Sunday, 28 Jun, 2026

మిస్ యూనివర్స్ రోడ్రిగ్జ్

ఈ సంవత్సరం మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 అలెజాండ్రా మరిస్సా రోడ్రిగ్జ్ 60 ఏళ్ల రోడ్రిగ్జ్ తన కన్నా చిన్న వాళ్లను పక్కకు నెట్టి కిరీటం సొంతం చేసుకుంది. అందాల పోటీలు అంటే శారీరక సౌందర్యం మాత్రమే కాదు విలువలూ, ప్రమాణికమే అనేందుకు నేనే నిదర్శనం అంటోంది రోడ్రిగ్జ్ అర్జెంటీనా లోని లా ప్లాటా ఆమె ఊరు. న్యాయవాది జర్నలిస్ట్ కూడా.

విమానం మా గుప్పిట్లో

ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ పూజ ఉమా శంకర్ విమానాశ్రయం లో ఈ రంగానికి ప్రాముఖ్యత చాలా ఎక్కువ విమానం ఎగిరే ముందర ఇంధన స్థాయి, టైర్లలో ప్రెషర్, లైట్లు అన్ని యంత్రాలు సరిగ్గా చెక్ చేసి ఎగిరేందుకు అనుమతి ఇచ్చే విభాగం ఇది. ఏరోనాటికల్ ఇంజనీర్ గా బాధ్యత తీసుకున్న ఉమాశంకర్ ప్రపంచవ్యాప్తంగా విమాన నిర్వహణ విభాగంలో 2.6 శాతం మాత్రమే మహిళలు ఉన్నారని చెబుతోంది. ఎండ వానల్లో పనిచేయాల్సిన ఈ ఉద్యోగం ఎన్నో సవాళ్లతో […]

సమస్యకు పరిష్కారం

‘పిరుల్స్’ సంస్థ ద్వారా అడవుల సంరక్షణ, అలాగే స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.నుపుర్ పోహార్కర్ ఉత్తరాఖండ్ లోని ఖేతి ఖాన్   గ్రామంలో ఉన్న పైన్ చెట్ల వల్ల అక్కడ అడవుల్లో మంటలు చెలరేగటం స్థానికులు గృహాల్లో తలదాచు కోవటం చూసింది నుపుర్. పల్ల ల్లాంటి పైన చెట్ల ఆకులతో గృహోపకరణాలు తయారు చేయటం నేర్పించటం ద్వారా అక్కడ ప్రజలకు జీవనోపాధి దొరికింది అలాగే చెట్ల  ఆకులు మొత్తం పరుచుకోవటం వల్ల అడవుల్లో మంటలు కూడా ఆగిపోయాయి […]

అహ్మదాబాద్ లో బస్ బడి

అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ లో 2022 లో సిగ్నల్ స్కూల్స్ ఆలోచనకు శ్రీకారం చుట్టాయి. మురికివాడల్లో తిరిగే పేద పిల్లల్ని చిన్న వయసులో చదువు మానేసిన వాళ్లని గుర్తించి సిగ్నల్స్ దగ్గర ఆగి ఉండే ఈ బస్సులు వాళ్లను ఎక్కించుకొని సాయంత్రం వరకు పాఠాలు నేర్పిస్తారు. తరువాత వాళ్ళని ప్రభుత్వ పాఠశాలల్లో చేరుస్తారు.ఈ సిగ్నల్ స్కూళ్ల కోసం ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. మరికొన్ని నగరాల్లో ఈ విధానం […]

