Wednesday, 29 Jul, 2026

కొత్త వెలుగు

రాజవంశీకులైన అక్షిత, మృణాళిక కోల్కత్తాలో చదువుకొని ఆ పైన విదేశాలకు కూడా వెళ్లారు ఒడిశా లోని మయూర్ భంజ్ జిల్లాలో జరిపాడు పట్నంలోని 1804 కాలానికి చెందిన అందమైన రాజ భవనాన్ని బోటిక్ హోటల్ గా మార్చేశారు ఇద్దరు కలిపి వందల సంవత్సరాల నాటి కళాకృతులు  పునరుద్దరించారు ఎంతో మంది చేతివృత్తి కళాకారులకు ఈ రాజభవనం కేంద్రం అయింది.  ఒడిశా కు చెందిన ఈ మయూర్ బంజ్ ప్యాలెస్ ఇవ్వాళ చూడవలసిన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి.

సమాజ సేవ

14 ఏళ్ల తెలుగు అమ్మాయి సింధు సూరపనేని అమెరికా ప్రెసిడెంట్ అవార్డుతో సత్కరించింది టెడెక్స్ లో స్పీకర్. ఆన్ లైన్ లో పెయింటింగ్స్ డాన్స్ పాఠాలు చెప్పే సింధు వాషింగ్టన్ స్టేట్ బి స్ట్రాంగ్ ప్రతినిధి కూడా రెండు వేల మందికి నాలుగు వందల ఆర్ట్ లెసన్స్ చెప్పిన సింధు మోస్ట్ ఇన్స్పిరేషనల్ యూత్ అవార్డ్ స్పోకెన్ యంగ్ ఫిలిం త్రిఫీ అవార్డులు తీసుకున్నది.

డోలు విద్యాంసురాలు లలిత

డోలు విద్యాంసురాలు 24 ఏళ్ల లలిత మనీషా ను ఘనంగా సన్మానించారు తెలంగాణ గవర్నర్ తమిళసై. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి డోలు విద్యాంసురాలిగా గుర్తింపు పొందింది లలిత. ఈమెది తినాలి డోలు వాయిద్యం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది.

ప్రైవేట్ మాస్టారు దివ్య

బైజు పేరుతో ఆన్ లైన్ టీచింగ్ ను ప్రారంభించారు దివ్య గోకుల్ నాథ్ భర్త రవీంద్రన్ తో కలిసి స్థాపించిన ఈ బైజు వ్యాపార పరంగా సక్సెస్. సైన్స్ టెక్నాలజీ లెక్కలు మొదలైన రంగాలలో మహిళలు ఎలా ప్రవేశించాలి. రాబోయే కొత్త విద్యావిధానానికి ముందుగా తయారై ఉండటం ఎలా అన్న విషయాలు కూడా బోధిస్తుంది. బైజు యాప్ తో దివ్య మహిళలు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు, ఎదిగే క్రమంలో ఎదుర్కొనే ఇబ్బందులు, వాటిని అధిగమించే మార్గాలు […]

క్వీన్ ఆఫ్ వెల్ నెస్

ఆరోగ్యం మెరుగుపరిస్తే అందం దానంతట అదే వస్తుందన్న సూత్రం ప్రకారం చేసిన వందన లుత్రా తను క్వీన్ ఆఫ్ వెల్ నెస్ గా చెపుతారు.సన్నగా నాజూకు గా ఉండటం మాత్రమే అందం కాదని చెబుతూ ఆమె ప్రారంభించిన వి.ఎల్.సి.సి వందన లుత్రా (కార్ల్స్  అండ్ కర్వ్స్) ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆసియా, ఆఫ్రికా ఖండాల లోని 153 నగరాల లో ఉన్న వి.ఎల్.సి.సి కేంద్రాలలో నాలుగు వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఆహారపు అలవాట్లు మార్చటం అదనంగా […]

ఇంగ్లీష్ నేర్పుతారు

ఇంగ్లీష్ మాట్లాడటాన్ని సులభతరం చేసేందుకు హలో ఇంగ్లీష్ పేరుతో మొబైల్ యాప్ తయారు చేశారు ప్రన్షు పత్ని. ఈ లెర్నింగ్ అప్లికేషన్ కు 220 దేశాలలో సబ్స్క్రైబర్లు ఉన్నారు. 50 మిలియన్ యూజర్స్ ఉన్నారు. దేశంలో ఇది నెంబర్ వన్ ఎడ్యుకేషన్ యాప్. ఇందుకు గాను ఫోర్బ్స్ ఇండియా లో అండర్- 30 లో ప్రన్షు పత్ని స్థానం పొందారు.

