Gagana
మహిళల రక్షణ ధ్యేయం
అస్సాం లోని లుండింగ్ లో పుట్టిన పల్లబి ఘోష్ బాలికల,మహిళల అక్రమ రవాణా నిరోధక కార్యకర్తగా పనిచేస్తున్నారు. పదివేల మంది అమ్మాయిలను ఈ ఊబి నుంచి రక్షించారు. ఇంగ్లీష్ లిటరేచర్ లో పీజీ చేసిన పల్లబి చదువు పూర్తి చేశాక హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధానికి పనిచేసే శక్తి వాహిని అనే ఎన్జీవో ఏర్పాటుచేసి హ్యూమన్ ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. హరియాణా,రాజస్థాన్,ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమబెంగాల్ లో పనిచేస్తుంది.
గిరిజన సంస్కృతి పరిరక్షణ ధ్యేయం
భారతదేశంలోని మైనారిటీ గిరిజన భాషలను పరిరక్షించటం కోసం గిరిజన భాషకు లిపి కనుగొనటం గిరిజన విద్యార్థుల అక్షరాస్యత కోసం పనిచేశారు సత్తుపాటి ప్రసన్న శ్రీ. ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ గా చరిత్ర సృష్టించారు అసోసియేట్ ఆచార్యులుగా ఆపై ప్రొఫెసర్ గా విధులు నిర్వహించారు. గిరిజన చరిత్ర సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కు నడుం కట్టారు ప్రసన్న శ్రీ. 30 కి పైగా దేశాల్లో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్న ప్రసన్న శ్రీ నారీ శక్తి […]
ఇది అపూర్వ గౌరవం
జాతీయ అవార్డు తీసుకున్న ఉత్తమ నటి కీర్తి సురేష్ ను యూనిసెఫ్ ఇండియా తమ కొత్త సెలబ్రిటీ అడ్వకేట్ గా నియమించింది.తమిళ్, తెలుగు, మలయాళం సినిమాల్లో ఎన్నో అవార్డులు తీసుకున్న కీర్తి పిల్లల హక్కుల కోసం పనిచేసేందుకు అంగీకరించటం మాకు ఎంతో గర్వకారణం అన్నారు. యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా మెక్‌కాఫ్రీ ఈ కొత్త బాధ్యత తీసుకోవడం విషయంలో కీర్తి తన సంతోషం వ్యక్తం చేసింది. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అంటుంది.
మహిళా క్రికెట్ కు చిరునామా
మహిళా క్రికెట్ కు అంతగా ఆదరణ లేని రోజుల్లోనే క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకుని అమోఘమైన పోరాట స్ఫూర్తితో క్రీడల్లో ఎదురైన సవాళ్లను గెలిచి దేశంలో ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తి ఇచ్చింది మిథాలి రాజ్ తన నాయకత్వ ప్రతిభ తో మహిళల క్రికెట్ స్థాయిని పెంచింది. జాతీయ జట్టును నిర్మించటం కష్టమైన రోజుల్లోనే జట్టును ముందుకు నడిపించింది. 23 ఏళ్ల పాటు మిథాలి క్రికెట్ మైదానం లో బ్యాట్ తో గర్వంగా నిలిచింది. మహిళల క్రికెట్ […]
మినియేచర్ ప్లాంట్స్
కదంబం, పారిజాతం, మందారం, నూరువరహాలు వంటి పెద్ద మొక్కలను మినీ సైజ్ లో ఇస్తున్నారు శాస్త్రవేత్తలు తెల్లని పూలతో పరిమళాలు వెదజల్లే మధు కామిని ఆరెంజ్ జాస్మిన్ మొక్క ను కూడా డ్వార్ఫ్ ఫ్లవర్ ప్లాంట్ గా తీర్చిదిద్దారు. దేవ గన్నేరు సంపంగి నందివర్ధనం పూల చెట్లు కూడా ఇప్పుడు కుండీల్లో పొట్టి చెట్లు గా పెంచుకోవచ్చు. తక్కువ స్థలంలో ఎన్నో రకాల మినియేచర్ చెట్లను కుండీల్లో పెట్టుకోవచ్చు మన బాల్కనీలో ఒక ఉద్యానవనం సృష్టించవచ్చు.
