అత్యున్నత పదవి
ఉత్తరప్రదేశ్ వారణాసి లోని మెహమర్గంజ్లో జన్మించిన నిధి తివారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయానికి తొలి మహిళా ప్రైవేట్ సెక్రటరీగా నియమితురాలై నూతన అధ్యాయాన్ని లిఖించింది.బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో శాస్త్రవేత్తగా ఎంపికై మహారాష్ట్రలో నిర్వహించిన సైంటిస్ట్ శిక్షణ లో కూడా అత్యున్నత ప్రదర్శన కనపరిచి గోల్డ్ మెడల్ గెలుచుకున్న నిధి తివారి ఏకైక లక్ష్యం ఇండియన్ ఫారిన్ సర్వీస్ లో పనిచేయడం. 2017లో ఢిల్లీలోని కేంద్ర విదేశాంగ శాఖ లో డెస్క్ పోస్టింగ్ లో చేరింది నిధి తివారి.విదేశాంగ శాఖ లోని డిసార్మమెంట్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అఫైర్స్ విభాగంలో అండర్ సెక్రటరీ గా పనిచేసింది. నవంబర్ 2022 లో ప్రధానమంత్రి కార్యాలయంలో అండర్ సెక్రటరీ గా బాధ్యతలు తీసుకున్నది. కొద్ది కాలంలోనే డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతి పొందింది .దౌత్యం దేశ భద్రత విషయంలో ఆమె నైపుణ్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా నియమించింది. మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న ఈ 12 ఏళ్ల కాలంలో ఒక మహిళ ఈ పదవికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి.