భాష లేని కాలంలో లిపి

డూడల్స్ డబ్బా సంస్థను ప్రారంభించి భారతీయ డూడల్స్ కళకు కొత్త రూపం పోసింది ఖుష్బూ గుప్తా.భాష లేని కాలంలో మన పూర్వికులు విషయాన్ని రకరకాల బొమ్మలు, గీతల రూపంలో గుహల గోడల పైన గీసే వాళ్ళు ఆ కళ పేరే డూడ్లింగ్.ఆ కళే ఖుష్బూ గుప్తా ప్రాజెక్ట్ బాడీ షేమింగ్ ప్రకృతి ఆధ్యాత్మిక ప్రపంచం రహస్యాలకు సంబంధించిన అంశాలను ఎంచుకొని డూడల్స్ రూపొందిస్తుంది ఖుష్బూ ఈ ఎల్ ఐ సిరీస్ యానిమల్స్ అరౌండ్ ది గ్లోబ్ లవ్ […]

కెరటాలపై స్వారీ

2024 పారిస్ సమ్మర్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది 26 సంవత్సరాల నేత్ర కుమనన్.సెయిలింగ్ లో జాతీయ అంతర్జాతీయ పథకాలు సాధించింది. నీలి సముద్రం లో సెయిలింగ్ చేయటం అంటే కెరటాలపై స్వారీ చేయటం అంటుంది నేత్ర. దేశం తరఫున రెండు సార్లు ఆసియా క్రీడల్లో పాల్గొన్నది అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్ షిప్ లో 20 కి పైగా పథకాలు సాధించింది. ఎంబిఎ చదువుతున్న నేత్ర ఈ సాహస క్రీడ ఆడవాళ్లకు సాధ్యమే అని నిరూపించింది.

వేల మంది అమ్మాయిలకు విముక్తి

బిబిసి తో సహా ప్రముఖ వార్తా సంస్థలతో కలిసి పనిచేసిన జర్నలిస్ట్ రుచిరా గుప్తా. తన డాక్యుమెంటరీ ది సెల్లింగ్ ఆఫ్ ఇన్నసెంట్స్ కు ఎమ్మి పురస్కారం లభించింది. అవుట్ స్టాండింగ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లో పురస్కారం అందుకున్న రుచిరా గుప్తా కొన్ని వేల మందికి సెక్స్ వర్కర్స్ గా మారిన అమ్మాయిలను విముక్తులుగా చేసింది. తను సేకరించిన సమాచారం లో వందమంది హ్యూమన్ ట్రాఫికర్స్ ను జైలుకు పంపారు. ఈ క్రమంలో ఫ్రెంచ్ అత్యుత్తమ పురస్కారం […]

అత్యంత సంపన్న ముస్లిం మహిళ

దేశంలోనే సంపన్న ముస్లిం మహిళ కూడా ఫరా మాలిక్ భాంజీ. పేరున్న రిటైల్ పాదరక్షల సంస్థ మెట్రో బ్రాండ్ ఆమె తండ్రి కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టి నెమ్మదిగా డైరెక్టర్ గా ఎదిగారు. 2010లో లైన్ వెబ్ సైట్ ఏర్పాటు చేసి 800 పైగా శాఖలతో సంస్థను దేశమంతా విస్తరించారు. నాయకురాలిగా ఫోర్బ్స్ జాబిదాలో ఎక్కారు. ఆమె 28 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తోంది. పాదరక్షల రంగంలో మెట్రో ని లీడర్ గా నిలిపారామె.

దివ్యాంగులకు అండ

అమితా పటేల్ అహ్మదాబాద్ సమీపంలోని జోద్ పూర్ లో పుట్టారు పసితనం లోనే పోలియో సోకి వీల్ చైర్ కే పరిమితం అయ్యారు గ్రామపంచాయతీ స్కూల్లోనే చదువుకుని అంచెలంచెలుగా లా పూర్తి చేశారు. వికలాంగుల కోసం కంప్యూటర్ కోర్సులు నేర్పిస్తారామే మంచి అథ్లెట్ కూడా. జావెలిన్ త్రో లో చాలా పథకాలు సాధించింది. సామాజిక కార్యకర్త మంచి రచయిత్రి కూడా. దివ్యాంగత రోజ్ గార్ మేళ, దివ్యాంగ్ జీవనోపాధి వంటి కార్యక్రమాలు నిర్వహించి వారికి మంచి జీవితం […]