విజయవంతమైన వ్యాపారం

2011 లో బిలియన్ డాలర్ల పెట్టుబడి తో లైమ్ రోడ్ ఆన్ లైన్  ఫ్యాషన్ రిటైల్ షాప్ ను ప్రారంభించారు సూచి ముఖర్జీ ఇక్కడ కస్టమర్స్ ఆలోచనలకు తగ్గట్టు గా దుస్తులు తయారు చేస్తారు. 50 వేల మందికి పైన లబ్ధి పొందుతున్న ఈ సంస్థ ఈ రోజు 52 మిలియన్ల డాలర్ల స్థాయిలో ఉంది. ఈ ఆన్లైన్ క్లాతింగ్ షాప్ సి ఈ ఓ గా సూచి ముఖర్జీ క్యూటెస్ట్ స్టార్టప్ ది ఇయర్ యూనికాన్ […]

పుస్తకాలతో అవగాహన

జార్ఖండ్ లో పుట్టి పెరిగిన అదితి గుప్తా మహిళల రుతుస్రావ సమస్యల పట్ల అవగాహన కలిగించే లక్ష్యంతో మెన్ స్ట్రు పీడియా సంస్థ ఏర్పాటు చేశారు ఈ స్టార్ట్ ప్ లో ఫ్రీ ట్రాన్స్ టీనేజర్లకు లైంగికత పీరియడ్స్ తదితర అంశాలపై కామిక్ పుస్తకాలు యానిమేటెడ్ వీడియోలు ఉన్నాయి.14 భాషల్లో ఉన్న ఈ పుస్తకాలను 18 దేశాల ప్రజలు చూస్తున్నారు. ప్రసిద్ధ ఫోర్స్ ఇండియా అండర్ 30 లిస్ట్ లో అతిథి పేరు చేర్చి గౌరవించింది.

సంచార వైద్యశాలలు

డాక్టర్ స్వాతి పిరామాల్ ముంబాయిలో డాక్టర్ పిరామాల్ హెల్త్ కేర్ సెంటర్ ద్వారా పలు రకాల అనారోగ్యాల గురించి అవగాహన సేవలు అందిస్తారు స్వాతి మహిళల ఆరోగ్యానికి స్వచ్ఛమైన నీరే అవసరం అని భావించి ముంబాయిలో ఎంపిక చేసిన ప్రాంతాలకు రక్షిత నీరు అందించే స్వర జల్ ప్రాజెక్ట్ ప్రారంభించారామె. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ హెల్త్ సర్వీస్ లు నిర్వహిస్తారు హెచ్.ఎమ్.ఆర్.ఐ సౌకర్యం తో పాటు అంబులెన్స్ సంచార సేవలు నిర్వహిస్తారు.

మహిళలకు చేయూత

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ నీతా అంబానీ. అంబానీ ఇంటి కోడలైన నీతా మహిళా సాధికారత అంశం పైన దృష్టి పెట్టింది ‘హర్ సర్కిల్’ డిజిటల్ వేదిక ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా మహిళలకు పత్రికల వ్యాసాలు వీడియోలు ఆరోగ్య సంక్షేమం ఆర్థిక చరిత్ర వ్యక్తిత్వ వికాసం వంటివి సంబంధించిన సమాచారం లభిస్తుంది. నైపుణ్యాల పెంపుదల ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తెస్తుందీ యాప్ సాధారణ మహిళల కోసం  నీతా   చేసిన సృష్టి ఈ యాప్.

