Thursday, 23 Jul, 2026

అంతర్జాతీయ ఆర్టిస్ట్

పశ్చిమ బెంగాల్ లోని శ్రీరామ్ పూర్ అనే పల్లెలో జన్మించిన మేమిత బాసర్ ఫైన్ ఆర్ట్స్ లో బ్యాచిలర్ పాత వస్త్రాలు తమ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన కాంత అల్లిక టీ,కాఫీ నాచు లతో ఆమె అద్భుతమైన చిత్రాలు గీశారు. మహిళల బావోద్వేగాలు పురుషాధిక్యత తో వాళ్లు ఎదుర్కొనే సవాళ్లు పర్యావరణం పైన చిత్రాల్లో కనిపిస్తాయి ఆమె చిత్రాలతో లండన్, పోలాండ్, స్పెయిన్ విదేశాల్లో ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఈ కళాకారుని […]

ద్వితీయ స్థానం లో క్రిస్టీన్

క్రిస్టీన్ లగార్డ్ లాయర్.చికాగోకు చెందిన బేకర్ మెక్‌కెంజీ అనే అంతర్జాతీయ లా సంస్థ తో తన కెరియర్ ప్రారంభించారు 31 ఏళ్ళు వచ్చేసరికి ఆ సంస్థ ఎక్స్క్యూటివ్ కమిటీ లో స్థానం సంపాదించారు. తరువాత ఆ కమిటీ చైర్ పర్సన్ అయ్యారు తొలి ఫిమేల్ గ్లోబల్ చైర్ పర్సన్ గా రెండుసార్లు ఎన్నికయ్యారు. తర్వాత ఫ్రెంచ్ రాజకీయాల్లో అడుగుపెట్టి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు ఫారిన్ ట్రేడ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ శాఖలకు మంత్రిగా చేశారు తర్వాత ఇంటర్నేషనల్ […]

ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానం

ఉర్సులా వాన్ డెర్ లేయన్ జర్మనీ చరిత్రలో తొలి మహిళా రక్షణ మంత్రి రాజధాని బ్రస్సెల్స్ లోని బ్రస్సెల్స్ లో జన్మించారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నారు విమెన్ హెల్త్ లో స్పెషలైజేషన్ చేశారు. 1990లో క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ లో చేరారు. ఆ తర్వాత లోయర్ సాక్సోనీ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2025లో వాన్ డెర్ లేయన్ ఫెడరల్ క్యాబినెట్‌ లో ఫ్యామిలీ అఫైర్స్ మినిస్టర్ గా నియమితులై చైల్డ్ అడ్వాన్స్ […]

వయసును స్వీకరించండి

40ల్లో 20 ఏళ్ల వారిలా కాకుండా 40 లాగే కనిపించాలి అంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్  రుజుత దివేకర్. బరువు పరిమాణం ఆరోగ్యానికి కొలమానం కావు అంటున్నారు.వయసు తక్కువగా కనిపించాలని తాపత్రయం తో డైటింగ్ లు వ్యాయామాలు చేసినంత మాత్రాన సౌందర్యం పెరగదు.అసలైన ఆరోగ్యం సంతోషం, క్రమశిక్షణ గల జీవిత విధానం మొదలైన వాటితో ముడిపడి ఉంటుంది.40 ఏళ్లు దాటుతుంటే,పెరిగే వయసుకు తగ్గట్టు శరీరం తనను తాను సర్దుబాట్లు చేసుకుంటుంది. ఇదే ఆరోగ్యం హాయిగా సీజనల్ స్వీట్లు తో […]

పిల్లలకు సైన్స్ శిక్షణ

సైన్స్ అంటే భయపడే విద్యార్థుల కోసం ‘క్యూరియస్’ ప్లే లాబ్స్ నెలకొల్పారు సరయు గార్గ్. భర్త ఐఏఎస్ ఆఫీసర్ అభిజిత్ తో కలిసి పిల్లల కోసం చండీగఢ్ లో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ లో పిల్లలకు ప్రయోగాత్మకంగా పాఠాలు చెబుతారు.కార్పొరేట్ చదువులతో క్రీడలు మర్చిపోతున్న పిల్లలకు వివిధ సంస్థల సహకారంతో ఆట స్థలాలు ఆధునీకరించారు. పేద విద్యార్థులకు ఆట సామాగ్రి అందించారు చండీగఢ్ లో పుట్టి పెరిగిన సరియు ఇంజనీరింగ్ చదివారు.అభిజిత్ తో కలిసి ప్రభుత్వ […]

