Tuesday, 22 Sep, 2026

“కన్యకాపరమేశ్వరి ప్రసాదం”

తమిళనాడు రాష్ట్రంలోని నాగర్కోయల్ సమీపంలో కన్యగా కన్యకాపరమేశ్వరి వెలసింది.   పురాణాల ప్రకారం పార్వతీ దేవి వివాహం కొరకు ఎదురుచూస్తూ ఇక్కడ విగ్రహ రూపంలో ఉండిపోయిందిట.పరశురాముడు ప్రతిష్ఠ చేశారు అని అంటారు.పార్వతీ దేవి అతి బలవంతుడైన బాణాసురుని హతమార్చడానికి ఇక్కడ ఉందిట.అట్టి సమయానికి పెళ్లి ముహూర్తం దాటిపోయినందుకు శివుడు యోగ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు.అందుకే పార్వతీ దేవి  వివాహం చేసుకోకుండా కన్యగా ఉండిపోయింది కావున కన్యకాపరమేశ్వరి గా పేరు వచ్చింది. నిత్య ప్రసాదం:కొబ్బరి,పొంగలి,పులిహోర                    -తోలేటి వెంకట శిరీష

మన తెలుగు సామెతలు 

కలిగిన వాడికి అందరు బంధువులే అన్నట్లు అన్న సామెత నిజంగానే అనుభవ సారంలోంచి పుట్టిందే డబ్బున్న వాళ్ళ చుట్టు ఎందరో ఆశ్రతులు ఉంటారు.. డబ్బు అవసరం ప్రతి వాళ్ళను ధనికులకు బంధువులను చేస్తుంది. వాళ్ళలో బంధుత్వం కలుపుకొనేందుకు అందరు ఇష్టపడతారు. డబ్బుతో అవసరం లేనిది ఎవరికీ ? ఏదో ఒక రోజు డబ్బు అవసరం వస్తే ఆదుకోకపోతారా అని కలిగిన వాళ్ళను ఎవ్వరు నొప్పించకుండా జాగ్రత్తగా స్నేహంగా ఉంటారు. ధనికులకు అందరు చుట్టాలే. అనే సామెత ఇలాగే […]

“చెంగాళమ్మ ప్రసాదం”

చిత్తూరు జిల్లాలో శుభగిరికి సమీపంలో కాళింది మరియు నెర్రి అనే నదులకు దగ్గరగా ఈ చెంగాళమ్మ పరమేశ్వరి దర్శన భాగ్యం కలుగుతుంది. పూర్వం ఈ ప్రాంతంలో గొడ్లు తోలుకుంటూ పిల్లలు కాళింది నదిలో దిగేసరికి నదిలో సుడులు వచ్చేటప్పటికి ఏదో ఒక శక్తి తమని పట్టుకుని రక్షించినట్టు అనిపించింది.మరుసటి రోజు మరల వెళ్ళి నదిలో దిగి చూస్తే ఒక రాయి పైన కాళికాదేవి రాక్షసుడిని సంహరిస్తున్నట్టుగా కనిపించిన పిల్లలు ఆ రాయిని ఒడ్డుకు చేర్చి పెద్దల సమక్షంలో […]

మన తెలుగు సామెతలు 

పాత రోజుల్లో ముక్కు సూటిగా,మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడే వాళ్ళు అని చెప్పేందుకు ఈ సామెత ఉదాహరణ.                               ఎక్కడైనా బావ గానీ వంగతోట దగ్గర మాత్రం కాదట ‘ ఎంతటి చమత్కారం బావ అని పిలవటం అంటే చనువుగా బంధుత్వం కలుపుకోవటం కదా. కానీ ఆల పిలిపించు కొన్నవాడు వంగ తోట దెగ్గర మాత్రం కాదని […]

ఆలోచనలు రేపే killa సినిమా 

2014 లో దర్శకుడు,ఛాయాగ్రాహ దర్శకుడు అవినాష్ అరుణ్ మరాఠీలో నిర్మించిన అందమైన సినిమా కిల్లా (కోట). చదువుల్లో చురుగ్గ వుండే చినూ తండ్రి మరణిస్తాడు. తల్లి చేస్తున్న ఉద్యోగంలో ఎక్కువ స్థిరత్వం లేకుండ ఎంతో బాధపడుతూ ఉంటారు. ఈ బదిలీలో పదకొండు సంవత్సరాలు చినూ ని వాళ్ళమ్మ కి ఎంతో ఇబ్బంది కలిగిస్తాయి. ఆలా వాళ్ళు పూణే నుంచి కొంకణీ తీరం లోని ఒక చిన్న ఉరికి బదిలీ అవుతారు చినూ నెమ్మదిగా అక్కడ కొందరు స్నేహితులు […]

