Tuesday, 01 Sep, 2026

కళా ప్రదర్శన కోసం ఒక కొత్త వేదిక

హైదరాబాద్ కు చెందిన అన్నపూర్ణ మడిపడగ ఆర్ట్ క్యూరేటర్. 2020 లో ఆమె ‘ఏక్‌చిత్ర’ క్యూరేటోరియల్ వేదికను స్థాపించింది. రాయడం చిత్రించటం ఇవన్నీ కళలే కాబట్టి ఏక్‌చిత్ర లో ఈ కళ లన్నిటికీ స్థానం కల్పించింది. పుస్తకావిష్కరణలు కవితా గోష్టి ,దృశ్య కళలకు ఏక్ చిత్ర ఒక వేదిక. ఈమె జేఎన్టీయూలో పెయింటింగ్ లో మాస్టర్స్ చేసింది. ప్రాచీన సంప్రదాయ కళాకారుల కళాఖండాలను సమీకరించి వాటి వారసులను కలిసి వివరాలను సేకరించి డాక్యుమెంట్  చేసి ఆ కళాఖండాలను నేటి కళాకారులకు అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాను అంటుంది అన్నపూర్ణ.కీర్తనం అన్న కళా వేదిక దామెర్ల రామారావు, పైడిరాజు శేషగిరిరావు, ఉల్చి వంటి 200 మంది పాతతరం కళాకారుల భౌతిక కళాకృతులను సమీకరించి డాక్యుమెంట్ చేయాలని ధ్యేయం అంటుంది అన్నపూర్ణ మడిపడిగ. ఒకప్పుడు  సంగీతం, నాట్యం, చిత్రలేఖనం అన్ని దేవాలయాల్లో తప్పనిసరిగా ప్రదర్శనకు ఉండేవి. ఆ పరిస్థితి ఇప్పుడు మనం కల్పించలేకపోయినా, ప్రజలకు కళలను మరింత చేరువ చేయడం కోసం కీర్తనం వేదిక ద్వారా కళా ప్రదర్శనలకు సంకల్పించాను అంటుంది అన్నపూర్ణ.

Leave a Reply