ని మలుపు తిప్పింది.కేరళకు చెందిన ట్రీసా జాలీ తో జోడి కట్టి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యున్నత జట్లలో ఒకటిగా నిలిచింది.ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్లో వరుసగా రెండుసార్లు సెమీ ఫైనల్ కు చేరి సంచలనం సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్ లో పథకాలు సాధించడంతో పాటు ఆసియా టీం ఛాంపియన్ షిప్ లో భారత్ కి చారిత్రాత్మక స్వర్ణం అందించింది.ప్రపంచ ర్యాంకింగ్స్ లోను దూసుకుపోతోంది గాయత్రి. అర్జున అవార్డుకు ఎంపికై అంతర్జాతీయ వేదికల్లో జాతీయ పతాకాన్ని ఎగరవేసింది గాయత్రి గోపీచంద్.

Leave a Reply