నల్ల మిల్లోరి పాలెం కథలు 

పాఠకుల నోరూరించే తెలుగు విందు వంశీ ‘ నల్ల మిల్లోరి పాలెం కథలు ‘ అన్నారు డాక్టర్ జంపాల చౌదరి. ఈ కథల గురించి చెప్పాలంటే ఇవి వంశీ శైలిలో వివిధ పార్ష్వాలకు ఉదాహరణలుగా నిలుస్తాయి. కొన్ని కథలు గాఢంగా మనసుని హత్తుకుంటాయి. తూర్పు గోదావరి జిల్లా మాండలీకం,అక్కడ వ్యాప్తిలో ఉన్న అచ్చ తెలుగు మాటలు నిత్య జీవిత సంభాషణలను తన కథల్లో కి సునాయాసంగా తీసుకొస్తాడు వంశీ. గోదావరి అందలద్దుకొన్న ఈ కథలేంత కమ్మగా ఉంటాయంటే […]

“లక్ష్మీదేవి  ప్రసాదం”

కరాగ్రే వసతే లక్ష్మీ…అంటూ మనం నిద్ర లేవటంతోనే లక్ష్మీదేవిని స్మరిస్తూ లేస్తాం.పౌర్ణమి రోజు లక్ష్మీదేవి పూజ ఎంతో మంచి సత్ఫలితాలిస్తుంది. క్షీరసాగర మధనంలో నుండి లక్ష్మీదేవి జన్మించినది అని,భృగు మహర్షి కుమార్తె అని విష్ణు పురాణంలో చెప్పారు.ప్రతి నిత్యం మనం దేవతామూర్తుల ఆరాధన చేస్తూనే వుండాలి.లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి శుచి,శుభ్రంగా వుండాలి.ఇల్లు శుభ్రంగా వుంచుకోవాలి.వాకిలి కడిగి రంగవల్లులు తీర్చిదిద్దాలి.దాన ధర్మాలు చేయాలి.ఇంటికి వచ్చిన అతిథులను మర్యాదగా వ్యవహరించడం చాలా అవసరం. నిత్య ప్రసాదం:కొబ్బరి,పొంగలి,పాయసం            -తోలేటి వెంకట […]

ఒక మంచి పుస్తకం 

అను బందో పాధ్యాయ రాసిన బహు రూపి గాంధీ ఒక చక్కని పుస్తకం నండూరి వెంకట సుబ్బారావు గారు అనువాదం చేశారు. ఆర్కే లక్ష్మణ్ బొమ్మలతో ఉన్న ఈ చిన్న పుస్తకం పిల్లల కోసం రాసిందే అయన,పెద్దలు కూడా తప్పని సరిగా చదవాలి. మహా నాయకుడు గాంధీ ఒక సామాన్యమైన జీవితం ఎలా గాడిపారు. మలమూత్రాలు ఎత్తి పోయటం నుంచి ప్రతి పని  తప్పని,అవమానకరమని భావించకుండా స్వయంగా చేసి చూపిస్తూ ఇతరులకు స్ఫూర్తి ఇచ్చారు,శారీరక శ్రమ చేయించటం,ఒక […]

మన సామెతలు    

కడుపులో బిడ్డ కడుపులో ఉండగానే కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఈ సామెత కు చక్కని అర్ధం ఉంది. ఊహలతో,కబుర్లతో కాలం గడిపే పనిలేని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళలో కష్టపడే తత్వం ఉండదు. ఊరికే కథలు అల్లటం తప్ప అలాటి వాళ్ళ గురించి బిడ్డ కడుపులో ఉండగానే పేరు పెట్టె వాడుగా వెక్కిరింత ఈ సామెత.        * కట్టె వంక పొయ్యి తీరుస్తుంది.           […]

“వరసిధ్ధి వినాయక ప్రసాదం”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో బహుదా నది ఉత్తరదిశ గా మనకు కాణిపాకం వరసిధ్ధి వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ స్వామి వారికి కొబ్బరి అంటే చాలా ఇష్టం.భక్తులు కొబ్బరి కాయలు కొట్టి ఆ నీళ్ళతో అభిషేకించండి విశేషం.ఈ అభిషేకిం నీళ్ళు స్వామి వారి నుండి ప్రవహిస్తూ ఒక కొలనులా ఏర్పడి కాణిపారకం అని భక్తులు నమ్మకం రాను రాను కాణిపారకం కాణిపాకంగా మారింది.ఈ స్వామి దగ్గర మనం గమనించాల్సినవిషయం ఏమిటంటే ఆయన సన్నిధిలో […]

