Thursday, 30 Jul, 2026

యాక్నె తో ఇబ్బందా ?

యవ్వనం లోకి అడుగు పెట్టగానే మొటిమలు మొహం పై యాక్నె ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మొటిమలు గిల్లితే మచ్చలు పడిపోతాయి. కనీసం 8 గంటలు నడక,యోగ,సైక్లింగ్ ఏదో ఒకటి చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు చర్మం పై ప్రభావం చూపించే జంక్ ఫుడ్ జోలికి పోకుండ పండ్లు తాజా కూరలు తినాలి జీవనశైలిలో మార్పులు,చక్కెర వంటి పదార్ధాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం అంటున్నారు వైద్యులు.

ఆమెకు ఆమే సాటి

యానిమేషన్ రంగ ప్రముఖురాలు హన్సా మోండల్. 2001 లో మొదటి ఆనిమేటెడ్ సిరీస్ నిర్మించారు ‘ సాఫ్టూన్స్ ‘ సంస్థ సిఇఓ ఆమె కార్టూన్ ను ఫేస్ బుక్,యూట్యూబ్ ల్లోకి వీడియోల రూపంలో తీసుకువచ్చారు. కోట్లు వీక్షణలు కలిగిన సాఫ్టూన్స్ కు డిస్నీ తోను సంబంధాలున్నాయి. పోపో మీటర్,నసీరుద్దీన్ షా పంచతంత్ర,హనిబని వంటి కార్టూన్ సిరీస్ స్థానిక భాష లన్నింటిలోకి అనువాదం అయ్యాయి. హాస్యం జోడిస్తూ సందేశం ఇచ్చే కార్టూన్ సిరీస్ నిర్మించటం హన్సా మోండల్ ప్రత్యేకత […]

అందంగా నెయిల్ ఆర్ట్

అందమైన చీరకు సరిగ్గా మ్యాచ్ అయ్యేలా థీమ్ ఆర్ట్ ను నెయిల్స్ పై ఎంచుకుంటున్నారు అమ్మాయిలు. బ్యూటీ కాన్సెప్ట్ లో గోళ్లకు  ప్రాధాన్యత పెరిగింది. సొంత గోళ్లకు సూట్ అయ్యే ఆర్టిఫిషియల్ గోళ్లు ఎంచుకొని వాటిపైన చక్కని ఆర్ట్ వర్క్ చేస్తున్నారు. మెరిసే పొడుగాటి గోళ్ళ పైన నెయిల్ రింగ్స్ ఫాన్సీ స్టడ్స్ మంచి లుక్ ఇస్తాయి. స్వరోస్కి స్టోన్స్ కూడా డిజైన్ లో భాగం అవుతున్నాయి.ఆర్టిఫీషియల్ నెయిల్స్ జెల్ తో గోళ్ళకు అటాచ్ చేసుకోవచ్చు వాటి […]

జవాన్ లకు శిక్షణ

78 ఏళ్ల వయసులో యోగా టీచర్ పద్మిని జోగ్ దేశ సరిహద్దుల్లో సైనికులకు శిక్షణ ఇస్తుంది. సముద్ర మట్టానికి 12000 అడుగుల ఎత్తున ఉన్న సైనిక శిబిరాలకు వెళ్లి యోగా లో శిక్షణ ఇచ్చారు. సరిహద్దుల్లో రామ్ దేవ్ బాబా నేర్పిన యోగ పాఠాలు పద్మిని జోగ్ ఆమె భర్త ప్రతాప్ జోగ్ నేర్చుకున్నారు. జోగ్ ఆర్మీ ఆఫీసర్ వేలకొద్ది క్యాంప్ లు నిర్వహించి యోగా శిక్షణ ఇచ్చారు పద్మిని. ఆమె క్యాంప్ లు ఆర్మీ లో […]

అత్యంత ఫ్యాషన్ ఆర్గంజా

పట్టు దారపు పోగులతో నేసే ఆర్గంజా సిల్క్ స్టయిల్ చాలా ప్రత్యేకం అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. కుర్తీలు క్రాప్ టాప్ లు రపుల్ బ్లౌజులు లెహంగా తో పలాజోలు  వంటి ఇండో వెస్ట్రన్ వేర్ కూడా లు ఆర్గంజా సిల్క్ తోనే అందంగా ఉంటున్నాయి. పల్చగా అందంగా మెరిసిపోయే ఆర్గంజా పండుగలు వేడుకలకు నిండుగా నిండుదనం తెచ్చే మాట వాస్తవం. చక్కని ఈ వస్త్రంతో డిజైనర్లు ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు.

