Chinna Maata
మంచుకొండల్లో
మంచులో దూసుకుపోయే స్కీయింగ్ చేయడం అంత తేలిక కాదు. అలాంటి సాహస క్రీడ చీరను ఎంచుకుంది దివ్య మయ్యా. అమెరికాలో ఉండే దివ్య మయ్యా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సుర్. అంతకు ముందు లెహంగా స్కర్ట్ తో చేసిన భారతీయ సంప్రదాయాన్ని ప్రతిఫలించే చీరకట్టుతో స్కీయింగ్ చేసింది.
చీర కట్టు ప్రచారం
పూనే కు చెందిన 27 సంవత్సరాల రమాబాయి లత్‌పటే భారతీయ సంస్కృతి సాంప్రదాయ ప్రచారం చేస్తూ మహారాష్ట్ర ‘సవారి’ చీరతో ప్రపంచాన్ని చుట్టేందుకు బయలుదేరింది. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి సోలో వరల్డ్ టూర్ ప్రారంభించిన రమాబాయి ఒక సంవత్సరం పాటు వివిధ దేశాల్లో పర్యటించి 2024 మార్చి 8న తిరిగి రానున్నది రమాబాయి వ్యాపారవేత్త పైలట్ కూడా.
ఇవాల్టి ట్రెండ్
ట్రెండీగా వెజ్ ఫర్నిచర్ మార్కెట్ లోకి వచ్చేసింది. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో రూమ్స్ లో ప్రీ స్కూల్స్ కోసం ఈ వెజ్ ఫర్నిచర్ ప్రత్యేకంగా రూపొందించారు చూసేందుకు వెరైటీగా కూర్చునేందుకు నిద్రపోయేందుకు సౌకర్యంగా సీతాఫలం, పుచ్చకాయ, కర్బూజ, పైన ఆపిల్, ఆరెంజ్, షేపుల్లో ఈ ఫర్నిచర్ కలర్ ఫుల్ గా ఆకర్షించేలాగా ఉన్నాయి. అరటి, ఆపిల్, కొబ్బరి, వంకాయ, సోఫాలు పిల్లల్ని ఆకర్షించే లాగా ఉన్నాయి.
వెనిగర్ తో మరకలు మాయం
రకరకాల లిక్విడ్ లతో ఇల్లు శుభ్రం చేయడం అంటే వైట్ వెనిగర్ ఒక్కటే ప్రత్యామ్నాయం. రసాయనాలు లేకుండా శుభ్రత సాధ్యం అంటారు ఎక్సపర్ట్స్. ఒక వంతు నీళ్లు రెండు వంతులు వెనిగర్ కలిపి అద్దాలు కిటికీలు తుడిస్తే దుమ్ము, మరకలు పోతాయి.రెండు స్పూన్లు వెనిగర్ లో స్పూన్ ఉప్పు కలిపి స్టీల్ వాటర్ టాప్ లు రుద్దితే తుప్పు మరకలు పోతాయి. స్నానాల గది మరకలు టాయిలెట్ కూడా వెనిగర్ తో శుభ్రం చేయచ్చు. గబ్బు నేల […]
అంతా ఈజీ
ఫిట్‌నెస్ కోచ్ రీనాసింగ్ ఏరోబిక్స్, పుషప్స్, పూలాప్స్ వంటి ఎన్నో రకాల వ్యాయమాలు చీర కట్టుతోనే చేస్తుంది. ఇన్‌స్టా లో ఆమె వ్యాయామాలకు ఎంతోమంది ఫాలోవర్స్. చీరకట్టు చాలా అందం అలాగే వ్యాయామాలు ఎంతో ఆరోగ్యం. ఆ రెండిటి కాంబినేషన్ నా స్టైలే అంటుంది రీనా సింగ్ స్వహతగా ఆమె అన్ని వ్యాయామాలు చీరతోనే చేస్తూ ఉంటుంది.
