Wednesday, 29 Jul, 2026
ఐలైనర్ ను కళ్ళ ఇన్నర్ రిమ్స్ లో అప్లై చేస్తేనే కళ్ళు అందంగా వుంటాయి. ఈ ప్రోడక్ట్ ను ప్రోమోట్ చేసే సినీ తారలు ఇదే మాదిరి అప్లై చేస్తారు. ఇలా ఐ లైనర్ ను వాడటం కరక్టేనా, కళ్ళకేం ప్రాబ్లం కాదు కదా అని చాల మంది సందేహంలో పడుతుంటారు. ఎక్స్ పర్ట్స్ ఏం చెపుతారంటే పేరు పొందిన కంపెనీలు కళ్ళ పరిసర ప్రాంతాలకు సురక్షితమైన పరిక్షలు జరిపాకే, ఆ పదార్ధాల నాణ్యమైన బ్రాండ్ ఎంచుకోవాలి. ఆ ప్రోడక్ట్స్ కళ్ళ ఇన్నర్ రిమ్ వాడకానికి అనుమతించి వుందో లేదో చెక్ చేసుకోవాలి. కంటి ప్రాంతం చాలా సున్నితంగా వుండి ఇరిటేషన్ కు ఎర్రబాడటానికి లేదా ఇన్ఫెక్షన్ కు దారి తీయవచ్చు. ముఖ్యంగా ప్రొడక్ట్స్ లో ఉపయోగించిన పదార్ధం సూట్ అవ్వక పోయినా ఇలా జరుగుతుంది. వాడటానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. తేదీ దాటిన వాటిని పొరపాటున కూడా వదవద్దు.

ఐ లైనర్ ఈజీగా

ఐ లైనర్ తో కళ్ళు విప్పారినట్లు కనిపిస్తాయి. చిన్న చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే చక్కగా వేసుకోవచ్చు. ఐ లైనర్ క్రీమ్ గా ఉంటే కనురెప్పల పైన మెత్తగా జరుగుతుంది. వేసుకోవటం ఈజీ ఇలాటి క్రీమ్ లైనర్ తోనే స్మడ్జ్ డ్ కలిసి ఉంటే బ్లెండ్ చేయటం ఎంతో తేలిక కాబట్టి వాటర్ ప్రూఫ్ బిల్ట్ ఇన్ స్మడ్జ్ డ్ క్రీమ్ ఐ లైనర్ నే ఎంచుకోవాలి. ఐ లైనర్ వేసుకునేందుకు ఉపయోగించే అద్దం ఫ్లాట్ గా ఉండే ప్రదేశంలో కూర్చున్న ప్రదేశానికి తక్కువ ఎత్తులో ఉండాలి. ఇలా ఉంటే కళ్ళను కిందికి దించి సులువుగా లైనర్ వేసుకోవచ్చు. లాష్ లైనర్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి కనురెప్పలకు ఆనుకొని ఉండేట్లుగా లైన్ గీసుకోవచ్చు. లైన్ వంకర లేకుండా రావాలంటే కన్ను మొదలు నుంచి చివరి వరకు కనురెప్పలకు కొద్దిగా పైన వరసగా మూడు చుక్కలు పెట్టుకుని తరువాత లైన్ తో ఈ చుక్కల్ని కలుపుతూ లైన్ గీసుకుంటే వంకర లేకుండా వస్తుంది.

Leave a Reply