• రెజ్లర్ గీతాఫోగట్ ఫ్యామిలీ స్టోరీ దంగల్ పేరుతో సినిమాగా రాబోతోంది. గీత తండ్రి ఇంటెర్నేష్నల్ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ పాత్రలో అమీర్ ఖాన్ 8 సంవత్సరాల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మహావీర్ సింగ్ కూతుళ్లు గీత బబిత రీతూ సంగీత ఇంకో ఇద్దరు పెంపుడు కూతుళ్లు వినేష్ ప్రియాబెక అందరు రెజ్లర్స్. అమీర్ ఖాన్ తో పాటు ఈ అమ్మాయిల పాత్రల్లో ఫాతిమా ,సాన్యా, జైరా లను పదివేల మందిని ఆడిషన్ చేసి ఎంచుకొన్నారట. వీళ్లకు రెండేళ్లపాటు కుస్తీ పట్టు నేర్పించారు. అమీర్ ఖాన్ భార్యగా టీవీ నటి మల్లికా షెరావత్ నటించారు. ఈ దంగల్ సినిమా నలుగురు ఆడపిల్లలకు కుస్తీ నేర్పించి అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకునేంతగా తీర్చిదిద్దిన ఒక రెజ్లర్ నిజ జీవిత గాధ. అమీర్ ఖాన్ ఈ సినిమా కోసం 90 కిలోల వెయిట్ పెరిగాడట. ఈ సినిమాలో హాని కారక్ బాప్య పాటని అందులో స్ట్రిక్ట్ అమీర్ ఖాన్ ని చూసి ఎంజాయ్ చేయండి. .

    దంగల్ సినిమా రాబోతోంది

    రెజ్లర్ గీతాఫోగట్  ఫ్యామిలీ స్టోరీ దంగల్ పేరుతో సినిమాగా రాబోతోంది. గీత తండ్రి ఇంటెర్నేష్నల్ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్  పాత్రలో అమీర్ ఖాన్ 8 సంవత్సరాల…

  • మంచి నిద్రకు ఆహారానికీ సంబంధం ఉంటుంది. ఉదాహరణకు రాత్రి వేళల్లో వేడి కాఫీ టీ లు తాగితే నిద్రపట్టని వాళ్ళుంటారు. అలాగే ఎన్నో రకాల పదార్ధాలు నేరుగా ప్రభావం చూపించక పోయినా పరోక్షంగా ఆరోగ్యాన్ని దాని ద్వారా నిద్రనూ దెబ్బ తీస్తాయి. ఆరోగ్యకరంగా మంచి నిద్రను ఇచ్చే ఆహారం మాత్రం సంపూర్ణాహారం అని మనం పిలిచే పాలు ఒకటే. ఇందులో అన్ని పోషకాలతో పాటు ట్రెప్టోఫాన్ ,అమైనో యాసిడ్ ఉంటుంది. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది. ఇవి గోరువెచ్చగా ఉండేలా నిద్రకు ఉపక్రమించేముందర తీసుకోవాలి. అలాగే ఓట్ మీల్ వరి వంటి కార్బోహైడ్రేట్స్ తిన్నాక కూడా నిద్రవస్తుంది. వీటిలోని మెలటోనిన్ అనే పదార్ధం కండరాలకు రిలాక్స్ చేసి నిద్రను ఇస్తుంది. అలాగే విటమిన్ సి వుండే బొప్పాయి అనాస నిమ్మజాతి పండ్లు సెలెరియం ఎక్కువగా వుండే చేపలు బాదాం వంటి నట్స్ కూడా ఆరోగ్యకరమైన నిద్రను ప్రోత్సహిస్తాయి. బెడ్ రూమ్ నిశబ్ధంగా ప్రశాంతంగా వుంది. మరీ చల్లగా కాకుండా మరీ వేడిగా కాకుండా ఉండాలి. ఎక్కువ వెలుగు లేకుండా ఉండాలి మసక చీకట్లో నిద్రకు తోడ్పడే మెలటోనిన్ రసాయనం విడుదల అవుతోంది.

    మంచి నిద్రకు మంచి భోజనం వాతావరణం

    మంచి నిద్రకు ఆహారానికీ  సంబంధం ఉంటుంది. ఉదాహరణకు రాత్రి వేళల్లో వేడి కాఫీ టీ లు తాగితే నిద్రపట్టని వాళ్ళుంటారు. అలాగే ఎన్నో రకాల పదార్ధాలు నేరుగా…

  • ఖరీదైన బట్టలు కొంటు వుంటాం. కొంత కాలం పాటు ఆ కొత్త దనం పోకుండా వుంటే బాగుంటుంది. ఇస్త్రీల వల్ల చెక్కగా వుతకడంతోనూ సరిపోదు. వాటి గురించి శ్రద్ద తీసుకోవాలి. ఆడపిల్లల డ్రెస్ లు జరీలు, కుట్టు పని, పూసలు, కుందన్ వర్క్ వీటితోనే హెవీగా కనిపిస్తాయి. వాటిని మాములుగా ఉతికి అరేస్తే నాలుగైదు వుతుకులకే వేసుకునేందుకు బాగోవు. అతి జ్యగ్రత్తగా ఏ ఫంక్షన్లోనో వేసుకోవడం వెంటనే బధ్రపరచడం చేయాలి. దుస్తులకి కొత్త అందం కోసం కొన్ని పువ్వులు స్టిక్కర్స్ లేదా రాళ్ళ తో చేసిన గుండిలు వంటివి కుట్టేస్తారు. ఆ కుట్టిన దరంపైన నాచురల్ కలర్ గోళ్ళ రంగులు వేస్తె వూదిపోకుండా వుంటాయి. వేసుకున్న దుస్తులను చెక్కగా హ్యంగర్ కు తగిలిస్తే గాలి తగిలి ఫ్రెష్ గా అయిపోతాయి. రంగుల దుస్తుల్ని నీడ పట్టున అరేయాలి. అలా అయితే సహజమైన రంగు కళ పోకుండా వుంటాయి. మాటి మాటికి వుతికేయకుండా జ్యగ్రత్త తీసుకుంటే సారి.

