నృత్యానికి పురస్కారం
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి డాక్టర్ పద్మజా రెడ్డి ని పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది ప్రభుత్వం కృష్ణాజిల్లా పద్మజా రెడ్డి స్వస్థలం కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు. సామాజిక అంశాలపై ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా ప్రజలు అవగాహన తీసుకోవాలనే ఉద్దేశంతో సొంత నృత్యా రీతుల్ని రూపొందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి హంస పురస్కారం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందాయి. 2015 లో సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు. కాకతీయ పేరుతో తెలుగువారి చరిత్రను […]
జీవనశైలి మార్పులు అవసరం
కరోనా సమస్య పూర్తిగా పోలేదు కనుక జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అంటున్నారు నిపుణులు. భోజనం విషయంలో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పీచు, విటమిన్-సి సమృద్ధిగా ఉండే వాటితో పాటు ఆహారం లో క్యాబేజీ, బ్రోకోలి, పాలకూర వంటివి తప్పక ఉండేలా చూసుకోవాలి. శరీరానికి ఇచ్చే పెద్ద బహుమతి నిద్ర ఇది శరీరంలోని మలినాలను బయటికి పంపి రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. వ్యాయామం రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి […]
మరో సాహసం
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా బచేంద్రి పాల్ పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఇప్పుడు ఆమె వయస్సు 67 సంవత్సరాలు. ఈ వయసులో మరో సాహసయాత్ర కు సిద్దం అవుతున్నారామె. 50 ఏళ్లు దాటిన తొమ్మిది మంది మహిళలతో కలిసి అరుణాచల్ ప్రదేశ్ నుంచి లడఖ్ వరకు సాహసయాత్ర చేయబోతున్నారు ఈ యాత్ర ఐదు నెలలు సాగుతుంది 4625 కిలో మీటర్ల ఈ సాహస యాత్ర మార్చి 8న ప్రారంభమై ఆగస్టు లో ముగుస్తుంది. […]
స్నేహితులే బలం
భారత జట్టు లో చాలా కీలకమైన స్థానంలో ఉంది సంధ్య రంగనాథన్ కడలూరు జిల్లా లో పుట్టింది సంధ్య జిల్లాస్థాయి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మెరిసింది. ఆమె చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకుంది. ఫుట్‌బాల్ అంటే ప్రాణం పెట్టేది స్నేహితులు, దాతల ప్రోత్సాహంతో పోటీలకు వెళ్ళేది. చివరికి జాతీయ జట్టుకు ఎంపికైంది. గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన జాతీయ క్రీడలలో మూడు మ్యాచ్ ల్లో ఏకంగా 12 గోల్స్ చేసి సత్తా […]
సమతా మూర్తి రామానుజులు
సమతా మూర్తి రామానుజుల వారి 216 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉంది. కూర్చొని ఉన్న విగ్రహాలలో ఇంతకన్నా పెద్ద విగ్రహం థాయిలాండ్ లోని గౌతమ బుద్ధుని విగ్రహం ఒక్కటే 1140 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది ఆ విగ్రహం. రామానుజుని విగ్రహం ఒక్కటే కాదు కింద ఉన్న విశాల ప్రాంగణంలో మొత్తం 108 దివ్య క్షేత్రాలు నిర్మించారు ఇవన్నీ దేశంలోని […]
సరస్వతి నికేతన్
ఏ తెలుగు పుస్తకం కావాలన్నా అది వేట పాలెం లో ఉండే సరస్వతి నికేతన్ గ్రంథాలయం లో దొరుకుతుంది అంటారు. తెలుగు భాషాభి. 1918 విజయదశమి నాడు ప్రారంభించిన ఆ గ్రంథాలయాన్ని నేటి వరకు వ్యవస్థాపక కుటుంబ వారసులు నిర్వహిస్తున్నారు. ఊటుకూరి వెంకట సుబ్బారావు శ్రేష్ట నాయకత్వంలో 1918లో హిందూ యువజన సంఘం పేరున చిన్న గ్రంథాలయంగా ప్రారంభం అయింది. గాంధీజీ శంకుస్థాపన చేసిన ఈ గ్రంథాలయం టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు. 1909 నాటి దిన […]
