Chinna Maata
తొలి దర్శకురాలు
1922 లో వీర్ అభిమన్యు తో సినిమాల్లోకి వచ్చారు ఫాతిమా బేగం. అప్పట్లో అన్నీ మూకీ సినిమాలే మగవాళ్లే మహిళా పాత్రలు కూడా నటించే వారు. అలాంటి సమయంలో ఫాతిమా తన పేరుతో ఫాతిమా ఫిల్మ్ కంపెనీ తో సొంత ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. ముగ్గురు కూతుళ్లను సినిమాల్లోకి తెచ్చారు. దర్శకురాలిగా తొలి సినిమా బుల్ బులే పరిస్థాన్ లో ముగ్గురు అమ్మాయిలు నటించారు ఈ సంస్థ ద్వారా 16 ఏళ్ల పాటు నిర్మాతగా కదా రచయితగా […]
వేడుకులకు పూజ బాక్స్
దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళలను ఒక వేదికపైకి తెచ్చే ఉద్దేశంతో ‘మై పూజ బాక్స్’ ప్రారంభించింది కావేరి సచ్ దేవ్. పర్యావరణ హితం కోరే ఈ సంస్థ సేంద్రియ రంగులను తయారు చేస్తుంది. 2018 లో ప్రారంభమైన ఈ సంస్థ గ్రామీణ మహిళలకు ఉపాధి ఇస్తుంది.వేడుక ఏదైనా దానికి తగ్గట్టు పూజా బాక్స్ సిద్ధం చేస్తుంది. దేశం లోని భిన్న సంప్రదాయాలకు తగ్గట్లు నాలుగువేల ఉత్పత్తులను అందిస్తున్నారు. లండన్ లోని కోవెంటో విశ్వవిద్యాలయంలో బిజినెస్ పట్టా తీసుకుంది కావేరి.
ఇక్కడ చదువు ఉచితం
కర్మ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అమ్మాయిలు ఉచిత విద్య చదువుకునేందుకు సాయం చేస్తున్నారు రాధికా భారత్ రామ్ ఢిల్లీకి చెందిన ది శ్రీరామ్ స్కూల్స్ వైస్ పర్సన్ రాధిక భారత్ రామ్ అమ్మాయిలకు చదువు చెప్పించడం కోసం కర్మ ఫౌండేషన్ ఫెల్ షిప్ లకు శ్రీకారం చుట్టింది.ఈ ఫెలోషిప్ కు ఎంపిక అయితే మూడేళ్ల పాటు ఫీజులు, వసతి ట్రావెల్ అలవెన్స్, లాప్ టాప్, పుస్తకాలు అన్ని ఇస్తారు.
హై స్పీడ్ రైల్ పైలెట్
సోలాపూర్ స్టేషన్,ముంబై లోని చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ వల్ల సెమీ హై స్పీడ్ ట్రైన్ కు ప్రైవేట్ పైలెట్ గా ఉన్నారు సురేఖ యాదవ్ మహారాష్ట్ర కు చెందిన సురేఖ భారతదేశపు మొట్టమొదటి మహిళా డ్రైవర్ గా 1988లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తిరిగి ఆసియాలోని మొట్టమొదటి మహిళా లోకో పైలెట్ గా చరిత్ర సృష్టించారు. ఈ రైలు సేవలు సోలాపూర్ స్టేషన్ లో మార్చి 13 నుంచి మొదలయ్యాయి ఈ రైలును 450 కిలోమీటర్ల […]
తబలా విధ్వాంసురాలు
ప్రపంచంలో తొలి మహిళ తబలా విధ్వాంసురాలు అనురాధ పాల్.ఆమె మ్యూజిక్ లో ఎం.ఎ చేశారు. 40 రకాల వాయిద్యాలు వాయించగలరు. స్త్రీ శక్తి అనే బ్యాండ్ పేరుతో 27 ఏళ్లుగా ప్రపంచ వ్యాప్త ప్రదర్శనలు ఇస్తున్నారు. రాష్ట్రపతి అవార్డుతో సహా 108 కి పైగా పురస్కారాలు అందుకున్నారు.ఎన్నో సినిమాలకు మ్యూజిక్ ఆల్బమ్స్ కు సంగీతాన్ని సమకూర్చారు.
