ఇంజనీరింగ్ చదువుకొని సైన్యంలో చేరటం లక్ష్యంగా పెట్టుకొని మిలటరీ లో అడుగు పెట్టింది సిద్ధి జైన్. ఉత్తర ప్రదేశ్ లోని ఉఝని లో జన్మించిన సిద్ధి ఎన్. డి. ఏ పరీక్ష రాసి మిలటరీ శిక్షణ తీసుకున్నారు. పాసింగ్ అవుట్ పరేడ్ లో రాష్ట్రపతి కాంస్య పథకం అందుకున్నారు.దీన్ని అందుకున్న తొలి మహిళ గా రికార్డు సృష్టించారు. అకడమిక్, ఫీల్డ్ పెర్ఫార్మెన్స్, నాయకత్వ లక్షణాలు, సేవ భావన లో ప్రతిభ చూపించి బెస్ట్ ఆల్ రౌండర్ కె డేట్ గా నిలిచారు ఈమె ఎయిర్ ఫోర్స్ లో తన సేవలు అందించనున్నారు దేశానికి సేవ చేయాలనుకొనే ఎంతో మందికి ఈమె స్ఫూర్తి.













