Top News
Prawaas (మరాఠీ సినిమా)
అభిజిత్ లత అనే వృద్ధ దంపతులు చేసిన జీవిత ప్రయాణం ప్రవాస్.ఈ మరాఠి సినిమాకు శశాంక్ ఉదపూర్కర్ దర్శకత్వం వహించిన అభిజిత్ డయాలసిస్ పైన జీవిస్తూ ఉంటాడు మంచి కుటుంబం భార్య కొడుకు తో సంతోషంగా ఉంటాడు ఇలా సామాన్యంగా జీవించటం తోనే జీవిత గమ్యం కోరుకొంటాడు. జీవితానికో సార్థకత ఉండాలనుకుంటాడు. తన కారును అంబులెన్స్ గా మార్చి అవసరమైన వాళ్ళకు హాస్పిటల్కు తీసుకు పోతూ ఉంటారు. ఈ ప్రయాణంలో అతనో ప్రముఖ హీరో ను కలుస్తాడు […]
18 presents (ఇటాలియన్ సినిమా)
తల్లికి బిడ్డ తో ఉండే బంధం చాలా ప్రత్యేకం 40 వారాల గర్భవతిగా ఉన్న ఎలిసా ఒక పరీక్షలో టెర్మినల్ క్యాన్సర్ అని తేలుతుంది.మరణానికి చేరువలో ఉన్న ఎలిసా తన పుట్టబోయే బిడ్డకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతి పుట్టిన రోజుకు ఇచ్చేలా కొన్ని బహుమతులు కొంటుంది. ఆమెకు జన్మించిన అన్నా కు 17 వ సంవత్సరం వచ్చే వరకు ప్రతి సంవత్సరం అందే బహుమతులు అసహ్యించుకొంటుంది.18 వ సంవత్సరంలో అడుగుపెట్టాక జరిగిన ఒక సంఘటన […]
Lion 2016 సినిమా
లూక్ డేవిస్ రాసిన A Long way Home ఆధారంగా తీసిన సినిమా ఇది. ఐదేళ్ల సారో అన్న పిల్లవాడు తప్పిపోయి ఆర్ఘనేజ్ కి చేరుతాడు. అతన్ని ఒక ఆస్ట్రేలియన్ దంపతులు పెంచుకొంటారు. 20 ఏళ్ల తర్వాత సారో వాళ్ళ తల్లితండ్రుల కోసం గూగుల్ సర్చ్ చేసి,వెతికి కలుసుకోవటం ఈ సినిమా కథ సారో అన్న పేరు గుర్తించుకొన్నాడు కానీ ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఉంది. ఈ చక్కని సినిమా ఆస్కార్ లో ఆరు […]
వికృతి (మలయాళం సినిమా)
ఈ లాక్‌డౌన్ సమయంలో చూడవలసిన ఇంకో గొప్ప సినిమా వికృతి. మెట్రో రైల్ లో జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా తీసిన సినిమా. ఎల్దో అతని భార్య ఎల్సీ ఇద్దరూ బధిరులు. ఎల్దో స్కూల్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతని కూతురు అనారోగ్యంతో ఐ సి యు లో ఉంటుంది రెండు రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపిన ఎల్దో ఒళ్ళు తెలియకుండా మెట్రో రైల్లో నిద్రపోతాడు.ఆ సమయంలో ఆ రైల్ లో ఉన్న ఇంకో […]
ఆర్టికల్ 15
ఆయుష్మాన్ ఖురానా పోలీస్ ఆఫీసర్ గా నటించిన హిందీ చిత్రం ఆర్టికల్ 15 చూడ దగిన ఒక పవర్ ఫుల్ నినిమా. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ఈ సినిమా కి ఆధారం. ఈ సినిమా గురించి ఎంత రాసిన తక్కువే. కులాల మధ్యనే ఉండే దారుణమైన తేడాలు మూడు రూపాయల కూలీ అడిగినందుకు ముగ్గురు గ్రామీణ బాలికలను రేప్ చేస్తారు. ఇద్దరిన్ని ఉరి తీస్తారు. మూడో అమ్మాయి దొరకదు. కొత్త ఆఫీసర్ ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ […]
MUMBAI Meri Jaan