 తెలుగు సామెతలు 

ఎలుకకు పిల్లి సాక్ష్యం లాగా …… అంటారు. ఒక సంఘటన గురించి సాక్ష్యం చెప్పవలసి వస్తే దాన్ని ప్రత్యక్షంగా చుసిన సాక్షి ఎంతో నిప్పక్షపాత బుద్దితో న్యాయవక్తినుడై నష్టపోయిన వాడికి న్యాయం జరిగేలా ఉండాలి. కానీ అదే సాక్షి నష్ట పరిచిన వాడి తరఫున,అన్యాయాన్ని సమర్థిస్తూ మాట్లాడ వలసి వస్తే ఈ సామెత వాడుతారు. న్యాయంగా,ఎలుక పిల్లి పరస్పర శత్రువులు. ఎలుక కు ఏదైనా అన్యాయం జరిగితే దానికి సాక్ష్యం పిల్లి అయితే,ఇక ఆ వ్యవహారం ఎంత […]

“మంగళగౌరి ప్రసాదం”

బీహార్ రాష్ట్రంలోని పట్నాలో గయ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫల్గుణి నది తీరానికి దగ్గర మంగళగిరి కొండ పైన మంగళగౌరీ దేవి వెలసింది. అష్టాదశ శక్తిపీఠాలలో ఈ ఆలయం కూడా ఒకటి. పార్వతీదేవి వక్షస్థలం ఈ ప్రాంతంలో పడింది అని పురాణ గాథలు.అమ్మవారు సంహారిణీ రూపంలో ప్రత్యక్షమవుతుంది.నంది, ఎదురుగా లింగాకారంలో ఉన్న పరమశివుడు దర్శనం ఇస్తారు.ఇక్కడ మహిషాసుర మర్దిని,అహల్య దేవి ఆలయాలు కూడా చూడవచ్చు.భక్తులు చైత్ర,వైశాఖ,శ్రావణ మాసాలలో అత్యంత ప్రీతి కరమైన మాసం అని […]

తెలుగు సామెతలు 

” కంచు మోగినట్లు కనకము మోగదు “ అంటారు రెండు లోహాలే. కానీ కంచు పాత్ర కింద పడితే పెద్ద శబ్దం వస్తుంది. బంగారు వస్తువు కింద పడితే శబ్దమే రాదు. అంటే ఊరికే శబ్దం చేసే మాటలు జోరుగా మాట్లాడితే ఎం లాభం. అందులో పస ఉండాలి. ఉపయోగం ఉండాలి. బంగారం వలే మాటలు విలువగా ఉండాలి. అందరికీ హితం చేకుర్చాలి అంటారు. ఇలాటి అనుభవ పూర్వకంగా చెప్పే సామెతలు వేలకొద్దీ ఉన్నాయి.     […]

     “శ్రీ కాశీ విశ్వేశ్వరుడి ప్రసాదం”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో కిలోమీటరు దూరంలో కేశవ పేటలో కొండ దిగువున పరమశివుడు, శ్రీ మహావిష్ణువు పక్క పక్కనే ఆలయాలలో కొలువై ఉన్నారు. నాగలింగ వృక్ష పుష్పంలో తెల్లని బుడిప నాగపడిగ లాగ మనకు దర్శనం ఇస్తుంది.ఈ పుష్పాలు శివునికి ఎంతో ప్రీతికరమైనవి.పూర్వం ఒంగోలు రాజు రామచంద్రరాజు ఈ ప్రాంతంలో చెన్న కేశవ స్వామి ని ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించాడు కానీ కొద్ది రోజులకి శత్రు రాజ్యం నుండి రక్షణ కోసం […]

తెలుగు సామెతలు 

ఎరువు సొమ్ము బరువు చేటు,తీయను పెట్టాను తీపుల చేటు,వాటిలో ఒకటి పోతే అప్పుల చేటు. ఇలాటి సామెతలాన్ని అనుభవంతో చెప్పిన సూక్తులు. ఏ పెళ్ళికో పేరంటానికో వెళుతూ,సొంతంగా లేకపోయినా ఏ బంధువులవో,స్నేహితులవో నగలు పెట్టుకుపోతూ ఉంటే ఇంట్లో వుండే పెద్దవాళ్ళు,ఎందుకా ఎరువు సొమ్ములు,ఒకవేళ అవి గాని పోతే అనవసరంగా అప్పుల పాలై పోతాము,లేదా అనవసరపు గొప్పలకు పోవద్దు అని మందలించటమె ఈ సామెతగా మారి వుంటుంది. ‘ ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్లు ‘ సామెత […]