సౌందర్య ఉత్పత్తులు ఇష్టం
నయనతార అటు సినిమాలు ఇటు వ్యాపారం లో మల్టీ టాస్కింగ్ చేస్తోంది. స్నేహితురాలు రేణితా రాణితో కలిసి ‘ది లిప్ బామ్ కంపెనీ’ స్థాపించి సౌందర్య ఉత్పత్తుల రంగం లోకి ప్రవేశించింది నయనతార. చెన్నైకి చెందిన ‘ఛాయ్‌వాలె’లో లోను సొంత ప్రొడక్షన్ కంపెనీ ‘రౌడీ పిక్చర్స్’ లోనూ పెట్టుబడులు పెట్టిన నయనతార వెబ్ సిరీస్, ఫీచర్ యాడ్ ఫిలిం నిర్మిస్తోంది.
పెట్టుబడి పెట్టడం ఇష్టం
గీత గోవిందం పుష్ప సినిమా లతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్న.లీగన్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ఉత్పత్తులకు ఇన్వెస్టర్. ప్యాకేజింగ్ నుంచి అమ్మకాల వరకు ఈ కంపెనీ లో ప్రతి విషయం చాలా శ్రద్ధగా చూసుకుంటుంది రష్మిక వ్యక్తిగతంగా చాలా నచ్చింది కనుకనే ఈ బ్రాండ్ లో ఎంతో పెట్టుబడి పెట్టాను అంటుంది రష్మిక.
బయో లెదర్ వ్యాపారం
ఆలియా భట్ కు వ్యాపారం చాలా ఇష్టం కాన్పూర్ ఐటి మద్దతుతో నడుస్తున్న ‘ఫూల్’ లో పెట్టుబడులు పెట్టింది ఆమె ఈ సంస్థ వాడి పడేసిన పూలతో బయో లెదర్ అగరబత్తీలు తయారు చేస్తుంది.ఎడ్-ఎ- మామ్మా పేరుతో చిన్నపిల్లల దుస్తుల అమ్మకాల వ్యాపారం లో కూడా ఉంది ఆలియా మెటర్నిటీ వేర్ ను అందుబాటులోకి తెస్తానంటోంది.
దూసుకుపోతున్న ది ట్రైబ్
ది ట్రైబ్ పేరు తో స్నేహితులు అనుష్క నందాని కరణ్ సాహ్ని, రాబిన్ బెహ్ల్ లతో కలిసి ఫిట్ నెస్ ప్రాజెక్ట్ ప్రారంభించింది కృతి సనన్ మిమి సినిమా కోసం 15 కిలోల బరువు తగ్గాల్సి వచ్చినప్పుడు ఈ ఫిట్ నెస్ వ్యాపారం మనసులోకి వచ్చింది అని చెబుతోంది కృతి.ఇన్ స్టూడియో పర్సనల్ గ్రూప్, వర్చువల్ విధానంతో ఈ సంస్థ వ్యాయామ పాఠాలు చెపుతోంది. కృతి సనన్ ఈ వ్యాపారానికి కృతి ఇమేజ్ నిజమైన పెట్టుబడి.
మహిళలదే హవా
హాసూర్ లో 80 మంది మహిళా ఉద్యోగులతో అశోక్ లేలాండ్ తయారీ కేంద్రం ఆరంభించింది.ఈ భారీ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ దేశంలో నాణ్యమైన ఉత్పత్తులు తీసుకురాగలిగే సమర్ధత స్త్రీలకు మాత్రమే ఉంది. ఈ అవకాశం ద్వారా వారి జీవితాలను మెరుగుపరుచుకోవటమే కాదు వారి కుటుంబ స్థితిగతుల్ని మార్చేస్తాము అందుకే మహిళా ఉద్యోగులకు నైపుణ్యాల శిక్షణ ఇవ్వడంలో మేము ముందే ఉంటాం అంటారు ఆ సంస్థ సి ఐ ఓ షేను అగర్వాల్.