ఈ లాక్ డౌన్ సమయంలో ఏర్పడే ఒత్తిడి కి ఉపశమనం ముంబయ్ మేరి జాన్ సినిమా. ఇది జులై 11,2006 లో ముంబయ్ రైలు బాంబ్ దాడుల సేపద్యంలో జరిగిన కథ ఇక్కడే జీవించే ఎంతో మంది ప్రజల ఆత్మ ఈ చిత్రం. ఆనాటి రైల్ బాంబు తో 209 మంది మరణించారు. 700 మందిపైగా గాయపడ్డారు. సినిమాలో ఒక సక్సెస్ ఫుల్ టివి రిపోర్టర్ గా సోహా ఆలీఖాన్,పర్యావరణ స్పృహ ఉన్న ఎగ్జిక్యూటివ్ గా మాధవన్ […]
గులాబో – సీతాబో
ఈ లాక్ డౌన్ లో తప్పకుండా చూడవలసిన సినిమా గులాబో సీతాబో. ఒక పురాతనమైన హవేలీ.మిర్జానవాబ్,ఫాతిమా బేగం ఈ హవేలీ యజమానులు . ఈ హవేలీ లో ఎంతో మంది అద్దెకుంటారు. ఎవ్వళ్ళూ సరిగ్గ అద్దెకట్టరు. మీర్జా నవాబ్ ఇతని కంటే 15 ఏళ్ళు పెద్దది. ఈ హవేలీ ని పురావస్తు శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి అప్పగించాలని,పురాతన భవనం కూలి పోతుందనీ నోటిస్ లెస్తారు. మీర్జా ఈ హవేలీని రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మేయాలని ప్రయత్నాలు చేస్తాడు. 70 […]
చొకేడ్ (సినిమా )
ఈ లాక్ డౌన్ సమయం సద్వినియోగం చేసుకోవాలంటే చూడవలసిన సినిమా మంచి సినిమా చొకేడ్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిమానిటైజేషన్ సమయంలో జరిగే అవకాశం ఉన్న చక్కని సినిమా.సవిత ఒక సాధారణ గృహిణి.లోకల్ బ్యాంక్ లో క్యాషియర్ ఒక కొడుకు,గిటార్ వాయించడం తప్ప సంపాదన తెలియని భర్త.చుట్టూ అపార్ట్మెంట్ మిత్రులు ఈ పాత ఫ్లాట్ లో ఒక డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చి సవిత ఇంట్లో డ్రైనేజ్ పైప్ లోంచి ప్లాస్టిక్ పోట్లలో చుట్టిన […]
పిహు( Thriller Movie )
వినోద్ కప్రి తీసిన పిహు సినిమాలో రెండేళ్ల పాప మైరా విశ్వకర్మ ఒక్కతే యాక్టర్.గౌరవ భార్య పూజ భర్తతో గొడవపడి ఆత్మహత్య చేసుకుంటుంది.రెండేళ్ల పాప పిహు ఒంటరిగా ఆ ఇంట్లో తండ్రి వచ్చే వరకు ఎన్ని రకాల ప్రమాదాలకు దగ్గరగా వెళుతుంది ఈ సినిమా కథ. సినిమా చూస్తుంటే మన ఇళ్ళల్లో ఇన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా అనిపిస్తుంది. తాత్కాలికమైన ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకునే ఎంతో మంది తల్లిదండ్రులు ఒక్క నిమిషం తమ సంతానాన్నిఎంత ఒంటరిగా […]
రియల్ హీరో
నేనూ వలస కార్మికుడినే అంటున్నాడు సోను సూద్ తెరపైన తిరుగులేని విలన్ గా నటించిన సోను సూద్ నిజ జీవితంలో ఇన్స్పైరింగ్ హీరో అనిపించుకున్నాడు లాక్ డౌన్ సమయాన వలస కార్మికులు వేలాది మంది రోడ్డున పడి నడిచిపోతుంటే చలించిపోయిన సోను సూద్ వాళ్లందరినీ ఇళ్లకు చేర్చే వరకు నిద్రపోలేదు. కరోనా సహాయ కార్యక్రమాల్లో భాగంగా జుహు లో వున్న తన హోటల్ ను కరోనా రోగులకు వైద్యం చేస్తున్న వైద్య సిబ్బందికి కేటాయించారు. ఇక ముంబై […]
“శ్రీ సౌమ్యనాథ స్వామి ప్రసాదం”