“శ్రీ సౌమ్యనాథ స్వామి ప్రసాదం”

కడప జిల్లా అంటే తిరుపతి కడప మధ్యలో నందలూరులో ఈ స్వామివారి ఆలయం ఉంది.ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రత్యక్ష దైవం.15శతాబ్దానికి చెందినదని చోళ రాజుల కాలం నుంచి కృష్ణ దేవరాయల వరకు ఈ ఆలయాన్ని అభివృధ్ధి చేశారని చెప్తారు. చీకట్లో కూడా స్వామి వారిని చక్కగా నఖశిఖ పర్యతం దర్శనం చేసుకుని కటాక్షం పొందడం అదృష్టం.అన్నమాచార్యులవారికి నందలూరితో అవినాభావ సంబంధము ఉన్నట్లు ఆయన రచించిన కీర్తనలలో నందలూరు గురించి ప్రస్తావన చేశారు. నిత్య ప్రసాదం:కొబ్బరి,పులిహోర,పొంగలి -తోలేటి వెంకట […]

తెలుగు సామెతలు 

జానపద సాహిత్యంలో ప్రధానంగా కథ గేయాలు,పద్యకధానాలు,సామెతలు,పొడుపు కథలు ఉన్నాయి. ఇవన్నీ ముఖ్యంగా తరాల నుంచి తరాలకు అందాయి. ఈ వందేళ్ళ లోపే అచ్చులోకి వచ్చాయి. ఒకప్పటి జనజీవితాన్ని అర్ధం చేసుకొనేందుకు ఈ సామెతలు గుర్తు పెట్టు కోవాలి. *ఎద్దు ఈనిందంటే కొట్టాన కట్టేయమన్నట్టు ! *ఎనుబోతు మీద వాన కురిసినట్లు *ఎముక లేని నాలుక ఎటు తిప్పినా ఆడుతుంది * ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు.   సేకరణ           […]

“చాముండీదేవి ప్రసాదం”

ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్లో  ఈ ఆలయం ఉంది.అఘోర శక్తుల ఆలయం.మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నా తాంత్రిక శక్తులు గల దేవాలయాలు కూడా శక్తివంతమైనవిగా ప్రసిద్ధి పొందిన వాటిలో ఈ చాముండి ఆలయం కూడా ఒకటి. చాముండి అమ్మవారు కాళికాదేవి అవతారం అని భక్తులు భక్తిగా పూజించి అనుగ్రహం పొందుతారు.ఇక్కడ అమ్మవారు పుర్రెల దండతో దర్శనం ఇస్తారు.ఈ ఆలయం తాంత్రిక శక్తి గల ఆలయం. నిత్య ప్రసాదం:కొబ్బరి,కోడి,మేక               -తోలేటి వెంకట శిరీష

తెలుగు సామెతలు

పెద్దవాళ్ళు తమ అనుభవ సారాన్నంతా రంగరించి పలికిన గొప్ప మాటలు ఈ సామెతలు. వీటినే లోకోక్తులు అంటారు. సామెతల్లో  కుటుంబ జీవితం,ప్రజా జీవితం,ప్రపంచ పోకడలు ప్రతిఫలిస్తాయి. సామెత లేని మాట,ఆమెత లేని ఇల్లు లాంటిది అంటారు. అంటే సామెతలు జోడించని కబుర్లు విందు లేని ఇల్లు లాంటివి అంటారు పెద్దలు. అనేక మంది జ్ఞానం కలిపి ఒక ప్రసిద్ధ సత్యాన్ని ఉటింకించే  సంక్షిప్త సారవంతమైన మార్గమే సామెత. *అంత్య నిష్టురము కన్నా ఆది నిష్టురమే మేలు.   […]

  “కాళికాదేవి ప్రసాదం”

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం,కలకత్తా నగరంలోగల కాళీఘాట్లో ఉన్న కాళికాదేవిని ఈ కొరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న సమయంలో తప్పకుండా స్మరిస్తూ పూజలు చేసుకుంటే అమ్మవారి కటాక్షం తప్పకుండా సత్ఫలితాలిస్తుంది. కాళికా దేవి వెలసిన ప్రదేశం కావున కలకత్తా అని పేరు వచ్చింది.అమ్మవారు విగ్రహం పూర్తిగా దర్శనం కలుగదు కేవలం శిరస్సు భాగం వరకే చూడవచ్చు.మూడడుగుల ఎత్తులో మనకు తల కనిపిస్తుంది.అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు.మరి ఈ రోజు నుండి అమ్మవారిని స్మరిస్తూ […]