Saturday, 15 Aug, 2026
శరీరానికి అందే ఉప్పు చాలావరకు సహజంగా ఆహారపదార్ధాల ద్వారానే అయినా రుచికోసం మనం కలుపుకొనే ఉప్పే అధిక ఉప్పుగా అనారోగ్యానికి కారణం అవుతుందంటున్నారు నిపుణులు. ముందుగా మనం తినే అయోడిన్ కలపిన ఉప్పు స్థానంలో సైంధవ లవణం రాక్ సాల్ట్ తినమంటున్నారు లేదా రాళ్ళ ఉప్పు పర్లేదంటున్నారు. వంటకాల్లోనే ఉప్పు సాధ్యమైనంత తగ్గించి, వెల్లుల్లి, నిమ్మ, ఉల్లి, ఆకుకూరలు, మసాలా దినుసులతో వండమంటున్నారు. ఆకుకూరల్ని బాగా కడిగి అందులోని లవణాలు పోయేలా చూడాలి. ఆహారంలో భాగంగా పొటాషియం అధికంగా గల బంగాళాదుంపలు, చిలకడదుంపలు, టొమాటోలు, ఆకుకూరలు తినాలి. పొటాషియం శరీరంలోకి వచ్చే సోడియంకు విరుగుడుగా ఉంటుంది. పదార్ధాలు వండే తీరుమార్చాలి. ఉప్పు వేయనవసరం లేని విధంగా కారగాయలు ఉడికించాలి. కూరల్లో ఉప్పుకు బదులుగా ఆ రుచి ఇచ్చే వస్తువులు వాడాలి. ఉప్పు ఎక్కువగా తీసుకొంటున్నారు అనే భావన వస్తే సాధ్యమైనన్ని మంచినీళ్ళు తాగాలి. ఉప్పు మంచిదే. ఆకలని కలిగించడం, ఆహారం గ్రహించడం, శరీరంలో మలినాలు తొలగించడం విషపూరితమైన పదార్ధాలు ప్రభావం తగ్గించడంలో ఇది మేలైనదే కానీ అధికంగా వాడితే ఇబ్బందులు తప్పవు.

ఉప్పు తగ్గిచాలి

పాతికేళ్ళు కూడా దాటకుండానే బి.పి సమస్య వస్తోంది. అంతు లేని కెరీర్ పరుగుల ఫలితంగా ఒత్తిడి ,బి.పి ఇవి తగ్గించుకోవటం కాస్త శ్రద్ధగా ఉంటే ఈజీనే. మందులు వాడకుండా ఆహారనియంత్రణ మొదటిది. రక్త పోటు పెరుగు తుంటే ఉప్పు తగ్గించుకోవటం మొదటిగా చేయవలసిన పని . వెన్న ,నెయ్యి,ఫ్యాటీ మీట్ సాస్ లో కేక్లో బిస్కెట్లు తగ్గించుకోవలసిందే .ప్రాసెస్ చేసిన పదార్థాలు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన బరువు రక్త పోటును నియంత్రణలో ఉంచుతుంది. పూర్తి స్థాయి ధాన్యాలు సహాజమైన ఓట్స్ ,బార్లీ సరైన ఆహారం,పండ్లు కూరగాయలు రోజులో ఐదుసార్లైనా తినాలి. డార్క్ చాక్లెట్ ,వాల్ నట్స్ తినటం చాలా మంచిదని డాక్టర్లు చెపుతున్నారు.

Leave a Reply