కడప జిల్లా అంటే తిరుపతి కడప మధ్యలో నందలూరులో ఈ స్వామివారి ఆలయం ఉంది.ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రత్యక్ష దైవం. 15శతాబ్దానికి చెందినదని చోళ రాజుల కాలం నుంచి కృష్ణ దేవరాయల వరకు ఈ ఆలయాన్ని అభివృధ్ధి చేశారని చెప్తారు. చీకట్లో కూడా స్వామి వారిని చక్కగా నఖశిఖ పర్యతం దర్శనం చేసుకుని కటాక్షం పొందడం అదృష్టం.అన్నమాచార్యులవారికి నందలూరితో అవినాభావ సంబంధము ఉన్నట్లు ఆయన రచించిన కీర్తనలలో నందలూరు గురించి ప్రస్తావన చేశారు. నిత్య ప్రసాదం:కొబ్బరి,పులిహోర,పొంగలి […]
“దుర్గా పరమేశ్వరి ప్రసాదం”
కర్నాటక రాష్ట్రంలో కటీల్ దుర్గా పరమేశ్వరి అలయంవుంది.ఈ ఆలయం నందిని అనే నది మధ్యలో పార్వతీదేవి మనకు దర్శనం ఇస్తారు. ఈ ఆలయం మాంగలూర్ సమీపంలో ఉంది.జాబాలి మహర్షి తపస్సు చేస్తున్న సమయంలో అసురుల బాధలు భరించలేక, జనుల ఆకలి బాధ చూడలేక ఇంద్రుని ఆశ్రయించి తన కామధేనువుని పంపించమని అడిగిన, ఇంద్రుడు తన కుమార్తె నందినిని పంపించారు.నందినికి చాలా పొగరు కావున ఏ మాటను లెక్క చేయకుండా వచ్చింది అప్పుడు జాబాలి నదిగా ప్రవహించు అని […]
“బ్రహ్మ తపస్సు ప్రసాదం”
మానవుల నుదుటి రాత రాసేది ఆ బ్రహ్మగారే కదా!! ఆయనగారు మరి తన కూతురునే వివాహమాడాడు.శివుని శాపం వల్ల బ్రహ్మకి ఎక్కువ ఆలయాలు,పూజలు ఉండవు. సరస్వతీ పురాణంలో బ్రహ్మ సరస్వతి,సంధ్య,బ్రాహ్మి అని ముగ్గురుని తన తపశ్శక్తితో సృష్టించాడు.వీరిలో సరస్వతి అపురూప సౌందర్యవతి కావున ఆమెను పెండ్లాడి మానవులను సృష్టించాలని సంకల్పించాడు. సరస్వతీ దేవి తన కనుసన్నల్లోనే వుండాలని తన నాలుగు తలలతో ఎల్లప్పుడూ దృష్టి పెట్టేవాడు.చివరికి సరస్వతీ దేవిని వివాహం చేసుకుని వంద సంవత్సరాలు ఏకాంతంలో వుండి […]
మంచి సినిమా ‘ అప్నా ఆస్మాన్ ‘
అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న అప్నా ఆస్మాన్ దర్శకుడు కౌషిక్ రాయ్,రవి, పద్మినీ ల కొడుకు ఆటిజం ఉన్నట్లు తేల్చారు డాక్టర్లు. పైగా స్లో లెర్నర్.అబ్బాయి పెంపకం లో ఇద్దరి జీవితం కాస్త ఒడి దుడుకులు పడుతోంది.ప్రత్యేక అవసరాలున్న బిడ్డను పెంచడం కష్టమే కదా. అలాంటి పిల్లవాడికి ఒక డాక్టర్ సలహాతో ఒక ఇంజక్షన్ ఇస్తాడు తండ్రి. పిల్లవాడు చైల్డ్ సూపర్ స్టార్ అవుతాడు ఆటిజం పిల్లవాడు చాలా మేధావి అయిన సందర్భంలో తల్లిదండ్రులు జీవితాల్లో ఏమైంది.చైల్డ్ సూపర్ […]
“దుర్గా దేవి ప్రసాదం”
అష్టాదశశక్తిపీఠాలు అంటే పార్వతీ దేవి అవతారాలు.సతీ దేవి అంశలో తండ్రి దక్ష యఙ్ఞంలో చేసిన అవమానం భరించలేక తనను తాను అగ్నిలో దహనం చేసుకుంది.అది వినిన శివుడు రుద్ర రూపుడై కాళ రుద్రుడై సతీ దేవి పార్థివ శరీరాన్ని తన భుజం మీద వేసుకుని రుద్ర తాండవం చేస్తున్న సమయంలో ఆమె శరీర భాగాలు ఒక్కొక్క ప్రదేశంంలో పడిన ఆ ప్రదేశాలను అష్టాదశ శక్తిపీఠాలుగా పార్వతీ దేవి మనకు ఒక్కొక్క అవతారంలో దర్శనం ఇస్తుంది. దుర్గ,కాళి,సింహవాసిని ఇలా […]