రేసింగ్ ఛాంపియన్
బెంగళూరుకు చెందిన ఐశ్వర్య పిస్సే రేసింగ్ అబ్బాయిలకే అనే ముద్ర చెరిపేశారు. పోర్చుగల్ లో జరిగిన ఎఫ్.ఐ.ఎ.ఎమ్ వరల్డ్ ర్యాలీ రైడ్ ఛాంపియన్షిప్ లో ఉమెన్ విభాగంలో విజేతగా నిలిచారు. 2017 లో అత్యంత క్లిష్టమైన రైడ్ ది హిమాలయాస్ తో పాటు 2017 – 2022 వరకు ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్ షిప్ లను సొంతం చేసుకున్నారు. ఎఫ్.ఐ.ఎమ్ బజాజ్ వరల్డ్ కప్ లో విజయం సాధించి మోటార్ స్పోర్ట్స్ విభాగంలో ప్రపంచ టైటిల్ […]
ఎడారిలో యాపిల్ పంట
రాజస్థాన్ కు చెందిన సంతోష్ దేవి ఖేదర్ యాపిల్ పంట వేసి తోటి రైతులకు ఒక కొత్త దారి చూపించింది. సాధారణంగా చల్లని ప్రదేశాల్లో పండే యాపిల్ ను ఎంచుకోవడం సంతోష్ మొదటి విజయం.2019లో ఆమె సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో 220 దానిమ్మ మొక్కలను నాటింది. ఆ చెట్టు ఫలితాలు ఇచ్చాయి. అటు తరువాత ఆమె తన పొలంలో వంద యాపిల్ మొక్కలు నాటారు. రాజస్థాన్ ప్రాంతంలో ఉండే వేడి వాతావరణంలో యాపిల్ పంట గురించి ఆలోచించటం […]
అంతరిక్షంలోకి కైవల్య
ఆంధ్రప్రదేశ్ కు చెందిన కుంచల కైవల్య రెడ్డి తాజాగా అంతరిక్షంలోకి అడుగుపెట్టే అరుదైన అవకాశం సాధించింది. టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టనున్న వ్యోమగామి శిక్షణ కోసం 36 దేశాల నుంచి వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కుంచల రెడ్డి 150 మంది ఎంపికైన వారిలో ఒకరు. కైవల్య ఎనిమిది, పదో తరగతి నుంచి ఎన్నో విజయాలు సాధించింది. 98 దేశాలు పాల్గొనే ఖగోళ, భౌతిక శాస్త్ర పోటీల్లో సిల్వర్ హానర్ సర్టిఫికెట్ […]
వయస్సు ఒక సంఖ్య మాత్రమే
కేరళ కు చెందిన ఇద్దరు స్నేహితులు సరోజినీ పద్మావతి 70 ఏళ్లు దాటాక లోకం చుట్టేయాలనుకున్నారు. ఒక విదేశం తో సహా 13 ప్రాంతాలు చూసి వచ్చారు. శబరిమల, గురువాయూర్, వారణాసి, బద్రీనాథ్, రాజస్థాన్, గుజరాత్, కాశ్మీర్ ఇలా ఎన్నో ప్రాంతాలు తిరిగారు. ఎన్నో నెలల పాటు పెన్షన్ డబ్బులు దాచుకొని ఈ పర్యటనలు ప్లాన్ చేసుకున్నారు. ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఇలా పర్యటనలు కొనసాగిస్తూనే ఉంటామన్నారు ఈ స్నేహితులు. పెళ్లి పిల్లలు, బాధ్యతలు అన్ని పూర్తయ్యాకనే ఈ […]
మష్రూమ్స్ తో ఆర్థిక విజయం
బీహార్ లోని ముంగేర్ జిల్లాకు చెందిన బినా దేవి తన ఇరుకైన గదిలో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించి తన భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నది. బాగల్ పూర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పుట్టగొడుగుల పెంపకం లో శిక్షణ తీసుకుని వాటిని పెంచడం ప్రారంభించిన బినా దేవి సంవత్సరానికి లక్షలు ఆర్జిస్తోంది. ఆమెను మష్రూమ్స్ లేడీ అంటారు. బీహార్ లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుంచి కిసాన్ అభినవ పురస్కారం అందుకున్నది. తన చుట్టూ ఎందరో మహిళలకు పుట్టగొడుగుల పెంపకం లో […]
నాయకత్వ శిక్షణ కోసం వితరణ
