Saturday, 01 Aug, 2026

మీటూకి శోభాడే మద్దతు

మీటూ ఉద్యమానికి ప్రముఖ స్త్రీవాద రచయిత కాలమిస్ట్ శోభడే మద్దతు ప్రకటిస్తూ డెక్కన్ క్రానికల్ లో ‘జమానా ఆఫ్ మేల్ ఎంటైటిల్ మెంట్ ప్రివిలైజ్ ఈజ్ ఓవర్’ అనే వ్యాసం రాశారు.మేం హక్కుదారులం,మేం ఏంచేసిన చెల్లుతుంది అని అనుకునే కాలం చెల్లింది అన్నారు. బైటకు వచ్చిన భాదిత మహిళలకి అజ్ణానంతో ఉండిపోయిన బాధతో వాళ్ళకి ఆమె తన మద్దతు ప్రకటించారు. మీటూ ఇప్పుడు వినిపిస్తుంది. భాదిత మహిళ ఎప్పుడు ఎదో ఒక రూపంలో తన పై జరుగుతున్న […]

సీజనల్ సమస్యలు

చలి పెరుగుతున్న కొద్దీ చర్మ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పొడి చర్మం గలవారికి మరీ సమస్య. ఈ కాలంలో తేమ తక్కువ .దీని వల్ల వంటిపైన స్వేదం త్వరగా ఆరిపోతుంది.ఎక్కువ నీళ్ళు తాగటం మంచి పద్దతి. మరీ వెచ్చనివీ, చల్లనివీ కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. పాదాలు, చేతులు పొడిబారకుండా గ్లిజరిన్ ఉండే క్రీమ్స్ ,పెట్రోలియం జెల్లి మాయిశ్చరైజర్లు వాడుకోవాలి.వారానికి ఒక సారి పాదాలను స్క్రబ్ తో రుద్ది ,పడుకొనే ముందర […]

మీటూ కు రెహమన్ మద్దతు

మీటూ ఉద్యమాన్ని గమనిస్తున్నాను. ఒక్కో పేరు బయటికి వస్తుంటే షాకింగ్ గా ఉంది అంటున్నాడు ఎ.ఆర్ రెహామన్. ఈ పోరాటం మహిళలకు మరింత శక్తి నివ్వాలని ,చిత్రసీమ పరిశుద్ధంగా మారి మహిళలను గౌరవించే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను.పని చేసే చోట ప్రతి ఒక్కరు తమ సృజనాత్మాకతను ప్రదర్శించేందుకు కావలసిన భద్రం ఇచ్చేందుకు నా యూనిట్ సభ్యులు నేనూ సిద్దంగా ఉంటాను. బాధితులు తమ ఆవేదన చెప్పుకొనేందుకు సామాజిక మాధ్యమాలు ఎంతో స్వేచ్చ ఇస్తున్నాయి. దీన్ని మనం దుర్వినొయోగం […]

అప్పుడు హీరో ఎందుకంట?

ఒక ఆర్టిస్ట్ కి కష్టమైన విషయం పాత్రల ఎంపిక అటూ కమర్షియల్ గా నిర్మాతకు లాభం రావాలి ఇటు అది కంటెంట్ ఉన్న సినిమా కావాలి. అలాగే నటిగా ఈ పాత్ర ఆకస్తికరంగా ఉందా? మనకేమైన ఛాలెంజ్ ఇస్తుందా? కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా ఉంటుందా ఆలోచించుకోవాలి అంటోంది శ్రియ .నేను ఏ సినిమా అయినా స్క్రిప్ట్ స్ట్రాంగ్ గా ఉంటే ఓకే అనేద్దాం అనుకొంటా. ఎందుకంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా హీరోయిన్ […]

