• భార్య భర్తల బంధం మరింత స్నేహ పూరితంగా ఉండాలంటే ఇద్దరి మధ్య మనస్పర్థలు ఎప్పుడు రావద్దనుకోవాలంటే రెండు మూడు విషయాలు చర్చించుకుంటే చాలు. జీవితంలో తగువులు రానే రావు. ఒకటి డబ్బు విషయంలో పొదుపు విషయంలో ఖర్చుల విషయంలో ఒక అవగాహన కు రావటం ముఖ్యం. ఎవరికి వాళ్ళ పనులుంటాయి.కానీ ఇద్దరు కలిసి బిజీ సమయంలో వాళ్ళిద్దరి కోసం ఎంత సమయం ఎలా మిగుల్చుకుంటున్నారో నిర్ణయించుకోవటం రెండు ఇద్దరికీ ఎన్నో విషయాల్లో అభిప్రాయ బేధాలుండచ్చు. పెరిగిన వాతావరణం లో విభిన్నమైన అలవాట్లు ఉండచ్చు. వీలైతే పట్టించుకోకుండా వదిలేయటం లేదా మరీ అసంతృప్తి అనిపిస్తే అవతలి మనిషి నొచ్చుకోకుండా సాధ్యమైనంత సున్నితంగా తమకు నచ్చని అలవాట్లో విషయాలు చెప్పటం మూడోది నాలుగోసారి ఇంటి పనులు బయటి పనులు లేదా అన్నింటినీ కలిపేసి ఒక బాధ్యతను కలిసి షేర్ చేసుకుంటే ఆ కుటుంబం అందమైన పొడారిల్లే.. ఎప్పుడూ సంతోషాలే !!

    ఇవి చర్చించుకోండి

    https://scamquestra.com/sozdateli/7-fanis-dzhuraev-24.html

  • జీవితంలో ప్రతిక్షణం సక్సెస్ ఫుల్ గానే గడపాలనే అందరూ కోరుకుంటాం. కొన్ని లక్షణాలు సొంతం చేసుకోగలిగితే విజయం వెంట నడుస్తూ వస్తుంది. మానసికంగా సంతోషంగా ఉండాలంటే శారీరికంగా ఆరోగ్యంగా ఉండాలి. చక్కని ఆహారపు అలవాట్లు సొంతం చేసుకోవాలి సరైన సమయానికి చక్కని ఆహారపు అలవాట్లు సొంతం చేసుకోవాలి సరైన సమయానికి చక్కని పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. పోటీ పడితే ఓటమి తిరస్కరణ సూన్యత బాధ సంతోషం వంటి భావోద్వేగాలు ఎదుర్కోవలిసివస్తుంది. వీటిని ఎదుర్కొనేందుకు మానసికంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. మన లోపాలు తప్పులు సమీక్షించుగోగలిగితే సక్సెస్ కు అనే దగ్గర మార్గాలవుతాయి. మన చుట్టూ సత్సంబంధాలు ఏర్పరుచుకుని ఎదుటివారిలో లోపాలు ఎంచకుండా సానుకూల వాతావరణం సృష్టించుకుంటే ముందు మనం శాంతిగా ఉంటాం. మనం ఎంచుకున్న గమ్యం సవ్యమైనదీ మన కెరీర్ ని దృఢపరిచేది అయితే మన కష్టం మనల్ని విజయం దగ్గరకు చేరుస్తుంది.

    సక్సెస్ మన చేతుల్లోనే

    జీవితంలో ప్రతిక్షణం సక్సెస్ ఫుల్ గానే గడపాలనే అందరూ కోరుకుంటాం. కొన్ని లక్షణాలు సొంతం చేసుకోగలిగితే విజయం  వెంట నడుస్తూ  వస్తుంది. మానసికంగా సంతోషంగా ఉండాలంటే శారీరికంగా…