    ఖరీదైన డ్రెస్ కి ఈ మాత్రం జాగ్రత్త కావాలి

    ఖరీదైన బట్టలు కొంటు వుంటాం. కొంత కాలం పాటు ఆ కొత్త దనం పోకుండా వుంటే బాగుంటుంది. ఇస్త్రీల వల్ల చెక్కగా వుతకడంతోనూ సరిపోదు. వాటి గురించి…

  • పిల్లలు వాళ్లకు కావలిసిన సరంజామా లగేజీ ఎక్కడికి పోయినా అందరి చాకిరీ తల్చుకుని ఆడవాళ్లు వెనకాడేవాళ్లేమో గానీ ఏ చిన్న అవకాశం వచ్చినా ఎవ్వళ్ళనీ పట్టించుకోకుండా మగవాళ్ళు దూరప్రయాణాలకు సిద్ధం అయిపోయేవాళ్లు కానీ ఇప్పుడొచ్చిన రిపోర్ట్ ఒకమారిపోయిన కాలాన్ని కళ్లముందుంచుతుంది. ఒక సర్వే లో 75 శాతం మహిళలు ట్రావెల్ ప్లాన్స్ లో ముందున్నారట. 63 శాతం మంది స్త్రీల ట్రావెలింగ్ తమని విజ్ఞానవంతుల్ని చేస్తారన్నారు. 36 శాతం మంది ట్రావెల్ తమ ఆలోచనా తీరుపై జీవనశైలి పై ప్రభావం చూపెడుతుందంటున్నారు. 57 శాతము మంది కొత్త విషయాలు నేర్చుకుంటామని రిలాక్స్ అవుతామంటున్నారు. 35 శాతం మంది తమ జీవిత భాగస్వాములతో ట్రావెల్ చేద్దామనుకుంటే 16 శాతం మంది కుటుంబ ప్రయాణాలు ఇష్టమంటున్నారు. మొత్తానికి స్త్రీలు హ్యాపీగా యాత్రలకు సిద్దపడుతున్నారని తేలుతోంది. ఆ నాలుగ్గొడలే ప్రపంచంగా ఇల్లే వైకుంఠం అనే భావన పోవటం మాత్రం స్త్రీలందరినీ అభినందించాల్సినవిషయం. నాలుగుళ్లు తిరిగితే లోకజ్ఞానం పెరుగుతుంది. ఆడది తిరిగి చెడింది మగాడు తిరగక చెడ్డాడు అనే సామెత ను సృష్టించిన వాడెవడో ఈ సర్వే చదివితే తప్పక చచ్చుంటాడు.

    జోరుగా హుషారుగా షికారు పోదామా

    పిల్లలు వాళ్లకు కావలిసిన సరంజామా లగేజీ ఎక్కడికి పోయినా  అందరి చాకిరీ తల్చుకుని ఆడవాళ్లు వెనకాడేవాళ్లేమో గానీ ఏ చిన్న అవకాశం వచ్చినా  ఎవ్వళ్ళనీ  పట్టించుకోకుండా మగవాళ్ళు…

  • నాలుక ఎప్పుడు తియ్యదనాన్ని కోరుతూనే వుంటుంది. అనారోగ్యం రానీ, శరీర బరువు పెరగనీ, ఇలాంటి సమస్యలున్నా సరే స్వీట్ తినాలన్న కోరిక పోదు. స్వీట్ లో వున్న స్వీట్ రుచి గొప్పదనం ఇదే. మాములుగా డాక్టర్లు ఎం చేపుతరంటే ఒత్తిడి, అలసట శరీరానికి తినాలనిపించడానికి కారణాలు శక్తి తగ్గితే తీపి ద్వారా శరీరానికి తక్షణ సాయం అందుతుంది. ఈ కబుర్లు అలా వుంచి స్వీట్లు జోలికి వెళ్ళకుండా వుండాలంటే ముందస్తుగా వ్యాయామం చేయాలంటున్నారు డాక్టర్లు, అలాగే శరీరంలోని నీటి శాతం తగ్గినప్పుడు కూడా చెక్కర తినాలని పిస్తుందిట. ఈ ఫిలింగ్ వదిలించుకునేలా మనసుని కంట్రోల్ చేసుకుని తీరాలి. అలా తీపీ లేని జీవితాన్ని అలవరుచుకునే క్రమంలో మరీ వుండలేక పోతే 70 శాతం డార్క్ చాకొలెట్ ను రెండు ముక్కలు మాత్రం తినాలి. స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్, ఖర్జూర పళ్ళు, అప్రికాట్స్, ఎండు ద్రాక్ష, అంజీర ఎదో ఒకటి తినాలి. స్వీట్స్ ఎంతో బాగుంటాయి. కానీ తింటే నష్టం మరీ ఎక్కువ.

    స్వీట్ బదులు ఇవి ట్రై చేస్తే బెటర్

    నాలుక ఎప్పుడు తియ్యదనాన్ని కోరుతూనే వుంటుంది. అనారోగ్యం రానీ, శరీర బరువు పెరగనీ, ఇలాంటి సమస్యలున్నా సరే స్వీట్ తినాలన్న కోరిక పోదు. స్వీట్ లో వున్న…

  • 'మీ పెదవుల మీద పడిన కన్నీటి రుచిని మిగిలిన ఏ రుచులు గెలువలేవు'.అన్న సంకేతం తో కన్నీటితో ఉప్పు తాయారు చేసి అమ్ముతుంది హక్ స్టన్ మూన్ స్టార్ సప్లయ్ అన్న లండన్ కంపెనీ. ఆ ఉప్పు పేరు Salt made from human tears. మనిషి కన్నీటిని నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ఆ ఆవిరి చల్లరిస్తే అది ఉప్పు అవుతుందిట. ఇదే వింత అయితే ఇందులో వెరైటీ ఉప్పులు వున్నాయి. బాధ, సంతోషం, కోపం లాంటి బావోద్వేగాలతో కరచిన కన్నీటి తో ఐదు రకాల ఉప్పులు తాయారు చేస్తారు. సాల్ట్ మేడ్ ఫ్రమ్ టియర్స్ ఆఫ్ సారో కొట్టండి ఆన్లైన్ లో బిరడా వేసిన సిసాలో Saddest salt in the world కనిపిస్తుంది. సంతోష సమయంలో జాలువారిన కన్నీటి ఉప్పు ఖరీదు ఎక్కువట. దీన్ని గురించి పెద్ద పెద్ద రివ్యూలు, రిపోర్ట్లు వున్నాయి. ఆన్ లైన్ లో చదువుకోండి.