జూతీల కనికట్టు

చలికాలం కోసం అమ్మయిలకు స్పెషల్ బూట్లు వచ్చాయి. జీన్స్ ,పొడవాటి చొక్క స్కర్ట్ వంటి ఆధునికమైన డ్రెస్ ధరిస్తే లోఫర్స్ ,ఎస్పాడ్రిల్లెస్ ఎంచుకొండి అంటున్నారు స్టైలిస్టులు. ఎస్పాడ్రిల్లెస్ జనపనారతో తయారు చేస్తారు. అడుగున సోల్ కూడా జనపనారతోనే ఉంటుంది. ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి. ఇక లోఫర్లు అయితే లెక్కలేనన్ని డిజైన్స్ ఉన్నాయి. ఇక పూర్తిగా చలికాలం వచ్చేస్తే వెచ్చగా ఉండాలి అనుకొంటే యాంకిల్ చూట్టు బూట్లు ఎంచుకొంటే బావుంటుంది. ఇవి అన్ని రకాల వస్త్రశ్రేణి పైకి […]

ఐదువందల జరిమానా

మెట్రో రైళ్ళలో మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో పురుషులు తదితరులెవరైనా కూర్చుంటే వారికి కఠిన జరిమానా విధించాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డైరక్టర్ ఎన్వీయస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైల్ భవన్, రసూల్ పురాలో హైదరాబాద్ మెట్రో అధికారులు, ఎల్&టీ ఉన్నతాధికారులతో జరిగిన సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు కేటాయించిన సీట్లలో ఇతరులెవరైనా కూర్చుంటే వారికి రూ 500/- వరకూ జరిమానా విధించాలని నిర్ణయించారు. అలాగే […]

రసాయనాలు వద్దు

ఒక సర్వే ప్రకారం ప్రపంచ మార్కెట్లో కాస్మొటిక్స్ వ్యాపారం విలువ బిలియన్లలో ఉంది. అయితే ట్రెండ్ కాస్త మారుతుంది. రసాయనాలున్న ఉత్పత్తుల కంటే సహజసిద్దమైన కాస్మొటిక్స్ కు విలువ పెరుగుతుంది. పసుపు,కలబంద,తులసి,పాల మీగడ జౌషధ మొక్కలలో చేసే ఎన్నో రకాల క్రీమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. సేంద్రియ పద్దతిలో తయారు చేసిన ఉత్పత్తులకు ఆన్ లైన్ ఆదరణ అపూర్వంగా ఉంది. ఉదాహారణకు రూబీస్ అర్గానిక్స్ పేరుతో విడుదలైన సేంద్రియ ఉత్పత్తుల్లో జోజోబా అనే మొక్క నుంచి తీసిన నూనె […]

స్వేచ్చ పోతుంది

మొదటి నుంచి నేను సన్నగానే ఉండేదాన్నినాకు వ్యయామాలు అవసరం లేదనుకున్నా అంటుంది పూజా హెగ్డే. అరవింద సమేత సినిమా సక్సెస్ తర్వాత హౌస్ ఫుల్-4లో చేస్తుంది పూజా. వ్యయామం అంటే ఫిట్ గా ఉండేందుకు అని సినిమాల్లోకి వచ్చాకే అర్ధమైంది. మొదట్లో ముందుకు వంగినా కాలి వేళ్ళు కూడా టచ్ చేయలేకపోయేదాన్ని. ఇప్పుడు వ్యయామం నా హాబీ. బోర్ కొట్టకుండా రోజు కొత్తవి చేస్తా. సైలేట్స్ నా హాబీ. సైలేట్స్,క్వాలిసైనిక్స్ ,కిక్ బాక్సింగ్, క్రాస్ ఫిట్ ,ఏరియల్ […]

మెదడు ఆరోగ్యం కోసం

మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మెదడు చురుగ్గా ఉండాలి.మెదడు చురుకు దనం కోసం కొన్ని పదార్థాలు నచ్చిన నచ్చకపోయినా తినాలి. అవకాడో తింటే మెదడు చురుగ్గా ఉండటమే కాకుండా తార్కిక ఆలోచన కూడా పెరుగుతోంది.మెదడుకి రక్త ప్రసరణ బాగా జరుగుతోంది. వాల్ నట్ మెదడుని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.బాధం వాల్ నట్స్, జీడిపప్పు,పిస్తా పప్పు తింటే మెదడు ఉత్సహాంగా పని చేస్తుంది.బ్రకోలీలో ఉండే మిటమిన్ కె ఆలోచన శక్తిని పెంచుతుంది.కొలైన్ అనే అత్యవసరమైన పోషకం బ్రకోలీలో దొరుకుతుంది.సాల్మన్ చేపల్లో […]

