Chinna Maata
మహిళలకే పెట్టుబడి
ఫాక్స్‌టేల్ సంస్థ స్థాపించి వెంచర్ కాపిటలిస్ట్ అయింది రోమితా మజుందార్ . వంద కోట్ల సంస్థ ఇది. మహిళలకు వ్యాపారంలో పెట్టుబడి పెడుతోందీ సంస్థ.వేల మంది మహిళలు అనుసరించే ప్రేమించే స్కిన్ కేర్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చింది. 28 ఏళ్ల రోమితా లక్ష్యం. 2025 నాటికి ఫాక్స్ టెల్ వేల కోట్ల సంస్థ గా తీర్చిదిద్దటం ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో ఆమె పేరు దక్కించుకున్నది.
ఎందరికో స్ఫూర్తి
అమెరికాలో భారతీయ మూలాలు ఉన్న మూలాలున్న అప్సరా అయ్యర్ చరిత్ర సృష్టించింది ప్రతిష్టాత్మక హార్వర్డ్ లా రివ్యూ ప్రెసిడెంట్ గా ఎన్నికయింది. లా విద్యార్థులకు పరిశోధన గ్రంథం గా ఉపయోగపడి.ఈ జర్నల్ ప్రతినెలా 2500 పేజీల్లో ప్రచురితం అవుతుంది. అప్సర గతంలో నేషనల్ సెక్యూరిటీ హ్యూమన్ రైట్స్ జర్నల్స్ లో పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ జర్నల్ కు ఇప్పుడు అప్సరా ప్రెసిడెంట్.
అతి సుకుమారం ముల్ ముల్
ఢాకా నుంచి తయారైన సుతి మెత్తని నేత వస్త్రం ముస్లిన్ దీన్ని ముల్ ముల్ కాటన్ అంటారు తేలిక రంగుల ముల్ ముల్ కాటన్ డ్రెస్ లకు కాంట్రాస్ట్ కలర్ చున్నీలు బాగుంటాయి ట్యూనిక్ వేస్తే కాంట్రాస్ట్ కలర్ బాటమే ఉండాలి అనార్కలి అయితే ఎక్కువ ప్లీట్స్ ఉండాలి ఈ ముల్ ముల్ కాటన్ కుర్తిలకు సోలాపూర్ జైపూర్ జుతీలు తేలికపాటి జ్యువెలరీ చక్కగా నొప్పుతాయి.
అసాధారణ ఖ్యాతి
సంగీత సామ్రాజ్ఞి ఆల్క యాజ్ఞిక్ గత మూడేళ్లుగా ఆమె పాటలు యూట్యూబ్ లో అధికంగా స్ట్రీమ్ అవుతాయి. 2022 వ సంవత్సరంలో ఏకంగా 15.3 మిలియన్ల స్ట్రీమ్స్ సాధించింది అంటే సగటున రోజుకు 42 మిలియన్లు మన లెక్కల్లో నాలుగు కోట్ల 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఆమె ఛానల్ చూశారు అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో యూట్యూబ్ స్ట్రీమింగ్ లో ప్రథమ స్థానం సాధించింది. 2020 వ సంవత్సరానికి మోస్ట్ స్ట్రీమ్డ్ […]
స్ట్రెచింగ్ బెస్ట్
మంచి ఫలితం ఇచ్చే వ్యాయామాల్లో స్ట్రెచింగ్ ఒకటి ఇది పురాతన యోగ కండరాలు సౌకర్యవంతంగా బలంగా ఆరోగ్యంగా ఉంటాయి అంటుంది దీపిక పదుకొనే. వయసు పెరిగే కొద్దీ కండరాల్లో పటుత్వం తగ్గుతోంది. సహజం అది. వీటికి అవసరమైన రక్త సరఫరా సరిగ్గా జరగదు. ఇలా జరక్కుండా స్ట్రెచింగ్ కాపాడుతుంది. నిపుణులైన శిక్షకుల పర్యవేక్షణలో ఈ స్ట్రెచింగ్ చేస్తే రక్తపోటు రాదు. గుండెకు కూడా భారం తగ్గుతుంది అంటుంది దీపిక.
