Monday, 27 Jul, 2026

ఫ్రెండ్లీ బొమ్మలు

పిల్లల బొమ్మల తయారీలో తన జీవితాన్ని అంకితం చేసిన నమితా ఆజాద్.బీహార్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక,బీహార్ హస్తకళల పురస్కారం అందుకున్నారు. చంపారన్ జిల్లాలోని గుడ్డపీలికలతో తమకు చేసే బొమ్మలు సంస్కృతిలో ఒక భాగం. కన్యా పుత్రి బొమ్మల పేరుతో చేసే ఈ బొమ్మలు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా ఇళ్లలో ఉంచుకున్నారు. ఈ బొమ్మలు ఎకో ఫ్రెండ్లీ బొమ్మలు ప్లాస్టిక్ వాడకం లేకుండా కేవలం గుడ్డపీలికలతో తయారు చేసే ఈ కన్యాపుత్రి బొమ్మలను ఎస్ క్రియేషన్స్ పేరు తో తయారుచేయంటే […]

మంచి పుస్తకం

‘వెస్ట్రన్ లేన్’ ఈ సంవత్సరపు బుకర్ ప్రైజ్ తుది జాబితాలో స్థానం సంపాదించుకొంది. భారతీయ మూలాలున్న బ్రిటిష్ రచయిత్రి   చేతనా మారూ రాసిన పుస్తకం చాలా అద్భుతంగా ఉందని విమర్శకులు సైతం మెచ్చుకొన్నారు. గోపీ అనే 11 ఏళ్ళ అమ్మాయి చుట్టూ తిరిగే ఈ నవలను ప్రముఖ అమెరికన్ ప్రచురణ సంస్థ ఎఫ్ ఎస్ జీ ప్రచురించింది.

నయా ఫ్యాషన్

దుస్తులకు సరిపోయే మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఎప్పటినుంచో మార్కెట్ లో దొరుకుతున్నాయి కానీ అచ్చంగా చీర లాగే ఉండే డిజైన్స్ తో మ్యాచింగ్ గాజులు ఉండవు కదా. తీషా క్రాఫ్ట్ వాళ్లకు చీరను లేదా డ్రెస్ ను బట్టి అచ్చు అలాగే ఉండేలా కస్టమైజ్ గాజుల్ని చేసి ఇస్తున్నారు. వాళ్ళ వెబ్ సైట్ లో చీరె ఫోటో పెట్టి గాజులు ఆర్డర్ చేస్తే అచ్చం చీర డిజైన్ గాజులు,ఒకవేళ చీరకు కుందన్లు పూసలు ఉంటే అది కూడా కలిపి […]

మాకు ప్లాస్టిక్ వద్దు

బార్టన్ బ్యాంక్ స్థాపించిన నీరు యాదవ్ ఊరు ఎంత శుభ్రంగా ఉంచవచ్చు నిరూపించారు రాజస్థాన్ లోని జూన్ జూన్ అనే పల్లెకు సర్పంచ్ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు ఉపయోగించే డిస్పోజబుల్ ప్లాస్టిక్ వస్తువులు గ్రామం నిండా పేరుకుపోయి పర్యావరణానికి హాని కలిగించటం నీరు యాదవ్ గమనించారు. ఆమె పెళ్లిళ్లలో వడ్డెనకు ఉపయోగించే గ్లాసులు, ప్లేట్లు, స్పూన్స్ అన్ని కొనేసింది. నీరు యాదవ్ గ్రామంలో ఎవరి ఇంట శుభకార్యం జరిగిన ఇవే వాడాలని కోరా రామె. ఈ బార్టన్ […]

ఆమె చిత్రాలే స్ఫూర్తి

బిబిసి 100 విమెన్ 2023 లో క్లైమేట్ వయనార్స్ విభాగంలో స్ఫూర్తిదాయక మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు ఆరతి కుమార్ రావ్ ఆమె పర్యావరణ ఫోటోగ్రాఫిర్ జీవన వైవిధ్యం క్లైమేట్ చేంజ్ అంశాలపై ఫోటోలు డాక్యుమెంటరీ లు తీశారు. భారతదేశంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను కళ్లకు కట్టేలా మార్జిన్ ల్యాండ్స్ ఇండియన్ ల్యాండ్ స్కేప్ ఆన్ ది బ్రింక్ అనే పుస్తకం రాశారు ఆరతి టెడెక్స్ స్పీకర్ కూడా.

