Top News
“తారాపీఠ్ ప్రసాదం”
పశ్చిమ బెంగాల్ లో వున్న తారాపూర్ లో ఉన్న తారాపీఠ్ అమ్మవారి దర్శనం చేసుకుని వద్దాం పదండి. ఇక్కడ భక్తులు “ఆమ్ఫన్” తుఫాన్ బారిన పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.శివుడు కైలాసంలో క్షీరసాగర మధనంలో మధిస్తున్నప్పుడు వచ్చిన విషాన్ని లోకోద్ధరణ కోసం ఆ విషాన్ని సేవించాడు.దాని ప్రభావంతో శివయ్య పార్వతీదేవి ఒడిలో మత్తుగా సేద తీరాడు.అట్టి సమయంలో పార్వతీదేవి శివయ్యను పసివాడిగా తన ఒడిలో స్ధన్యం ఇస్తున్న భంగిమలో దర్శనం ఇస్తారు.అమ్మవారు […]
కేరళ పోలీస్ పవర్ ‘ ఉండ ‘ 2019 మలయాళం
కేరళ లోని ఇడుక్కి నుంచి కొత్తగా నియమితులైన కేరళ పోలీసులు బస్తర్ లో ఎలక్షన్ డ్యూటీ కి బయలు దేరిన ఇతివృత్తంలో వచ్చిన సినిమా. ఉండ పోలీసుల దగ్గర లాఠీలు తప్ప బుల్లెట్లు ఉండవు. ఆ లాఠీలతో నే మావోయిస్టు ప్రాంతంలో నెగ్గుకు రావాలి. వీళ్లు మావోయిస్టు ల పేరు చెప్పి ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టాలని రాజకీయాలే కొనసాగుతున్నాయని అమాయకులను మావోయిస్టులు గా ముద్ర వేసి బలి తీసుకుంటున్నదని స్వార్ధ రాజకీయాలకు మిలటరీ సాయం అందుతుందని సూచన […]
చక్కని సినిమా ‘లేబర్ ఆఫ్ లవ్ ‘
బెంగాలీ సినిమా లేబర్ ఆఫ్ లవ్ లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు.భార్య బ్యాగ్స్ ప్యాక్ చేసే ఫ్యాక్టరీ లో పగలంతా పని చేస్తుంది.వాళ్ళిద్దరి జీవన విధానం ఈ సినిమా భార్య ఆఫీస్ కు వెళ్లే ముందే భర్త ఇంటికి వస్తాడు ఆమె చేసి ఉంచిన టిఫిన్ తిని,తెమ్మని స్లిప్ పైన రాసిన సరుకులు తెచ్చి ,ఆ మధ్యాహ్నం అన్నం తినేసి ఇంటి తలుపులు మూసేసి వేళ కాని వేళ నిద్ర పోయే ప్రయత్నం చేస్తాడు.భార్య […]
“శృంఖలాదేవి ప్రసాదం”
కలకత్తాలోని హుగ్లీ లో వున్న శక్తిపీఠమే ప్రద్యుమ్న శృంఖలాదేవి.త్రేతాయుగంలో రోమపాదుడనే చక్రవర్తి ఈ అమ్మవారిని ప్రతిష్ఠ చేశాడని,అమ్మవారి ఉదర భాగం ఇక్కడ పడింది అని అంటారు. ఒకసారి రోమపాదుడి రాజ్యంలో కరువు తాండవం చేస్తోంది.జనం తిండి లేక విలవిల్లాడారు.రుష్యశృంగుడనే మహర్షి ఈ ప్రదేశానికి వస్తే అంతా సస్యశ్యామలంగా వుంటుంది అని చెప్పారు.వెంటనే చక్రవర్తి తన సైన్యాన్ని,కొంత మంది యువతులను రుష్యశృంగుని ఆశ్రమం వద్దకు పంపించాడు.అతను ఆ యువతుల అందచందాలను చూసి ముగ్ధుడై వారి వెంటే నడుచుకుంటూ రోమపాదుడి […]
“మార్తాండ భైరవుడి ప్రసాదం”
కర్నాటక రాష్ట్రంలోని మాంగ్ సులి సమీపంలో ఖండోబా ఆలయంలో మనం మార్తాండ భైరవుడిని చూసి దర్శనం చేసుకోవచ్చు. మల్ల మరియు మణి అనే రాక్షసులు వారికి మరణం లేకుండా ఎవరితోటి ఓటమి లేకుండా వరమివ్వమని బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి వరము పొందారు.వారివురు గర్వంతో దేవతలను,మునీశ్వరులను హింసించేవారు.ఆ బాధలు భరించలేక శివుని ధ్యానం చేస్తూ వుంటే శివుని అంశంగా మూడు కన్నులతో బంగారు రంగు ముఖముతో ఫాలభాగాన నెలవంక తో ఉద్భవించిన మార్తాండ భైరవుడిని చూసి అందరూ […]