తగిన బహుమతి

ఇండోర్ కు చెందిన జనక్ పల్టా మెగాలిగాన్ పద్మశ్రీ అవార్డు గ్రహీత పర్యావరణహితంగా జీవించటం సాధ్యమే అని ఆమె జీవిస్తూ నిరూపించారు. జీరో వేస్ట్ విధానంతో తన ఇంటినే పర్యావరణహితంగా మార్చారు ఆమె ఇంటికి కరెంట్ బిల్లు రాదు విండ్ మిల్స్ తో ఉత్పత్తి అయ్యే కరెంట్ ఆమె ఇంటి తో పాటు మరో 50 ఏళ్లకు కరెంట్ ఇస్తోంది ఆమె తోటలో వందలాది చెట్లున్నాయి జిమ్మీ మెకానిగాన్ సెంటర్ ఫన్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ అనే సంస్థ […]

అంతులేని ప్రతిభ

ప్రేమ రామమూర్తి కర్ణాటక శాస్త్రీయ సంగీత కళాకారిణి సంగీత సరావులు అమృత వర్షిని దక్షిణ భారత పర్వీన్ సుల్తానా వంటి వారితో పాటు అంతర్జాతీయంగా న్యూయార్క్ రాక్ ఫౌండేషన్ అవార్డ్స్ అందుకున్నారు. ఆమె మ్యూజిక్ కాంపోజిషన్ కు రెండుసార్లు జాతీయ పురస్కారాలు వచ్చాయి తాజాగా ప్రేమ రామమూర్తి జాతీయ సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు.

కొత్త ప్రయోగాలు

మంగళ బట్ కథక్ నృత్య కళాకారిణి భర్త రాఘవ్ తో కలిసి హైదరాబాద్ లో ‘ఆకృతి కథ కేంద్ర’ ను ప్రారంభించారు. అంతరంగ్ పేరుతో ప్రతి సంవత్సరం డాన్స్ ఫెస్ట్ నిర్వహిస్తారు. జాజ్ డ్రీమ్స్ కళారియాపట్టు గజల్స్ వంటివి జోడించి సరికొత్త నృత్య రూపకాలను సృష్టించారు 2019 కి గాను జాతీయ సంగీత నాటక అకాడమీ  అవార్డ్ పొందారు.

కెరటాలను జయించిన ప్రీతి

ఒలింపిక్ మిక్స్డ్ డబల్స్ లో పాల్గొనాలన్నది నా లక్ష్యం అంటుంది సెయిలర్ ప్రీతి కొంగర్ 2016 లో తెలంగాణ రాష్ట్ర సెయిలింగ్  ఛాంపియన్ షిప్ అండర్ 15 పోటీల్లో జూనియర్ ఫ్లీట్ లో వెండి పతకం సాధించటం తో ఆమె పరుగు మొదలైంది.మాన్యూస్ రెగట్టా పోటీల్లో స్వర్ణం గెలుచుకుంది. ప్రీతి ఇప్పటివరకు ఐదు బంగారు నాలుగు వెండి అయిదు కాంస్య పథకాలు గెలుచుకున్నది.అంతర్జాతీయ స్థాయిలో ఇండియా తరఫున సెయిలింగ్ పోటీల్లో పాల్గొన్న ప్రీతి కొంగర ఇంటర్ చదువుతోంది.ఆమె […]

జీవితాన్ని గెలిచిన శిల్ప

ముంబై కి చెందిన శిల్పా మెహతా జైన్ జీవితంలో తిరుగులేని విజేత. పోలియో బాధితురాలు ఆమెకు చక్రాల కుర్చీ కి పరిమితం అయినా చక్కగా చదువుకొని సి.ఎ చేశారామె డ్రైవింగ్ పారా గ్లైడింగ్, స్విమ్మింగ్ చేయగలరు శిల్ప సి.ఎ గా ఆమె సాధించిన విజయాలకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అవార్డుతో సత్కరించారు.