ఎంపికలో మార్పు అవసరం
ఈ చలి రోజుల్లో క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్ ను ఎంచుకోవటం మేలు షియా బట్టర్, పొద్దుతిరుగుడు, రోజ్ హిప్ నూనెలున్న క్రీమ్ ను ఎంచుకోవాలి. హైలురోనిక్ యాసిడ్ ఎక్కువ మొత్తంలో ఉన్న వాటిని రాత్రివేళల్లో రాస్తే వృద్ధాప్య ఛాయలు దగ్గరకు రావు. అలాగే రెటినాల్ గుణాలున్న క్రీమ్ లు రాయాలి. జిడ్డు చర్మం వారికి నీటి ఆధారిత క్రీమ్ లు మంచివి మొటిమలు సమస్య రాకుండా పెట్రోలియం జెల్లీ వంటి వాటికి దూరంగా ఉండాలి. బదులుగా జింక్ […]
సుస్వరానికి ‘పద్మం’
మీ సంతృప్తి కోసం సంగీతాన్ని సాధన చేయండి, అవార్డులు అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అంటారు ప్రభా ఆత్రే గురువు గా ప్రయోగాలు చేసిన సంగీత కర్తగా అధ్యాపకురాలిగా పాటలు ఆమె జీవితం తో పెనవేసుకుపోయింది. పజిల్స్ దగ్గర నుంచి భజనల వరకు ఆమె నిష్ణాతురాలు కానీ గాన శైలి లేదు. ఆల్ ఇండియా రేడియో కళాకారిణిగా, సంగీత కళాశాల అధ్యాపకురాలిగా రచయిత్రిగా స్వర కర్త గా ఆమె వృత్తి జీవితం ఎంతో వైవిధ్యం తో సాగింది. […]
మేకప్ పోకపోతే నష్టం
వేడుక సమయాల్లో కాస్త శ్రద్ధగా మేకప్ చేసుకుంటారు కానీ దాన్ని పూర్తిగా తొలగించక పోతేనే చాలా నష్టం చర్మం పాడవుతుంది అంటారు ఎక్సపర్ట్స్. మేకప్ వైప్స్ తో తొలగించి అలవాటుగా మాయిశ్చరైజర్ రాస్తారు కానీ వైప్స్ తో మేకప్ పోదు. ముఖానికి క్లేన్స్‌ర్ రాసి నిమిషంపాటు అలా వదిలేసి ఆ పైన తడి చేసుకుంటూ ముఖమంతా మసాజ్ చేస్తున్నట్లు రుద్ది కడిగేయాలి 100 శాతం శుభ్రం చేయాలంటే ముఖానికి ఆవిరి పట్టాలి. అప్పుడు ముఖ చర్మం పై […]
నన్ను చూసి ఊరే మారింది
సూరజ్ బాయ్ మీనా రణతంబోర్ నేషనల్ పార్క్ మొదటి మహిళా నేచరలిస్ట్. రాజస్థాన్ లోని బూరీ పహాడి ఈమె సొంత ఊరు. అమ్మాయిలంటే వంట ఇంటికే అనే ఊరు నుంచి బయటికి వచ్చి పని చేస్తోన్న మొదటి మహిళ. పులులు, సింహాల మధ్య పని చేసే ధైర్యశాలి. జంతువుల గొంతు పాదాల గుర్తులు ఆధారంగా వాటిని కనిపెట్టగల నేర్పుగల అమ్మాయి. రథం బోర్ నేషనల్ పార్క్ లో గైడ్ గా పని చేసే అన్న సూరజ్ బాయ్ […]
అక్షరాస్యత కు కృషి
56 ఏళ్ల రాబియా కు పద్మ శ్రీ వరించింది పసితనం చక్రాల కుర్చీకే పరిమితం అయినా పల్లెటూర్లో చదువు రాని గృహిణులకు పాఠాలు చెప్పారు కేరళ లో ప్రభుత్వం అక్షరాస్యత ఉద్యమం చేపట్టడానికి ఆమె స్ఫూర్తి ఆమె మలప్పురం జిల్లాలోని తిరురంగడి అనే ఊరికి దగ్గరలోని ‘వెల్లిలక్కడు’ అనే ఊరిలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టారు రాబియా పోలియో తో నడవ లేకపోయినా ఆమె డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చదువుకొని స్త్రీలకు చదువు నేర్పింది. ‘చలనం’ అనే […]
మధుర్ కు పద్మం
ఈ సంవత్సరం పాక శాస్త్ర విభాగంలో రచయిత్రి మధుర్ జాఫ్రీ కి పద్మభూషణ్ పురస్కారం దక్కింది మధుర్ అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటి మర్చంట్ ఐవరీ సంస్థ అధినేత జేమ్స్ ఐవరీ ని పెళ్లాడి, తమ సంస్థ తీసిన అనేక సినిమాల్లో నటించారు. రంగస్థలం సినిమా, టివి పాకశాస్త్రం రంగాల్లో, భారత్ ఇంగ్లాండ్ అమెరికాల మధ్య సాంస్కృతిక సంబంధాలు పెంచటంతో ఆమె చేసిన సేవలకు బ్రిటన్ ప్రభుత్వం 2014లో కమాండర్ ఆమె బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం తో […]
జాగ్రత్త సుమా !