హరీష్ అండ్ బినా షా ఫౌండేషన్ ద్వారా 2010 నుంచి అనేక దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బీనాషా.ప్రస్తుతం సిగ్నెట్ కాపిటల్ బిజినెస్ నడుపుతున్న బినా కళలు,విద్య పర్యవరన పరిరక్షణ ఆరోగ్యం జీవనోపాధి విభాగాల్లో విరాళాలు,గ్రాంట్లు అందిస్తోంది.అశోక యూనివర్సిటీ కి అత్యధిక మొత్తంలో విరాళం వీరి నుంచే అందింది.ఇండియా లీడర్స్ ఫర్ సోషల్ సెక్టార్ సంస్థ తో కలిసి ఎన్జీఒ ల విభాగం లో నాయకత్వం శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతోంది.వివిధ రంగాల్లో సమర్థులైన సాహసికులైన యువ నాయకులను తయారు […]
నాయకత్వ శిక్షణ కోసం వితరణ
హరీష్ అండ్ బినా షా ఫౌండేషన్ ద్వారా 2010 నుంచి అనేక దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బీనాషా.ప్రస్తుతం సిగ్నెట్ కాపిటల్ బిజినెస్ నడుపుతున్న బినా కళలు,విద్య పర్యవరన పరిరక్షణ ఆరోగ్యం జీవనోపాధి విభాగాల్లో విరాళాలు,గ్రాంట్లు అందిస్తోంది.అశోక యూనివర్సిటీ కి అత్యధిక మొత్తంలో విరాళం వీరి నుంచే అందింది.ఇండియా లీడర్స్ ఫర్ సోషల్ సెక్టార్ సంస్థ తో కలిసి ఎన్జీఒ ల విభాగం లో నాయకత్వం శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతోంది.వివిధ రంగాల్లో సమర్థులైన సాహసికులైన యువ నాయకులను తయారు […]
ఉదార హృదయం
రోహిణి నీలేకని భారతీయ రచయిత్రి.త్రాగునీరు పిల్లలకు ఉచిత విద్య,పారిశుద్ధ్య సమస్యల పైన పనిచేసే అర్ఘ్యం ఫౌండేషన్ స్థాపించారు.అలాగే అక్షర ఫౌండేషన్ అధ్యక్షురాలు కూడా.లాభ పేక్ష లేని ఏక్ స్టెప్ సహ వ్యవస్థాపకురాలు.రోహిణి నీలేకని ఫిలాంత్రోపీస్ చైర్ పర్సన్.గత ఐదేళ్లుగా హరూన్ ఫిలాంత్రోపీ జాబితాలో చోటు దక్కించు కొంటున్నారు.ముంబాయ్ లో పుట్టిన రోహిణి ఫ్రెంచ్ లిటరేచర్ లో డిగ్రీ తీసుకొన్నారు.ప్రముఖ వార్తా పత్రికల్లో పని చేశారు ప్రభుత్వం తో,ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసిన రోహిణి సహజ వనరులు,పర్యావరణ […]
మహిళా సంక్షేమం ధ్యేయం
షీలా కొచౌసెఫ్ 40 ఏళ్ళ వయసులో వ్యాపారం లోకి వచ్చి కొచ్చి కేంద్రం గా వి స్టార్ అనే పేరుతో ఇన్నర్ వేర్ అమ్మకాలు చేశారు.ఆమె భర్త కొచౌసెఫ్ చిట్టిల పిల్లి గ్రూప్ వి స్టార్ గ్రూప్ యజమాని.1995 లో ప్రారంభించిన ఈ సంస్థ అధిక నాణ్యత గల లోదుస్తుల బ్రాండ్ గా వెళ్ళాలనుకొన్నారు.టర్నోవర్ వంద కోట్ల పైనే ఉంటుంది.ఈ కుటుంబానికి చెందిన చిట్టిల పిల్లి ఫౌండేషన్ ద్వారా ప్రధానంగా సామాజిక సంక్షేమం […]
పిల్లల సంరక్షణ కోసం వితరణ
దేశంలో ఎందరో వికలాంగులకు మేధోపరమైన సేవలందిస్తున్న పురాతన,అతి పెద్ద సంస్థ జై వకీల్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు అర్చన చంద్ర సిఇఒ మానసిక సంతులిత దెబ్బతిని వాళ్ళేం చేస్తున్నారో,వాళ్ళకే తెలియని పిల్లలకు ఆసిరా ఎంతో అవసరం అనిపించక భర్త అమిత్ చంద్ర సహకారం తో ఎ టి ఈ చంద్ర ఫౌండేషన్ నెలకొల్పి పిల్లల ఆరోగ్యం కోసం పని చేస్తున్నారు అర్చన చంద్ర గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ఉండే సమస్యల పరిష్కారం చేసేందుకు,నీటి వనరుల […]