వెండి తెర సూపర్ ఉమెన్

ఈ సంవత్సరం ఐ ఎం డి బి టాప్ టెన్ జాబితాలో కళ్యాణి ప్రియదర్శన్ పేరు నమోదయింది. మానాడు, హృదయం, బ్రో డాడీ, లోకా చాప్టర్-1  ఆమె నటనకు ప్రేక్షకుల ఆదరాభిమానాలు దక్కాయి. న్యూయార్క్ విశ్వవిద్యాలయం లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదివింది. డైరెక్టర్ సాబు సీరిల్ దగ్గర అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తుంది.2017లో హలో సినిమా తో వెండితెర పైన వెలిగింది కళ్యాణి. కొత్త లోకా చాప్టర్ 1 లో సూపర్ ఉమెన్ గా […]

సిద్ది కి రాష్ట్రపతి మెడల్

ఇంజనీరింగ్ చదువుకొని సైన్యంలో చేరటం లక్ష్యంగా పెట్టుకొని మిలటరీ లో అడుగు పెట్టింది సిద్ధి జైన్. ఉత్తర ప్రదేశ్ లోని ఉఝని లో జన్మించిన సిద్ధి ఎన్. డి. ఏ పరీక్ష రాసి మిలటరీ శిక్షణ తీసుకున్నారు. పాసింగ్ అవుట్ పరేడ్ లో రాష్ట్రపతి కాంస్య పథకం అందుకున్నారు.దీన్ని అందుకున్న తొలి మహిళ గా రికార్డు సృష్టించారు. అకడమిక్, ఫీల్డ్ పెర్ఫార్మెన్స్, నాయకత్వ లక్షణాలు, సేవ భావన లో ప్రతిభ చూపించి బెస్ట్ ఆల్ రౌండర్ కె […]

ఆమె అడవి కే అమ్మమ్మ

కాణి తెగకు చెందిన లక్ష్మి కుట్టి కేరళ జానపద అకాడమీలో ఉపాధ్యాయురాలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. వితుర లోని కల్లార్ అడవి ప్రాంతానికి చెందిన ఈ గిరిజన టీచర్ గారు 500 రకాల ఔషధ చికిత్సలు చేయగలరు.అడవిలో ఏ ఔషధ మొక్క ఎక్కడ ఉందో ఆమెకు కొట్టిన పిండి అందుకే లక్ష్మి కుట్టి ని వన ముతస్సి అంటే అడవికే అమ్మమ్మ అంటారు.50 ఏళ్లుగా సంప్రదాయ వైద్యం చేస్తున్న ఈమెకు 1985లో కేరళ ప్రభుత్వం నాటు వైద్య […]

ఈ డాక్టర్ హార్స్ రైడర్

కాకినాడ లో డాక్టర్ గా ఎంతో పేరున్న డాక్టర్ సువర్ణ హార్స్ రైడింగ్ శిక్షకురాలు.కళాశాల లో చదివే సమయంలో గుర్రపు స్వారీ నేర్చుకున్న సువర్ణ 2017-16 లో వివిధ గుర్రపు స్వారీ పోటీల్లో విజయం సాధించారు.గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గుర్రం పై ఖడ్గం చేతిలో పట్టుకొని ప్రధాని కి సెల్యూట్ చేసే అవకాశం చేజిక్కించుకున్నారు .కాకినాడ సెవెన్ రైడింగ్ క్లబ్ లో గుర్రపు స్వారీ పాఠాలు నేర్పుతారు సువర్ణ.ఉత్తమ డాక్టర్ అవార్డు కూడా తీసుకున్నారు.

సెలబ్రిటీ కేసులతో బిజీ

రచయిత్రి, డాక్టర్, ఆర్టిస్ట్ అవ్వాలని ఎన్నో రకాల కలలతో ఉండే ప్రియాంక ఖీమాని లాయర్ అయిపోయింది. సొంతంగా లా ఫర్మ్  నెలకొల్పి బాలీవుడ్ సెలబ్రిటీ కేసులతో తీరిక లేకుండా అయిపోయారు. డిగ్రీ లో బయోటెక్నాలజీ తీసుకొని రైటర్ గా ఎన్నో స్క్రిప్ట్ లో రాసిన ప్రియాంక 2012 లో లా పూర్తి చేసి పూర్తిస్థాయి లాయర్ గా జీవితాన్ని తనే ఒక మలుపు  తిప్పుకున్నారు. లతా మంగేష్కర్, సోను నిగమ్, అనురాగ్ కశ్యప్ మొదలైన బాలీవుడ్ ప్రముఖుల […]