    ఈ ఉప్పు మేడ్ విత్ కన్నీళ్ళు

    ‘మీ పెదవుల మీద పడిన కన్నీటి రుచిని మిగిలిన ఏ రుచులు గెలువలేవు’.అన్న సంకేతం తో కన్నీటితో ఉప్పు తాయారు చేసి అమ్ముతుంది హక్ స్టన్ మూన్…

  • ప్రతి పనిలో ఎదో ఒక కష్టం వున్నట్లే డబ్బు లెక్కపెట్టడంలో కూడా రిస్క్ ఉందిట. ఇంకేం లెక్క బడతాం ఇప్పుడు అసలు చేతిలో డబ్బు ఆడితే కదా అనకండి. తీరిగ్గా వున్నాకదా ఇప్పుడు ముఖ్యమైన విషయం చెప్పుకుందాం. ఇచ్చి పుచ్చుకునే క్రమంలో కరెన్సీ నిత్యం కొన్ని వేల లక్షల మంది చేతులు మారుతూ వుంటుంది. వైద్య రంగంలో వున్న వాళ్ళను మినాహాయిస్తే మేగతా సామాన్య ప్రజలు అందరి చేతుల్లోను కాస్తో, కుస్తో బాక్టిరీయా వుండే వుంటుంది. డబ్బు జేబుల్లో, పర్సుల్లో, బ్యాగుల్లో, వుంచేస్తూవుంటాం వాటికి రకరకాల ప్రదేశాల్లోనుంచి డబ్బు కరెన్సీ లోకి చేరిపోతుంది. పరిశోధకుల లెక్కల ప్రకారం 78 రకాల బాక్టిరియాతో పాటు యంటి బయాటిక్ నిరోధక జీవులు కూడా ఈ నోట్ల కట్టలపై ఉంటాయిట. ఇవన్నీ ముట్టుకుని లెక్క పెట్టడం వల్ల ఎన్నో రకాల చర్మ వ్యాధులు, ఇతర అంటు వ్యాధులు వచ్చె అవకాసం వుందని ముఖ్యంగా 10,20,100 రూపాయిల నోట్లపై ఈ బాక్టిరియ కుప్పలుగా వుందని అంటున్నారు. కనుక ప్లాస్టిక్ కరెన్సీ గనుక వస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చంటాయి అడయాయినాలు. క్రిడిట్, డెబిట్ కార్దుల తో పాటు బ్యాంకు కార్డుల వినియోగం పెరిగితే సమస్య నుంచి బయట పడవొచ్చు అంటున్నారు పరిశోధకులు.

    కరెన్సీ లెక్క పెడుతున్నా సమస్యే

    ప్రతి పనిలో ఎదో ఒక కష్టం వున్నట్లే డబ్బు లెక్కపెట్టడంలో కూడా రిస్క్ ఉందిట. ఇంకేం లెక్క బడతాం ఇప్పుడు అసలు చేతిలో డబ్బు ఆడితే కదా…

  • ఆఫీసులో ఎప్పుడు సినిమేటిక్ గా వుంటాయి. వారంలో ఆరు రోజుల పాటు రోజుకు 8 గంటలు పని చేస్తాం. అయినా పని ఎందుకో ముందుకు జరగదు. ఎందుకింత స్లో? డెడ్ లైన్లు దటేసెంత స్లో ఎందుకు వర్క్ మిగిలిపోతుంది? ఈ ప్రస్నలకు సమాధానం ఇస్తున్నారు సైకాలజిస్ట్ లు. మందు మన ఎదురుగా డెస్క్ క్లీన్ గా ఉంచుకోవాలి. మాటి మాటికి టైం చూసుకోవడం వల్ల ఔట్ పుట్ పైన ఆ ఎఫెక్ట్ పడుతుంది. మనకిష్టమైన వారి ఫోటో ఎదురుగా వుంటే మనసు రిలాక్స్డ్ గా వుంటుంది. మంచి ప్రిటిన్స్ వున్న స్నాక్స్, భోజనం తింటే మనసు రిలాక్స్డ్ గా వుంటుంది. అసలు ఆఫీస్ డేకోరేషన్ లో పచ్చదనం ఒక భాగంగా వుండాలి. కళ్ళు మాటి మాటి కి ఆ పచ్చ దానం వైపుకు మళ్ళాలి. అస్తమానంకూర్చునే ఉండకుండా గంటకో సారి లచి నడవాలి. పని చేసే కుర్చీలో సరైన పోశ్చర్ లో కూర్చోవాలి. ఇమ్యున్ సిస్టం మెరుగు పరుచుకోవడం కోసం లెమన్ టీ, నిమ్మరసం తీసుకోవాలి. వర్క్ మొదలు పెట్టాక దాని పై నుంచి దృష్టి మరల్చ వొద్దు. అంటే మనం పని చేసే వర్క్ ని డిస్ట్రబ్ చేసే ఆలోచనలు దూరంగా వుంచేయాలి. ఆఫీస్ గురించి ఇంట్లో, ఇల్లు గురించి ఆఫీసులో మాట్లాడక పొతే నూరు పాళ్ళు పర్ ఫెక్ట్ గా ఉన్నట్లే.