మన తెలుగు సామెతలు
‘ విందైన మూడు రోజులు,మందైనా మూడురోజులే ‘ ఈ సామెత నిత్య జీవిత అనుభవం లోంచి వచ్చినదే మంచి భోజనం కనీసం మూడు రోజుల పాటు వరసగా చేస్తే మనకు తృప్తి పడుతోంది. అలాగే ఏ మందైనా మూడు రోజులు వాడితే వంటికి పడుతోంది అని అర్ధం. స్నేహం విందు,మందులా విడవకుండా రోజుల పాటు చేస్తే అది బలపడి,హృదయానికి దగ్గరై కలకాలం ఉంటుంది అని అర్ధం. […]
“శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ప్రసాదం”
తమిళనాడులోని తిరుత్తణి వున్న శ్రీ వల్లీ సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుని వద్దాం పదండి. పురాణ గాథల ప్రకారం ఒక రాక్షసుడు సూరకాసురుడుని సంహరించడానికి శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు,మురుగన్ నిశ్చయించుకున్నాడు.ఆ రాక్షసుడిని చంపేందుకు తిరుత్తణిలో బస చేశాడనీ,ఇక్కడే శ్రీ వల్లీ దేవిని వివాహం చేసుకున్నాడని అంటారు.పూర్వం దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని సుబ్రహ్మణ్యేశ్వరునితో వివాహం జరిగింది అనీ,అల్లుడికి ఒక ఏనుగుని కానుకగా ఇచ్చిన, ఇంద్రలోకంలో శున్యం కనపడింది.అది గమనించిన మురుగన్ వెంటనే ఆ […]
నా లక్ష్యాన్ని తెలుసుకొన్న
ఈ కరోనా విపత్తు నాకెన్నో పాఠాలు నేర్పించాయి అంటున్నారు ములుగు ఎమ్మెల్యే, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సీతక్క. ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమ్ మహమ్మద్ చేసిన ‘ గో హంగర్ గో ‘ చాలెంజ్ ను తీసుకొని పెనుగోలు గ్రామానికి బయలుదేరాను. అక్కడికి కాలినడకనే వెళ్లాలి గుట్టలు వాగులు దాటుతూ అక్కడి 20 కుటుంబాల ఆకలి తీర్చడం కోసం చేసిన ప్రయాణం నాలో ఆత్మస్థైర్యం నింపింది .మారుమూల గ్రామాల్లో 470 కి పైగా […]
మన తెలుగు సామెతలు
మనిషి జీవితంలోని సర్వ విషయాలను సంబంధించి ఎన్నో సామెతలు ప్రచారంలో ఉన్నాయి .ఇవన్నీ అనుభవసారాలే విశేషాను భావం గల పెద్దల మాటలు.ఒక నీతిని సూచిస్తూ, చేస్తున్న పనిలో తప్పొప్పులను ఎత్తి చూపించేందుకు ఒక అనుభవాన్ని చేర్చి మాట్లాడటం ఈ సామెత లక్ష్యం !! మనసుంటే మార్గం ఉంటుంది. అన్న సామెత ఒక కష్టమైన పని చేసేందుకు స్ఫూర్తి నిచ్చేదిగా ఉంది. * అనుమానము ప్రాణ సంకటము. * అనువు గాని చోట అధికుల మనరాదు. * […]
“పొన్నూరు శ్రీ వీరాంజనేయుని ప్రసాదం”
జై శ్రీ రామ్ గుంటూరు జిల్లా నుంచి నిడుబ్రోలు మీదుగా పోన్నూరు చేరుకుని 24 అడుగులు ఎతైన హనుమంతుల వారి విగ్రహాన్ని కనులారా చూచి లోకా సమస్ధా సుఖినో భవంతు అని నమస్కరించుకుందాం పదండి. ఇక్కడ స్వామి వారికి నిన్న, ఈ రోజు, రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.లక్ష తమలపాకులతో అలంకరించి సేవ చేసే భాగ్యం కలుగుతుంది కాబట్టి మనమందరం పూజించుకుందామా!! ఆలయం మొదట్లో ఒక రావి చెట్టు ఉన్నది దాని చుట్టూత […]