చీర కట్టుతో మారథాన్
చక్కగా సంబల్‌పురి చేనేత చీర కట్టుకొని మారథాన్ లో పాల్గొన్నది యు.కె లో ఉండే మధు స్మిత జెన్. స్వస్థలం ఒడిశా స్థిరపడింది. యు.కె లో వృత్తి రీత్యా టీచర్ 42.5 కిలోమీటర్ల దూరాన్ని నాలుగు గంటల ఐదు నిమిషాల్లో పూర్తి చేసి చీరకట్టుతో మారథాన్ పూర్తి చేసింది. ఇదేం అసాధ్యం కాదు చీరతోనే చాలా కంఫర్ట్ అన్నది మధుస్మిత.
పాతవే….అయినా కొత్తగా
వన్ గ్రామ్ గోల్డ్ నగల ను రీసైకిల్ చేసి కొత్తగా నగలు సృష్టిస్తుంది దండు సుప్రజ ‘అతిధిలైన్’ పేరుతో ఈ నగలు మార్కెట్ అవుతాయి.పాత వాటిని కొత్తగా మార్చడం మొత్తం డిజైన్ నే రీ మోడల్ చేయడం ఈ రీ సైకిల్డ్ ఫ్యాషన్ ప్రత్యేకత తక్కువ డబ్బుతో కొత్త డిజైన్ లు ఇవ్వటం తో ఈ వ్యాపారం బాగా సాగుతోంది.
గుండెకు మేలు చేసే గుమ్మడి
బూడిద గుమ్మడికాయ గుజ్జు గింజల్లోనూ, ఎన్నో పోషకాలు ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. రోజు ఒక గ్లాస్ బూడిద గుమ్మడికాయ రసం తాగితే ఇందులో ఉండే పీచు తక్కువ కార్బోహైడ్రేడ్స్ బరువు తగ్గిస్తాయి. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కోసం బూడిద గుమ్మడి రసంలో కొంచెం కారం నిమ్మరసం కలిపి తాగాలి. ఇందులో ఉండే కొవ్వులు కార్బోహైడ్రేడ్స్ గుండె కండరాలకు బలాన్ని ఇస్తాయి.
మొసలి తో పోరాటం
భర్త ప్రాణాల కోసం మొసలి తో పోరాడింది విమలా బాయి రాజస్థాన్ కు చెందిన విమలా కు మేకల పెంపకం జీవనోపాధి ఆమె భర్త బనీసింగ్ నదిలో మేకలకు నీళ్లు తాగిస్తూ ఉంటే ముసలి అతన్ని పట్టుకుంది, ఒడ్డున ఉన్న విమల బాయి ఈ సంఘటన చూసి చేతిలో ఉండే కర్రతోనే ముసలి పై యుద్ధం చేసింది. చేతి కర్రతో పదేపదే దాన్ని బాదుతూ భర్తను వదిలి పెట్టే వరకు వదిలిపెట్టలేదు. చివరకు మొసలి బనీసింగ్ ను […]
ప్లాస్టిక్ నియంత్రణ
పర్యావరణాన్ని కాపాడడం కోసం క్రోకరీ బ్యాంక్ ఏర్పాటు చేసింది గృహిణి తులికా సునేజా ఈ బ్యాంక్ ద్వారా డిపాజిబుల్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేస్తోంది. ఫరీదాబాద్ కు చెందిన తులికా సునేజా చిన్న మొత్తంలో స్టీల్ ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులు కొన్నది.చుట్టు పక్కల ఇళ్లలో జరిగే ఫంక్షన్స్ కు ఈ సామాన్లు తీసుకుపోయేవారు. పర్యావరణవేత్తల మద్దతుతో తూలిక ఫరీదాబాద్ లో మరికొన్ని స్టీల్ క్రోకరి బ్యాంక్ లు ఏర్పాటు చేయగలిగింది. ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఇలాంటి […]
వంటింట్లో వెనిగర్