అధిక ప్రయోజనాలు

ఒక వందగ్రాముల తోటకూరలో 716 క్యాలరీలు దొరుకుతాయంటున్నారు నిపుణులు. ఎప్పుడూ దొరుకుతోంది కనుక సీజన్ మారినప్పుడల్లా తలెత్తే రుగ్మతలను దూరంగా ఉంచగలుగుతుంది తోటకూర.సోడియం ,పోటాషియంలతో పాటు కాపర్ ,కాల్షియం ,మాంగనీస్ ,ఇనుము ,మెగ్నిషియం ,ఫాస్పరస్ జింక్ వంటి ఖనిజాలు లభిస్తాయి.ఆకు కూరల అన్నిటికంటే ఎక్కువ పోషకాలు దక్కుతాయి.ఎ,సి,డి,బి12,బి6,ఇ, కె, విటమిన్లు లభిస్తాయి. ఇందులోని పీచు జీర్ణ శక్తి పెంచుతుంది. అధిక కోవ్వును కరిగిస్తుంది. బి.పి ఉన్న వారికి ఇది మంచి ఆహారం. తప్పకుండా తోట కూరను ఆహారంలో […]

అద్భుతమైన చిరుతిండి

సూపర్ స్నాక్స్ లో పాప్ కార్న్ ను చేరుస్తున్నారు. ఏ వయసు వాళ్లైన నిరభ్యంతరంగా తినవచ్చు. ఎక్కడైన తినగలిగే స్నాక్ ఇది. పీచు యాంటీ ఆక్సిడెంట్లు అత్యుత్తమమంగా లభిస్తాయి. బోలెడంత శక్తి గుండె ఆరోగ్యానికి ప్రయోజన కరం.వీటీలో విటమిన్ బికాంప్లెక్స్ ,మాంగనీస్ ,మెగ్నిషియం ,ఐరన్ సమృద్ధిగా దొరుకుతాయి. జీర్ణ క్రియలకు సాయపడతాయి. ఇన్ ఫ్లేషన్ మలబద్దకం తగ్గిస్తాయి. డయాబెటిస్ గలవారికి ఇవి మంచి చిరుతిండి. రోగనిరోధక శక్తి పెంచుతుంది. వీటిని రోజు తింటూ ఉన్నట్లైతే ఎముకల ధృడత్వానికి […]

కర్టెన్ కనికట్టు

అపార్ట్ మెంట్స్ వచ్చాక సూర్యుడు ,చంద్రుడు కనిపించే అశేలేదు.ఇక ప్రకృతి ,చెట్లు ,వానలు, మెరుపులు చూద్దామన్న అవకాశం లేదు. కళ్ళకి పచ్చగా ఏదైనా కనిపిస్తే బావుండు ఒక చెట్టు ,కొన్ని పువ్వులు ఇలా కిటికీలోంచి కనిపిస్తే ఎంత బావుండు అనుకొంటాం కదా. ఇదిగో త్రీడీ ప్రింటెడ్ కర్టెన్స్ ఆ కోరిక తీర్చేస్తాయి. కళ్ళ ముందు పచ్చదనం చూపిస్తాయి. వాగులు,వంకలు ,పారే సెలయేళ్ళు, బీచ్ అందాలు ,మైమరిపించే పూల కొమ్మలు ఇలా బయటి ప్రపంచంలోని అందాలన్నీ నట్టింట్లోకి తీసుకువచ్చాయి […]

పసుపెంత గొప్పది !