  • బరువు తగ్గాలనుకోవటం ఒక సాధన. ఆ క్రమంలో శరీరం ఎంత శ్రమ ఓర్చుకోగలుగుతుందో గమనించుకోమంటున్నారు నిపుణులు. వ్యాయామం చేసినప్పుడు దాహం వేసిన పెదవులు తడారిపోయినా శరీర ఉష్ణోగ్రత పెరిగినా వెంటనే నీళ్లు తాగాలి. జీవక్రియల పనితీరు సరిగ్గా ఉండేలా మితంగానే వ్యాయామం చేయాలి. శరీరం అలసిపోతేనే కండరాలు కీళ్ల నొప్పులు వస్తాయి. శరీరం అతిగా అలసిపోయిందని చెప్పే సంకేతాలివి. మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూనే వ్యాయామం చేయాలి. వ్యాయామం తరువాత వెంటనే స్నానం వద్దు . అలాని ఏసీ లో కూర్చోవటం ఫ్యాన్ కింద విశ్రాంతి తీసుకోవటం తప్పు. శరీరం సరైన ఉష్ణోగ్రత లోకి వచ్చేదాకా వేచి చూసి స్నానం చేయాలి. అలాగే వ్యాయామం ముగించగానే ఆహారం తీసుకోకూడదు. అలాగే ముందు కూడా మాంసకృతులు వుండే ఆహరం జోలికి పోకుండా వుండటం ఉత్తమం.

    శరీరపు అలసట కనిపెట్టాలి

    బరువు తగ్గాలనుకోవటం ఒక సాధన. ఆ క్రమంలో శరీరం ఎంత శ్రమ ఓర్చుకోగలుగుతుందో గమనించుకోమంటున్నారు నిపుణులు. వ్యాయామం చేసినప్పుడు దాహం వేసిన పెదవులు తడారిపోయినా శరీర ఉష్ణోగ్రత…

  • ఇంటి దగ్గరుండే మైదానాల్లోనో మామూలు వీధుల్లోనో పరుగు పందెం కోసం సాధన చేసే క్రీడాకారిణులకు ఆకతాయిల వేధింపులు ఎన్నో ఎదురవుతూ వుంటాయని ప్రపంచ వ్యాప్తంగా మహిళా అథ్లెట్ల పరిస్థితి ఇలాగే ఉంటుందని రన్నర్స్ వరల్డ్ అనే పత్రిక నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 2533 మంది అథ్లెట్ల తో ఈ అధ్యయనం చేశారట. ఈ వేధింపులకు భయపడి మన క్రీడా కలల్ని తుంచేసుకొనవసరం లేదు. ఆటలో దూకుడు ప్రదర్శించి పతకాలు గెల్చుకోవాలి అని చెప్తోంది. అమెరికన్ క్రీడా కారిణి కారా గౌచర్. ఇప్పటికే రెండు ఒలంపిక్స్ లో పాల్గొన్నారామె. అథ్లెట్లు ఒలంపిక్ విజేతలు అన్న తారతమ్యం లేకుండా అందరూ వేధింపులకు గురైనవారేనని తేలింది కదా ఇంకా మీరేవళ్ళు ఆకతాయిల అల్లరికి భయపడకండి హాయిగా మీ పనులు చేసుకోండి అని ఆడ పిల్లలకు హితవు చెపుతున్నారు ఈ అధ్యయనకారులు.

    వాళ్ళకే తప్పు లేదు మీకెందుకు భయం

    ఇంటి దగ్గరుండే మైదానాల్లోనో మామూలు వీధుల్లోనో పరుగు పందెం కోసం సాధన చేసే క్రీడాకారిణులకు  ఆకతాయిల వేధింపులు ఎన్నో ఎదురవుతూ వుంటాయని ప్రపంచ వ్యాప్తంగా మహిళా అథ్లెట్ల…