వంటకాల్లో రుచి కోసం వెనిగర్ చాలా అవసరం.ఇందులో కొవ్వులు ఉండవు స్పూన్ వెనిగర్ లో రెండు క్యాలరీలు ఉంటాయి. బ్రెడ్ తయారీలో ప్రతి రెండున్నర కప్పుల పిండికి ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కలిపితే బ్రెడ్ బాగా పొంగుతుంది. కప్పు తాజా పాలలో ఒక స్పూన్ వెనిగర్ కలిపి దాన్ని కదపకుండా నిమిషం ఉంచితే మజ్జిగ తయారవుతుంది.జున్ను ను వెనిగర్ ముంచిన గుడ్డలో చుట్టి డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో ఉంచాలి. చేప పొట్టు త్వరగా వదలాలి […]
చాలా మంచిది
పన్నీర్ లో తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేడ్లు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో విటమిన్ డి ఉండే పన్నీర్ లో రోగనిరోధక శక్తి కూడా ఎక్కువే. బరువు పెరగము. ఇందులో ఉండే ఫాస్ఫరస్, మెగ్నీషియం జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. మధుమేహం ఉన్నవాళ్లు కూడా ఇందులో ఉండే మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. కాబట్టి నిరభ్యంతరంగా పన్నీర్ ను తగిన మోతాదులో తీసుకోవచ్చు.
సంపన్న మహిళ
అమెరికాలో తొలి వందమంది స్వయంకృషితో ఎదిగిన మహిళ సంస్థల జాబితా ఫోర్బ్స్ విడుదల చేసింది. 2.4 బిలియన్ డాలర్ల నికర ఆస్తులతో 15 వ స్థానంలో ఉన్నారు భారత సంతతికి చెందిన జయశ్రీ ఉల్లాల్. 2008 నుంచి అరిస్టా నెట్ వర్క్ ప్రెసిడెంట్ గా సి.ఇ.ఓ గా ఉన్నారు. ఈ సంస్థలు ఈమెకు 2.4 శాతం వాటా ఉంది.
యాంకర్ లిసా
ఒడిశా లోని ఒక మీడియా సంస్థ లిసా కృతిమ మహిళ యాంకర్ ఎ ఐ సాంకేతికత తో ఈ యాంకర్ ను సృష్టించారు ఈ న్యూస్ యాంకర్ కు దేశంలో అన్ని భాషలు వచ్చు కానీ ప్రస్తుతం ఒడియా,ఇంగ్లీష్ భాషల్లోనే వార్తలు చదువుతోంది. ముఖ కవళికలు భావోద్వేగాలు ఖచ్చితంగా పాటించే ఈ యాంకర్ రియల్ టైమ్ లో యూజర్ల సమస్యలకు సమాధానాలు ఇస్తుంది.తాజా కబుర్లు వెంటనే చెప్పగలదు లిసా సోషల్ మీడియా లో ఖాతా ఉంది.
పోషకాలు అవసరం
పోషకాలు తక్కువ అయితే రక్తహీనత వస్తుంది.రుతు చక్రం క్రమం తప్పుతోంది. అందుకే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి ఫిష్, లివర్, సజ్జలు, రాగులు, ఆకుకూరలు, సెనగలు, ఉలువలు, పల్లీలు వంటివి తినాలి. తగినంత కాల్షియం కోసం పాలు, పాల సంబంధిత పదార్థాలు నువ్వులు, రాగులు, వేరుసెనగ పప్పు ధాన్యాలు తినాలి. వేరుశెనగ బాదం, పిస్తా నట్స్, నువ్వుల్లో మైక్రో న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో తీసుకుంటే ఎన్నో సమస్యలు పోతాయి.