    పనికి కూడా ఓ విధానం వుండాలి

    ఆఫీసులో ఎప్పుడు సినిమేటిక్ గా వుంటాయి. వారంలో ఆరు రోజుల పాటు రోజుకు 8 గంటలు పని చేస్తాం. అయినా పని ఎందుకో ముందుకు జరగదు. ఎందుకింత…

  • పుట్టుకతో మనకు మంచి జ్ఞాపక శక్తి వుంటుంది. పెద్ద అవుతూ వుంటే కొన్ని జ్ఞాపకాలు రాలి పోయా యనిపిస్తుంది. కొందర్ని చూడగానే పేరు మరచి పోతాం. చిన్న చిన్న వస్తువుల్ని ఎక్కడో భద్రంగా పెట్టి మరచిపోతాం. చిన్న చిన్న వస్తువుల్ని ఎక్కడో భద్రంగా పెట్టి మరచిపోతాం. ఇలా ఏ అంశాన్ని పోగోత్తుకోకుండా మెదడులో భద్రంగా దాచుకోవాలంటే దానికి శిక్షణ ఇవ్వలన్తున్నారు శాస్త్ర వేత్తలు. ఏదైనా సమాచారం తప్పని సరిగా గుర్తుంచుకోవాలి. ఇది ఇంపార్టెంట్ సుమా అని మెదడుకు చెప్పాలి. ఇదంతా గుర్తు పెట్టుకో లేమంటే భద్రంగా రాసి పెట్టుకుని, అలా రాసినవి అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. కారు తాళం చెవులు, మందుల టైమింగ్స్ మనీ ప్లాంట్ కి మరచి పో కుండా నీళ్ళు పోయడం ఇవన్నీ తప్పని సరిగా గుర్తు పెట్టుకుని తీరాలి కదా. కొన్ని దృశ్యాలకు ఆ వస్తువులను జత చేయమంతున్నారు శాస్త్రజ్ఞులు. కారు కీస్ అనగానే మన కారు రంగున్న పుస్తకం పైన పెట్టామని, మందులు గుర్తు రావాలంటే మందులున్న బాక్స్ మేకప్ కిట్ దగ్గర అంటే మనం తప్పని సరిగా వాడే వస్తువులు సమయం ఇలా విజువలైజ్ చేసుకుంటూ పొతే కొంత కాలానికి ప్రతి వస్తువునూ ఒక దృశ్యం తో కలిపి గుర్తుంచుకోగలం అంటున్నారు ట్రై చేస్తే బాగుంటుందేమో.

    మెదడు శిక్షణ ఇస్తే జ్ఞాపకాలు పరిచయం

    పుట్టుకతో మనకు మంచి జ్ఞాపక శక్తి వుంటుంది. పెద్ద అవుతూ వుంటే కొన్ని జ్ఞాపకాలు రాలి పోయా యనిపిస్తుంది. కొందర్ని చూడగానే పేరు మరచి పోతాం. చిన్న…

  • ఒక మెడికల్ రిపోర్ట్ ప్రకారం నగరాల్లో నిరసించే గర్భవతుల్లో 40 శాతం రక్తహీనతతో బాధ పడుతున్నారని తేలింది. ఈ ఎనీమియా ప్రారంభ దశలో వుంటే ఐరన్ మందుల రూపంలో తీసుకోవచ్చు పౌష్టికాహారం, విటమిన్-సి, విటమిన్-బి 12, ఫోలిక్ యాసిడ్ ల తో ఈ లోపాన్ని తగ్గించ వచ్చు. మాంసం, పచ్చని ఆకు కూరలు, తాజా కూరలు, బీన్స్, ఆపిల్, బెల్లం, పప్పు ధాన్యాలు,బ్రకొలి వంటివి తీసుకుంటే మేలు. ఇక విటమిన్-సి కోసం ఉసిరి, నిమ్మ, చీని, కమల, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, మొలకెత్తిన పెసలు వంటికి మంచివి. వీటితో ఎనేమియా లోపం వెంటనే తగ్గిపోతుంది. పచ్చని ఆకు కూరలు, కూరగాయలు, పులుపు పండ్లు, ఆరంజ్ జ్యూస్, బీన్స్, పప్పు ధాన్యాల వినియోగం పెంచాలి. విటమిన్ బి-12 కోసం సోయా ఆహార ఉత్పత్తులు, ఛీజ్, కోడి గుడ్లు, చికెన్ లివర్, మటన్, చేపలు, పితలు, తినాలి. ఐరన్ లోపం వస్తే రక్త హీనత సమస్య అంటున్నారు. గర్భినిలు ఈ విషయం దృష్టిలో ఉంచుకుని సరైన ఆహారం విషయంలో శ్రద్ధ చూపించాలి.ఒక మెడికల్ రిపోర్ట్ ప్రకారం నగరాల్లో నిరసించే గర్భవతుల్లో 40 శాతం రక్తహీనతతో బాధ పడుతున్నారని తేలింది. ఈ ఎనీమియా ప్రారంభ దశలో వుంటే ఐరన్ మందుల రూపంలో తీసుకోవచ్చు పౌష్టికాహారం, విటమిన్-సి, విటమిన్-బి 12, ఫోలిక్ యాసిడ్ ల తో ఈ లోపాన్ని తగ్గించ వచ్చు. మాంసం, పచ్చని ఆకు కూరలు, తాజా కూరలు, బీన్స్, ఆపిల్, బెల్లం, పప్పు ధాన్యాలు,బ్రకొలి వంటివి తీసుకుంటే మేలు. ఇక విటమిన్-సి కోసం ఉసిరి, నిమ్మ, చీని, కమల, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, మొలకెత్తిన పెసలు వంటికి మంచివి. వీటితో ఎనేమియా లోపం వెంటనే తగ్గిపోతుంది. పచ్చని ఆకు కూరలు, కూరగాయలు, పులుపు పండ్లు, ఆరంజ్ జ్యూస్, బీన్స్, పప్పు ధాన్యాల వినియోగం పెంచాలి. విటమిన్ బి-12 కోసం సోయా ఆహార ఉత్పత్తులు, ఛీజ్, కోడి గుడ్లు, చికెన్ లివర్, మటన్, చేపలు, పితలు, తినాలి. ఐరన్ లోపం వస్తే రక్త హీనత సమస్య అంటున్నారు. గర్భినిలు ఈ విషయం దృష్టిలో ఉంచుకుని సరైన ఆహారం విషయంలో శ్రద్ధ చూపించాలి.