  • అబద్దాలు ఎంత తక్కువ చెప్తే ఆరోగ్యం అంత బావుంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. 18 నుంచి 71 సంవత్సరాలున్న వయస్సు వారిలో పదివారాల పాటు పాలిగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. అబద్దాలు చెపుతుంటే యంగ్జయిటీ వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరుగుతున్నాయిట. హార్ట్ రేట్ రక్తపోటు పెరుగుతాయి. దానితో శరీరం నిరంతరం ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లో ఉంటుందిట. ఈ స్థితి రోగ నిరోధక వ్యవస్థని దెబ్బ తీస్తుందిట. మన శరీరం మన ఆలోచనలు భావాలకు ప్రభావితం అవుతుంది కనుక అబద్దాల చెప్పటం వాళ్ళ కలిగే మానసిక స్థితి శరీరానికి అహంకారం చేసే లాగే ఉంటుందిట. ఇక పరీక్షలు నిర్వహించిన వారిలో సగం మందికి అబద్దాలు ఆపేయమని నిర్వాహకులు హెచ్చరించి ఒక వరం తర్వాత పరీక్షిస్తే వాళ్లలో సోర్ థ్రోట్ మానసిక సమస్యలు తలనొప్పులు తగ్గిపోతాయట. ఆత్మశాధన కోసం మాత్రమే ఈ వార్త.

    అబద్దాలతో ఆరోగ్య హాని

    అబద్దాలు ఎంత తక్కువ చెప్తే ఆరోగ్యం అంత బావుంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. 18 నుంచి 71 సంవత్సరాలున్న వయస్సు వారిలో పదివారాల పాటు పాలిగ్రఫీ పరీక్షలు నిర్వహించారు.…

  • వీట్ గ్రాస్ అంటే గోధుమ గడ్డి ఇప్పుడు చాలా మందిని ఆకర్షిస్తోంది. డిటాక్సిఫికేషన్ కోసం బరువు తగ్గేందుకు మాత్రమే కాకుండా ఈ గోధుమ గడ్డి విటమిన్ల స్టోర్ హౌస్. చక్కని ద్రుష్టి ఆరోగ్యవంతమైన చర్మం పుష్కలంగా ఖనిజాలు దొరకటంతో గోధుమ పిండి జ్యూస్ ని ఎంతో మంది రెగ్యులర్ గా తీసుకుంటున్నారు. లివర్ బలోపేతం చేయటం బ్లడ్ షుగర్ స్థాయిల్ని క్రమబద్దీకరించటం గుండెకు బలం ఇవ్వటం తో పాటు ఈ వీట్ గ్రాస్ జ్యూస్ కాన్సర్ రోగులకు సైతం వీరు తీసుకునే టాక్సిక్ మెడిసిన్స్ కు బాలన్స్ చేయటాన్ని సమర్ధవంతమగా నిర్వహిస్తోంది. మార్కెట్ లో వీట్ గ్రాస్ పౌడర్ ఫ్రోజెన్ వీట్ గ్రాస్ జ్యూస్ కూడా దొరుకుతుంది. ఇంట్లో తాజాగా తయారు చేసుకునే వీట్ గ్రాస్ లో వుండే పోషకాలు ఈ నిల్వ వుండే పౌడర్లలో దొరక్కపోవచ్చు. కానీ ఈ జ్యూస్ పిల్లలు పెద్దలు నిరభ్యంతరంగా తాగొచ్చని ఆరోగ్యమని చెపుతున్నారు.

    అద్భుత పోషకాల వీట్ గ్రాస్

    వీట్ గ్రాస్ అంటే గోధుమ గడ్డి ఇప్పుడు చాలా మందిని ఆకర్షిస్తోంది. డిటాక్సిఫికేషన్ కోసం బరువు తగ్గేందుకు మాత్రమే కాకుండా ఈ గోధుమ గడ్డి విటమిన్ల స్టోర్…

  • నిద్ర సరిగ్గా పోకపోతే ఊబకాయం వస్తుందని డాక్టర్లు చెపుతుంటారు. కానీ ఈ నిద్ర పట్టనివారు రోజు మొత్తం మీద తీసుకోవాలిసిన క్యాలరీల కన్నా 365 క్యాలరీలు ఎక్కువ తీసుకుంటున్నారనీ వీరిలో క్యాలరీల ఖర్చు తక్కువగా ఉంటుందనీ చెపుతున్నారు. కావలిసిన దాని కన్నా ఎక్కువ ఆహరం తీసుకోవటం లేదా నిద్రపట్టక సమయం గడవక ఎదో ఒక చిరుతిండి తినటం వల్ల ఊబకాయం వస్తోందనీ తేలుతోంది. లండన్ లోని కింగ్ జార్జ్ యూనివర్సిటీ పరిశోధకులు 172 మంది పైన పరిశోధన చేసారు. సరిపడా నిద్ర పోయేవారికి ఒక నియంత్రణ తో కూడిన జీవన పద్ధతి ఉందనీ వారు సరైన వేలకు తినటం నిద్రపోవటం వల్ల అధికమైన క్యాలరీలు శరీరంలో చేరటం ఖర్చు కాకపోవటం జరగదని నిద్రలేమి చాలా అనర్దాలకు కారణం అవుతుందని పరిశోధకులు తేల్చారు.