చుండ్రుకు నూనె

కప్పు నువ్వుల పొడిని అర లీటర్ కొబ్బరి నూనెలో కలిపి దానిలో కొన్ని మందార పువ్వులు,కరివేపాకు వేసి సన్నని మంట పైన మరిగించాలి. ఈ నూనెతో తలకు మర్దన చేసుకుని ఒక గంట తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుంది జుట్టు బాగా పెరుగుతుంది. నల్ల నువ్వుల లోని ఒమేగా 3,6 ఫ్యాటీ యాసిడ్స్ మాడుని పొడిబారకుండా చేసి చుండ్రు పోగొడతాయి.

డ్రాగన్ టెంపుల్

థాయ్ లాండ్ లోని డ్రాగన్ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది 1760 ఆన్నాల ఈ ఆలయం కింద పై వరకు డ్రాగన్ చుట్టినట్లు నిర్మించారు. నిప్పులు కురిపించే డ్రాగన్ తల భీతి కలిగిస్తుంది.దీని సమీపంలోని భవనం పై ఉండే బుద్ధ విగ్రహం పర్యాటకుల అలసట,భీతిని మాయం చేస్తుంది. ఈ సామ్ ఫ్రాన్ డ్రాగన్ ఆలయం చక్కని ధ్యాన కేంద్రం.

అందంగా గాజా టాప్స్

సర్జికల్ డ్రెస్సింగ్ తయారీలో పేరుపొందిన పాలస్తీనా నగరం గాజా పేరు ఇప్పుడు ఫ్యాషన్ రంగానికి పాకింది తేలికగా సౌకర్యంగా ఉండే గాజా టాప్స్ ఇప్పుడు ఫ్యాషన్ తేలిక రంగుల్లో ఆకర్షణీయమైన ఎంబ్రాయిడరీ డిజైన్లలో దొరికే ఈ టాప్స్ తో తేలికైన ఆభరణాలు శాండిల్స్ మ్యాచ్ అవుతాయి.ఈవినింగ్ పార్టీలు గెట్ టుగెదర్ వేడుకల్లో ఈ టాప్స్ బాగుంటాయి ఇవి మూడు శాతం కాటన్ వే.

ఐఓఏ అధ్యక్షురాలిగా ఉష

భారత అథ్లెటిక్స్ చరిత్ర లో ఎన్నో విజయాలు సృష్టించిన అథ్లెట్ పిటి ఉష 58 ఏళ్ల వయసులో ఇంకొక రికార్డ్ సృష్టించారు ప్రతిష్టాత్మకమైన భారత ఒలింపిక్ సంఘం ( ఐఓఏ ) అధ్యక్షురాలిగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు 1934 లో మహారాజా మహారాజా యాదవీంద్ర సింగ్ (క్రికెట్) తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన క్రీడాకారిణి ఉష.

ఈ నాలుగు బెస్ట్

చలికాలంలో పోషకాలు ఎక్కువగా ఉండే నాలుగు రకాల దుంపలు తినడం వల్ల చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది అంటున్నారు వైద్యులు. పిండి తక్కువ పీచు ఎక్కువ ఉండే టర్నిప్,ఆల్ఫా లిపోయిక్ ఆమ్లం ఉన్న బీట్ రూట్, గ్లూకో సైనో లేట్ ఉండే ముల్లంగి విటమిన్ -ఎ  పీచు అధికంగా ఉండే క్యారెట్ తింటే మధుమేహం అదుపులో ఉంటుందని పరిశోధకులు నిరూపించారు.

