వయసును స్వీకరించండి

వయసును స్వీకరించండి

వయసును స్వీకరించండి

40ల్లో 20 ఏళ్ల వారిలా కాకుండా 40 లాగే కనిపించాలి అంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్  రుజుత దివేకర్. బరువు పరిమాణం ఆరోగ్యానికి కొలమానం కావు అంటున్నారు.వయసు తక్కువగా కనిపించాలని తాపత్రయం తో డైటింగ్ లు వ్యాయామాలు చేసినంత మాత్రాన సౌందర్యం పెరగదు.అసలైన ఆరోగ్యం సంతోషం, క్రమశిక్షణ గల జీవిత విధానం మొదలైన వాటితో ముడిపడి ఉంటుంది.40 ఏళ్లు దాటుతుంటే,పెరిగే వయసుకు తగ్గట్టు శరీరం తనను తాను సర్దుబాట్లు చేసుకుంటుంది. ఇదే ఆరోగ్యం హాయిగా సీజనల్ స్వీట్లు తో సహా అన్ని తినటం, కాసేపు నడక, కంటి నిండా నిద్ర చాలు. రెండు కాళ్లపైన నిలబడితే శరీరం తేలికగా చురుగ్గా కదిలితే ఆరోగ్యంగా ఉన్నట్లే అంటున్నారు రుజుతా.