    నిద్రలేమితో అనర్ధం

    నిద్ర సరిగ్గా పోకపోతే ఊబకాయం వస్తుందని డాక్టర్లు చెపుతుంటారు. కానీ ఈ నిద్ర పట్టనివారు రోజు మొత్తం మీద తీసుకోవాలిసిన క్యాలరీల కన్నా 365 క్యాలరీలు ఎక్కువ…

  • ఆందోళనే అసలు కారణం

    అతి సర్వత్ర వర్జాయేత్ అన్నది పెద్దలు చెప్పేది. దేనికైనా అతి పనికిరాదు. ఆరోగ్యం భయం ప్రమాదకరం అంటున్నారు  నార్వే పరిశోధకులు.ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించేవాళ్ళు అతి శ్రద్ధ…

  • ప్రతి రోజు ఒక అర గ్లాస్ బీట్ రూట్ రసం తాగితే కండరాల శక్తి పెరుగుతుందని వాషింగ్టన్ వైద్య విద్యాలయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది హృద్రోగులకు కూడా చాలా శక్తినిస్తుంది. సరుకులు మోయటం మెట్లెక్కటం వంటి దైనందిన మైన పనులు చేయలేకపోవటం కండరాలు శక్తి క్షీణించటం వల్లనే అంటున్నారు ఎక్సపర్ట్స్. బీట్ రూట్ రసంతో నైట్రేట్ సుతఃయిలు అత్యధికంగా ఉన్నాయని వీటిని శరీరం నైట్రిక్ ఆక్సైడ్ గా మార్చుకుంటుందనీ దీని వల్ల కాంట్రక్షన్ స్పీడ్ శక్తి పెరుగుతుందంటున్నారు. ఏ జ్యూస్ పెద్దవాళ్ళు రెగ్యులర్ గా తీసుకుంటే కండరాల మెరుగుదల ఉంటుందనీ కండరాల బలహీనత అలసట ఇవన్నీ మాయమవుతాయని చెపుతున్నారు.

    బీట్ రూట్ జ్యూస్ తో సూపర్ పవర్

    ప్రతి రోజు ఒక అర గ్లాస్ బీట్ రూట్ రసం తాగితే కండరాల శక్తి పెరుగుతుందని వాషింగ్టన్ వైద్య విద్యాలయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది హృద్రోగులకు కూడా…

  • ఆర్గానిక్ కూరగాయలు పండ్లు సేంద్రియ ఎరువులు వేసి సహజమైన పద్ధతుల్లో పండిస్తారనీ ఆరోగ్యానికి మంచిదనీ ఖరీదైనా కొనాలనుకుంటాం. పళ్ళు ,కాయగూరల పై లేబుల్స్ ఉంటాయి. వాటిని బట్టి అవి ఆర్గానిక్ వా కాదా తెలుసుకోవచ్చు. ఆపిల్ కూడా లేబుల్ పైన నాలుగు అంకెలు వుండి మొదటి అంకె మూడు లేదా నాలుగు అని వుంటే అవి పురుగు మందులు వేసినవి అని అర్ధం. లేబుల్ పైన ఐదు అంకెలుండి మొదటి అంకె ఎనిమిది అయితే అది జన్యు మార్పిడి ద్వారా పండించినది అని అర్ధం. లేబుల్ పైన ఐదు అంకెలుండి మొదటి అంకె తొమ్మిదయితే అది ఆర్గానిక్ పండే. ఈ పళ్ళ పై వుండే లేబుల్ తినదగిన కాగితంతో జీర్ణమయ్యే జిగురుతో అంటిస్తారు. కానక పిల్లలు గబుక్కున లేబుల్ తో సహా తినేసినా ప్రాబ్లమ్ ఏవీ లేదు.

