Wednesday, 30 Sep, 2026
ఇంటీరియర్స్ చలా ఖరీదు. ఒక సారి కొన్ని వస్తువులు కొన్నాక, ఇక మాటి మాటికీ మార్చాలంటే కుదరదు. కానీ రోజు ఇల్లు ఒకేలా వుంటే బోర్ గా వుంటుంది. మరి కస్త మార్పు తేవాలంటే బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, సోఫా కవర్స్ ఇలాంటివి మార్చుతూ వుండాలి. పడక గది నీట్ గా వుండాలంటే పిల్లో కవర్స్ కొత్త కొత్త డిజైన్ల తో రంగులతో ఉండేలా తీసుకుంటే అవి ఎప్పుడు మార్చేస్తూ వుంటే ఫ్రెష్ లుక్ వస్తుంది. మంచి రంగులు ఎంపిక చేసుకోవాలి. పిల్లో కవర్స్ రంగు, డిజైన్, ఫ్యాబ్రిక్ పరిగణలోకి తీసుకోవాలి. గది ధీమ్ ను బట్టి బెడ్ రూమ్ దుప్పట్లు, పిల్లో కవర్స్ ఎంపిక చేయాలి. గది అందం పెంచడం లో కుషాన్ కవర్స్ బాగా ఉపకరిస్తాయి. డ్రాయింగ్ రూమ్, లివింగ్ రూమ్ లో కుషన్స్, కవర్స్ అమర్చు కుంటే ఆకర్షనియంగా వుంటుంది. ఎంబ్రాయిడరీ వర్క్ మోడల్స్ లైవ్ లీ ప్రింట్స్ వేసిన కవేర్స్ ప్రస్తుతం అందుబాటులో ఉంటున్నాయి. ఇంటీరియర్ ఫర్న్ బార్ ను దృష్టిలో పెట్టుకుని ఆకర్షణీయమైన ఆ కట్టు కొనే పిల్లో కవర్స్ బెడ్ షీట్స్ కుషన్ కవర్స్ ఎంపిక చేయడం మంచిది. ఇంటికి గ్రాండ్ లుక్ వస్తుంది.

ఇల్లు విశాలంగా

కొత్త ఇల్లు కొనుక్కుంటే కొత్త వస్తువులను ఎంపిక చేసుకోండి కొత్త ఫర్నిచర్ ఇంటీరియర్ డెకరేషన్ లో కాస్త శ్రద్ధ చూపిస్తే అప్పుడే ఇంటి అందం తెలుస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. ఉదాహరణకు బెడ్ రూమ్ తీసుకుంటే బెడ్ తో పాటు ఇంట్లో ఉండే క్లోసెట్స్ ను రెడీమేడ్ గా కొనుక్కోవాలి. మార్కెట్ లోకి వచ్చే అధునాతన టెక్నాలజీ కొత్త వస్తువులకు అప్డేట్ కావాలి. హాల్ రంగులను బట్టి కూల్ గా అందంగా కనిపించే సోఫా సెట్ ఎంపిక చేసుకోవాలి. ఇల్లు విశాలంగా, వెలుగు తో ఉండాలంటే ఇంటీరియర్ డిజైనర్ ని సంప్రదించి మరీ సామాన్లు కొనుక్కోవాలి. డైనింగ్ టేబుల్, కార్పెట్లు, కాఫీ టేబుల్ వంటివి ఇంటిని బట్టి కొనుక్కుంటేనే బావుంటుంది.

Leave a Reply