నది మధ్యలో ఊరు

మెక్సికో లోని మెక్స్ కాల్టిటన్ అనే ఐలాండ్ విలేజ్ ఒక మంచి సందర్శక ప్రాంతం పచ్చని పరిసరాలు చుట్టూ నీళ్లు మధ్యలో ఉండే ఈ అందాల లంకను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తారు. ఈ ఊరి విధుల్లో తిరగాలన్న పడవలో వెళ్లాలి దీన్ని ది మెక్సికన్ వినిప్ అని పిలుస్తారు ఈ ఊరి ప్రజలు మొత్తం వెయ్యి మందే.

ఇద్దరం ఒకటే

మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ తో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకోవచ్చు.సరి జోడి గా అనిపించాలంటే ఒకే రంగు డిజైన్ లు దుస్తులు ధరించాలి.పువ్వులు, లతలు ముదురు రంగులు ఇప్పుడు పురుషులు ఎంచుకుంటున్నారు. టీషర్ట్, ఒకే రకం ఫ్రాక్, ఒకే రకం, చెక్స్, ఒకే రంగు తో మహిళలకు మ్యాచ్ అయ్యే డిజైన్ లు ఇప్పుడు పురుషులు ధరించటం కొత్త స్టైల్. అన్ని సందర్భాలకు సరిపోవు మ్యాచింగ్ దుస్తులు మార్కెట్ లోకి వచ్చాయి.

కథ డీల్ చేసేది రచయితే

మీట్ క్యూట్ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయటం తీసిన మొదటి ప్రాజెక్టు సక్సెస్ రేట్ సాధించటం నాకు ఈ రంగంలో నిలబడాలనే స్ఫూర్తి ఇచ్చింది. హీరో నాని అక్కగానే కాను ఒక దర్శకురాలిగా నాకు పేరు రావడం నాకు గర్వంగా ఉంది దీప్తి గంట.తొలి ప్రయత్నం లోనే అభిరుచి గల దర్శకురాలిగా అభినందనలు అందుకున్న దీప్తి అమెరికాలో ఇంజనీరింగ్ ఇన్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేశారు. డేటా మేనేజర్ గా అమెరికాలో పనిచేస్తున్నారు. రాయటం వస్తే కథలో […]

వెలిగే మొక్కలు

మినుగురులు కాంతిని వెదజల్లే కొన్ని మొక్కలు కూడా మెరుస్తుంటాయి. ప్రకృతి సహజంగా పెరిగే పెప లాంతన్ మొక్క బ్రెజిల్ లో పెరుగుతుంది. ఇది సూర్యోదయం సూర్యాస్తమయ సందర్భాలలో దీపపు కాంతులు ఇస్తాయి. దీపావళి టపాసులు పేలుస్తున్నట్లు కనపడే ఈ మొక్కలన్నీ ఒకే కాలంలో ఇచ్చే మెరుపులు కళ్ళు తిప్పుకోనివ్వవు. ఈ మొక్కల్ని స్థానికులు సెంపెర్ వివా (చిరంజీవి) అంటారు పూలు కోసి ఎండబెట్టిన వాటి మెరుపు పోవు. పువ్వులు కూడా అంత త్వరగా వడలిపోవు.

ఎక్కువ శ్రద్ధ అవసరం

ఈ పోటీ ప్రపంచంలో గెలవాలంటే అబ్బాయిల కన్నా ఎక్కువ స్థిరత్వం, సహనం, ధైర్యం ఉండాలి. అప్పుడు నచ్చిన రంగంలో కృషి చేసి గెలవచ్చు అంటుంది ఫ్యాషన్ డిజైనర్ గౌరీ నాయుడు.ఇంజనీరింగ్ చదివిన గౌరీ నాయుడు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంచుకున్నారు చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, పూజా హెగ్డే వంటి స్టార్స్ కు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. నటీనటులకు దుస్తులు డిజైన్ చేయాలంటే ఫ్యాషన్ ధోరణలు తెలియాలి. పాత్రకి అద్దం పట్టేలా దుస్తులు ఉండాలి. ముఖ్యంగా అభిమానులకు […]

గిన్నె మాడిందా ?  

