April 2020
ఇదో నివారణ మార్గం
కరోనా వైరస్ వ్యాప్తిని నోటి శుభ్రతతో నివారించవచ్చునంటున్నారు డాక్టర్ సుమన్ కాపుర్. ఇందుకోసం ఆమె ప్రత్యేకంగా ఓ మౌత్ వాష్ తయారు చేశారు. బిర్లా ఇన్స్ ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ హైద్రాబాద్ కాంపస్ లో బయో కెమిస్ట్రీ విభాగంలో ఆమె సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. కరోనా బాధితులు తుమ్మినా దగ్గినా వచ్చే తుంపరులు ఎదుటి వ్యక్తిపై పడినప్పుడు ఆ వైరస్ ఆ తుంపరల నుంచి ఎదుటి వ్యక్తి కి చేరి వాళ్ళ గొంతులో […]
మలాలా హెయిర్ కట్
ప్రపంచం అంతా ఇప్పుడు లాక్ డౌన్ లోనే ఉంది స్వీయ నిర్బంధంలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ తన జుట్టును సొంతంగా కత్తిరించుకొని ఆ ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసింది. ఎవరి పనులో వాళ్ళు చేసుకొనే దిశగా అందరినీ ప్రోత్సహించేందుకు తన వంతుగా ఇలా ప్రయత్నిం చానని చెపుతోంది మలాలా. ఆమె అభిమానులకు ఈ స్టయిల్ చాలా బాగా నచ్చిందట.
ఇవి సహజమైనవి
లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండిపోవలసి వస్తోంది. ఫేషియల్స్ కోసం పార్లర్ కు పోయే అవసరం ఏమి లేదు. ఇంట్లోనే కొన్ని రకాల ఫేషియల్స్ ట్రయ్ చేయమంటున్నారు ఎక్స్ పర్ట్స్. పెరుగు,ఓట్ మీల్,తేనె ఈ మిశ్రమం చర్మాన్ని మృదువుగా చేస్తోంది. ఈ మిశ్రమాన్ని మెత్తగా అయ్యేలా బాగా కలిపి మొహం పైన మాస్క్ లాగా వేసి ఓ పదిహేను నిముషాలు ఆలా వదిలేసి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. చర్మం చాలా మృదువుగా అయిపోతుంది. పసుపు,పెరుగు,జాజికాయ […]
నీళ్ళు ఎప్పుడు సురక్షితం
తాగునీటి పైపుల ద్వారా కరోనా వ్యాపిస్తోంది ఇజ్రాయిల్ నుంచి సోషల్ మీడియా వేదికగా వస్తున్న ప్రచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పు పట్టింది. నీటి పైపుల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతోందని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ అధికారాలు లేవని తేల్చి చెప్పింది. ఒక మనిషిని ఇంకో మనిషిని తాకడం ద్వారా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది కానీ ఇలా గాలిలో,నీటిలో ప్రయాణం చేసేంత తేలికపాటి చురుకైంది కాదని స్పష్టంగా చెప్పారు. మనిషి మనిషికీ మధ్య ఒక […]
మేకప్ కు బ్రేక్ మంచిదే
హడావిడిగా తయారై ఆఫీసు పరుగులు తీయటం ఆపేసి ఇంటి నుంచే పనిచేసే రోజులు ఇవి .ఆఫీస్ కు వెళ్తూ కాస్తయినా మేకప్ వేసుకుంటూ ఉంటారు .ప్రస్తుతం దానికి కూడా బ్రేక్ ఇవ్వడం మంచిదే అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . సాధారణంగా మేకప్ చర్మ రంద్రాలను మూసేస్తూ ఉంటుంది .లిక్విడ్ ఫౌండేషన్ లు సిలికాన్ బెస్ట్ ప్రైమరీలు వల్ల ఒక్కసారి మొటిమలు బ్లాక్ హైడ్స్ కూడా వస్తూ ఉంటాయి .ఈ ఇంట్లోంచే పని చేసే రోజుల్లో మేకప్ కు […]