అనువైన స్నేహాలు అనుకున్నంత ఆరోగ్యకరం కాకపోవచ్చు కాబట్టే వ్యక్తిగత వివరాలు ఫోటోలు పెట్టకండి ముఖ్యంగా మనసు ఇచ్చే సంకేతాలు వినండి అంటున్నారు ఎక్సపర్ట్స్. రిక్వెస్ట్ మెసేజ్ పంపించిన వెంటనే వారిని జోడించకండి. ప్రొఫైల్ ఊరు పేరు ఎన్ని రోజులు గా వాడుతున్నారు వారి ముఖ్య స్నేహితులు వాళ్ల వివరాలు గమనించాలి. సామాజిక మధ్యమలన్నాక ఫోటోలు షేర్ చేయటం మామూలే వాళ్ళు పెట్టె పోస్టులు సంభాషణ జాగ్రత్తగా చూసి నిజమైన స్నేహితుల్లాగే అనిపిస్తేనే రిక్వెస్ట్ ఓకే చేయాలి. కాకపోతే […]
పార్టీ స్పెషల్
పార్టీ లో ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటే దుస్తుల ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి. డిజైనర్ వేర్ లో ఎంబ్రాయిడరీ చేసినవి స్పెషల్ గా కనిపిస్తాయి. లాంగ్ స్లీవ్స్ రౌండ్ నెక్ డిజైన్స్ ట్యూనిక్ పార్టీ లో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. ఫ్యాబ్రిక్ ఏదైనా క్రాప్ టాప్ ఏ బటమ్ వేసుకొన్న బాగా నప్పుతుంది. లేదా చీర పైకి కూడా క్రాప్ టాప్ బావుంటుంది. ఎరుపు, నలుపు రంగులు కూడా పార్టీ డ్రెస్ గా బాగుంటాయి క్రాప్ టాప్ స్కర్ట్,రిప్ప్ […]
పువ్వుల్లాంటి పాదాలు
చలికి పాదాలు పగుళ్లు వచ్చి. అందులో మట్టి చేరి చూసేందుకు బాగుండవు. ఈ ఇబ్బంది పోవాలంటే ముందుగా గోరువెచ్చని నీళ్ళలో కొన్ని చుక్కల షాంపూ, నిమ్మరసం, ఉప్పు వేసి ఆ నీళ్లలో పది నిమిషాలు పాదాలను ఉంచాలి. తర్వాత బ్రష్ తో రుద్ది కడిగితే మృతకణాలు పోతాయి. తడిలేకుండా తుడిచి ఒక తెల్లని టూత్ పేస్ట్ లో రెండు ఇ- విటమిన్ క్యాప్సిల్స్ కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసి సున్నితంగా మర్దన చేయాలి. తర్వాత సాక్స్ […]
నేటి తరానికి ఫైనాన్స్ పాఠాలు
యువతకు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగించే పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సూత్రాలని సులభంగా నేర్పాలనే లక్ష్యంతో ఇండియా- హాంకాంగ్ వేదికగా ‘ఇన్‌వెస్టోఏసియా’ సంస్థని స్థాపించారు స్మృతితోమర్.ఈ సంస్థ ద్వారా విదేశీయులు మన మార్కెల్లో సులభంగా పెట్టుబడులు పెట్టొచ్చు. మనం కూడా చైనా, కొరియా, జపాన్ వంటి దేశాల్లో ఏ చిక్కులు లేకుండా పెట్టుబడులు పెట్టొచ్చు.స్మృతితోమర్ ఎన్‌ఐటీ భోపాల్ నుంచి బీటెక్ చేశారు.లాటిన్ అమెరికాలోని అతిపెద్దదైన సిటీబ్యాంక్ బెనామెక్స్‌లో పనిచేసి . బ్లాక్ చెయిన్ సాంకేతికతలో నైపుణ్యం […]