అచ్చ తెలుగు వ్యాఖ్యానం
స్పోర్ట్స్ ప్రెసెంటేటర్ గా యాంకర్ గా కామెంట్రీ తో అందరి దృష్టి ఆకర్షిస్తారు సునీత ఆనంద్. భారత్ తరఫున వెస్టిండీస్ ,ఇంగ్లాండ్,ఆసియా కప్,ఆస్ట్రేలియా సిరీస్ లో అడారామె.హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీనియర్ టీమ్ కు స్ట్రెంగ్స్ అండ్ కండిషనింగ్ కోచ్ గా పనిచేశారు.డబ్లు పి ఎల్.ఐ.పి.ఎల్ థియేటర్ కామంటేటర్ గా అవకాశాలు వచ్చాయి. తెలుగు కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు సాంప్రదాయబద్ధంగా చీరకట్టుతో కామెంట్రీ చెప్పి ప్రశంసలు అందుకుంది సునీత ఆనంద్.
సహజమైన పరిమళం
రసాయనాలు లేని రూమ్ స్ప్రే లు వాడుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్. గిన్నెలో నీళ్లలు రెండు చుక్కల నిమ్మగడ్డి నూనె వేసి మరిగిస్తే ఇల్లంతా పరిమళం వ్యాపిస్తుంది.స్ప్రే బాటిల్లో నీళ్లు పోసి అందులో బేకింగ్ సోడా రెండు చుక్కల లావెండర్ నూనె కలిపి ఇంట్లో స్ప్రే చేస్తే ఆ పరిమళం మనసుని తేలిక చేస్తుంది. ఆ హాల్ పదార్థాల ఘాటైన వాసన పోవాలంటే వామాకులు దంచి రసం తీసి ఆ రసంలో కాటన్ ఉండాలని ఇంట్లో మూలల్లో పడేస్తే […]
ఓకే ఒక్క పాట
ఒకే ఒక్క పాటతో ట్రెండ్ సెట్టర్ అయింది ఆర్య దయాల్. బేబీ సినిమా లో ‘దేవరాజ’ పాట నాలుగు రోజుల్లో 21 లక్షల మందికి చేరింది. స్టాటిస్టిక్స్ లో పిజీ చేసిన ఆర్య సంగీతం లో కెరీర్ వెతుక్కుంది. మలయాళ, తమిళ పాటలతో పాటు తాను రాసిన పాడిన పాటలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ద్వారా చాలా పాపులర్ అయింది ఆర్య . లైవ్ ప్రదర్శనలు ఇచ్చే ఆర్య కు అమితాబచ్చన్, హరిహరన్ వంటి […]
చినుకుల్లో పాంచోస్
వానల్లో తడవకుండా డిజైనర్ వాటర్ ప్రూఫ్ పాంచోస్ రెడీ టు వేర్ గా వచ్చాయి. సిల్క్ అండ్ కాటన్ పాంచోస్ పోల్క డాట్స్, త్రిడీ ప్రింట్స్,లైన్స్, ఫ్లోరల్ యానిమల్ లో అనేక రంగుల్లో వచ్చాయి.ఆన్ లైన్ లో ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉన్న పాంచోస్ ముసురు పట్టిన రోజుల్లో టెన్షన్ ఫ్రీ గా గడిపేయచ్చు.
పర్యావరణం పై శ్రద్ధ
రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన దీపాలి బి.కె గోయెంకా భార్య ఆమె ‘వెల్స్పన్’ కంపెనీ లోకి అడుగుపెట్టినప్పుడు ఏడు శాతం మహిళలే ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 30 శాతానికి పెరిగింది. వెల్స్పన్ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్ టైల్స్ సంస్థ.ఇక్కడి ఉత్పత్తుల్లో 94 శాతం బయట దేశాలకు అమ్ముతారు. రైతులతో కలిసి పర్యావరణానికి సంబంధించిన విషయాలపై పనిచేసే దీపాలి కంపెనీ ప్రొడక్ట్స్ కోసం రీసైకిల్ వాటర్ నే ఉపయోగించేలా చేశారు.