    ఏ యాపిల్ మంచిది

    ఆర్గానిక్ కూరగాయలు పండ్లు సేంద్రియ ఎరువులు వేసి సహజమైన పద్ధతుల్లో పండిస్తారనీ  ఆరోగ్యానికి మంచిదనీ ఖరీదైనా  కొనాలనుకుంటాం. పళ్ళు ,కాయగూరల పై లేబుల్స్ ఉంటాయి. వాటిని బట్టి…

  • కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాల వేడుక కన్నుల పండుగ గా జరుగుతుంది. నవంబర్ 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల్లో నిత్యం వివిధ ప్రత్యేక పూజలతో దైవాన్ని ఆరాదిస్తూ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహిస్తున్నారు. బుధవారం జరిగిన ప్రత్యేక పూజలు, కార్తీక దీపారాధనలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపతులు పాల్గొన్నారు.

    కోటి దీపోత్సవంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపతులు

    కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాల వేడుక కన్నుల పండుగ గా జరుగుతుంది. నవంబర్ 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు…

  • కోన్ ఐస్ క్రీమ్ తినేసాక చివరగా కోన్ కూడా బిస్కెట్ ఫ్లేవర్ తో తినేందుకు అనువుగా ఉంటుంది. ఇప్పుడు అచ్ఛంగా అలంటి వడ్డించే గిన్నెలొస్తున్నాయి. సూప్ లు, పాలు, పాయసం, తాగాక కప్పుల్ని కూడా అలాగే తినేయచ్చు. చివరికి కేక్ ముక్కని కూడా నేరుగా గిన్నెతో కలిపి తినేయచ్చు. అదెలాగంటే కుల్ఫీలు ,చాక్లేట్లు ,గోధుమ ,జొన్న ,రాగి , చీజ్ , మాంసం , కూడా గిన్నెల్లాగా చేసే మిషన్లోచ్చాయి. వాఫిల్ బౌల్ మేకర్ దానిపేరు. మనక్కావలిసిన రకం పిండి నాన్ వెజ్ ,స్వీట్ ,ఏదైనా టేస్టీ గా కలిపేసి ఇందులో ఆ పిండి పెట్టేసి మూత వేసేసి స్విచ్ నొక్కితే వెంటనే కాస్త పిండి పెడితే ఆ పిండి కాస్తా గిన్నె ఆకారం లోకో కోన్ ఆకారం లోకో కూడా మనం ఆర్డర్ ఇచ్చి తెచ్చుకున్న రకం రూపంలోకో మారిపోయి వచ్చేస్తాయి. ఇక చాక్లేట్ గిన్నెలకున్న పాపులారిటీ ఇంకా వేటికీ లేదుట. కరిగిన చాక్లేట్ ని వేరే అచ్చుల్లో పూసి కూడా ఈ గిన్నెల్ని తయారు చేయచ్చు. కూరలు ,సలాడ్లు, సూప్ లు , కోసం రకరకాల పిండి మాంసం కలిపి గిన్నెలను చేసేయచ్చు. రకరకాల ప్యాకింగులతో పర్యావరణనికి సమస్యలు లేకుండా చేసే ఇలాంటి వస్తువుల వల్ల చాలా ప్రయోజనం.

    తినేసే గిన్నెలొచ్చాయి

    కోన్ ఐస్ క్రీమ్  తినేసాక చివరగా కోన్  కూడా బిస్కెట్ ఫ్లేవర్ తో తినేందుకు అనువుగా ఉంటుంది. ఇప్పుడు అచ్ఛంగా అలంటి వడ్డించే గిన్నెలొస్తున్నాయి. సూప్ లు,…