క్వారంటైన్ పాపాయి
మొట్టమొదటి క్వారంటైన్ బర్త్ కేస్ ను కార్గల్ లో నమోదు చేశారు కరోనా నేపధ్యంలో కార్గిల్ లో ఓ కుటుంబాన్ని అధికారులు క్వారంటైన్ చేశారు. ఆ ఇంట్లో 30 జహ్రాబాను నిండు చూలాలు. ఆమె సోదరుడికి కరోనా పాజిటివ్ రావటం తో ఆ కుటుంబాన్ని క్వారంటైన్ కు తరలించారు. ఇంతలో జహ్రా కు పురుటి నొప్పులు రావటంతో ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మర్చి 28 వ తేదీన మగబిడ్డ పుట్టాడు,ఇది దేశంలోనే తోలి క్వారంటైన్ […]
ఇవి వ్యాధి నిరోధక శక్తినిస్తాయి
కోవిడ్-19 జబ్బుకు ఇంతవరకు ముందుగానీ వ్యాక్సిన్ గానీ లేవు. కానీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు మాత్రం కొన్ని ఔషధ గుణాలున్న దినుసులు పండ్లు తీసుకోమంటున్నారు డాక్టర్లు. కానీ ఇది కరోనా వైరస్ నుంచి కాపాడేవి కాదు వ్యాధీ నిరోధక శక్తి నిచ్చే ఎదోరక్షంగా నివారణకు ఉపయోగ పడతాయి అల్లం,వెల్లుల్లి ఉల్లి వాటిలో ఔషధ గుణాలున్నాయి నిమ్మ జాతి పండ్లలో ఉండే సి-విటమిన్ తో వ్యాధీ నిరోధక శక్తి పెరుగుతోంది. అల్లం అల్లం వెల్లుల్లి లోని […]
ఆ ప్రభావం రెండు గంటలే
ప్రతి రెండు గంటల కోసారి శుభ్రంగా చేతులు కడుక్కొని శానిటైజర్ పూసుకోమంటున్నారు డాక్టర్లు. చేతులపై ఉండే వ్యాధి కారక క్రిములు వైరస్ లు ప్రభావవంతంగా నిర్ములించేందుకు శానిటైజర్లు ఉపయోగపడుతాయి. కానీ ప్రతి రెండు గంటలకు డాక్టర్లు చేతులు కడుక్కోమని సలహా ఎందుకు ఇస్తున్నారంటే.రెండు గంటలకు చేతులకు రాసుకొన్న శానిటైజర్ ప్రభావం తగ్గుతోంది. అందుకే మళ్ళీమళ్ళీ రాసుకోవాలి దాని వల్ల చేతులకు గానీ శరీరంలో ఇతర చోట్ల అంటుకోవటం వల్ల గానీ ఎలాటి నష్టము ఉండదు. ఈ శానిటైజర్ […]
అద్భుతమైన మాచింగ్ .
ఎలాంటి విపత్కార పరిస్థితి అయినా గుండె నిబ్బరంతో ఎదుర్కోగలిగే వాళ్ళు ఉంటారు .స్లోవేకియా ప్రెసిడెంట్ జుజున కపుటోవ్ ఈ మధ్య కాలంలో ఒక అధికారిక కార్యక్రమానికి దుస్తులతో మ్యాచ్ అయ్యే పేస్ మాస్క్ ధరించి కనిపించరు .ఎవరికీ వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా కబుర్లు తో ఉలిక్కి పడుతూ ఉంటూ ఉండే జుజున కపుటోవ్ చక్కని మాచింగ్ లో మాస్కతో సహా కనిపిస్తే అందరూ సంతోషించారు .ఎలాటి కష్ట సమయం వచ్చినా ఎంతో క్రియేటివ్ గా ధైర్యం […]
అవగాహనతో అరికట్టవచ్చు