అంతర్జాతీయ మోడల్ గా భవిత

హైదరాబాద్ కు చెందిన భవిత మండవ ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ బొట్టెగా వెనెటా స్ప్రింగ్ సమ్మర్ 2025 లో మోడల్ గా మంచి పేరు సంపాదించింది. ఈ ఫ్యాషన్ లో షో లో ఓపెనింగ్ వాక్ చేసింది భవిత. ఇంటరాక్టెడ్ డిజైన్ అండ్ మీడియాలో మాస్టర్స్ చేస్తున్న భవితకు ఫ్రెంచ్ బెల్జియన్ డిజైనర్ మాథ్యూ బ్లేజీ అవకాశం ఇచ్చారు.ఈ అవకాశం ఇచ్చిన రెండు వారాల్లో న్యూయార్క్ సబ్ వే స్టేషన్ లో ఓపెనింగ్ వాక్ చేసింది […]

మహిళా శక్తికి నిదర్శనం

ఈ సంవత్సరం హరూన్ ఇండియా ఆర్ట్ లిస్ట్ 2025 జాబితాలో మహిళా శక్తి కి మకుటం లాగా నిలిచారు 85 సంవత్సరాల కళాకారిణి పద్మశ్రీ అవార్డు గ్రహీత అంజోలీ ఎలా మీనన్.గడచిన సంవత్సరంలో ఏకంగా 8.7 కోట్ల టర్నోవర్ తో ఈ జాబితాలోని మహిళల్లో అగ్రస్థానంలో ఉన్నారు. ఆమె గీసిన 32 కళాఖండాలు అమ్ముడుపోగా అందులో ఒక చిత్రం 14 కోట్లు కు అమ్ముడైంది. ఆమె చిత్రాలు చండీగఢ్ మ్యూజియం పీబోడీ ఎసెక్స్ మ్యూజియం తో సహా […]

మహిళల సంక్షేమం కోసం కృషి

హాకీ వాలి సర్పంచ్ అంటారు నీరు యాదవ్ ను రాజస్థాన్ లోని ఝుంఝునున్ జిల్లా లంబి అహిర్ లో ఉంటుంది. ఆ గ్రామ సర్పంచ్ గా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచింది. ఒక మహిళ సర్పంచ్ కావడం ఇదే మొదటిసారి. గ్రామంలోని మహిళా రైతుల సాధికారత కోసం సచ్చీ సహేలి మహిళ ఆగ్రో లిమిటెడ్ ప్రారంభించింది గ్రామంలో ఆడపిల్లలకు క్రీడా శిక్షణ కోసం అదితి ఫౌండేషన్ నెలకొల్పింది ప్లాస్టిక్ రహిత సమాజం సృష్టించేందుకు స్టీల్ పాత్రల […]

మహిళా ఉద్యోగాలకే ప్రాధాన్యత

విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ చేసిన అశ్విని అశోకన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పట్టు సాధించింది. ఇంటెల్ సంస్థలో పనిచేసిన అశ్విని మ్యాడ్ స్ట్రీట్ డెన్ లాంచ్ చేసింది. క్లయింట్స్ కు ఆర్టిఫిషియల్ డ్రివెన్ సొల్యూషన్స్ అందించే రిటైల్ ఆటోమేటిక్ ఫ్లాట్ ఫామ్ ఈ మ్యాడ్ స్ట్రీట్ డెన్. కటింగ్ ఎడ్జ్ ఏ ఐ టెక్ ప్రాడక్ట్ ల రూపకల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది ఈ డెన్. వ్యూ ఏ ఐ ఆధారిత ఫ్లాట్ ఫామ్ ను […]

సంపన్న మేనేజర్  

అరిస్టా నెట్ వర్క్ సీఈఒ జయశ్రీ ఉల్లాల్ భారతీయ సంపన్న ప్రొఫెషనల్ మేనేజర్ లో తొలి స్థానం స్థానంలో నిలిచారు హురున్ ఇండియా రీచ్ లిస్ట్ 2025 లో ఆమె పేరు నమోదై ఉంది. జయశ్రీ లండన్ లో జన్మించారు చిన్నతనం న్యూఢిల్లీలో గడిచింది. శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు.సిస్కో లో 15 ఏళ్లు పనిచేశాక అరిస్టా నెట్ వర్క్ లో చేరారు.2008లో అరిస్టా నెట్ వర్క్ సీఈఒ ప్రెసిడెంట్ గా […]