  • వ్యాయామం అలవాటై పోయిన ఒక్క పూట మానేసినా ఎదో వెలితిగా ఉంటుంది. మరి వణికించే ఈ చలి రోజుల్లో వర్కవుట్స్ చేయటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. చలికి నొప్పులొస్తాయి. చలిగాలులకు శరీరం ప్రభావితం కాకుండా నిండుగా చెమట పట్టే దళసరి వస్త్రాలు ధరించాలి. నేరుగా చలిలోకి పరుగు తీయకుండా ఇంట్లో వార్మ్ అప్ చేయాలి. అప్పుడు శరీరం వ్యాయామం కోసం సిద్ధం అవుతుంది.ఎండ తీవ్రత లేకపోయినా సన్ స్క్రీన్ రాసుకుని తీరాలి. లేకపోతే చర్మం చలికి పగిలి పాడవుతుంది. ఉదయాన్నే కాకపోతే సాయంత్రం కాస్త ఎండా వుండగానే వ్యాయామం పూర్తి చేసినా మేలే. ఎంతయినా చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం కొన్ని జాగ్రత్తలు తీసుకుని జాగింగ్ మానక పోవటమే హాయి.

    చల్లగా వున్నా సరే మానకండి

    వ్యాయామం అలవాటై పోయిన ఒక్క పూట  మానేసినా  ఎదో వెలితిగా ఉంటుంది. మరి వణికించే ఈ చలి రోజుల్లో వర్కవుట్స్ చేయటం వల్ల  లాభం కంటే నష్టమే …

  • పిల్లల్ని బాగా పెంచటం అంటే ఖరీదైన వస్తువులు దుస్తులు ఖరీదైన పెంపకపు పోకడలు కాదు. చిన్న పిల్లలకు ఈ ప్రపంచంలో వస్తువుల ఖరీదు తెలియదు. వాళ్ళ దృష్టిలో జామపండు పిజ్జా రెండు ఒకటే. ఏది ఇష్టమో దాన్ని కోరుకుంటారు. ఖరీదు బట్టి కాదు. వాళ్ళ తల్లి తండ్రుల ఆసరా స్నేహం వాళ్లతో కలిసి గడిచే సమయం కావాలి. ఎదిగే వయసులో వాళ్ళకి ప్రోత్సాహం కావాలి. రెండు మార్కులు తక్కవొస్తే పర్లేదు ఈ సారి వస్తాయి లెద్దూ అనే ప్రేమ కావాలి. పెళ్లిళ్లు పేరంటాలకు పిల్లల్ని తీసుకుపోయినట్లే స్నేహితులు బంధువుల ఇళ్లలో జరిగే విషాదాలు కూడా వాళ్ళకి తెలియాలి. పుట్టిన రోజుకి ఫ్రెండ్స్ కిజిఫ్టు ఇమ్మని చెప్పటం కాకుండా ఎవరైనా అనారోగ్యాల తో వుండే దగ్గరుండి తీసుకుపోయి స్నేహితుల బాధను పంచుకునే అలవాటు చేయాలి. మనం దేన్నీ ఇస్తే దాన్నే అమూల్యమనుకుంటారు.

    కష్టం , సుఖం , తెలుసుకోనివ్వండి

    పిల్లల్ని బాగా పెంచటం అంటే ఖరీదైన వస్తువులు దుస్తులు ఖరీదైన పెంపకపు పోకడలు కాదు. చిన్న పిల్లలకు ఈ ప్రపంచంలో వస్తువుల ఖరీదు తెలియదు. వాళ్ళ దృష్టిలో…

  • ఇప్పటి దాకా అచస్ట్రక్టివ్ స్లీప్ అప్లియా అంటే గురక పెట్టడం, పగటి వేల నిద్ర, నిద్ర లేమి పురుషులకే వుంటాయి అనుకుంటున్నారు. 20 నుంచి 70 సంవత్సరాల వయస్సున్న మహిళలపై చేసిన ఒక అధ్యయినంలో మహిళల్లో 70 శాతం మందికి ఈ ప్రాబ్లం ఉన్నట్లు తేలింది. ఇది పగటి నిద్ర వల్ల కాదని ఈ నిద్ర లేమి స్థూలకాయం, హైపర్ టెన్షన్ ల తో సంబంధం కలిగి వుందని పరిశోధనలు తేల్చాయి. స్థూలకాయం ఉన్న మహిళల్లో 31 శతం మంది సరైన నిద్ర పట్టకపోవడం, గురక, నిద్ర మధ్యలో మెలకువ వంటి సమస్యలు వున్నాయిని అధ్యయినం తేల్చింది. అన్నింటికీ కారణమైన శరీరపు బరువుని ఎలాగైనా తగ్గించుకోమని రేపోర్ట్లు స్పష్టం చేస్తున్నాయి.