కరోనా కు బయపడకండి. అవగాహనతో ఈ వైరస్ ను కట్టడి చేయవచ్చు అంటున్నారు వైద్యులు. కరోనా కు గొంతు గరగరకు సంబంధం లేదు. జ్వరం దగ్గు ఆయాసం రెండు రోజుల పాటు తగ్గుతూ పెరుగుతూ ఉంటేనే డాక్టర్ ను సంప్రదించాలి. జ్వరం వంద డిగ్రీల సెల్సియస్ ఉంటే వైద్యం చేయించుకోవాలి మధుమేహం ఉన్నా వాళ్ళు గర్భిణులు,గుండె,మూత్రపిండ సమస్యలు ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్ష అవసరం లేదు విదేశీ ప్రయాణం చేసిన దగ్గు,ఆయాసం,జ్వరం […]
బాల్కనీ లో మారథాన్
ఒక చక్కని మారథాన్ నిర్వహించారు దుబాయ్ లో నివశించే భార్యాభర్తలు. దక్షిణాఫ్రికా కు చెందిన కొలిన్ ఎలిన్,ఈయన భార్య హిల్టా,ఇరవై మీటర్ల పొడవు వున్నవాళ్ళు బాల్కనీ పైన 26 మైళ్ళ మారథాన్ చేశారు.ప్రస్తుతం కరోనా భయంతో ఉన్నప్రజల్లో ఆరోగ్య స్పృహ పెంచాలనే ఉద్దేశ్యం తో ఈ ప్రయత్నం చేశారు. అయిదు గంటల తొమ్మిది నిముషాల పాటు ఈ మారథాన్ కొనసాగించింది. ఆ సమయంలో వాళ్ళ పద్దేళ్ళ కూతురు గీనా,అమ్మానాన్నలకు మంచినీళ్ళు,స్నాక్స్,చక్కని సంగీతం వినిపించి తన మద్దతుగా సహాకరించిందట. […]
క్వారంటైన్ ప్రేమకథ
ప్రేమ కు ఎప్పుడు తిరుగుండదు. ప్రస్తుతం ఎవరికీ వాళ్ళు సామాజిక క్వారంటైన్ పాటిస్తున్నారు. అలాంటప్పుడు ప్రేమలు సాధ్యమా? అంటే సాధ్యమేనని నిరూపించారు న్యూయార్క్ లోని బ్లూ క్లిన్ కి చెందిన జెరెమి కోహెన్. ఇతను కాలక్షేమం కోసం కిటికీలోంచి చూస్తూ ఉంటె ఎదురింట్లో ఒకమ్మాయి చక్కగా డాన్స్ చేస్తోంది. సరే ఎలాగోలా తన సంతోషం వ్యక్తం చేయాలని తన నెంబర్ రాసిన కాయితాన్ని ఓ డ్రోన్ పైన రాసి ఆమెకు పంపించాడు. ఈ వ్యవహారాన్ని ట్విట్టర్ లో […]
అన్నపూర్ణ స్వరూపం అంచల్
లాక్ డౌన్ లో చిక్కుకొన్న ఢిల్లీ వలస కూలీలకు వందలాది మందికి ఆహారం అందిస్తోంది 30 ఏళ్ళ అంచల్ శర్మ .రొట్టె మంచినీళ్ళు, బిస్కట్లు, భోజనం ప్యాకెట్లు అందిస్తున్నారు .ఆమె కాన్సర్ తో బాధ పడుతోంది అయినా రంగ్ పూర్ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఉండే వలస కులీల కోసం మిల్స్ ఆఫ్ హ్యాపీనెస్ పేరుతో స్వచ్చంద సంస్థ ను స్థాపించింది .ఎంతో మందికి ఆమె ఆహారం ఇస్తోంది .ఇప్పుడీ కరోనా సంక్షోభ సమయంలో ఎన్నో కుటుంబాలకు […]
ముత్యాల దండతో వివాహం
కరోనా భయపెడుతున్నా కళ్యాణం ఆగలేదు. ఇండోర్ కు చెందిన అక్షయ్ జైన్ కూతురు కింజాల్ వివాహాన్ని ఎంతో వైభవంగా చేయాలనుకున్నాడు. మరి కరోనా భయం కదా. ఇలాంటి పరిస్థితుల్లో ముఖాలకు మాస్క్ లు వేసుకొని శానిటైజర్లు దగ్గరే ఉంచుకొని ఫోటోలకు కూడా సామజిక దూరం పాటిస్తూ పెళ్ళి జరిపించాడు. బయట నుంచి పువ్వులు తెచ్చేందుకు భయపడి ముత్యాల దండాలు మార్చుకొన్నారట వధువరులు. వైరస్ భయం వణికిస్తున్న ఈ సమయంలో ఇలాటి శుభవార్తలు కూడా సంతోషపెడతాయి మరి.