ఈ ఆలోచనే అమూల్యం
భూకంపాల పై రీసెర్చ్ చేసిన కాంచన అగర్వాల్ అతిసూక్ష్మ కంపనాలను పసిగట్టే రియల్ టైమ్ ఆటోమేటిక్ పి-వేవ్ డిటెక్టర్ ను తయారు చేసింది. దీని ద్వారా భూకంపాల గురించి కనీసం రెండు నిమిషాల ముందే ప్రజల్ని అప్రమత్తం చేయవచ్చు. అలాగే తీవ్ర నష్టాలను కలిగించే అణు శక్తి రియాక్టర్ లు రవాణా వంటివి నిలిపివేయవచ్చు. ఆవిష్కరణకు 2019 జపాన్ అంతర్జాతీయ పోటీలో స్టూడెంట్ ట్రావెల్ గ్రాంట్ అవార్డ్ ను ఐ.ఐ.టి మద్రాస్ 2020 సదస్సులో బెస్ట్ ప్రజెంటేషన్ […]
రోజుకో జామ ఆరోగ్యం
హార్మోన్ల అసమతుల్యత తో బాధపడేవారు ప్రతిరోజూ ఒక జామకాయ తింటే ప్రయోజనం ఉంటుంది. జామ రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే వెల్లుల్లి కూడా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజు వెల్లుల్లిని తీసుకుంటే బి.పి నియంత్రణలో ఉంటుంది. బ్రష్ చేసుకునే సమయంలో పేస్ట్ పై రెండు చుక్కల నిమ్మరసం వేసుకొని తోముకుంటే దంతాలు తెల్లగా మెరుస్తాయి రాత్రి పడుకునే సమయంలో దగ్గు విసిగిస్తే గోరువెచ్చని నీళ్లలో కొంచెం తేనె వేసుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది నిద్ర బాగా […]
ఫాస్టెస్ట్ బైకర్
మూడేళ్ల పాటు వరుసగా సూపర్ బైకర్స్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంది డాక్టర్ నిహారిక. హెల్మెట్ తీసి పొడవాటి జుట్టు బయట పెట్టే వరకు ఇంత వేగంతో వెళ్లగలిగే ఫాస్ట్ బైకర్ అమ్మాయి అంటే ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. 1000 సిసి సామర్థ్యం ఉన్న బండి ని అవలీలగా నడపగల ఫాస్టెస్ట్ లేడీ సూపర్ బైకర్ డాక్టర్ నిహారిక యాదవ్. మా అమ్మ కార్ రేసర్, నాన్న ఆర్మీ లో యుద్ధ విమానాలు నడిపే వారు వాళ్ళు ఇచ్చిన […]
కాఫీ పూత తో మెరుపు
కాఫీ పొడి ని మొహానికి పూతగా వాడితే అందమైన చర్మం మీ సొంతం అంటున్నారు ఎక్సపర్ట్స్. ఇది యాంటీ ఏజింగ్ గా పని చేయడంతో పాటు ముఖంపై మచ్చలు నల్లటి వలయాలు పోగొడుతుంది. అలాగే చర్మ సంరక్షణ ఉత్పత్తుల లోకి టోనర్ ని చేర్చుకోండి ఇది పి హెచ్ స్థాయిలను నిలకడగా ఉంచుతుంది. అలాగే ప్రతిరోజు గువాషా రాయ తో ముఖాన్ని సున్నితంగా మర్దన చేయాలి నున్నటి రాయిలా ఉండే ఈ గువాషా శరీరానికి ఎలాంటి హాని […]
