Wednesday, 01 Jul, 2026

తల్లి బిడ్డ క్షేమం లక్ష్యం

ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలతో పాటు ఎక్సలెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు అందుకున్నారు డాక్టర్ లక్ష్మీ ప్రియ ఐఏఎస్. ఆమె మొదటి పోస్టింగ్ అసోం లోని జోర్హాట్ జిల్లా. టీఎస్ స్టేట్ లకు ఆ జిల్లా ప్రసిద్ధి.అక్కడ మహిళలు పోషకాహార లోపం రక్తహీనత తో బాధపడటం గమనించి దీన్ని అరికట్టేందుకు స్టేట్ రూలర్ లైవ్లీహుడ్ మిషన్ సహాయంతో పౌష్టికాహారాన్ని అందించే బగన్ బజార్లు ఏర్పాటు చేశారు లక్ష్మి.తర్వాత ఆమెకు బొంగైగావ్ కు బదిలీ అయింది. 2020లో అక్కడ ప్రాజెక్టు సంపూర్ణ ప్రారంభించారు .తల్లి బిడ్డ క్షేమం దీని ప్రాథమిక లక్ష్యం. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల్ని దీనిలో చేర్చారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీలు ఆశా వర్కర్ల సహాయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు విజయం సాధించింది. ప్రసూతి మరణాల రేటు 84 కి వచ్చింది.లక్ష్మీ అందిస్తున్న సేవలు సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు.

Leave a Reply