ఎంబ్రాయిడరీ పెయింటింగ్స్
అచ్చం ఫొటోల్లా ఉంటాయి ఈ ఎంబ్రాయిడరీ బొమ్మలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి చైనీయులు సూదీ దారం తో ఈ ఎంబ్రాయిడరీ పెయింటింగ్స్ కు ప్రాణం పోస్తున్నారు. బట్ట పైన ముందుగా వేయాలనుకున్న ఆకారం గీసుకొని దానికి సరిపోయే రంగు దారాలతో సరిగ్గా ఆ ఆకారం వచ్చేలా కుట్టేస్తారు. ఈ రియలిస్టిక్ ఎంబ్రాయిడరీ బొమ్మల్ని చూస్తే అవి చేత్తో కుట్టిన బొమ్మలంటే నమ్మాలని పించదు.
చిట్టి ముత్యాల హారాలు
రైస్ పెరల్స్ హారాలు ట్రెండీగా బంగారు నగల నగీషీల్లో ఒకటై పోతున్నాయి. చిట్టి చిట్టి మల్లె మొగ్గల్లాంటి ఈ ముత్యాలు నెక్లెస్ లు, హారాలు కంటెలు ఇలా దాదాపు అన్ని నగాల్లో కలిసిపోయి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కొద్ది బంగారంతో ఈ ముత్యాలు కలిపి అందమైన ఆభరణాలు తయారు చేస్తున్నారు నగల డిజైనర్లు.
అత్యంత ఖరీదు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫర్ ఫ్యూమ్ షుముఖ్ ధర 9.3 కోట్లు 2019లో దుబాయ్ లో నబిల్ ఫర్ ఫ్యూమ్ అనే సంస్థ విడుదల చేసింది. చందనం, ఇండియన్ అండర్ వుడ్ అంబర్ టర్కిష్ రోజ్ ఆయిల్ వంటి సుఖంధ ద్రవ్యాలతో దీన్ని తయారు చేశారు. ఇంత ఖరీదుకు కారణం దీని ప్యాకింగ్ 3500 డైమండ్స్ ముత్యాలు రెండున్నర కిలోల 18 క్యారెట్ల బంగారం 5.9 కిలోల వెండితో తయారు చేసిన ప్యాకింగ్ తో ఈ ఫర్ […]
ఒక్క మొక్క చాలు
ఫోధోస్ (మనీ ప్లాంట్) లో కొత్తగా కొన్ని జన్యువులు చేరింది నియో ప్లాంట్ అనే బయోటెక్ కంపెనీ నియో-పి1 గా పిలిచే ఈ మొక్క ఇంట్లో పెంచుకుంటే ఫార్మాలి హైడ్,బెంజెస్ టోలిన్ జైలీన్ అనే హానికర పదార్థాలను పీల్చుకుంటుంది. ఇలాంటి మొక్క ఇంట్లో ఉంటే గాలి స్వచ్ఛత గురించి ఆలోచించే పనిలేదు.
ది వార్ డైరీ ఆఫ్ ఆశా
17 సంవత్సరాల వయసులో యుద్ధక్షేత్రం లోకి వెళ్ళింది ఆశా సహాయ జపాన్ లోని కోచ్ నగరంలో జన్మించింది నేతాజీ భారత జాతీయ సైన్యం లోని రాణీ ఝాన్సీ రెజిమెంట్ చేరిన ఆశా గెరిల్లా యుద్ధ తంత్రాల్లో శిక్షణ తీసుకొని సింగపూర్, మలేషియా, బర్మా యుద్ధ క్షేత్రాల్లో పనిచేసింది ఆమె డైరీలో రాసుకున్న విషయాలను ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్ కొలిన్స్ తాజాగా ది వార్ డైరీ ఆఫ్ ఆశా-సాన్ ఫ్రమ్ టోక్యో టు నేతాజీస్ ఇండియన్ ఆర్మీ […]
పాఠాలు చెప్పే పోలీస్
రాజస్థాన్ కు చెందిన లేడీ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్తి సింగ్ తన్వర్ మోటివేషనల్ స్పీకర్ పోలీస్ అకాడమీ లో విధులు నిర్వహిస్తున్న ఆర్తి సింగ్ తన్వర్ సోషల్ మీడియా ద్వారా సైబర్ నేరగాళ్ల నుంచి ఎంత అలర్ట్ గా ఉండాలో వీడియో పాఠాలు చెబుతారు. ఖాకీ యూనిఫామ్ లో వీడియో లో కనిపించే ఆర్తి సింగ్ తన్వర్ సాంకేతిక రంగంలో వచ్చే మార్పుల గురించి సమాచారం ఇస్తాం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు పాఠాలు చెబుతారు. […]
పట్టుదలకు ప్రతిరూపం
ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ ను అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళ అరుణిమ సిన్హా దుండగులు దాడి చేసి వేగంగా వెళుతున్న రైలు నుంచి ఆమెను బయటకు తోసేస్తే ఆ ప్రమాదంలో కాలు కోల్పోయింది. జాతీయస్థాయి ఫుట్ బాల్ క్రీడాకారిణి అవ్వాలని కలలు కన్నా అరుణిమ సిన్హా పట్టుదలతో ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతాలు ఎక్కింది. పట్టుదల కష్టపడే తత్వం ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని చెప్పేందుకు సిసలైన ఉదాహరణ అరుణిమ సిన్హా.
