వాయుసేన ఆఫీసర్ గా దివ్యాన్షి
దేశంలోనే ఎన్‌డిఎ శిక్షణ సాధించిన తొలి మహిళా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా రికార్డ్ సృష్టించింది దివ్యాన్షి సింగ్.12వ తరగతి పూర్తి కాగానే అత్యంత కఠినమైన నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్ష రాసి ఎంపికైంది దివ్యాన్షి. ఎన్ డి ఏ 75 ఏళ్ల చరిత్రలో పురుష క్యాడట్లతో సమానంగా శిక్షణ పూర్తి చేసుకుని వాయుసేన గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ లో ఆఫీసర్ అయిన తొలి మహిళ దివ్యాన్షి. ఆమె తండ్రి ఒక ఎయిర్ వారియర్. తండ్రి చెప్పే నిస్వార్థ సేవ క్రమశిక్షణకు సంబంధించిన కథలు వింటూ ఆమె పెరిగారు. దివ్యాన్షి సాధించిన ఈ విజయం మారుతున్న నవభారత సైనిక ముఖచిత్రానికి సరికొత్త సగర్వ రూపం. యూనిఫామ్ ధరించి దేశానికి సేవ చేయాలని తపించే భారతదేశం లోని లక్షలాది మంది యువతులకు దివ్యాన్షి ప్రయాణం గొప్ప దిక్సూచి. వ్యవస్థ ఎంత కఠినంగా ఉన్న పట్టుదలతో శ్రమిస్తే చరిత్ర ను తిరగ రాయగలనని ఆమె నిరూపించారు. ఈ భారత వాయుసేన ఆఫీసర్ స్ఫూర్తి ఎంతోమంది దేశ పుత్రికలను సైనిక రంగం వైపు నడిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు.