    ఐరన్ లోపం తోనే ఈ ప్రాబ్లం

    ఒక మెడికల్ రిపోర్ట్ ప్రకారం నగరాల్లో నిరసించే గర్భవతుల్లో 40 శాతం రక్తహీనతతో బాధ పడుతున్నారని తేలింది. ఈ ఎనీమియా ప్రారంభ దశలో వుంటే ఐరన్ మందుల…

  • సగటు ఒక మనిషి రోజుకు ౩౦ వేల ఆలోచనలు చేస్తాడని అధ్యయనాలు చెపుతున్నాయి. జీవితాన్ని శాశించేవి ఆలోచనలే. మనం ఎదుర్కొనే 75 నుంచి 95 శాతం సమస్యలకు ప్రతికూల ఆలోచనలే కారణం మనకి భయం వేసిందనుకోండి మెదడు లో 1400 భౌతిక రాసాయినిక చర్యలు జరుగుతాయని నిర్ధారణ అయింది. బి పి, కాన్సర్, ఆస్తమ, చర్మ సమస్యలు, అలర్జి లకు కారణం మనసులో ప్రతికూల భావనలు ఉండటమే అంటారు.శరీరంలో మలినాలను స్నానం చేసి స్టీమ్ బాత్, లోపలి మంచి ఆహారం తీసుకోవడం ద్వారా శుద్ధి చేసుకున్నట్లే ఆలోచనల్లో నెగటివ్ ధోరణి ని కూడా క్లిన్ చేసుకోవాలి. మన లోపలి ఆలోచలను నిష్కారణంగా జడ్జ్ చేసుకోవడం, పొరపాటుగా ఆలోచిస్తున్నామో లేదో తేల్చుకోవడంలో సగం నెగటివ్ ఫీలింగ్స్ పోతాయి. మానసిక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. మన సంస్కారం ప్రవర్తన మెరుగు పరుచుకునే మార్గం ఇదే. సగటు ఒక మనిషి రోజుకు ౩౦ వేల ఆలోచనలు చేస్తాడని అధ్యయనాలు చెపుతున్నాయి. జీవితాన్ని శాశించేవి ఆలోచనలే. మనం ఎదుర్కొనే 75 నుంచి 95 శాతం సమస్యలకు ప్రతికూల ఆలోచనలే కారణం మనకి భయం వేసిందనుకోండి మెదడు లో 1400 భౌతిక రాసాయినిక చర్యలు జరుగుతాయని నిర్ధారణ అయింది. బి పి, కాన్సర్, ఆస్తమ, చర్మ సమస్యలు, అలర్జి లకు కారణం మనసులో ప్రతికూల భావనలు ఉండటమే అంటారు.శరీరంలో మలినాలను స్నానం చేసి స్టీమ్ బాత్, లోపలి మంచి ఆహారం తీసుకోవడం ద్వారా శుద్ధి చేసుకున్నట్లే ఆలోచనల్లో నెగటివ్ ధోరణి ని కూడా క్లిన్ చేసుకోవాలి. మన లోపలి ఆలోచలను నిష్కారణంగా జడ్జ్ చేసుకోవడం, పొరపాటుగా ఆలోచిస్తున్నామో లేదో తేల్చుకోవడంలో సగం నెగటివ్ ఫీలింగ్స్ పోతాయి. మానసిక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. మన సంస్కారం ప్రవర్తన మెరుగు పరుచుకునే మార్గం ఇదే.

    ఆలోచనలు క్లీన్ చేస్తే ఆరోగ్యం

    సగటు ఒక మనిషి రోజుకు ౩౦ వేల ఆలోచనలు చేస్తాడని అధ్యయనాలు చెపుతున్నాయి. జీవితాన్ని శాశించేవి ఆలోచనలే. మనం ఎదుర్కొనే 75 నుంచి 95 శాతం సమస్యలకు…

  • ఎప్పుడో ఓసారి మనిషన్నవాడికి తలనొప్పి రావడం అత్యంత సహజం. సరైన నిద్ర లేకపోయినా, సుదీర్ఘ ప్రయాణాలు, అతినిద్ర, మంచి నీళ్ళు సరిగా తగకపోవడం, ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం, ఇలాంటి కారణాలు కాకుండా మనం రోజు బుజానికి తగిలించుకునే హ్యాండ్ బ్యాగ్ బరువు కుడా తలనొప్పికి కారణం అవుతుందిట. మనం మోసే చేతి నుంచి మన శరీర బరువులో పది శాతానికి మించి వుంటే, ఆ బరువు ఓత్తిడిగా మారి ముందు బుజాలు, మెడ నొప్పికీ తర్వాత తలనొప్పికీ దారి తిస్తుందిట. అందుకే హ్యాండ్ బ్యాగ్ లో అవసరానికి మించిన వస్తువులు పెట్టుకునే అలవాటు వుంటే స్వస్తి చెప్పండి అంటున్నారు నిపుణులు. బరువు మోయడం తప్పదు అనుకుంటే బ్యాక్ పాకెట్లు ఎలాగో ఫ్యాషన్ కాబట్టి అలా వాడటం మంచిదే. ఒక్కసారి బరువులు ఏమైనా ఎత్తాలంటే ఏళ్ళ బిగువున్నా ఎత్తేస్తాం. దాంతో మొహం కండరాళ్ళు బిగుసుకుని మొహం ఎర్రబడిపోతుంది. అప్పుడు కూడా తలనొప్పి వచ్చె ఆస్కారం వుంది. కదలకుండా గంటల తరబడి కూర్చుంటేనూ, బరువులు మోస్తుంటేనూ కూడా తలనొప్పి పట్టుకోవచ్చు జాగ్రత్త అంటున్నారు నిపుణులు.