శీతాకాలపు సీరమ్  

చలిగాలులకు చర్మంలో తేమ తగ్గిపోయి పొడిబారి పగుళ్లు వస్తాయి. ఇందుకోసం ఇంట్లోనే సీరమ్ తయారు చేసుకోవచ్చు. కమల పండు తొక్కలు ఒక గిన్నెలో వేసి రెండు టేబుల్ స్పూన్ గులాబీ నీరు అర టేబుల్ స్పూన్ గ్లిజరిన్ విటమిన్ ఇ క్యాప్సిల్స్ నూనె కలపాలి. వీటిని కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసి వడకడితే వచ్చే రసంలో కాస్త అలోవెరా గుజ్జు కలిపి సీసాలో భద్రపరుచుకుంటే రెండు మూడు వారాలు వాడుకోవచ్చు. క్రీమ్ రాసుకునే ముందు ఈ […]

ఇంగ్లీష్ టీచర్

ఇంగ్లీష్ పాఠాలు చెపుతోంది యశోదా లోధి ఉత్తర ప్రదేశ్ లోని కౌశాంబి జిల్లా లో సిరాతు నగర్ అనే పల్లెటూర్లో ఉంటుంది యశోద. హిందీ మీడియం లో ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. బంగాళదుంప చేలల్లో కూలి కి వెళ్తుంది. యూట్యూబ్ లో చూసి ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకుంది. అట్లా నేర్చుకుంటూనే తన సొంత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇంగ్లీష్ పాఠాలు నేర్పటం మొదలు పెట్టింది యశోద. మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ తో యశోద లోధి […]

అమ్మాయిలే  మెకానిక్ లు

కేరళ లో తొలి విమెన్ మెకానిక్ వర్క్ షాప్ ప్రారంభించారు బిన్సీ, మెర్సీ, బింటు అనే ముగ్గురు అమ్మాయిలు కేరళలో కాసరగోడ్ జిల్లాలోని వెస్ట్ ఎలేరి అనే చిన్న గ్రామంలో నుంచి వీరు ముగ్గురు వాహనాల రిపేర్లు మొదలుపెట్టారు. రీబిల్డ్ కేరళ పేరుతో ఆ రాష్ట్రం మహిళలకు ఉపాధి మార్గాలు చూపిస్తోంది.వారు ప్రవేశపెట్టిన కుడుంబశ్రీ ఇప్పటికే విజయం సాధించింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ ముగ్గురు టూ వీలర్ రిపేరింగ్ వర్క్ షాప్ మొదలుపెట్టారు.

170 కోట్ల వితరణ

రోహిణీ నిలేకని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నిలేకని భార్య ఈ సంవత్సరం 170 కోట్ల రూపాయలు సేవా కోసం ఖర్చు చేసి దాతల జాబితాలో పదో స్థానంలో ఉన్నారు. మీరు పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కోసం అర్ఘం ఫౌండేషన్, ప్రతిభ గల విద్యార్థులకు ఎక్ స్టెప్ అక్షర ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. నోని అన్న కలం పేరుతో ఆమె పిల్లల కోసం ఎన్నో రచనలు చేశారు.

మహిళల కోసం గోబర్ దియా

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగ్ పాల్ గ్రామీణ మహిళల కోసం గోబర్ దియా ప్రారంభించారు. ఆవుపేడతో దీపాలు చేయడం మహిళలకు శిక్షణ ఇప్పించారు. గేదెలు, ఆవులు పేడతో పిడకలు చేసి ఎండనిచ్చి పొడిచేసి బంకమన్ను కలిపి చేసే దీపాలు ఉపయోగించిన తర్వాత వ్యర్ధంగా ఏమి మిగలదు ఈ ఉత్పత్తుల అమ్మకాల ద్వారా ఉపాధి పొందుతున్నారు గ్రామాల్లో ఉండే మహిళలు.

ఎనిమిదేళ్లకే గుర్తింపు

మణిపూర్ లోని బషిఖోంగ్ లో పుట్టిన లసిప్రియా కంగుజం ప్రపంచంలోనే అతి పిన్న వయసుగల పర్యావరణ వేత్త గా గుర్తింపు పొందింది.తన ఐదేళ్ల వయసు గల పర్యావరణ రక్షణ. నిరక్షరాస్యత వంటి సమస్యల పై మాట్లాడటం మొదలు పెట్టింది. 2019 లో స్పెయిన్ లో జరిగిన ఐరాస్ సదస్సులో ప్రసంగించే అవకాశం సంపాదించింది.ఈ చిన్నారికి వర్డ్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్ ది ఇండియా పీస్ ప్రైజ్ అబ్దుల్ కలాం అవార్డులు వచ్చాయి.

ప్రధానిపై పి.హెచ్.డి

ప్రధాని మోదీ పి.హెచ్.డి చేసిన మొదటి మహిళ స్కాలర్ గా వారణాసికి చెందిన నజ్మా పర్వీన్ గుర్తింపు పొందింది. బనారస్ యూనివర్సిటీ లో పొలిటికల్ సైన్స్ చదివిన పర్వీన్ పి.హెచ్.డి కోసం ‘నరేంద్ర మోడీస్ పొలిటికల్ లీడర్ షిప్ యాన్ అనలిటికల్ స్టడీ’ అన్న అంశాన్ని ఎంచుకొంది.8 సంవత్సరాల అధ్యయనం చేసి నజ్మా ఈ పి.హెచ్.డి పూర్తి చేసింది.

