Wednesday, 29 Jul, 2026
2017 మహిళా దినోత్సవానికి స్పూర్తినిచ్చే మహిళల జాబితా పెద్దదే వుంది. ఎందరో మహిళలు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు, భారత దేశపు బయోటిక్ రంగంలో తిరుగు లేని ప్రతిభ చూపించారు. కిరణ్ మంజుదాస్ షా, ఫోబ్స్ ప్రకటించిన 2016 జాబితా లో ఈమె పేరు శక్తి వంతమైన మహిళల జాబితాలో వుంది. బయోకాన్ స్థాపించి నాదిపిస్తున్నారు కిరణ్ మంజు దాస్. డయాబెటిక్ రోగాలుని ప్రణాలు కాపాడే ఇన్సులిన్ ని తాయారు చేసే అతి పెద్ద కంపనీ అమెది. బయోకాన్ పరిశోధన విభాగం నుంచి 950 పేటెంట్స్ కి వెళ్ళారంటే ఆ పరిశ్రమ ఎంత గొప్ప స్థానం లో వుందో తేలింది. దేశ ఆరోగ్యం పెంపొందించడంలో తన వంతు కర్తవ్యం నిర్వహించిన కిరణ్ స్ఫూర్తి నిచ్చే మహిళల్లో ముందుంటారు.

సిరిమంతురాలు కిరణ్ షా

హారూన్  విడుదల చేసిన అత్యంత ధనవంతులైన భారతీయుల జాబిదాలో తోలి వంద మందిలో అత్యంత ధనవంతురాలైన తోలి మహిళగా నిలిచారు కిరణ్ మంజుదార్ షా. ఆస్ట్రేలియా లో మాల్టింగ్ అండ్ బ్రూవింగ్ లో పట్టా తీసుకున్న కిరణ్ షా బయోకాన్ లో భాగస్వామిగా చేరారు. సంవత్సరం తిరిగేలోగానే భారత్ లో తొలి ఎంజైమ్ ల తయారీ సంస్థ గా నిలబెట్టారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె పోటుని దరిచేరనీయని ఉత్పత్తులతో సంచలనం సృష్టించారు. గత ఏడాది కన్నా ర్యాంక్ తగ్గినా 28.200 వందల కోట్ల సంపద తో హరూన్ జాబితాలో సిరిమంతురాలు గా నిలిచారు.

Leave a Reply