    హ్యాండ్ బ్యాగ్ బరువు వల్లే ఈ ప్రాబ్లం

    ఎప్పుడో ఓసారి మనిషన్నవాడికి తలనొప్పి రావడం అత్యంత సహజం. సరైన నిద్ర లేకపోయినా, సుదీర్ఘ ప్రయాణాలు, అతినిద్ర, మంచి నీళ్ళు సరిగా తగకపోవడం, ఎక్కువ సేపు కదలకుండా…

  • సలాడ్స్ కోసం తరిగిన కూరగాయ ముక్కల్ని, పండ్ల ముక్కల్ని కొంచం సేపు విడిగా ఉంచిన అవి రంగు మారిపోతాయి. అలాగని సరిగ్గా తినే ముందరే కోయాలంటే టైమ్ సరిపోదు. కొన్ని సార్లు ఇంటికెవరైనా అతిధులు వస్తున్నారంటే ఇలాంటివి కాస్త తీరికగా అందంగా కట్ చేసి పెట్టుకుంటే హడావుడి లేకుండా వుంటుంది. అనిపిస్తుంది అలాంటప్పుడు 'కోల్డ్ బౌల్ ఆన్ ఐస్' వుంటే ఎంతో ఉపయోగ పడుతుంది. గంటా రెండు గంటల పాటు సలాడ్లు, పండ్ల ముక్కలు, అప్పుడే కోసిన వాటిలా తాజాగా వుంటాయి. గట్టి ప్లాస్టిక్ తో చేసిన ఈ బాక్స్ లకు కింద భాగంలో విడిగా తీసి పెట్టుకునే ఇంకో ఆర వుంటుంది. అందులో నిండా ఐస్ ముక్కలు పేర్చి పై భాగంలో పండ్ల ముక్కలు పెడితే ఐస్ చల్లదానం పై వరకు వ్యాపించి గిన్నెలోని ముక్కల్ని ఎక్కువ సేపు తాజాగా ఉంచుతుంది. దీనిలో వుండే ప్లాస్టిక్ సపరేటర్ తీసి ఒకే దాన్లో రెండు మూడు రకాల ముక్కలను అందంగా పేర్చి టేబుల్ పైన పెట్టేస్తే చూసేందుకు ఎంతో బాగుంటుంది.

    చల్ల చల్లగా…….తాజాగా…….ఫ్రెష్ గా…….

    సలాడ్స్ కోసం తరిగిన కూరగాయ ముక్కల్ని, పండ్ల ముక్కల్ని కొంచం సేపు విడిగా ఉంచిన అవి రంగు మారిపోతాయి. అలాగని సరిగ్గా తినే ముందరే కోయాలంటే టైమ్…

  • టొమాటోలెన్ని రకాలు అంటే దేశవాళి, హైబ్రీడ్ మహా అయితే చెర్రీ అంటాం, కానీ ప్రపంచ వ్యాప్తంగా 7500 టొమాటో రకాల్ని పండిస్తున్నారు. రకరకాల ఆకారాలు పరిమాణాలు, ఎరుపు, గులాబీ, పసుపు, నారింజ, ఉదా, గోధుమ, తెలుపు, నలుపు ఇంకా గీతాలు రుచులు వేరువేరుగా వున్నాయి. తక్కువ పులుసులు, తియ్యగా వుండే ఎల్లో పెయర్, ముదురు ఎరుపు రంగు తో ఉప్పుగా వుండే బ్లాక్ క్రీమ్, పలుచని తొక్కలు, తీపి పులుసు రుచి తో బ్రాందీ వైన్, తీపి, వగరు రుచులతోగ్రీన్ సాసేజ్, తియ్యని గార్డెన్ పిచు, చెర్రి గ్రేప్, అన్నింటి కంటే బుల్లిగా చప్పరించేటట్లుగా వుండే తియ్యని కరెంట్ ఇలా ఎన్నో రకాలు. తియ్యని చెర్రి గ్రేప్ టొమాటోలను నేరుగా సలాడ్లలోను ఐస్ క్రీముల్లోను ఉపయోగిస్తారు. మనకి దొరికే ఎర్రని టొమాటోల్లో లైకొపిన్ శాతం ఎక్కువగా వుంటుంది. ఇది అద్భుతమైన యంటీ ఆక్సిడెంట్. ఇది ఆహారానికి ఎంతో అవసరం ఇది ఆరోగ్యానికే కాదు సౌందర్యానికి మేలే. టొమాటో గుజ్జు ఫేస్ మాస్క్ గా వేస్తే మొటిమలు పోతాయి చర్మం కాంతి వంతంగా అయిపోతుంది. దీన్ని లవ్ ఆపిల్ అని ఫ్రెంచ్ వాళ్ళు. ది ఆపిల్ పారడైజ్ అని జర్మన్లు పిలుస్తారట.

    ది బెస్ట్ అండ్ టేస్టి లవ్ ఆపిల్

    https://scamquestra.com/17-dokazatelsta-i-probely-afery-41.html

  • క్రిస్టల్ సాల్ట్ కు కాకుండా నేచురల్ గా తయారయ్యే రాతి ఉప్పు కు మాత్రమే ఎన్నో ఆరోగ్యసమస్యలను తగ్గించే గుణం వుంటుదన్నారు ఎక్స్ పర్ట్స్. ఇది స్వచ్చమైనది. ఆయుర్వేద మందుల తయారీలో ఈ ఉప్పే ఉపయోగిస్తారు. ఈ ఉప్పుతో మధుమేహం, ఆస్ట్రియో పార్సిస్, డిప్రెషన్, స్ట్రెస్, కండరాల నొప్పులు, తల దిమ్ముగా వుండటం లాంటి ఎన్నో సమస్యలు పరిష్కరించ వచ్చు. ఈ ఉప్పుతో అధ్యాత్మిక శక్తి కూడా ఉందంటున్నారు. నమ్మకం వున్న వాళ్ళు ఒక చిన్ని గిన్నె లో ఉప్పు కర్పూరం కలిపి ఉంచితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జిలు పోతాయి అంటున్నారు. ఈ నమ్మకాలు అవతల పెడితే స్నానం చేసేటప్పుడు స్క్రుబ్ కోసం ఉప్పును ఉపయోగిస్తే మలినాలు తొలగిపోతాయట. ఉదయం గోరు వెచ్చని నీళ్ళల్లో పావు టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి తాగితే అంతర్గత వ్యవస్థ శుభ్ర పడుతుందిట. ఇల్లు ఫ్లోర్ లు తుడిచేటప్పుడు ఆ నీళ్ళల్లో ఉప్పు వేసి తుడిస్తే ఈగలు రాకుండా వుంటాయి. అలాగే ఉల్లిపాయ వంటివి కోసిన వాసన పోవాలంటే చేతులు ఉప్పు నీటి తో కడుక్కోవాలి.

