Tuesday, 18 Aug, 2026
మనీషా కొయిరాలా మళ్ళీ వెండితెర పై కనిపించనుంది. నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆమె సంజయ్ దత్ తల్లిగా నటించనున్నారు. అలనాటి ప్రముఖ నటి నర్గీస్ హీరో సంజయ్ దత్ తల్లికీ హీరోయిన్ మనీషా కొయిరాలా కు ఇద్దరికీ మధ్య ఒక పోలిక వుంది. ఇద్దరు కాన్సర్ వ్యాధిగ్రస్తులే. 51 ఏళ్ల వయసులో నర్గీస్ కాన్సర్ తో మరణించారు. కాన్సర్ వ్యాధిని జయించిన మనీషా మేకప్ వేసుకుంటున్నారు. బాలీవుడ్ ఓ సెకండ్ ఇన్నింగ్స్ కోసం చూస్తున్న ఆమెకు సరైన పాత్రే లభించింది. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ బయోపిక్ లో నర్గీస్ పాత్ర కోసం మనీషాని ఎంపిక చేసారు. ఈమెను ఎంపిక చేయటానికి ముఖ్యకారణం ఆమె కాన్సర్ బాధను స్వయంగా అనుభవించటం అన్నారు. దర్శకులు రాజ్ కుమార్ హర్యాణీ . ఇందులో సంజయ్ దత్ తండ్రిగా పరేష్ రావెల్. సతీమణి మాన్యత పాత్రలో దియా మీర్జా మాజీ ప్రేయసి గా సోనమ్ కపూర్ నటిస్తున్నారు.

నా జీవితం విలువ తెలుసుకొన్న

క్యాన్సర్ తో బాధ పడుతున్న పేషెంట్లకు ఉత్సహాన్ని ఇవ్వాలనుకొన్న .ప్రజలకు నా కథ చెప్పాలనుకొన్నాను.అందుకే ఈ పుస్తకం Healed: How Cancer Gave Me a New Life పుస్తకం ముంబైలో ఆవిష్కరించారు . ఈ సందర్భంగా మనీషా కోయిరాలా మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్స తీసుకొనే సమయంలో నాకు చాలా గాయాలయ్యాయి. కానీ ఒక్కసారీ వెనక్కి తిరిగి చూసుకొంటే జీవితాన్ని నాకు కోత్త కోణంలో చూపించింది. క్యాన్సర్ జీవితం పట్ల నాకెంతో ఆశ కలిగింది. నా ఆరోగ్యం ,నా లైఫ్ నాకెంత ముఖ్యమో అర్ధం అయిందది. మనకు చిన్న చిన్న ఇబ్బందుల వస్తే చాలా నిరాశ పడతాం.ఆ ఇబ్బందులు మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పేందుకే వస్తాయని నేను అర్ధం చేసుకొన్నాను. క్యాన్సర్ ను జయించాక నాకు దొరికిన గొప్ప బహుమతి నా జీవితపు విలువ నేను తెలుసుకోవటం అంటోంది మనీషా కొయిరాలా.

Leave a Reply