పక్షి ఈకల గ్రంథాలయం

బెంగళూరు లో పక్షి ఈకల లైబ్రరీ నడుపుతున్నారు ఈషా మున్షీ ఫెదర్ లైబ్రరీ పేరుతో నడిచే ఈ గ్రంథాలయంలో 160 రకాల పక్షుల ఈకలు 400 పక్షుల అవశేషాలు ఉన్నాయి.వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్ అయిన ఈషా ఆర్నిథాలజి (పక్షుల శాస్త్రం) చదివారు.పక్షుల పరిరక్షణ కు నడుము కట్టారు.బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్ లో పక్షుల విభాగానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. వాతావరణంలో ఇమడలేక మరణించిన పక్షుల ఈ కల అధ్యయనం ద్వారా ఆమె వాటి సమస్యను […]

అందమైన టెర్రకోట నగలు

కర్ణాటక లో స్థిరపడిన ప్రశాంతి సుధీర్ క్లే హోమ్,పేరుతో టెర్రకోట నగల తయారీ అమ్మకాలు చేస్తున్నారు ఎమ్యెస్సి జువాలజీ చదువుకున్న ప్రశాంతి మైసూర్ లోని ఒక హ్యండి క్రాఫ్ట్స్  వర్క్ షాప్ లో టెర్రకోట నగలు తయారీ నేర్చుకున్నారు. 2018 లో వ్యాపారం మొదలుపెట్టారు సెరామిక్ క్లే వస్తువులను థీమ్ స్టైల్ లో డిజైన్ చేశారామె  కప్ లు, జార్ లు, ప్లేట్ లు, జాడీలు వంటివి కార్వింగ్స్ తో ఫ్యూజన్ స్టైల్ లో మారుస్తారు.వీటికి మంచి […]

మహిళ ర్యాలీ డ్రైవర్

కేరళ కు చెందిన మొదటి మహిళ ర్యాలీ డ్రైవర్ అతిరా మురళీ బైక్ లా నుంచి టిప్పర్ల వరకు దేన్నయినా నడపగలదు అతిరా ఇన్ని రకాల వాహనాలకు లైసెన్స్ లు పొందిన పిన్న వయస్కురాలిగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పేరు నమోదయింది.కేరళలోని కొట్టాయం కు చెందిన అతిరా తండ్రి ట్రాన్స్ పోర్ట్ రంగానికి చెందిన వారు. ఆ రకంగా వాహనాల పైన ఇంట్రెస్ట్ తో మోటార్ స్పోర్ట్స్ వైపు వచ్చింది అతిరా.2000 లో తొలిసారిగా జాతీయ […]

ఎడారిలో ఉపాధి

ఆమ్లా అశోక్ రుయా ముంబైలో స్థిరపడిన ప్రభుత్వ సామాజిక కార్యకర్త.ఎడారి భూములను సస్యశ్యామలంగా మార్చి వాటర్ మదర్ ఆఫ్ ఇండియా గా పేరు పొందారు.2003లో ఆకర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి చెక్ డ్యామ్ లు, చెరువులు నిర్మించారు.2006లో రాజస్థాన్ లోని మండవార్ లో మొదటి చెక్ డ్యామ్ పని మొదలుపెట్టి స్థానికుల సాయంతో ఆ గ్రామాల్లో చెరువులు నిర్మించారు అక్కడే బంజారా భూముల్లో నదులను పారించారు. నెమ్మదిగా పంటలు పండాయి 11 లక్షల మంది గ్రామీణులకు […]

గిరిజన గ్రామంలో ఉచిత బడి

జిలింగ్‌సెరెంగ్ పశ్చిమబెంగాల్ లోని ఒక గిరిజన గ్రామం.12వ తరగతి చదువుకున్న మాలతి ముర్మ ఆ గ్రామంలో గిరిజన బాల బాలికల కోసం తన ఇంటిని బడి గా మార్చింది.ఆమె నివసించే మట్టి గదుల ఇంట్లో మాలతి బాల స్కూల్ పేరుతో ఉచిత విద్య బోధన చేస్తోంది. ఇంగ్లీష్,గణితం,సైన్స్ లో ప్రాథమిక పాఠాలు బోధిస్తోంది.ఆమెకు ఎలాంటి ఉపాధ్యాయ శిక్షణ లేదు అయినా గిరిజన బాలలను విద్యావంతుల్ని చేయడం ఆమె లక్ష్యం.45 మంది పిల్లలతో ఆమె పాఠశాల విజయవంతంగా నడుస్తోంది.