ట్రాప్ షూటింగ్ లో ప్రపంచ కప్
మట్టి పెళ్ళలను గాల్లోనే గురి చూసి కొట్టే ట్రాప్ షూటింగ్ లో నీరూ దండా ప్రపంచ కప్ సాధించి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు.ఈ పోటీలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తున్న మట్టి పెళ్ళలను సెకండ్ల వ్యవధిలో గాల్లోనే గురు చూసి కొట్టాలి. ఈ విభాగంలో విజయం సాధించిన తొలి భారతీయ మహిళ నీరూ దండా.మధ్యప్రదేశ్ లోని శివపురికి చెందిన నీరు షూటింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుని మెళకువలు నేర్చుకున్నారు ఇండియన్ ఆర్మీకి చెందిన ఆర్మీ మార్స్మన్ షిప్ యూనిట్ కి ఎంపికయ్యారు. అక్కడ సైనిక శిక్షణ తో పాటు షూటింగ్ నైపుణ్యాలకు కూడా పదును పెట్టుకున్నది నీరూ .ప్రస్తుతం భారత సైన్యంలో జూనియర్ కమిషన్ ఆఫీసర్ గా. విధులు నిర్వహిస్తోంది నీరూ దండా. ఈ ఆటలో క్రీడా కారిణి కి మానసికంగా దృఢంగా ఉండటం షూటింగ్ లో ఏకాగ్రత చురుకుదనం చాలా ముఖ్యం. ఈ గెలుపు ఇచ్చిన ప్రోత్సాహంతో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధిస్తాను. అని చెప్తోంది నీరూ.