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్
కరోనా తర్వాత జీవితం లో చాల మార్పులు వచ్చి తీరుతాయి. ముఖ్యంగా గుంపుగా థియటర్స్ కు పోయి సినిమాలు చూడగలమా అన్నది సందేహమే. నెమ్మదిగా వెబ్ సీరీస్ కు ,ఇంట్లోనే సినిమాలు చూసేందుకు అలవాటుపడి తీరవలసిందే. అలా మొదలెట్టాలి అనుకొనే వాళ్ళు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీరీస్ మొదలు పెట్టవచ్చు. స్టోరీ లో నలుగురు కథానాయకులు. దామిని జర్నలిస్ట్, ఉమాంగ్ ఫిట్ నెస్ ట్రైనర్ ,అంజన్ లాయర్. సిద్ది […]
” కదిరి నరసింహస్వామి ప్రసాదం”
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని హిందూపురాణానికి సుమారు 90 కి.మీ.దూరంలో కడప జిల్లాకి సరిహద్దు లో ఉన్న కదిరి లో స్వయంభుగా వెలిశాడు శ్రీ కదిరి నరసింహస్వామి.ఇక్కడ మనకు ప్రహ్లాద సమేత నరసింహుడు దర్శనం ఇస్తారు. ఖ అంటే విష్ణు పాదాలు అని దిరి అంటే కొండ అని అర్థం.స్వామివారికి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. బుక్కాలరాయుల వారి సన్నిధిలో ఈ స్వామి వెలిశాడు అని భక్తులు చెప్తారు. నిత్య ప్రసాదం:కొబ్బరి,పులిహోర -తోలేటి వెంకట శిరీష
మనసుని కదిలించే కూడె (2018)
మలయాళం లో అంజలి మీనన్ నిర్మించిన సినిమా కూడె నీలగిరి కొండల్లో ఉంటున్న 15 ఏళ్ళ అబ్బాయి జోశువా కు చెల్లాయి పుట్టింది. కొద్ది రోజులకే ఆమె పుట్టుకతోనే అనారోగ్యం తో ఉందని ఊపిరి పీల్చుకోవటం కష్టమై మరణించే అవకాశం ఉందని చెపుతారు డాక్టర్లు. ఆ పాప వైద్యం కోసం ఇంట్లో అన్ని అమ్ముకొంటు,చివరికి జోశువా ను గల్ఫ్ లో పని చేసేందుకు పంపేస్తారు. ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి చెల్లెలి వైద్యానికి కుటుంబం కోసం డబ్బు […]
మన తెలుగు సామెతలు
‘ అత్త ఒకరింటి కోడలే ‘ అన్న సామెత ఎవరినోట నుంచి పలికిందో కానీ అది ఏ తరం లో అయినా గుర్తు చేసు కోవలసిన మాట. అత్తగారికి,కోడలికి నిజానికి తల్లీ బిడ్డలకు వుండే బాంధవ్యం ఉండాలి. కానీ తరతరాల నుంచి వచ్చిన కోడలు తన ఇంటిలో పెత్తనం చేస్తుందనీ,కొడుకుని తనవాడిని చేసుకొంటుందనీ అత్తగారి భయం అలాగే అత్తగారు తనను సవ్యంగా కాపురం చేసుకోనివ్వదని కోడలి అనుమానం వయసులో పెద్దది కనుక అత్తగారే కోడలిని అదుపులో పెట్టాలని […]
“పాండురంగడి ప్రసాదం”
మహారాష్ట్ర షోలాపూర్ మండలంలోని పండరీపురంలో మనకు పాండురంగడి ఆలయం కనిపిస్తుంది. ఇది భీమా నది ఒడ్డున పాండురంగ విఠల రుక్మిణి సమేతంగ మనకు దర్శనం ఇస్తారు.భక్తులు శ్రీ కృష్ణ అవతారంగా భావించి కొలుస్తారు. 13 నుండి 15 శతాబ్దంలో తుకారాం,ఏక్నాథ్ మొదలగు వారు ఈ పాండురంగడ్ని పూజించి మోక్షం పొందా ఈ ఆలయానికి తొలి ఏకాదశి రోజున ప్రత్యేకంగా దీక్ష తీసుకుని కాలి నడకన వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. నిత్య ప్రసాదం:కొబ్బరి, పులిహోర -తోలేటి […]