భారత కోకిల
భారత కోకిల బిరుదు గల సరోజినీ నాయుడు కవిగా ప్రజాకర్షణ కలిగిన జాతీయ స్వాతంత్రోద్యమ నాయకురాలిగా మనకు తెలుసు.1914 నుంచి 30 ఏళ్ల పాటు గాంధీ గారితో కలిసి పనిచేశారామె.1925 లో జాతీయ అఖిల భారత కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎంపికయ్యారు ఆమె మొదటి కవితా సంకలనం గోలైన ట్రిష్ హాల్డ్ 1905 లో ప్రచురితమైంది.ఆమె తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ నిజాం కాలేజీ వ్యవస్థాపకులు. సరోజినీ దేవి ఆ కాలంలో అగ్రగామి ఆంగ్ల కవియత్రి.
మహాలఖా బాయి చందా
మహాలఖా బాయి ప్రముఖ కవయిత్రి గా సంగీత కర్పూరిగా, గాయకురాలిగా హైదరాబాద్ లో ప్రసిద్ధి చెందింది. పుట్టుకతో ఆమె పేరు చందా బీబి. విమెన్ రైటింగ్ ఇన్ ఇండియా లో మహాలఖా బాయి ని తొలి ఉర్దూ కవయిత్రి గా చెప్పారు ఆమె చేతిరాతతో ఉన్న 125 గజల్స్ ఉన్న పుస్తకం దినాన్-ఏ-చందా, బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ స్థలం మొత్తం బహుమతిగా ఇచ్చిందే. 1824లో మరణించాక ఆమె ఆస్తులలో చాలా భాగం […]
ఈమె ఫైటర్
కెప్టెన్ దీక్ష సి.ఎం పారా స్పెషల్ ఫోర్సెస్ లో ఎంపికైన తొలి మహిళ ఆఫీసర్ ఆర్మీ డాక్టర్ కూడా. ఈమె ఇండియన్ ఆర్మీ లో కఠినమైన శిక్షణ పూర్తి చేశారు. అలాగే ఆర్మీ వైద్యం చేసేందుకు శారీరక దారుఢ్యం కర్తవ్య దీక్ష కావాలి. ఇండియన్ ఆర్మీ లో స్త్రీలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వివక్ష లేదు సంశయాలు లేకుండా ముందుకు వస్తే మంచి భవిష్యత్తు అని చెపుతోంది దీక్ష సి.ఎం.
c
బహతీనాక్, పుష్పవల్లి అనే కామెడీ సీరియల్స్ తో సముఖీ సురేష్ చాలా పాపులర్ కమెడియన్ రైటర్ యాక్టర్.నాగపూర్ లో పుట్టి పెరిగిన తమిళ యువతి పుష్పవల్లి. మోటార్ మౌత్ పేరుతో కంటెంట్ క్రియేట్ చేసే సంస్థ స్థాపించింది. అమెజాన్ ప్రైమ్ కామికిస్తాన్ సీజన్ వన్ లో కో హాస్ట్ గా థర్డ్ సీజన్ లో జడ్జ్ గా వ్యవహరించింది.
బ్రాండ్ ఆఫ్ హ్యూమర్
రాధిక వాజ్ స్టాండప్ కమెడియన్ యాక్ట్రెస్ రైటర్ కూడా కామెడీ ద్వారా స్త్రీల సమస్యలను పురుషాధిక్య ధోరణిని ప్రేక్షకుల ముందుకు తెచ్చి వారిలో ఆలోచన రేకే తించటంతో ఎన్నో ప్రయోగాలు చేసింది. ‘అన్ లాడ్లీ లైక్’ పేరుతో ఆమె రాసిన పుస్తకం పెద్ద సంచలనం. ఆడవాళ్ళ నెలసరి నుంచి, వర్జినిటీ, పెళ్లి వయసు ముదరటం వంటి వివాదాస్వర అంశాలు, ఆచార వ్యవహారాలు కామెడీ తో ముడిపెట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారు రాధిక వాజ్.