    స్త్రీలకి ఈ సమస్య సహజమే

    ఇప్పటి దాకా అచస్ట్రక్టివ్ స్లీప్ అప్లియా అంటే గురక పెట్టడం, పగటి వేల నిద్ర, నిద్ర లేమి పురుషులకే వుంటాయి అనుకుంటున్నారు. 20 నుంచి 70 సంవత్సరాల…

  • ఊరికే భయాపడిపోవడం మానేసి చేయాల్సిన పని చేసాక అమ్మయిలు కర్ణాటక రాష్ట్రంలో చెలగాలి జిల్లాలోని రాషి వారా గ్రామంలో 14, 15 వయస్సు ఆడ పిల్లలు తమను ఎడిపిస్తున్న పోకిరిలను వదిలించుకునేందుకు లాథిలు పట్టుకున్నారు. ఆడ పిల్లలల ను మోటార్ సైకిళ్ళ పై వచ్చి వేధించడంవాళ్ళని తాకి వేగంగా పారిపోవడం చేస్తుంటే గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. లాభం లేకపోయింది. దాని తో ఆడపిల్లల తల్లి దండ్రులు ఆడపిల్లలను స్కూల్ వద్దు ఇంట్లోనే కూర్చోమన్నారు. అలా అయితే తమ భవిష్యత్తు నాశనం అవుతుందని భాలికలు లాతీలు పట్టుకుని గుంపులుగా స్చూలుకు పోవడం మొదలు పెట్టారు. చేతిలో కర్రలతో ధైర్యంగా స్చూల్కు బయలు దేరుతున్న అమ్మాయిలను చూసి పోకిరీలు ఫరార్!

    కర్ణాటకలో బదులు చెప్పిన అమ్మాయిలు

    ఊరికే భయాపడిపోవడం మానేసి చేయాల్సిన పని చేసాక అమ్మయిలు కర్ణాటక రాష్ట్రంలో చెలగాలి జిల్లాలోని రాషి వారా గ్రామంలో 14, 15 వయస్సు ఆడ పిల్లలు తమను…

  • బంగాళా దుంప పైన ఆకుపచ్చ రంగు మొలక రావటం చూస్తూ ఉంటాం. ఇలా ఆకుపచ్చ రంగుతో కనపడే చుక్కల్ని గ్లైకొల్కలాయిడ్స్ జి. ఏ అంటారు. చీడపీడలు, పురుగుల నుంచి తనను తానూ రక్షించు కునేందుకు మొక్క వీటిని సమకూర్చుకుంటుంది. ఈ జి.ఏ లో దుంపల చర్మం అడుగుదాకా ఉంటాయి. కాన్స్ లోతుగా కట్ చేసి ఆకుపచ్చదనం తీసేయాలి. రెస్టారెంట్ లో బంగాళా దుంప కూర తినేటప్పుడు ఈ విషయం గుర్తుతెచ్చుకొండంటున్నారు నిపుణులు. ఇంట్లో వాడుకునేట్టపుడు ఒకటీ అరా ఆకుపచ్చ మచ్చలు కనిపిస్తే అంతవరకు తీసేసి లేదా దుంపలో ఎక్కువచోట్ల కనిపిస్తే నిక్షేపంలా దాన్ని పారేయండి. అవి విషతుల్యం అంటున్నారు.