వేల సంవత్సరాల క్రితం ఆయుర్వేద గృహావైద్యంలో వాడుకలో ఉన్న పసుపు ఇప్పుడు పాశ్చత్య నిపుణుల చేతిలో పడింది.అందులోని కూర్ క్యూమిన్ అనే రసాయనం వల్ల జరిగే ఉపయోగాల గురించి ఎన్నో అధ్యయనాలు వస్తున్నాయి. మతి మరుపుకి క పసుపును మించిన మందు లేదంటున్నారు.చిరాకు, ఆందోళన ,నిరాశలతో బాధపడేవాళ్లకు కూర్ క్యూమిన్ టాబ్లెట్లు ఇస్తే మెదడు చురుగ్గా మారిందని పరిశోధన చెపుతోంది.దీన్నీ బయోగా-3 ఫ్యాట్ ఆమ్లాలతో కలిపి వాడితే మోకాళ్ళు ,కాళ్ళ నొప్పులకు బ్రూఫిన్ లాగే పని చేస్తుంది. […]

నొప్పులు ఇప్పుడు హాయిగా ఉన్నాయి పాపా

4 సంవత్సరాలు…7 ఎటెమ్ట్స్ ,మిస్ కారేజెస్ అండ్ 16161 ఇంజక్షన్స్ .ఈ కాప్షన్ తో సోషల్ మీడియాలో ఒక పాప ఫోటో ,బుల్లి పాప, ఆ పాప చుట్టు హార్ట్ షేప్ లో ఇంజక్షన్లు పేర్చారు.. ఈ ఫోటో వైరల్ ఎన్నో అవాంతరాల తర్వాత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ పాపను నెటిజన్లు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. దేశం తెలియదు కానీ తల్లి పేరు పత్రిసియా ,తండ్రి కింబర్లీ. పిల్లలు పుట్టకపోవటంతో ఐ.వి.ఎస్ పద్దతి ఆశ్రయించి నాలుగేళ్ళలో ఏడుసార్లు గర్భం […]

పోషకాలు ఎక్కువే

ఆరోగ్యం పట్ల శ్రధ్ధ పెరిగాక మార్కెట్ లోకి కొత్త వస్తువులు వచ్చి చేరుతున్నాయి. తృణ ధాన్యాలతో రంగురంగుల రైస్ బిగ్ బజార్లలో కనిపిస్తున్నాయి. బ్రౌన్ రైస్ ,బ్లాడ్ రైస్ ,రెడ్ రైస్ .ఇలా రకరకాల పేర్లతో అనేక రంగుల్లో కనిపిస్తున్నాయి. అందులో ముదురు రంగులో ఉండే బ్లాక్ రైస్ మంచి పోషకాలున్నాయి. ఈ బియ్యంలోని ఆంథో సైయనిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ గా శరీరంలోని కణజాలాల వాపును నియంత్రిస్తాయి. దీనివల్ల రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతాయి.అధిక కొలెస్ట్రాల్ తో రక్త […]

కేశ రక్షణలో ఫస్ట్

నువ్వుల నూనె పేరు వింటే వంటలు గుర్తోస్తాయి. కానీ ఇది కేశ సౌందర్యాన్ని వెయ్యింతలు చెస్తుంది అంటున్నారు నిపుణులు. ఇందులో యాంటీ ఆక్సీడెంట్లు,ఒమేగా ప్యాట్ ఆమ్లాలు,విటమిన్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి.నువ్వుల నూనె జుట్టుకు సహాజ మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. ఇందులో ఒమేగా 2,6,9 ప్యాట్ ఆమ్లాలు, విటమిన్లు వెంట్రుకల కుదుళ్ళకు కావలసిన పోషణ ఇస్తాయి. ఇది మంచి హెయిర్ కండిషనర్. జీవం కోల్పోయిన జుట్టుకు పోషణ ఇస్తుంది. సరాసరి నువ్వులను తీసుకొని బాగా దంచి ముద్దగా […]