పాలపొడి తో పెరుగు
ఇవ్వాల్టి రోజుల్లో పెరుగు ఎప్పుడంటే అప్పుడు దొరకటం కష్టమే ఎలాటి సమయంలో పాలపొడి తెచ్చి ఇంట్లో ఉంచు కుంటే రుచికరమైన పెరుగు తయారు చేసుకోవచ్చు .ఒక గిన్నెలో నీళ్ళు పోసి పాలపొడి వేసి బ్లెండర్ తో చక్కగా మిక్స్ చేయాలి .ఆ పాలని చిన్న మంట పై వేడిచేయాలి .పాలు బాగా మరిగిన తరువాత చలార్చి ఓ స్పూన్ పెరుగు వేసి మూతపెడితే నాలుగైదు గంటల్లో రుచికరమైన పెరుగు తయారవుతుంది .దీన్ని రైతా , డిజర్ట్ లుగా […]
కేరళ నర్స్ లకు ప్రశంసలు
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆరోగ్య కార్యకర్తలు ఎంతో శ్రమిస్తున్నారు .ఈ నేపథ్యంలో కేరళకు చెందిన నర్స్ లే కీలక పాత్ర పోషిస్తున్నారని అధ్యయనాలు చెపుతున్నాయి .ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నర్స్ ల్లో భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ .అందులో కేరళదే అగ్రస్థానం .కేరళ లో చదువుకొన్న 30 శాతం మంది నర్స్ లు అమెరికా బ్రిటన్ లు 15 శాతం మంది ఆస్ట్రేలియా లో , 12 శాతం […]
నాట్య మయూరి లంకా అన్నపూర్ణ దేవి
కొంత మంది తమ జీవిత విధానంలోనే భావితరాలకు స్ఫూర్తిని ఇస్తారు .కృష్ణ జిల్లా గుడివాడలో లక్ష్మి నారాయణ , సుబ్బ లక్ష్మి దంపతులకు జన్మించిన లంకా అన్నపూర్ణ దేవి ప్రముఖ నాట్య కళాకారిణి .వందలకొద్దీ ప్రదర్శనలు ఇచ్చారామె .చైనా , భారత్ యుద్ధ సమయంలో దేశ సరిహద్దుల వరకు వెళ్ళి సైనికులలో ఉత్తేజం నింపేలా నాట్య ప్రదర్శన ఇచ్చేవారు . 1973 లో జరిగిన రైలు ప్రమాదంలో ఒక కాలు మోకాలి వరకు తెగిపోయింది మరోకాలు మడమ […]
‘సుప్తశిల ‘ ఓ ఆణిముత్యం
ఇది దేవరకొండ బాలగంగాధర తిలక్ కధానిక … జప , తపా లతో దైవిక చింతనలో ఉండే గౌతమ మహర్షీ … ఆశ్రమ కార్యకలాపములతో భర్త సపర్యల్తో మానసికోల్లాసం కలగక ప్రేమానురాగాలకొరకు తపిస్తూఒక దివ్య స్వప్నం లో కనిపించిన ఇంద్రుని ప్రేమించిన ఆయన భార్య అహల్యా ..ఆమె రూప ,లావణ్యాలకు ముగ్ధుడైన మహేంద్రుడూ …ఈ సుప్త శిల లో ప్రధాన పాత్రధారులు .. ఇక ఈ వ్యవహారం కళ్లారా చూచిన గౌతముని పలుకులు ,శాపవచనములు, పశ్చాత్తాపం…అహల్య బాధాతప్త […]
గుడ్లు తినచ్చు
కరోనా ఒక వ్యక్తికి సోకితే ఆ వ్యక్తి నుంచి సగటున మరో ముగ్గురికి వ్యాపించే అవకాశం ఉంటుంది .కనుక వ్యాప్తి ని సంక్రమణ వేగాన్ని తగ్గించాలంటే దూరాన్ని పాటించటం తప్పనిసరి అని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖా స్పష్టం చేసింది .80 శాతం కేసులు మైల్డ్ గానే ఉన్నాయి కనుక ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే వైరస్ సోకకుండా ఉంటుందని చెప్పారు .కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలన్నారు .పాల ప్యాకెట్లు ఉపయోగించే ముందర వాటిని కడిగితే సరిపోతుంది […]
“తారా పీఠ్ దేవి ప్రసాదం”
ఓం శ్రీమాత్రే నమః దుష్ట శక్తులను ఎదిరించడానికి మనం సర్వ వేళల తలచుకుంటూ నిత్యం ఆదిశక్తి పూజ చేస్తూ ఉండాలి సఖులు. పశ్చిమ బెంగాల్లో ఉన్న శ్రీ తారాపీఠ్ అమ్మవారి దర్శనం చేసుకుని ఆ తల్లి చల్లని చూపులు మనపై ఉండాలని కొలుద్దాం.కథనాల ప్రకారం దక్షయఙ్ఞం లో ఆత్మాహుతి చేసుకున్న పార్వతీదేవిని చూచి ఉన్మాదుడైన శివుడు ప్రళయ తాండవం చేస్తున్న సమయంలో శ్రీమహావిష్ణువు అది గమనించిన శివయ్య దృష్టి మరల్చడానికి తన సుదర్శన చక్రంతో పార్వతీదేవి దేహాన్ని […]