మన తెలుగు సామెతలు
పెద్దవాళ్ళు మాట్లాడే ఎన్నో చమత్కారమైన మాటలు కూడా సామెతలు అయిపోయాయి. ‘ అదైతే వైద్య కట్నం. ఇదైతే వైతరిణీ గోదానం ‘ ఇంట్లో వయసు మళ్ళిన వాడు జబ్బుగా ఉన్నాడు. వైద్యుడు ఎంతో సొమ్ము వాసులు చేస్తున్నాడు. ఇటు వైద్యుడిని భరించలేరు. అటు ప్రాణం పోతోంటే చూస్తు ఉరుకోలేరు. ఆ సందర్భంలో ఇంట్లో ఉన్న వాళ్ళెవరు గృహస్తు కష్టాన్ని చూసి,ఏదయినా ఒకటే ఇటు బతికి వుంటే వైద్యుడికి సమర్పించుకోవాలి. లేదా మరణిస్తే గోదానం భూదానం అంటూ మరణానంతర […]
“శ్రీ కూర్మనాథ స్వామి ప్రసాదం”
శ్రీకాకుళం జిల్లాలోని గార మండలం గ్రామంలో ఉన్న శ్రీ కూర్మనాథ స్వామిని దర్శించి వద్దాం పదండి. సురాసురులు క్షీరసాగర మధనంలో మంధర పర్వతాన్ని కవ్వంలా మధించటానికి వాసుకిని తాడుగా మధిస్తుండగా మందర పర్వతం జారుతుండగా శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో సముద్ర గర్భంలో నుంచి ఉద్భవించి మందర పర్వతాన్ని నిలబెట్టాడు. ద్వాపర యుగంలో పరశురాముడు ఉమారుద్ర కాళేశ్వర లింగం ప్రతిష్ఠ చేసి శ్రీ కూర్మం వచ్చిన క్షేత్రపాలకుడు భైరవుడు గుడిలోనికి అనుమతించ లేదు.అట్టి సమయమువో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై శరణు […]
మన తెలుగు సామెతలు
అంత్య నిష్టురము కన్నా అది నిష్టురము మేలు ! అందని మామిడిపండ్లు పుల్లన ! అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడ్డట్టు ! అందులో పస లేదు గంజిలో వార్చమన్నట్లు ! అక్క మనదైతే బావ మనవాడవుతాడా ! అగ్ని కి వాయువు తోడు అన్నట్లు ! ఇలాటి సామెతల్లో ఎన్నో జీవిత సత్యాలు కనిపిస్తాయి అగ్నికి వాయువు తోడు అంటే ఇద్దరు తగవులు పడుతూ ఉంటే మధ్యలో వాళ్ళు సర్ది చెప్పకుండా ఇంకో […]
“సురుల పల్లి శివ ప్రసాదం”
చిత్తూరు జిల్లాలోని నాగలాపురం లో మనకు శయనిస్తున్న శివుని దర్శన భాగ్యం కలుగుతుంది.మన దేశంలో ఉన్న ఏకైక శివాలయం. కథనం ప్రకారం దేవదానవులు క్షీరసాగరం లో ఉద్భవించిన విషం తాగిన శివుడు పార్వతీదేవి ఒడిలో సేద తీరాడని అందుకే శయనమూర్తిగా కనిపిస్తాడు.మనము శ్రీ మహావిష్ణువుని ఆ భంగిమలో చూస్తాం కానీ ఇక్కడ అలాంటి భంగిమలో శివుడు కనిపిస్తాడు.ఈ ఆలయ ప్రదేశంను సురుటపల్లి అని పిలిచేవారు రాను రాను సురులపల్లిగా వాడుకలో ఉంది.స్వామివారి ఆలయంలో నిత్యనూతనంగా అన్ని పర్వదినాలు […]
మన తెలుగు సామెతలు
కొండను తవ్వి ఎలకను పట్టినట్లు అంటారు పెద్దవాళ్ళు. ఒక పెద్ద కొండను తవ్వాలనే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొంటే అంత కష్ట పడ్డాక దాని ఫలితం అంత స్థాయిలో ఉండకపోతే నవ్వులపాలు అవుతారు. ఎంతో గొప్పగా మాట్లాడి దానికి తగ్గ చేతలు లేకపోతే మాటలే వెక్కరింపు అన్నమాట ఈ సామెత. గొప్ప కొండను తవ్వేసి,ఒక చిన్న ఎలుకను పట్టినట్లుగా ఎన్నో డాంబికాలు పలికి ఫలితం ఏమీ చూపెట్టలేదు అని ఈ సామెతకు అర్ధం. పెద్దవాళ్ళు ఎం చెపుతున్నారు అంటే […]