యుద్ధభూమిలో తొలి అడుగు
యుద్ధభూమిలో పోరాడే అవకాశం అందుకున్నారు కెప్టెన్ శాలిజా ధామి. వాయుసేన పోరాట విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. పంజాబ్ లోని పంజాబ్ లోని సరభ గ్రామానికి చెందిన శాలిజా 2003లో ఐ ఎ ఎఫ్ లో హెలికాప్టర్ పైలట్ గా కెరియర్ ప్రారంభించారు. పశ్చిమ సెక్టార్లో హెలికాప్టర్ విభాగానికి ఫైట్ కమాండర్ గా చేరారు. ఫ్రంట్ లైన్ కమాండ్ హెవీ క్వార్టర్స్ లో ఆపరేషన్ విభాగంలో ఉన్న శాలిజా పశ్చిమ ప్రాంతంలో క్షిపణులు స్క్వాడ్రన్‌కు నేతృత్వం వహించనున్నారు. ఈ […]
తొలి మహిళ కమాండర్
లద్దాఖ్ లో స్వతంత్రత ఫీల్డ్ వర్క్ షాప్ కు నేతృత్వం వహించే అవకాశం దక్కించుకున్నారు కల్నల్ గీతా రాణా. ఈ అవకాశం అందుకున్న తొలి మహిళ ఆఫీసర్ గా చరిత్ర సృష్టించారు. 23 ఏళ్ల కెరియర్ లో సిక్కిం, జమ్మూ కాశ్మీర్ వంటి ఎన్నో ప్రాంతాల్లో పనిచేశారు. ఈ ఎం ఈ శిక్షణ కేంద్రంలో ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆర్మీలో ఒక యూనిట్ కు కమాండర్ గా వ్యవహరిస్తున్న తొలి నాన్ మెడికల్ ఆఫీసర్ గా గీత […]
ఉత్తమ నిర్మాత
ప్రపంచంలోనే 12 మంది అత్యుత్తమ నిర్మాతల్లో ఒకరు గా గుర్తింపు పొందారు గునీత్ మోంగా. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్,అయ్యా, షాహిద్, ది లంచ్ బాక్స్, గర్ల్ ఎల్లో బూట్స్,ఫెడ్లర్స్ మాసన్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ వంటి సినిమాలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. ఢిల్లీకి చెందిన పంజాబీ అమ్మాయి గునీత్ స్త్రీల సమస్యల పైన దృష్టి పెట్టిన గునీత్ 2008 లో సిక్వా ఎంటర్టైన్ ప్రారంభించి అన్నీ విజయవంతమైన సినిమాలే నిర్మించారు.
ప్రాణాలకు తెగించి
ఇంపాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్ ద్వారా పదివేల మంది బాలబాలికలను స్త్రీ లను అక్రమ రవాణా నుంచి కాపాడారు పల్లబి ఘోష్ అస్సాం కు చెందిన పల్లబి 2020 లో ఎన్జీవో స్థాపించారు. ఈశాన్య రాష్ట్ర పోలీస్ లు,సరిహద్దు భద్రతా దళాల తో కలిసి యాంటీ ట్రాఫికింగ్ యాక్టివిస్ట్ గా పనిచేస్తోంది. బెంగాల్ అస్సాం నాగాలాండ్ వంటి రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకొచ్చి బలవంతపు పెళ్లిళ్లు చేస్తారు. ఆడపిల్లల అక్రమ రవాణా ఆ ప్రాంతాల్లో యథేచ్ఛగా జరుగుతుంది […]
కొత్త వెలుగు
రాజవంశీకులైన అక్షిత, మృణాళిక కోల్కత్తాలో చదువుకొని ఆ పైన విదేశాలకు కూడా వెళ్లారు ఒడిశా లోని మయూర్ భంజ్ జిల్లాలో జరిపాడు పట్నంలోని 1804 కాలానికి చెందిన అందమైన రాజ భవనాన్ని బోటిక్ హోటల్ గా మార్చేశారు ఇద్దరు కలిపి వందల సంవత్సరాల నాటి కళాకృతులు పునరుద్దరించారు ఎంతో మంది చేతివృత్తి కళాకారులకు ఈ రాజభవనం కేంద్రం అయింది. ఒడిశా కు చెందిన ఈ మయూర్ బంజ్ ప్యాలెస్ ఇవ్వాళ చూడవలసిన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి.