    క్రిస్టల్ సాల్ట్ కంటే కల్లుప్పు బెస్ట్

    క్రిస్టల్ సాల్ట్ కు కాకుండా నేచురల్ గా తయారయ్యే రాతి ఉప్పు కు మాత్రమే ఎన్నో ఆరోగ్యసమస్యలను తగ్గించే గుణం వుంటుదన్నారు ఎక్స్ పర్ట్స్. ఇది స్వచ్చమైనది.…

  • మనకి మూడు రకాలైన ఆకళ్ళు ఉంటాయని మనస్థత్వ శస్త్ర వేత్తలు చెపుతున్నాయి. ఒకటి జీవన వ్యవస్థను నడిపించే ఆకలి, భావోద్వేగపరమైన ఆకలి, సామాజికమైన ఆకలి. మొదటిది ఆకలేస్తే అలవాటుగా తినేసే ఆకలి, భావోద్వేగ ఆకలంటే సంతోషం కలిగినా, చుట్టాలోచ్చినా, ఒంటరితనం అనిపించినా, ప్రతి ఉద్వేగాన్ని ఆకలితో ముడిపెడతాం, ఇక పోతే సామాజికమైన ఆకలి సమాజంలో మనకు ఎదురయ్యె, చూసే అలవాటు చేసుకునే ఆకలి, టివి లో క్రికెట్ చూస్తూ పిజ్జా ఆర్డరు, సినిమాకు పొతే పాప్ కార్న్, కూల్ డ్రింక్, రెస్టారెంట్ కు వెళితే స్టార్టర్ దగ్గర నుంచి ఐస్ క్రీమ్ దాకా సమస్తం స్వాహా చేసే ఆకలి. కొన్ని వాణిజ్య ప్రకటనలైతే ఫలానావి తింటే అధునికులైనట్లు, ఆనందంగా వన్నట్లు భ్రమ కలుగుతుంది. అసలు రుచి కంటే మన మనస్సు చేసే మాయ మన డబ్బుని ఖర్చు చేయిస్తుంది. అందుకే ఆహార మనస్తత్వ శాస్త్రం అధ్యయినం చేస్తేనే మనం తిండి పోటులు కాకుండా వుంటారు. మనస్సు పైన పట్టు సాధించి ఆకలిని అర్ధం చేసుకుని శరీరాన్ని గమనించుకుని తేలికగా కడుపు నిండటం అంటే మైండ్ ఫుల్ ఈటింగ్ అలవరుచుకోవాలి అన్నమాట. అంటే ముందు మనస్సుని సంతృప్తితో నింపేస్తే అది అతి తిండిని కంట్రోల్ చేస్తుందన్నమాట.

    మైండ్ ఫుల్ ఈటింగ్ అలవరుచుకోవాలి

    మనకి మూడు రకాలైన ఆకళ్ళు ఉంటాయని మనస్థత్వ శస్త్ర వేత్తలు చెపుతున్నాయి. ఒకటి జీవన వ్యవస్థను నడిపించే ఆకలి, భావోద్వేగపరమైన ఆకలి, సామాజికమైన ఆకలి. మొదటిది ఆకలేస్తే…

  • చాలా మందికి హీరోయిన్లని తెర పైన చూస్తున్న కొద్దీ రోజు రోజుకీ ఇంకా అందంగా అయిపోతున్నారనిపిస్తుంది. శృతి హాస్సన్,శ్రీదేవి, నయినా తార, సామంత, అంజలి, కరీనా, కంగనా, వళ్ళంతా రెండు, మూడేళ్ళ క్రితం చూసినట్లు ఇప్పుడు లేరు మరి ఎలా పెరుగుతుంది ఇంత అందం. వయస్సుతో పాటు అందం పెరుగుతుంటే ఆశ్చర్యంగా వుండదు. అందంగా కనిపించడం, నటించడం కూడా వృత్తిలో భాగమే. ఆహార నియమాలు, వ్యాయామాలు, ప్లాస్టిక్ సుర్జిరీలు, ఇవన్నీ కారణాలే. ఎప్పుడో 8౦ల్లొ శ్రీ దేవి ముక్కుకు శాస్త్ర చికిత్స చేయించుకుంది. ఇప్పుడు బ్యూటీ బిజినెస్ ఆకాశమంత ఎత్తులో వుంది. వయస్సుని తగ్గించి ముడతలు పోగొట్టుకునెందుకు, శరీర ఛాయను పెంచేందుకు రకరాకాల చికిత్స్యలు వస్తున్నాయి. ఖరీదైన క్రిములి, లోషన్లు, ముఖ్యంగా వ్యాయామాలు, శారీరక సౌష్టవం పైన అందం పైన ప్రభావం చూపిస్తున్నాయి. పెర్స్ నల్ ట్రైనర్స్ ఆద్వర్యంలో గంటలకొద్దీ జిమ్ల్లో చెమటోడ్చి కష్టపడి అందం సాధిస్తున్నారు అంటే ఆశ్చర్యం ఏముందీ? నోరు కట్టేసుకోవడం, ఓ గంట సేపు పరుగెట్టాలి అమ్మాయిలు, అద్దం ముందు పడిగాపులు కాచినా ప్రయోజనం శూన్యం.