మొహమంతా మెరుపు
ఇంట్లో చేతికి అందే వస్తువులతో చేసే ఫేస్ ప్యాక్ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది పాల ప్యాకెట్ కట్ చేసి పాలను గిన్నెలోకి వంపేక ప్యాకెట్ అంచుల్లో పేర్కొన్న పచ్చి పాలు మీగడ లేదా వెన్న ముఖం చేతులకు రాసుకుంటే చర్మం మృదువుగా అవుతుంది. సాధారణ పొడి చర్మానికి ఇది చక్కని మసాజ్. రక్త ప్రసరణ బాగా జరిగి మొహం పైన మరకలు పోతాయి. ఈ క్రీమ్ రాసి, రెండు స్పూన్ల సెనగపిండి కాస్త నిమ్మరసం కలిపి పావుగంట […]
సీడ్ మదర్
200 దేశివాళీ విత్తనాలతో విత్తన భాండాగారం ఏర్పాటు చేశారు రాహి బాయ్ సోమ్ పొపేరే మహారాష్ట్రలోని అకోలే గ్రామానికి చెందిన సోమ్ పొపేరే చదువుకోలేదు. పదేళ్ల వయసు నుంచి వ్యవసాయ పనులు చేసేది. హైబ్రిడ్ విత్తనాలు రసాయనక ఎరువులే పంటలకు అపకారం చేస్తాయని గ్రహించి సేంద్రియ వ్యవసాయం లోకి దిగి దేశవాళీ విత్తనాలు భద్రపరచడం మొదలుపెట్టారు గ్రామస్తులు ఆమెను బీజ్ మాత్ (సీడ్ మదర్) అని పిలుస్తారు.పద్మశ్రీ ఇచ్చింది భారత ప్రభుత్వం.
ఎక్కువే కష్టపడాలి
మనం చేస్తున్న పని పైన స్పష్టత ఉంటే ఎంతటి లక్ష్యాన్నయినా సాధించవచ్చు. ఈ పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీలు నిలదొక్కుకోవాలి అంటే రెండింతలు ఎక్కువే కష్టపడాలి నేనయితే కేవలం కష్టపడ్డాను అంటుంది షానా చౌహన్ పార్లే ఆగ్రో సంస్థ సి.ఇ.ఒ 2006 లో ఆమె సి.ఇ.ఒ గా బాధ్యతలు తీసుకున్న మార్కెట్ ను తట్టుకుంటూ ఫ్రూటీ అప్పీ ఫిజ్, బిఫిజ్, ఫ్రియో వంటి సరి కొత్త ఉత్పత్తులను మార్కెట్ లోకి తెచ్చి వినియోగదారులను సంతృప్తి పరిచింది. కోట్ల […]
కథలు ఎంతో అవసరం
అపర్ణ జయ శంకర్ ప్రొఫెషనల్ స్టోరీ టెల్లర్. ఎం ఎ సోషల్ వర్క్ చేశారు. భారతం లోని కధలు చాలా ఇష్టం గా చెపుతారు. కథలు ఎప్పుడు సజీవంగానే ఉన్నాయి. ఆ బతికించే బాధ్యత మాత్రం మనదే అంటుంది అపర్ణ మన దేశంలో వంద రకాల భారతాలు రామాయణాలు ఉన్నాయి. ఏ ఒక్క కథ ఒకేలా ఉండవు ప్రతి కథలో ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి. అవన్నీ పిల్లలకు చెపితే జీవితం పట్ల ఒక గొప్ప అవగాహన వాళ్ళలో […]
ఘాటైన వాసనలా ?