బంగారు బుద్ధుడు

థాయిలాండ్ లోని బంగారు బుద్ధ విగ్రహం పర్యాటక ఆకర్షణ లో ఒకటి ఇది బౌద్ధ చరిత్ర లో అతి పెద్ద బంగారు విగ్రహం 5500 కిలోల డాలర్లు 2000 కోట్ల రూపాయిలు ఈ విగ్రహం బ్యాంకాక్ లోని వాట్ ట్రైమిట్ ఆలయంలో ఉన్నది ఈ ఆలయం భవనం లోనే బ్యాంకాక్ చైనా  టీన్ వారి హెరిటేజ్ సెంటర్ ఈ గోల్డెన్ బుద్ధిని మూలాలు భద్రపరచి ఉన్నాయి.ఈ బుద్ధుని విగ్రహం మూడు మీటర్ల ఎత్తులో 5.5 టన్నుల బరువుతో […]

స్ఫూర్తి దాత లహరీ బాయి

లహరీ బాయి ను భారత దేశపు మిల్లెట్ ఉమెన్ అంటారు మధ్యప్రదేశ్ లోని మారుమూల గ్రామానికి చెందిన 27 సంవత్సరాల లహరీ బాయి కి తమ పూర్వీకులు చిరుధాన్యాలు తినడం వల్లనే బలంగా ఉన్నారని అర్థం చేసుకోంది. ఎన్నో అరుదైన విత్తనాలు సేకరించి తన ఇంటినే విత్తనాల బ్యాంక్ గా తయారు చేసింది. చుట్టుపక్కల గ్రామాల్లో ఈ చిరుధాన్యాల గురించి ప్రచారం చేసింది మిల్లెట్స్ గ్రాస్ రూట్ అంబాసిడర్ గా ఆమె ఎంతో మందికి స్ఫూర్తి.

హర్మన్‌ప్రీత్ కౌర్

హర్మన్‌ప్రీత్ కౌర్ క్రికెట్ క్రీడాకారిణి పంజాబ్ లోని ధారాపూర్ కు చెందిన దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. 20 ఏళ్ల వయసులో జాతీయ జట్టులో స్థానం సంపాదించింది మిథాలీ స్థానంలో కెప్టెన్ పగ్గాలు పుచ్చుకుంది. 2017 వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా పై అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి దేశమంతా తన పేరు మారుమోగేలా చేసింది.టి 20 లో సెంచరీ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి.ఆమెను అర్జున్ అవార్డు వరించింది.

వేసవి కి ప్రత్యేకం

ఈ ఎండల్లో ఇక తేలికైన కాటన్ చీరెలు ఎంపిక చేసుకోవాలి పశ్చిమ బెంగాల్ లోని పులియా లో తయారయ్యే కాటన్ చీరెలు తేలిక రంగుల్లో ఎంతో సౌకర్యంగా ఉంటాయి. అలాగే బనారస్ కాటన్స్ కూడా సింగిల్ వీవ్ తో తయారయ్యేవే రాజస్థాన్,గుజరాత్ లకు చెందిన టై అండ్ డై లేదా బందీని చీరెలు కూడా మంచి ఎంపిక మంగళగిరి కోటా కోయంబత్తూర్ వంటి కాటన్ లు వేసవి లో ధరించేందుకు ప్రత్యేకంగా తయారవుతాయి. మధ్యప్రదేశ్ కు చెందిన […]

కొలతలే ప్రధానమా ?

సాక్షి సింద్వాని ప్లస్ సైజ్ వాళ్లకోసం వస్త్ర సంస్థను ప్రారంభించింది. సన్నగా నాజూకుగా ఉండటమే అందం అన్న అపోహను  తొలగించాలనుకున్నది స్టైల్ విత్ మి సాక్షి పేరుతో యూట్యూబ్ ద్వారా శరీర కొలతల కంటే ఆరోగ్యం ముఖ్యం అని ప్రచారం చేస్తుంది.  గత ఏడాది దేశంలో ఫోర్బ్స్ టాప్ టెన్ డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించుకుంది ఆమె గొప్ప మోటివేషనల్ స్పీకర్ కూడా.