    ఆకుపచ్చ రంగొస్తే పారేయండి

    బంగాళా దుంప పైన ఆకుపచ్చ రంగు మొలక రావటం చూస్తూ ఉంటాం. ఇలా ఆకుపచ్చ రంగుతో కనపడే చుక్కల్ని గ్లైకొల్కలాయిడ్స్  జి. ఏ అంటారు. చీడపీడలు, పురుగుల…

  • అనేక భారతీయ వంటకాల్లో సిల్వర్ ఫాయిల్ అలంకరించిన మిఠాయిలు కనిపిస్తారు. ఈ వంటకాల సిల్వర్ ఫాయిల్స్ కోసం మన దేశంలో ప్రతి ఏటా రెండు లక్షల 75 కిలోల స్వచ్ఛమైన వెండి వాడతారట. కాజు, డిజార్ట్స్, సుగుంధ ద్రవయాలు డ్రై ఫ్రూట్స్ , తమలపాకులు, మౌత్ ఫ్రెషనర్లు, ఈ సిల్వర్ ఫాయిల్ లంకారణలో కనిపిస్థాయి. కెన్నీ మేఘాలయ వంటకాల్లో కూడా వీటిని ఉపయోగిస్తూ వుంటారు. ఇవి మంచివా కాదా అంటే చెప్పటం కష్టం. కమర్షియల్ గా వాడే ఫాయిల్ చెప్పటం కష్టమే. ఇంట్లో చేసుకునే మిఠాయిలు పైన ఈ ఫాయిల్ వాడుదలుచుకుంటే దీన్ని వేళ్ళ మధ్య నలిపితే సవచమైన దైతే మెరుపులుఅతుక్కుని కనిపిస్తుంది. కల్తీ అయితే చేతులకు అతుక్కుపోతుంది. బూడిద లాగా రాలుతుంది.

    స్వీట్ సిల్వర్ ఫాయిల్

    అనేక భారతీయ వంటకాల్లో సిల్వర్ ఫాయిల్ అలంకరించిన మిఠాయిలు కనిపిస్తారు. ఈ వంటకాల సిల్వర్ ఫాయిల్స్ కోసం మన దేశంలో ప్రతి ఏటా  రెండు లక్షల 75…

  • ఎన్టీఆర్ స్టేడియం లో భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సి.ఎం. కె.సి.ఆర్. దంపతులు పాల్గొన్నారు.నిర్వాహకులు కైలాసాన్ని తలపించే ఏర్పాట్లు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఇంద్ర కరణ్ రెడ్డి, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి ఎల్.వి. రమణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు, పీఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    కోటి దీపోత్సవంలో కె.సి.ఆర్. దంపతులు

    ఎన్టీఆర్ స్టేడియం లో భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సి.ఎం. కె.సి.ఆర్.…

  • ఆరోగ్యం కోసం ఏం తినచ్చో ఏం తాగచ్చో నిరంతరం సలహాలు వింటూనే వుంటాం. కానీ వీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాపడితే అలా తినకూడదు అంటారు డైటీషియన్లు. నట్స్ లో పీచు, ప్రోటీన్లు, ఖనిజాలు ఎక్కువే. కానీ వీటిని తీపి పదార్ధాలతో కలిపి తీసుకోకూడదు. పండ్లతో కలిపి, ఓట్స్ తో కలిపి తినాలి. పండ్లు జీవ క్రియల వేగాన్ని మెరుగుపరుస్తాయి. కానీ వీటిని ఉదయం వేళ అల్పాహారంతోనో, మధ్యాహ్నం భోజనం అయ్యాక తినాలి. భోజనానికి ముందు తినకూడదు. నెయ్యి భోజనానికి రుచి ఇస్తుంది.కానీ నేతితో బ్రెడ్, పరోటాలు కాల్చకూడదు. అప్పుడు దానిలోని పోషక విలువలు పోతాయి. చపాతీలు, పరోటాలు కాల్చాక వాటిపై రాస్తే రుచి, ఆరోగ్యం. సాంబారు, పప్పు తాలింపుగా నెయ్యి వాడితే వాటికి అదనపు రుచి వస్తుంది.

    కొన్నింటిని అన్నింటితో కలపద్దు

    ఆరోగ్యం కోసం ఏం తినచ్చో ఏం తాగచ్చో నిరంతరం సలహాలు వింటూనే వుంటాం. కానీ వీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాపడితే అలా తినకూడదు అంటారు డైటీషియన్లు.…