ఆక్సా చాలా ప్రత్యేకం

అతిపిన్న వయస్కురాలైన సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సుర్ గా గుర్తింపు సాధించింది. 11 సంవత్సరాల అక్సా మస్రత్ ‘వాట్ అక్సా సే’ పేరుతో యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేసింది. ఆక్సా చేసిన  వీడియోల్లో పేద రైతులకు క్రీడాకారులు రకరకాల వృత్తులు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఉంటాయి.

అద్భుత ప్రతిభ  

ఆంధ్రప్రదేశ్ లోని భీమవరానికి చెందిన తనిష్క భూపతి రాజు ఆరేళ్ళ వయసు లోనే విల్లు ఎక్కుపెట్టి ఆసియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్  ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో పేరు సంపాదించింది. 16 నిమిషాల 50 సెకన్లలో 100 బాణాలు లక్ష్యాన్ని తాకేలా వేసి ఆర్చరీ లో తన ప్రతిభను చాటింది.

కృషికి గుర్తింపు

అమెరికా లోని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఎమ్మీ ఈ అవార్డు ఈ సంవత్సరం ఏక్తా కపూర్ కు వచ్చింది. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ఏక్తా 1995 లో టెలివిజన్ రంగంలో అడుగుపెట్టిన ఏక్తా ఇప్పటి కి 134 సీరియల్స్ తీసింది. 17000 గంటల టెలివిజన్ కంటెంట్ అందించింది.45 సినిమాలు ప్రొడ్యూస్ చేసింది. ఆమె కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

ట్రెండింగ్ లో దిష్టి చుక్క

పాత తరం, పిల్లల బుగ్గల పైన అరికాళ్ళలో దిష్టి చుక్క పెట్టే వాళ్ళు.ఆ ట్రెండ్ ఇప్పటికీ మారలేదు నవతరం కోసం ఎవిల్ ఐ జువెలరీ వచ్చేసింది. నీలం రంగులో చిన్న లాకెట్ లా ఉండే ఈ దిష్టి గొలుసు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది అంటున్నారు. ఈ ఏమోజి ని నగలు గా ధరించే వారిలో ఇండియా రెండో స్థానంలో ఉంది. భాగస్వామితో మనస్పర్థలు, ప్రమోషన్ లు ఆలస్యం ఎ పని తలపెట్టిన ఆటంకాలు రావడం, వీటన్నిటికీ ఇతరుల […]

మంచి ఉపాధి

గేమింగ్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి చూపెడుతుంది. ఈ గేమింగ్ లో తన వ్యాపార రక్షత చూపెట్టింది ముంబైకి చెందిన లక్ష్మీ కావోల్కర్ ఇంటరాక్టివ్ ఇ లెర్నింగ్ చిల్డ్రన్స్ కంటెంట్ డిజైన్ చేయడం ద్వారా గేమింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. సొంతంగా గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అపార్ గేమ్స్ ప్రారంభించింది.

నాకు నేను తెలుసు

సింపుల్ లైఫ్ స్టయిల్ నా సూత్రం జీవన శైలిలో ఆకస్మిక మార్పులు చేయను. నటన నా ఫ్యాషన్ ప్రేక్షకులకు సంతోషం ఇవ్వటం నాకున్న విలువైన పని అంటుంది సాయి పల్లవి. విభిన్నమైన పాత్రలతో తనకు ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకున్న సాయి పల్లవి మెటీరియల్ అంశాలకు నేను కనెక్ట్ కాలేను. ఏది తప్పు, ఏది ఒప్పు అని తేల్చి జడ్జిమెంట్ లు ఇవ్వలేను కానీ నాకు ఏది ఉత్తమంగా ఉంటుందో నాకు తెలుసు అంటుంది డాక్టరమ్మ.

ఇది షాల్ ట్రెండ్

ఈ చలి రోజుల్లో స్టయిల్ గా కనిపించే షాల్ తో ట్రెండ్ సృస్టించమంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ఉలెన్ సూట్ తో షాల్ చున్నీలా వేసుకోవచ్చు. పష్మీనా షాల్స్ కశ్మీర్ ఊలుతో తయారు చేస్తారు. వెచ్చదనాన్ని,వేసుకొన్న డ్రెస్ కు అందాన్ని కూడా ఇస్తాయి ఈ షాల్స్.  సూట్ షాల్స్ అయితే షల్వార్‌ కమీజ్‌ కు మ్యాచింగ్‌ చున్నీల్లాగా ఉంటాయి. అలాగే సల్వార్ సూట్ తో స్టోల్ కూడా. షాల్ లాగా కలిపి వేసుకొంటే ఎంతో అందంగా ఉంటుంది.

నాణ్యమైన కొబ్బరి పువ్వు

ఈ మధ్య కొబ్బరి పువ్వులు అమ్మకానికి ఉంటున్నాయి. ఈ కొబ్బరి పువ్వు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా పారసైట్ పెరగనివ్వదు. చక్కెర వ్యాధి నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఎముకలు దృఢంగా ఉంచి తక్షణ శక్తిని ఇస్తుంది.