మన తెలుగు సామెతలు
ప్రతి మనిషికీ కొన్ని కర్తవ్యాలు,ధర్మాలు ఉంటాయి. అలా ఎవరి పని వారు చేసుకుంటూ అదేదో ప్రపంచాన్ని ఉద్దేశించి నట్లు మాట్లాడుతూ ఉంటారు కొందరు అలాంటి వారి గురించి వచ్చిన సామెత. *ఆలికి అన్నంపెట్టి ఊరికి ఉపకారం చేశా నన్నాడట ! […]
“పంచముఖేశ్వరుని ప్రసాదం”
కర్నాటక రాష్ట్రంలో బెంగళురుకు కొన్ని కిలోమీటర్ల సమీపంలో ఉన్న పంచ శివలింగలని దర్శనం చేసుకుని వద్దాం పదండి. ఇక్కడ వైద్యేశ్వర, ఆర్కేశ్వర, వాసుకేశ్వర,సాయికటేశ్వర,మల్లికార్జున అను పంచశివలింగాలు ఇక్కడ ప్రసిద్ధి.పూర్వ కాలంలో విజయ నగరం మరియు మైసూరు మహారాజులు ఈ ఆలయంను పర్యవేక్షణ చేస్తూ వున్నారు.ఒకసారి మైసూరు మహారాజుకి అలిమేలు అమ్మవారి నగల మీద కన్ను పడింది. అది గమనించిన అమ్మ నగలతో సహా కావేరి నదలో దూకి చనిపోయిందిట.ఇక్కడ శివుడిని వైద్యనాధుడి గా కొలుస్తారు. నిత్యప్రసాదం:కొబ్బరి,అభిషేకం -తోలేటి […]
Joseph (2018,Malayalam)
మళయాల సినిమా జోసెఫ్ ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ జోసఫ్ ఎక్స్ వైఫ్ మరణం తర్వాత అది హత్యగా అర్థం చేసుకున్నాడు. అంతకుముందే వారి కూతురు యాక్సిడెంట్ లో చనిపోతుంది ఈ కేసు విచారణ క్రమంలో దాని వెనక ఒక కార్పొరేట్ హాస్పిటల్ హస్తం ఉందని ,అవయవాల మాఫియా జరుగుతోందని తెలుసుకుంటారు. ఎంతో పరిశోధన తర్వాత కొన్ని వందల మంది అమాయకులు బలి అయిపోయిన ఈ కేసు కోర్టుకు తెచ్చేందుకు తన ప్రాణాలనే పణంగా […]
“పార్ధసారధి ప్రసాదం”
తమిళనాడులో ట్రీప్లికేన్ లో వున్న పార్ధసారధి దేవాలయంను తమిళనాడు యాత్రలకు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోవాలి.ఇక్కడ దేవాలయాల కట్టడం చూస్తే మన పూర్వీకులు ఎలా నిర్మించారో అని ఆశ్చర్యంగా ఉంటుంది. పార్ధసారధి దేవాలయంలో శ్రీ కృష్ణ పరమాత్మ తన సోదరుడు బలరాముడు,సహోదరి సుభద్ర కొలువై ఉన్నారు.ఇక్కడ స్వామికి మీసాలూ ఉండడం ప్రత్యేకత.కురుక్షేత్ర యుద్ధంలో తగిలిన గాయలు కూడా మనకు కనిపిస్తాయి. నిత్యప్రసాదం:కొబ్బరి,పులిహోర -తోలేటి వెంకట శిరీష
మనసు కదిలించే భయానకం (మలయాళం)
1940లో రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రపంచ జనాభాలో మూడోవంతు మంది జవాన్లు మరణించారు.అందులో ఇండియాలో 87,000 మంది అయితే కుట్టినాడ్ లో 650 మంది సోల్జర్స్ చనిపోయారు.ఈ నేపథ్యంలో తీసిన సినిమా ‘భయానకం’. మొదటి ప్రపంచ యుద్ధంలో పనిచేసి వికలాంగుడైన ఒక వ్యక్తి పోస్ట్ మాన్ గా కుట్టినాడ్ వస్తాడు. ఆ వూర్లో ఆర్మీలో చేరిన వాళ్ళు పంపే మనీ ఆర్డర్ లు పంచుతుంటాడు. అంతలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలు అవుతుంది.ఇక మరణ వార్తలు […]