చల్లని వాతావరణం లో తలుపులు మూసి ఉంచితే ఇల్లంతా ఘాటైన వాసన నిండిపోతుంది ఒక సీసాలో వైట్ వెనిగర్,కాస్త రోజ్ వాటర్ ను కలిపి పోసి ఇల్లంతా స్ప్రే చేస్తే చాలు ఒక కప్పులో వంట సోడా వేసి గది ములలో ఉంచినా వాసనలు రావు. వెనిగర్ లో రెండు లావెండర్ నూనె కలిపి బీరువాల్లో స్ప్రే చేస్తే బట్టలు ముక్క వాసన రాకుండా ఉంటాయి. వంట గదిలో వాసనలు పోవాలంటే నీళ్లలో రెండు నిమ్మ తొక్కలు […]
పనులు పంచుకుంటే సులభం
సరిగ్గా ప్లాన్ చేసుకుంటే కుటుంబం, వ్యాపారం రెండు సమన్వయం అవుతాయి అంటారు సూచి ముఖర్జీ లైమ్ రోడ్ ఫౌండర్ సి ఈ ఓ కుటుంబంలో చాకిరీ మొత్తం స్త్రీలపైనే ఉండటం మొదటి సమస్య. కెరియర్ కన్నా కుటుంబం ముఖ్యం అనుకుంటారు చాలామంది. కానీ ఇంట్లో అందరి సహకారం సాయం ఉంటే ఇంట్లో పనులు అందరూ పంచుకుంటే అదే సమస్య పరిష్కారం నేనైతే మొహమాటం లేకుండా ఇంట్లో పనులు పిల్లల పనులు ఇంట్లో అందరినీ సాయం కోరుకున్న.ఫలానా పని […]
మన సంస్కృతి చాటాలనుకున్న
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ రోజు కొంత సమయం నచ్చినా వ్యాయామం చేయండి నాలాగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండచ్చు అంటుంది రంపళ్ల భారతి జితేంద్ర పాఠక్ టాటా ముంబాయి మారథాన్ లో గంటపాటు ఐదు కిలోమీటర్లు పరుగు తీశారు జితేంద్ర పాఠక్ చేతిలో భారతీయ జెండాతో చీరతో ఈ మారథాన్ లో పాల్గొన్నారు జితేంద్ర పాఠక్. నేను భారతీయురాలిని దేశంపైనా అభిమానాన్ని తెలియజేయడానికి నేను జెండా పట్టుకున్నాను ఈ వయసులో కాళ్లు చేతులు బాగున్నాయి కదా ఊరికే ఇంట్లో […]
ఫ్యాషన్ స్టేట్ మెంట్ సెక్విన్
డిస్కో రకానికి చెందిన మెరుపుల షిఫాన్ చీరలు ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ ఈవెనింగ్ పార్టీల్లో మెరుపులు మెరిసిపోవటం కోసం సెక్విన్ చీరలు డ్రెస్సులు ఎంచుకోవచ్చు. కాంట్రాస్ట్ కలర్ సెక్విన్ లతో ఎంబ్రాయిడరీ చేసిన షిఫాన్ చీరలు ఏ ఫంక్షన్ కైనా బావుంటాయి.కానీ పగటి వేలకు సరిపోవు సెక్విన్ ప్యాంటు సూట్స్ కు మ్యాచ్ అయ్యేలా హై పోనీ టెయిల్ లేయర్డ్ జ్యువెలరీ క్రిస్టల్ ఎంబోజోడ్ హిల్స్ బాగుంటాయి. సెక్విన్ స్టేట్ మెంట్ జాకెట్స్ కూడా చాలా ఫ్యాషనబుల్ […]