వంట గదిలో గిన్నెలు మాడిపోవటం ప్రతి ఇంట్లో అనుభవమే అలా మాడిన గిన్నెను శుభ్రం చేయాలంటే గిన్నెలో సగం కంటే ఎక్కువ నీళ్లు పోసి వంట సోడా రెండు స్పూన్ల నిమ్మరసం లేదా వెనిగర్ కలిపి ఐదు నిమిషాలు ఎక్కువ సెగపై వేడి చేసి తర్వాత సన్నని మంటపై నీటిని మరగనివ్వాలి. గరిటతో తిప్పితే అడుగు మాడిన పదార్థాలు విడిపోయి నీళ్లు మరుగుతూ ఉండగానే స్పూన్ తో గీరేస్తే మాడిన గిన్నె మామూలుగా అయిపోతుంది. తర్వాత క్లీనింగ్ […]

మెడ పై నలుపు

మెడ పైన చర్మం నల్లగా అయిపోయి వదలకుండా ఉంటుంది ఒక స్పూన్ శనగపిండి, అర స్పూన్ బియ్యం పిండి, పావు స్పూన్ పసుపు కలిపి పాలు నిమ్మరసం కలిపి పేస్ట్ లా చేసి మెడ చుట్టూ పట్టించి పావు గంట తర్వాత చెయ్యి తడి చేసుకుంటూ మెడ చుట్టూ మృదువుగా స్క్రబ్ చేసి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. చర్మం పై నలుపు పోగొట్టడం లో బంగాళదుంప మంచి బ్లీచింగ్ మాదిరి పనిచేస్తుంది.బంగాళదుంప గ్రైండ్ చేసి రసం తీసి […]

డాన్సింగ్ ట్రీస్

ప్రకృతి మనిషిని ఎప్పటికప్పుడు కొత్తగా ఆశ్చర్యపోయేలా చేస్తూనే ఉంది. ఇండోనేషియా లోని తూర్పు సుంభ ద్వీపం లోని వలికిరి తీరంలో మాడ అడవులు ఎంతో ప్రత్యేకం అక్కడి చెట్లన్నీ మరుగుజ్జు రకానికి పైగా ఏదో నాట్యం చేస్తూ ఆగిపోయినట్లు కనిపిస్తాయి. అందుకే వీటిని డాన్సింగ్ ట్రీస్ అంటారు. సూర్య అస్తమయం సమయం లో సముద్రం వెనక్కి తగ్గుతుంది. నేలంతా తెల్లని మెరిసే ఇసుక దానిపైన ఈ నర్తించే చెట్లు వాటి నీడలో ప్రకృతి తీర్చిదిద్దిన ఈ సుందరమైన […]

తొలి రైల్వే గేట్ ఉమెన్

భారత దేశపు తొలి మహిళ గేట్ ఉమెన్ గా రైల్వే శాఖ లో 2013 లో చేరింది సల్మా లక్నో కి అనుకోని ఉన్న మాల్వార్ స్టేషన్ లో ఆమె పనిచేసింది రైలు వచ్చే ముందు గేటు తీయడానికి లివర్ ఉన్న ఇనుపక చక్రం తిప్పాలి. ఆ పని సమర్ధవంతంగా చేస్తూ గత పదేళ్లుగా రోజుకు 12 గంటల డ్యూటీ చేసింది సల్మా ఉత్తర ప్రదేశ్ కు చెందిన సల్మా గేట్ ఉమెన్ గా నియమితురాలైనపుడు గేట్ […]

మసాలా మిల్క్

ఈ చలి రోజుల్లో మసాలా మిల్క్ తాగితే ఆరోగ్యం అంటున్నారు ఎక్సపర్ట్స్. గ్లాస్ పాలు వేడి చేసి అందులో చిటికెడు పసుపు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి ,చిటికెడు మిరియాల పొడి కలిపి కాసేపు పక్కన ఉంచి ఆ తరువాత తాగాలి. ఈ మసాలా మిల్క్ రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.