Thursday, 16 Jul, 2026

పిల్లల కోసం టాయ్ ట్రంక్

ప్రియాంక మంగోస్కర్,మీను జోషి ఇద్దరు స్నేహితులు.ముంబైలో బ్యాంకర్ల కుటుంబంలో పుట్టిన ప్రియాంక ఆర్కిటెక్ట్ మాస్టర్స్ చేశాక 2013లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వృత్తి జీవితాన్ని ప్రారంభించింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన వ్యాపార కుటుంబానికి  చెందిన మీను సూరత్ లో ఆర్కిటెక్చర్ లో డిగ్రీ చదివి బ్రిటన్ లో మాస్టర్స్ చేసింది.ఈ ఇద్దరు స్నేహితులు మన దేశంలో అంతరించిపోతున్న కళారూపాలను బొమ్మల రూపం లోకి తీసుకువచ్చి వ్యాపారం చేయాలని ఉద్దేశంతో టాయ్ ట్రంక్ అనే సంస్థ ప్రారంభించారు. రసాయనాలు లేని వేప చెక్క, సహజమైన రంగులతో పిల్లల కోసం బొమ్మల తయారు చేశారు.మూడు నెలల నుంచి ఏడాది వయసున్న పిల్లలు ఆడుతూ ఈ బొమ్మలను నోట్లో పెట్టుకున్న ఎలాంటి అనారోగ్యం రాదు. ఎంతోమంది కళాకారులను భాగస్వాములుగా చేసుకొని 2021 లో బొమ్మలు ఉత్పత్తి ప్రారంభించారు. ఆన్‌లైన్ లో విక్రయాలు చేస్తున్నారు ఈ బొమ్మల పెట్టెకు ఎంతో మంచి స్పందన ఆదరణ లభించింది.

Leave a Reply