    చిందించిన చమటకు బహుమతిగా అందం

    చాలా మందికి హీరోయిన్లని తెర పైన చూస్తున్న కొద్దీ రోజు రోజుకీ ఇంకా అందంగా అయిపోతున్నారనిపిస్తుంది. శృతి హాస్సన్,శ్రీదేవి, నయినా తార, సామంత, అంజలి, కరీనా, కంగనా,…

  • త్రీడి జెల్లీ కేక్ తిన్నారు కదు........... చూసారా అని అడగాలి. పోనీ జెల్లీ కేక్ లు అద్భుతమైన పువ్వులు, ఇవన్నీ కళాత్మకమైన దృష్టితో పిల్లలను ఆకర్షించేందుకు సిరంజీలు, స్పూన్లు, స్ట్రా లు వాడుతూ చేసే కళాకండాలు, కొబ్బరి పాలు, పండ్ల రసాలు, గ్రీన్ టీలు, మిల్క్ షెక్ లు ఎవన్నింటికి జెలటిన్ లేదా సముద్రపు నాచు అగరాను జోడించి ఘనపదార్ధంగా తాయారు చేస్తే అది జెల్లీ అయిపోతుంది. ఇది వరకు జెల్లీ లోపల నిజమైన పండ్లు పూలు పెట్టి డెకరేట్ చేసే వాళ్ళు. ఇప్పుడు పువ్వుల జెల్లీ కేక్ కావాలంటే జెలాటిన్ లో పారదర్శకమైన జెల్లీ కేక్ తాయారు చేసి సిరంజీలు,స్ట్రా లు రకరకాల స్పూన్లు ఉపయోగించి పువ్వుల్ని, ఆకుల్ని అందులో వచ్చేలా చేస్తున్నారు. కేకు పరిమాణం బట్టి ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వులు సృస్టిస్తారు. ఆసక్తి వున్న వాళ్ళు ఈ త్రీడి జెల్లీ కేక్ ఎలా చేస్తున్నారో యు ట్యూబ్ లో చూసి నేర్చుకో వచ్చు. ఇందుకు కావాల్సిన సమస్తమైన సామాన్లు ఆన్ లైన్ లో కొనుక్కోవచ్చు.

    జెల్లీలో పూస్తున్న తినే రంగుల పూలు

    త్రీడి జెల్లీ కేక్ తిన్నారు కదు……….. చూసారా అని అడగాలి. పోనీ జెల్లీ కేక్ లు అద్భుతమైన పువ్వులు, ఇవన్నీ కళాత్మకమైన దృష్టితో పిల్లలను ఆకర్షించేందుకు సిరంజీలు,…

  • తల్లీ బిడ్డల ప్రాణాలు కాపాడే నిమిత్తం అత్యంత క్లిష్ట సమయంలోనే శస్త్ర చికిత్సకు వెళ్లాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం శస్త్ర చికిత్స ద్వారా ప్రపంచంలోకి వస్తున్న పిల్ల సంఖ్య అత్యధికంగా వుంది. ఈ అంశంలో తెలంగాణా తోలి స్థానంలో వుంటే ఆంధ్రప్రదేశ్ నాలుగోవ స్థానంలో వుంది. తెలంగాణా తోలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40.6 శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో 74.9 శాతం తల్లులకు శస్త్ర చికిత్స ద్వారానే కాన్పులు జరుగుతున్నాయి. ఇక ఆంధ్రాలో ప్రభుత్వ ఆసుపత్రులలో 25.5 శాతం ఆసుపత్రుల్లో 57 శాతం బిడ్డలు కడుపు కొత ద్వారానే బయట పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో త్రిపుర పశ్చిమ బెంగాల్లో మాత్రం తెలంగాణా లో పోటీ పడుతున్నాయి. శస్త్ర చికిత్సలు ఈ స్థాయి లో పెరిగిన మాతృ శిశు మరణాలు మాత్రం తగ్గడం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

    అమ్మాకెప్పుడూ కష్టమే!

    తల్లీ బిడ్డల ప్రాణాలు కాపాడే నిమిత్తం అత్యంత క్లిష్ట సమయంలోనే శస్త్ర చికిత్సకు వెళ్లాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం  శస్త్ర చికిత్స…

  • హార్మోన్స్ ఇన్ బాలెన్స్ ఎప్పుడు మహిళలను ఇబ్బంది పెడుతూనే వుంటుంది. ఈ అసమతుల్యతకి ఎన్నో కారణాలున్నాయి తగిన ఆహారం తీసుకుంటే ఆ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చుముదురు రంగు చాక్లెట్లు, వేరు సెనగలు, పీతలు వంటి వాటిల్లో జింక్ సమృద్ధిగా దొరుకుతుంది. ఎర్ర కండి పప్పు, సోయాబీన్స్, బఠానిలలో ఈస్ట్రోజిన్ వుంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతను అదుపులో ఉంచుతుంది. ఆలివ్ నూనె ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, పండ్ల విషయానికి వస్తే నిమ్మజాతి పండ్లు, ద్రాక్ష ఎంత తింటే అంట మంచిది. కాల్షియం కూడా ఎంతో అవసరం పాల ఉత్పత్తులు, క్యాబేజీ వంటివి ఆహారంలో ఎదో ఒక రూపంలో తీసుకోవాలి తృణ ధాన్యాలు అన్ని కలిపి పిండి కూడా ఎంచుకోవచ్చు. ఉదయం పూట నడక అలవాటు చేసుకోవాలి.

    ఈ ఆహారం ఆ ప్రభావాన్ని తగ్గిస్తుంది

    హార్మోన్స్  ఇన్ బాలెన్స్ ఎప్పుడు మహిళలను ఇబ్బంది పెడుతూనే వుంటుంది. ఈ అసమతుల్యతకి ఎన్నో కారణాలున్నాయి తగిన ఆహారం తీసుకుంటే ఆ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చుముదురు రంగు…