ఆరు రెస్టారెంట్ల యజమాని!
దక్షిణాయన్ హోటళ్ల యజమాని బినా గాంధీ .సాధారణ గృహిణి నుంచి మొదలైన ఆమె ప్రస్థానం ఇప్పుడు ఆరు రెస్టారెంట్లకు యజమానిగా ఉంది.మొదట్లో రుబ్బిన దోశ పిండి సాంబార్ ,రసం, చట్నీ,లెమన్ రైస్ కూడా అమ్మేవాళ్లు.తర్వాత ఈవెంట్లకు క్యాటరింగ్ చేశారు.ఇందుకోసం ప్రత్యేకంగా రకరకాల దోశలు, ఊతప్పాలు,ఇడ్లీలు వంటివి తయారు చేసేది బీనా గాంధీ.అహ్మదాబాద్ లో 2000 లో తొలి దక్షిణాయన్ హోటల్ ప్రారంభించింది. ఆ మొదటి రెస్టారెంట్ ను సినిమా తారలు సందర్శించి ఆమె వండిన పదార్థాలు రుచి చూసారు. దానితో ఆమెకు ఒక బ్రాండ్ వాల్యూ వచ్చింది. ముంబైలో మూడు అహ్మదాబాద్ లో మూడు రెస్టారెంట్లు నడుపుతోంది బీనా గాంధీ. సాంబార్,చారు వంటి పొడులు రెడీ టు ఈట్ ఐటమ్స్ కూడా విక్రయిస్తున్నారు. కస్టమర్లకు సౌత్ రుచులు చూపిస్తున్నది బీనా.ఈ హోటళ్లలో తయారయ్యే పదార్థాలకు కావలసిన మసాలాలు దగ్గర నుంచి అన్ని ఇంట్లోంచి తయారు చేయిస్తుంది బీనా.అదే ఆమె వ్యాపార రహస్యం.
