సైన్స్ అంటే భయపడే విద్యార్థుల కోసం ‘క్యూరియస్’ ప్లే లాబ్స్ నెలకొల్పారు సరయు గార్గ్. భర్త ఐఏఎస్ ఆఫీసర్ అభిజిత్ తో కలిసి పిల్లల కోసం చండీగఢ్ లో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ లో పిల్లలకు ప్రయోగాత్మకంగా పాఠాలు చెబుతారు.కార్పొరేట్ చదువులతో క్రీడలు మర్చిపోతున్న పిల్లలకు వివిధ సంస్థల సహకారంతో ఆట స్థలాలు ఆధునీకరించారు. పేద విద్యార్థులకు ఆట సామాగ్రి అందించారు చండీగఢ్ లో పుట్టి పెరిగిన సరియు ఇంజనీరింగ్ చదివారు.అభిజిత్ తో కలిసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం సైన్స్ మ్యాథమెటిక్స్ నేర్పే ప్రయోగాలు చేస్తారు.