గర్భిణీల ఆరోగ్యం లక్ష్యం
ఇనా అశ్విన్ డాని నాలుగు దశాబ్దాలుగా టెక్ రంగంలో ఉన్నారు.ఆసియన్ పెయింట్స్ లిమిటెడ్ ప్రమోటర్ గ్రూప్ సభ్యురాలు ఏషియన్ పెయింట్స్ మాజీ ఎండి అశ్విన్ సూర్యకాంత్ డాని ని పెళ్లాడిన ఇనా ఆ సంస్థకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా.యోగా శిక్షకురాలు హోమ్ విల్లా యోగ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గర్భిణులకు తన ఫౌండేషన్ ద్వారా ప్రినేటల్ యోగ నేర్పిస్తున్నారు.అలాగే డాని ఫౌండేషన్ ద్వారా సామాజిక అభివృద్ధి విద్య సాధికారత వంటి వాటిలో సేవలు […]
ఇది కళాత్మకమైన స్టోర్
పాతకాలపు అందమైన చీరలకు పూర్వ వైభవాన్ని తెచ్చి పెట్టాలని కోరిక తో నెరిగే స్టోరీ పేరుతో చీరల వ్యాపారం మొదలుపెట్టింది పూజ నాడిగ్ బెంగళూరుకు చెందిన పూజ ఇంజనీరింగ్ చదివి టి సి ఎస్ లో ఐదేళ్లపాటు ఉద్యోగం చేసి తర్వాత చీరల వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నది.వారణాసి, మధురై, తమిళనాడు, కర్ణాటక, జైపూర్, కోల్కత్తా లోని చేనేత కళాకారులు చేత ప్రత్యేకంగా వస్త్రాలు నేయించి వాటిని డిజైన్ చేసి నెరిగే స్టోరీ లో అమ్మకాలు ప్రారంభించారు పూజ […]
వర్జినియా లెఫ్టినెంట్ గవర్నర్ గజాలా
హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన గజాలా హష్మి ఇప్పుడు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ అయ్యారు తండ్రి ఉద్యోగరీత్యా నాలుగేళ్ల వయసులో అమెరికాలోని జార్జియా లోకి వచ్చిన గజాలా అమెరికన్ లో పి.హెచ్.డి చేశారు తర్వాత ప్రొఫెసర్ గా పని చేశారు. సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ స్థాపించి పదవీ విరమణ చేసే వరకు డైరెక్టర్ గా కొనసాగారు. 2019లో రాజకీయాల్లో ప్రవేశించి రిపబ్లికన్ ఉన్న స్టేట్ సెనేటి సీట్ లో సంచలన విజయం పొందారు. 2024లో సెనేట్ […]
సంగీతంతో ఆరోగ్యం
సంగీతంతో తల్లికి గర్భంలో ఉండే బిడ్డ కు అనుబంధం ఏర్పడుతోంది అంటారు దివ్య లక్ష్మి బీటెక్ చదివిన దివ్య లక్ష్మి చెన్నైలో ఆరోహణ అనే పేరుతో సంగీత పాఠశాల నెలకొల్పింది. కుమార్తె ఆరోహి పుట్టాక తన బిడ్డ తన గర్భంలో ఉండగానే రోజు సంగీతం వినడం వల్ల ఎన్నో తెలివితేటలతో జన్మించిందని అర్థం చేసుకున్నది. సంగీతం గర్భిణీ లో ఉండే యాంగ్జైటీ బిపి వంటి సమస్యలను దూరం చేస్తుందని స్వీయ పరిశీలన తో అర్థం చేసుకున్నది. సంగీతం […]
కాలాన్ని జయించిన అందం
ఫ్యాషన్ ప్రపంచం లోకి 58 ఏళ్ల వయసులో అడుగుపెట్టిన జర్మన్ మోడల్ గినా (Gina drewalowski) ఇటీవల ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో రన్ వే పైన నడిచి ప్రశంసలు అందుకున్నది కమ్యూనికేషన్స్ మార్కెటింగ్ రంగంలో చేసిన గినా పట్టుదల జీవశక్తి సానుకూల మనస్థత్వం ఎంతో మందికి ఆదర్శం వృద్ధాప్యంలోనూ వెలుతురు నింపుకున్న ఆమె నమ్మకం, జీవిత ప్రయాణం మహిళలు తలచుకుంటే ఎలాంటి ప్రయాణం చేయగలరో నిరూపిస్తుంది. కలలను కొనసాగించే విషయం లో వయసు ఒక సంఖ్య […]