డ్యూటీలో డ్రెస్సే

కానిస్టేబుల్ తో సహా ఆపైన హోదా ఉన్న మహిళా పోలీసులందరూ ఇకపై యూనిఫామ్ గా ప్యాంట్ షర్టు మాత్రమే వేసుకోవాలని కర్నాటక రాష్ట్ర పోలీసు యంత్రాంగం పేర్కొన్నది. అలాగే వ్యక్తిగత అలంకరణలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెపుతోంది. గర్భిణులైన మహిళా పోలీసులకు కొన్ని ప్రత్యేక సందర్భాలలోనూ ఈ నిబంధనకు మినహాయింపు ఉంది.నేరాస్తులను పట్టుకొనేందుకు యూనిఫారం అయితే సౌకర్యంగా ఉంటుంది. అలాగే పోలీసులంటే గౌరవం పెరుగుతోంది. విధుల్లో ఉన్న పోలీసులు ప్రత్యేకంగా కనిపించాలని ఈ నిర్ణయం తీపుకొన్నాం అంటున్నారు […]

‘యాంట్స్‌ ఎమాంగ్‌ ఎలిఫెంట్స్‌’కు అవార్డు

‘యాంట్స్‌ ఎమాంగ్‌ ఎలిఫెంట్స్‌’ పుస్తకానికి కాజీపేటకు చెందిన సుజాతా గిడ్ శక్తి ఫస్ట్ బుక్ ఫ్రైజ్ అందుకొంది. ది శక్తి భట్ ఫౌండేషన్ అనే అంతర్జాతీయ సంస్థ గత 11 సంవత్సరాలుగా వర్ధమాన రచయితలను ప్రోత్సహించేందుకు గానూ అవార్డ్ ను ,రెండు లక్షల రూపాయల నగదును అందిస్తోంది. లోయర్ మన్ హట్టన్ లో ఒక ప్రైవేట్ బ్యాంక్ లో ఐటీ విభాగంలో 13 సంవత్సరాలు విధులు నిర్వహించిన సుజాత ఆ జాబ్ పోవటంతో అక్కడే సబ్ వే […]

సరికొత్త ఆదాయ వనరు

జైపూర్ లోని పింక్ సిటీ రిక్షా సంస్థ పర్యాటలకు కోసం నడిపే ఇ-రిక్షాలలో మహిళలకు ఉపాధి చూపించింది.ఒక స్వచ్చంద సంస్థ సాయంతో మహిళలను గుర్తించి ,డ్రైవింగ్ లో శిక్షణ ఇప్పించి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉచితంగా ఇప్పిస్తోంది..ఇప్పుటి వరకు 200 మంది మహిళలు శిక్షణ తీసుకొన్నారు. వీరిలో 50 మంది జైపూర్ లోని టూరిస్ట్ లకు చారిత్రక కట్టడాలు చూపిస్తున్నారు. ఈ పింక్ సిటీ సంస్థ రిక్షాలు టూరిజం ,కార్పోరేట్ పంక్షన్లు,పెళ్ళిళ్ళకు వాడుతున్నారు.ఈ రిక్షాలు చార్జింగ్ తో […]

చీరెలో హుందాగా

ఎన్ని ఆధునికమైన డిజైనర్ ,ఫ్యాషన్ డ్రెస్ లు వచ్చిన చీరెకట్టులో ఉండే అందం దేనిలోనూ ఉండ .చీరె శరీరానికి అనుకూలంగా ఉంటుంది.ఇందులో ఎక్కువ ప్రయోగాలు ఉండవు గానీ వెళ్ళే సందర్భాన్ని బట్టి చక్కని చీరెని ఎంపిక చేసుకోవాలి. దానికి సరైన బ్లౌజ్ ఉండాలి. సందర్భానికి తగిన నగలూ ఉండాలి. సాధారణంగా ఆఫీస్ కు వెళ్ళేందుకు అయితే లినెన్,జరీకోటా,చేనేతలు చాలా బావుంటాయి.చక్కని కాలర్ నెక్ బ్లౌజ్,ఏమాత్రం ముడతలు లేకుండా ఇస్త్రీ చేసిన ఏ సాధారణ కాటన్ చీరె అయినా […]